హోం

8, నవంబర్ 2011, మంగళవారం

ప్రజా కవి కాళన్న యాది..


తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం ప్రతిధ్వని కాళోజి నారాయణరావు. రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కాళోజి. కవిత్వం రాసి ప్రజాకవి. హక్కులడిగి ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది.హేతువాది . మొత్తంగా తెలంగాణ జీవిత చలన శీలి కాళోజి. పుటక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి.కాళోజీ జయంతి సెప్టెంబర్ 9 ని “తెలుగు మాండలిక భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.

  • కాళోజి నారాయణరావు కాళన్నగా, కాళోజిగా ప్రఖ్యాతుడు. 1914 సెప్టెంబర్ 9 న కర్ణాటక బీజాపూర్ జిల్లా రట్టేహళి గ్రామంలో జన్మించిండు.కాళోజివరంగల్ జిల్లా మడికొండ గ్రామంల పెరిగిoడు.
  • కాళోజి న్యాయవాద విద్య అభ్యసించినా వృత్తి ముందుకు సాగలేదు.
  • హైదరాబాదుల సంచరించినా హనుమకొండలనే ఆయన జీవితం.
  • కవిత్వం రాసినా ప్రజా చైతన్య మార్గమే ఆయన లక్ష్యం. రాజకీయాలు ఆయన ప్రాణం.
  • కాళోజి రామేశ్వరరావు ఆయన అన్న, ఉర్దూ కవి.తమ్ముడికన్నా అన్న ఆరు సంవత్సరాలు పెద్ద
  • కాళోజీ అసలు పేరు-రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాం రాజా కాళోజి-
  • తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు.
  • కాళోజీ జన్మించిన అయిదారు నెలలకే రమాబాయమ్మ చనిపోవడంతో అన్నే అమ్మగా మారి తమ్ముడు కాళోజిని పెంచి పెద్దచేశారు.నా ఏడవ నెలలో అన్నగారి భుజాలమీద ఎక్కిన నేను నా 80వ ఏట కూడా ఆ భుజాలమీద అట్లనే ఉన్న. ఆయన అట్లనే మోస్తున్నాడు! అన్నాడు
  • పి.వి. నరసింహారావు, కాళోజీ ఒరే అనే టంత చనువు వున్న స్నేహితులు,
  • కాళోజీ నాన్ వెజి టేరియన్ తినేవాడు. ఇష్టం గా రమ్ము తాగేవాడు. తాపీగా భోజనం చేస్తూ బోలెడు కబుర్లు చెప్పేవాడు.
  • రాయ్ ను యూనివర్శల్ పర్సన్ అనేవారు. ఆంధ్రప్రదేశ్ కావాలని కోరిన కాళోజీ, 1969 లో ప్రత్యేక తెలంగాణాను సమర్ధించి, అలాగే నిలిచిపోయారు.
  • 1977లో సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశాడు కాళోజీ. డిపాజిట్ పోయింది.
  • తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-సంకోచ పడియెదవు సంగతేమిటిరా?
                 అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా అన్నారు కాళోజీ.

  • కాళోజీ నిఖిలాంధ్ర కవి. అందులో ఎట్టి సందేహం లేదు. ఆయనకు తెలంగాణా అంచులు గోడలుగా అడ్డునిలువజాలవు. ఆయన తన ఖండకావ్య సంపుటానికి 'నా గొడవ' అని పేరు పెట్టారు. అదే కవి ప్రతిభ. అదే కవి చెప్పవలసిందీను. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ - శ్రీశ్రీ
  • ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక- కాళోజి
  • 'పుటక నీది-చావు నీది-బతుకంతా దేశానిది --- జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు కాళోజి
  • 1943లోనే ఆయన కథల్ని కాళోజీ కథలు పేరుతో అప్పట్లో హైదరాబాద్‌లో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీకి చెందిన అణాగ్రంథమాల సంస్థ తన పద్నాలుగో ప్రచురణగా ప్రచురించింది.
  • ఆర్యసమాజ భావజాలం పట్ల ఆకర్షితులై నిజాం నవాబు కారుమీద బాంబు విసిరాడు..
  • ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి తెలంగాణా ప్రత్యేక సంచిక వెలువరించారు. విశాలాంధ్ర కావాలనీ అన్నారు. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణా కావాలనీ అన్నారు.
  • రెండేళ్లు రాష్ట్ర విధానపరిషత్తు సభ్యుడిగా ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు. 
  •                                                          
                 
  • తెలంగాణల నిజాం జమానాల నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులను సాహసికంగా ఎదిరించిండు.
  • ఆర్యసమాజ్ సభలు, ఊరేగింపులు, కాంగ్రెస్, కమ్యూనిస్టుల కార్యకలాపాలు, రచయితల సభలు, అన్నీ కాళోజి భాగం పంచినయి.
  • సహ యువకుల్ని చైతన్యంలకి మళ్లించేటోడు. గాంధీ అహింసామార్గాన్నే శిరసావహించినా అవసరాన్ని బట్టి ప్రతిహింసను కూడా ఆహ్వానించిండు.
  • నిజాం వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో కవితలు రాసిండు. నిజాం దుష్కృత్యాల్ని తన సహజ శైలిల తూర్పారబట్టిండు.
  • నిజాం ఆగ్రహించి కాళోజికి వరంగల్ నగర బహిష్కారం విధించిండు. కాళోజి మరింత తీవ్రంగా అంకితభావంతో అక్షరం సంధించిండు. 1939ల1943ల రెండుసార్లు జైలుకి పోవాల్సివచ్చింది.
  • ఎన్నో ఇతర భాషా గ్రంథాలను తెలుగులకి అనువదించిండు.
  • కాళోజి కథలునా గొడవజీవన గీత మొదలైనవి ఆయన రచనలు.
  • ఆంధ్ర జనసంఘంఆంధ్ర సారస్వత పరిషత్తుఆంధ్రమహాసభతెలంగాణ రచయితల సంఘం సంస్థల నిర్మాణంల కాళోజి భాగం ఉంది.
  • పి.వి.నరసింహారావు లాంటి ఎందరికో ఆయన సాహిత్యంల, రాజకీయాలల్ల మార్గదర్శనం చేసిండు.
  • విశాలాంధ్ర సమస్యలు గమనించి ఆయన 1969ల ప్రత్యేక తెలంగాణ ఉద్యమంల కలిసిండు.
  • అన్ని సందర్భాలల్లా అసలుసిసలైన తెలంగాణవాదిగా జీవించిండు. బూటకపు ప్రజాస్వామ్యాన్ని, కోస్తా ఆధిపత్యాన్ని వ్యతిరేకించిండు.
  • ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె. - కాళోజీ
  • విద్యార్థి దశనుంచీ మిత్రుడైన పి.వి.నరసింహారావు మాటను కాదనలేక ఆయన భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు! అయితే ప్రభుత్వం అవార్డునిచ్చిందనీ, సత్కరించిందనీ తన హక్కుల పోరాటం, తెలంగాణా రాష్ట్ర వాదం ఆయన చివరివరకూ వదులుకోలేదు. 2002 నవంబరు పదమూడో తేదీ కాళోజీ కన్నుమూశారు!

  • చివరి వరకు తెలంగాణే ఆశగా శ్వాస గా బతికిన ఆయన "ప్రాంతేతరుడు తప్పుచేస్తే ప్రాంతం దాటే వరకు తరిమి కొడదాం, ప్రాంతం వాడు తప్పు చేస్తే ప్రాంతంలోనే పాతి పెడదాం అని " పిలుపు నిచ్చారు, ప్రస్తుత ఉద్యమానికి ఆయన లేని లోటు పుడ్చాలేనిదే, ఐన ఆయన ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి...


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి