హోం

5, నవంబర్ 2011, శనివారం

తెలంగాణా సుకవి దాశరథి....

 ( 05 . 11 . 2011 ) తెలంగాణా ఆధునిక కవుల్లో కలికితురాయి దాశరథి, ఆయన జూలై 22 ,1925 లో ఖమ్మం జిల్లాలోని చిన్నగుడురు గ్రామంలో జన్మించారు, ఆయన బాల్యం ఖమ్మంలోనే గడిచిన ఉన్నత విద్యకై హైదరాబాద్ కు వచ్చారు, అప్పుడే నిజాంకు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు.
                         వారు ఆతర్వాత వరంగల్ జిల్లాకు వలస వెళ్లారు, ఆయనొక అభ్యుదయవాది, ఆయన నిజాం వ్యతిరేకంగా 150 మందితో ఏర్పాటు చేసిన సైన్యంలో ఒకడిగా పనిచేసారు, కామునిస్ట్ పార్టీలో ఉన్న ఆయన ఒక మహా సభ ను ఏర్పాటుచేసారు, ఆ తర్వాత జనాన్ని చైతన్య పరచటానికి, తెలంగాణా మొత్తం తిరిగారు, ఆయన 1946 నుండి 1948 వరకు వరంగల్, ఆతర్వాత నల్లికుదురు నిజామాబాదు జైలు లలో ఉన్నారు, అయన జైలు నుండి తప్పించుకొని, మహబూబాబాద్ అడవుల్లో అజ్ఞాత౦ లోకి వెళ్లి, తన కార్యకలాపాలు కొనసాగించారు.
                                    దాశరథి మొదటి రచన అగ్నిధార, ఈ పుస్తకం నిజాం నిరంకుశ పాలనకు సంబంధించింది. "మా నిజాం రాజు తరతరాల భూజు" అన్నారు దాశరథి, ఆతర్వాత రుద్రవీణ, పుష్పకం, గాలిబ్ గీతాలు, ఆలోచన లోచనాలు, తిమిరంతో సమరం, మొదలైన రచనలు చేసారు, 1967 లో దాశరథి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డ్ను తిమిరంతో సమరం పుస్తకానికి గాను అందుకున్నారు, 1975 లో ఆంద్ర ఉనివర్సిటి కళా ప్రపూర్ణ తో సత్కరించింది, ఆ తర్వాతి సంవత్సరం ఆగ్రా విశ్వా విద్యాలయం డాక్టరేట్ తో సత్కరించింది. ఆయనకు తెలుగు, ఉర్దూ, సంస్కృతం, తమిళ భాషలు తెలుసు.
                    " నా తెలంగాణా కోటి రతనాల వీణ" అని చాటిన దాశరథి సినిమా సాహిత్యాన్ని కూడా రచించారు, ఆయన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఆస్థానకవిగా ఉన్నారు, ఎన్ టి ఆర్ ముక్య మంత్రి అయ్యాక ఆయనను ఆపదవి నుండి తొలగించి తీవ్రంగా అవమానించాడు, ఆయన ఆ అవమాన భారంతో 1987 లో మరణించారు..

2 కామెంట్‌లు: