1 . ఈ నెల 10వ తేదీ తర్వాత తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. సోనియాతో భేటీ అనంతరం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. 11న కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ తర్వాత కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది.
2 . కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించింది..ఎనిమిది రోజుల సంది దీక్ష చేస్తున్న కోమటిరెడ్డి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నరు...అయితే ప్లూయిడ్స్ తీసుకోవడానికి కోమటిరెడ్డి నిరాకరిస్తున్నట్టు డాక్టర్లు చెపుతున్నరు.. తెలంగాణ వచ్చే దాక వెనక్కి తగ్గేదే లేదని కోమటిరెడ్డి తేల్చి చెప్పిన్రు...మరోవైపు కోమటిరెడ్డి హెల్త్ కండీషన్ పై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నరు.
3 . ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న మాయవతి ప్రకటన కీలకమైనదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం అన్నారు. తెలంగాణ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుంది అని అంటున్న టీ కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో ఏం చేయాలో మాయవతిని చూసి నేర్చుకోవాలని చెప్పారు. టీ కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేయించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల నాటికి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి