* 1919 లో ముల్కి రూల్స్ అమలులోకి వచ్చాయి.
* 15 సంవత్సరాలు తెలంగాణాలో స్థిర పడిన వారే ఇక్కడ ఉద్యోగం పొందడానికి అర్హులు.
* 1930 లో ఆంద్ర మహా సభ ఆవిర్భావం, ఇదే కమూనిస్ట్ పార్టి గా రూపొందింది.
* తెలంగాణా సాయుడ పోరాటంలో పాల్గొన్న కమూనిస్ట్ ప్రముకులు కే వి రంగారావు, నరసింహ రావు సురవరం ప్రతాప రెడ్డి, రావి నారాయణ రెడ్డి, బద్దం యెల్లారెడ్డి, బొజ్జ నర్సింహులు , అనభేరి ప్రభాకర్.
* 1946 లో కమూనిస్ట్ పార్టీ పై నిజాం సర్కార్ నిషేధం విధించింది.
* కాశీం రజ్వి ఆధ్వర్యంలో రజాకార్లు విధ్వంసాలు, మానబంగాలు, దోపిడిలు, లూటీలకు పాల్పడ్డారు.
* వీరు మత విద్వేషాలు రెచ్చ గొట్టారు.
* ఆర్య సమాజ్ అధ్యక్షుడు రామానంద్ తీర్ధ కాంగ్రెస్స్ పార్టీని తెలంగాణాలో ఏర్పాటు చేసి పోరాడసాగారు.
* 1947 లో భారత దేశం స్వతంత్రం పొందింది.
* హైదరాబాద్ లో అలజడిని గుర్తించి భారత కేంద్ర ప్రభుత్వం కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది.
* కే.ఎం .మున్షి ని భారత ప్రతినిధి గా పంపారు.
* 1947 డిసెంబర్ లో ఒప్పందంలో బాగంగా హైదరాబాద్ సంస్థానంలో ఎన్నికలు జరిగాయి, అందులో లాయక్ అలీ ప్రధానిగా ఎన్నుకోబడ్డారు.
* 1946 నుండే గ్రామస్థాయి నుండి రైతాంగ సాయుధ పోరాటం మొదలయింది. ఇది 1946 అక్టోబర్ లో ప్రారంభం అయ్యింది.
* మొదట నల్గొండ, బీదర్ లలో ప్రరంబమైన పోరాటం ఆ తర్వాత తెలంగాణా అంతట విస్తరించింది.
* 1948 లో వరంగల్ జిల్లా బైరాన్ పల్లి ఉదంతం మరో జలియన్వాలా బాగ్ ను తలపించింది.
* హైదరాబాద్ ను భారత దేశం లో కలపాలన్న ప్రజల ఆకాంక్షను నిజం రాజు వ్యతిరేకించాడు.
* ప్రజల పోరాటంలో చివరికి భారత ప్రభుత్వం తోడోచ్చి, మేజర్ చౌదరి ఆధ్వర్యంలో సైనిక చర్య జరిపింది, దిని పేరే ఆపరేషన్ పోలో.
* 1948 సెప్టెంబర్ 12 న ప్రరంబమైన సైనిక చర్య 17 న నిజాం రాజు లొంగిపోవడంతో ముగిసింది. సెప్టెంబర్ 17 , 1948 లో తెలంగాణా కు విముక్తి లభించింది.
* 1948 నుండి 1952 వరకు భారత ప్రభుత్వ సివిల్ సర్వెంట్ గా నారాయణ మీనన్ ను నియమించారు.
* 1952 లో ఉద్యోగాలన్నీ మద్రాసు ప్రసిడేన్సి వాళ్ళకు ఇస్తున్నారని, నాన్-ముల్కి గో బ్యాక్ ఉద్యమం నడిచింది.
* 1952 జనరల్ ఎలేక్షన్స్ లో బూర్గుల రామకృష్ణ రావు ముఖ్య మంత్రిగా ఎన్నికయ్యారు.
* 1953 లో ఆంద్ర రాయలసీమ కలిసి ఆంద్ర రాష్ట్రంగా ఏర్పడ్డాయి.
* మొదటి ఎస్ ఆర్ సి లేదా ఫజల్ అలీ కమిషణ్ రాష్ట్రానికి వచ్చింది.
* తెలంగాణా ను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని, ఒక వీల కలపలనుకుంటే 1961 ఎన్నికల వరకు ఆగాలని, ఎన్నికలలో గెలిచినా అభ్యర్తులలో 2 /3 సభ్యులు ఒప్పుకుంటే అప్పుడు విలీనం గురించి ఆలోచించాలి అని చెప్పారు.
* భుర్గుల రామ కృష్ణ రావు కాంగ్రెస్ అధినేతకు రాసిన ఉత్తరం లో తెలంగాణా లో విభిన్న వాదనలు ఉన్న అధిక సంక్యలో ప్రజలు తెలంగాణా రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని రాసారు.
* చివరికి ఆంద్ర వాళ్ళ ఒత్తిడి మేరకు నెహ్రూకు ఇష్టం లేకపోయినా విలీనానికి ఒప్పుకున్నారు.
* కొన్ని ఒప్పందాలపై ఇరు ప్రాంతాల పెద్దమనుషులు సంతకాలుచేసారు, అదే పెద్ద మనుషుల ఒప్పందం.
* ఒప్పందంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు:
-తెలంగాణా మంత్రులతో తెలంగాణా అభివృద్ది కొరకు " రిజినల్ స్టాండింగ్ కమిటి " ఏర్పాటు చేయాలి. తెలంగాణా లోని భూముల అమ్మకానికి, తెలంగాణాలో మధ్య నిషేధానికి ఈ కమిటి అనుమతి తప్పనిసరి.
-డోమినల్ రూల్స్: అప్పటి వరకు హైదరాబాద్ స్టేట్లోని ఉద్యోగుల ఉద్యోగాలు ఎధతధం గా ఉంటాయి.విధ్యభివ్రుద్ది పై దృష్టి, ముల్కి రూల్స్ అమలును పర్యవేక్షించడం దీని పని.
-ఉర్దూ భాషకు రెండవ అధికార భాష హోదా.
-అప్పటి వరకు తెలంగాణా లో ఉన్న మిగులు బడ్జెట్ ను తెలంగాణా అభివృద్ధికి కర్చు చెయ్యాలి.
-ఆదాయాన్ని ఎ ప్రాంతానిది ఆ ప్రాంతానికే కర్చు చెయ్యాలి, తెలంగాణా లోని ఆదయ, వ్యయాల్ని లెక్క చూపాలి.
-మంత్రి వర్గంలో 60 :40 పంపిణి,ఆంద్ర నుండి ముక్య మంత్రి ఉంటె తెలంగాణా వాళ్ళు ఉపముక్య మంత్రి ఉండాలి.
* పెద్దమనుషుల ఒప్పందం పై ఇరు ప్రాంతాల నేతలు 19 జూలై 1956 లో సంతకం చేసారు,
ఆంద్ర నుండి 1 బెజవాడ గోపాల్ రెడ్డి, 2 నీలం సంజీవ రెడ్డి, 3 గౌతు లచ్చన్న లు
తెలంగాణా నుండి 1 బూర్గుల రామకృష్ణ రావు, 2 మర్రి చెన్నారెడ్డి, 3 కే వి రంగా రావు లు సంతకాలు చేసారు.
* ఒప్పందాల, నిభంధనల ఉల్లంగనల ఫలితంగా 1969 లో ఉద్యమం ప్రారంభమైంది.
* విద్యార్థులు, ఉద్యోగులు, డాక్టర్లు , లాయర్ లు కలిసి ఉద్యమాన్ని నడిపించారు.
* ప్రభుత్వ కాల్పుల్లో 360 మంది విద్యార్థులు మరణించారు.
* మర్రి చెన్న రెడ్డి ఉద్యమం లో చేరి తెలంగాణా ప్రజా సమితి అనే పార్టీని ఏర్పాటు చేసారు.
* 1971 ఎన్నికలలో 11 ఎం పి స్థానాలు గెలిచారు. కాని ఉద్యమాన్ని మధ్యలో వదిలేసి కాంగ్రెస్ లో చేరారు.
* 1969 నవంబర్ 11 న అష్ట సూత్ర పథకం వచ్చింది:
- తెలంగాణా నుండి ఆంధ్రకు తరలించబడిన నిధులను తీయడానికి ఒక కమిటి, నెలరోజుల్లో రిపోర్ట్.
- మిగులును తరలించుట వలన తెలంగాణా కు జరిగిన నష్టాన్ని పూరించుటకు నిధులు మంజూరు.
- అభివృద్ది కి ప్రాంతీయ అభివృద్ది మండలి ఏర్పాటు.
- ప్రణాళిక అమలుకు ప్రణాళిక సంగం అధ్యక్షుని అధ్యక్షతన ఒక అధికారుల కమిటి ఏర్పాటు, కేంద్ర హోం, ఆర్ధిక శాఖల ప్రతినిధుల తో పాటు, రాష్ట్ర ప్రతినిధులు అందులో ఉంటారు.
- రీజినల్ స్టాండిగ్ కమిటి కి అధికారాల పెంపు.
-ఉద్యోగుల విషయంలో రాజ్యంగా రక్షణలు.
-ఉద్యోగుల సమస్యల పరిష్కార భాద్యతను యునియన్ పుబ్లిక్ సర్విస్ కమిషన్ కు అప్పగింత.
-6 మాసాలకు ఒక సారి తెలంగాణా అభివృద్ది కమిటి భేటికి ప్రధాని హాజరు కావలి.
* అక్టోబర్ 16 1972 న ముల్కి రూల్స్ రాజ్యంగా బద్ధమే నని సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది.
* జై ఆంద్ర ఉద్యమం మొదలయ్యింది, దీని ఫలితం గా ఆరు సూత్రాల పథకం వెలుగులోకి వచ్చింది.
* సెప్టెంబర్ 21 1973 న సిక్స్ పాయింట్ ఫార్ముల వచ్చింది:
- రాష్ట్రాన్ని ఆరు జోన్స్ గా ఏర్పాటు చెయ్యడం.
- రాష్ట్ర పరిధిలో ప్లానింగ్ బోర్డు మరియు సబ్ కమిటి ల ఏర్పాటు.
- తెలంగాణా లో విద్యాభివృద్ధికి సెంట్రల్ యునివర్సిటీ ఏర్పాటు.
- ఉద్యోగుల భద్రతకు హై లెవెల్ అడ్మినిస్త్రేటింగ్ ట్రిబునల్ ఏర్పాటు.
- దీనిలో దేనికి విఘాతం కల్గిన రాష్ట్రపతి నేరుగా కల్పించుకోవచ్చు.
- పైవి అమలైతే ఇక ముల్కి రూల్స్ , రిజినల్ కమిటీలు రద్దు అవుతాయి.అయితే 15 సంవత్సరాల నివాస నిబంధన నాల్గు సంవత్సరాలకు కుదించారు.
* 1969 ఉద్యమం తర్వాత ఏర్పాటు చేసిన భార్గవ కమిటి 1969 నాటికి 25 వేల మంది ఆంద్ర వాళ్ళు తెలంగాణా కు రావాల్సిన ఉద్యోగాలు కొల్లగొట్టారని తేల్చింది.
* అయితే ఈ మధ్యలోనే 1969 లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు సూత్రాల పథకం తీసుకు వచ్చింది.
* 1969 జి ఓ నంబర్ 36 విడుదలయ్యింది దీని ప్రకారం తెలంగాణాలోని ఆంద్ర ఉద్యోగుల్ని ఆంద్ర కు పంపి తెలంగాణా ఉద్యోగులతో కాలిలను నింపాలి.
* 1985 లో వేసిన జై భరత్ రెడ్డి కమిటి ప్రకారం 1969 నుండి 1985 మధ్యలో 58 వేల మంది ఆంద్ర వాళ్ళు తెలంగాణా ఉద్యోగాల్లో అక్రమంగా చేరారని తేల్చింది.
* 1985 లో వేసిన జై భరత్ రెడ్డి కమిటి ప్రకారం 1969 నుండి 1985 మధ్యలో 58 వేల మంది ఆంద్ర వాళ్ళు తెలంగాణా ఉద్యోగాల్లో అక్రమంగా చేరారని తేల్చింది.
* 1985 లో 610 జి ఓ వచ్చింది, ఇది జి ఓ 36 కు పుత్రిక.
* నారా వారి హయంలో వేసిన గిర్ గ్లాని కమిటి అప్పటికే ఒక లక్ష యాభై వేల మంది ఆంద్ర ఉద్యోగులు తెలంగాణా లో అక్రమంగా చేరారని తేల్చింది.
* కేంద్రం 2008 లో ప్రణబ్ ముకర్జి కమిటి వేసింది.
* 2009 లో రాష్ట్ర ప్రభుత్వం రోశయ్య కమిటి వేసింది.
* 2009 డిసెంబర్ 9 న తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది కేంద్రం.
* ఆ తర్వాత సీమంద్రుల ఒత్తిడితో సంప్రదింపుల కమిటిని వేసింది.
* కేంద్రం శ్రీ కృష్ణ కమిటి వేసింది.
* కాంగ్రెస్ పార్టీ ఆజాద్ కమిటి వేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి