(2 నవంబర్ ) కే సి ఆర్ నిరాహార దిక్ష, విద్యార్థుల ఉద్యమంతో దిగి వచ్చిన కేంద్రం 9 .12 .2009 న ఒక ప్రకటన చేసింది అనే విషయం మనందరికీ తెలుసు, ఆ తర్వాత సీమంద్ర రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి 23 .12 .2009 న ఆ ప్రకటన నుండి కేంద్రం వెనక్కి వెళ్ళింది, ఈ పరిణామంతో కే సి ఆర్ జానా రెడ్డి నివాసానికి వెళ్లి ఉమ్మడిగా పోరాడేందుకు ఒక వేదికను ఏర్పాటు చేసారు, అదే తెలంగాణా రాజకీయ JAC , జే ఎ సి కన్వినర్ గా ప్రో.కోదండ రామ్ ను ఎన్నుకున్నారు, ఇందులో కాంగ్రెస్, టి ఆర్ ఎస్, టి డి పి, బి జే పి, న్యూ డేమోక్రసి పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంగాలు, కవులు కళాకారులు, మేధావులు, గద్దర్, మంద కృష్ణ మాదిగ, ఇలా చాల మంది ఉన్నారు, ఒకటి రెండు సమావేశాలు జరిగాయి, అయితే ప్రాధాన్యతల గొడవతో గద్దర్ లాంటి వాళ్ళు , వివిధ కారణాలతో మంద కృష్ణ , కొన్ని సంగాలు జే ఎ సి నుండి తొలగి పోయాయి, అన్ని పార్టీల వాళ్ళు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు, జనవరి 28 2010 లోగ రాజీనామాలు చెయ్యాలని, కాంగ్రెస్ మాట నిలుపుకోలేక జే ఎ సి నుండి బయటికి వెళ్ళింది, టి డి పి రాజీనామాల జిరాక్ష్ కాగితాలు కోదండ రామ్ కు ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసారు, జే ఎ సి, టి డి పి ని భహిష్కరించింది, ఇక జాక్ లో కేవలం టి ఆర్ఎస్, బి జే పీ, న్యూ డేమోక్రాసి లు మాత్రమే ఉండడంతో రాజకీయ జాక్ విఫలం చెందిందని సీమంద్ర ఛానళ్ళు ప్రచారం చేసాయి, దీంతో జాక్ లో కొన్ని మార్పులు చేసారు, రాజకీయ jac ని తెలంగాణా jac గా ఏర్పరచి, చైర్మెన్గా కోదండ రామ్, కో చైర్మెన్గా మల్లేపల్లి లక్ష్మయ్య ఎన్నికయ్యారు. జాక్ మాట విని 11 మంది టి ఆర్ ఎస్ , ఒక బి జే పి ఎం ఎల్ ఎ లు రాజీనామా చేసారు.. జాక్ జిల్లా మండల స్థాయిల నుండి గ్రామ స్థాయి వరకు జాక్ లను ఏర్పరచి పూర్తిగా పరిపుష్టం అయ్యింది.
జగన్ ను అడ్డుకున్న మానుకోట: పార్లమెంట్లో సమైక్య వాద ప్లేకార్డ్ పట్టుకున్న జగన్ వరంగల్లో ఓదార్పు యాత్రకు సిద్ధపడ్డాడు, వరంగల్ జనం తమ జిల్లాకు జగన్ రావొద్దని మొత్తుకున్నారు, అతని రాకకు నిరసనగా బంద్ పాటించారు, డి జి పి కూడా వేల్లోద్దని చెప్పారు, సోనియా గాంధీ కూడా వరంగల్ వేల్లోద్దని చెప్పిన జగన్ కొండ దంపతుల అండతో వరంగల్ వెళ్ళడానికి సిద్ధమయ్యారు, అయితే జాక్ జగన్ ను అడ్డుకోవాలని పిలుపు నిచ్చారు, 27 మే 2010 న ఇంటర్ సిటీ ట్రైన్లో సికాన్ద్రాబాద్ నుండి బయలు దేరాడు జగన్, అయితే ఆ రోజు ఉదయానికే వేలాది మంది జనం మహబూబా బాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు, జగన్ ను మొదట బిబి నగర్ రైల్వే స్టేషన్ లోనే జనం అడ్డుకున్నారు, అరగంట తర్వాత ట్రైన్ బిబి నగర్ నుండి బయలుదేరింది,అయితే మహబూబాబాద్ రైల్ స్టేషన్కు కొండదంపతులు చేరుకోవడం ఉద్రిక్తతలకు ధరి తీసింది, వెయిటింగ్ రూం లో కూర్చున్న వారిపై జనం రాళ్ల దాడి చేసారు, దీనితో ఆగ్రహించిన కొండ మురళి కాల్పులకు పాల్పడగా విద్యార్థి తల నుండి బుల్లెట్ దూసుకెళ్ళి , ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. వరంగల్ జనం ఆగ్రహంతో రగిలి పోయారు కేసముద్రం ను౦డి మహబూబ బాద్ వరకు రైల్వే ట్రాక్ మొత్తం జనం తో నిండి పోయింది, వంగపల్లి స్టేషన్ వద్ద సుమారు రెండు గంటల పాటు రైల్ ను ఆపారు, ఆ తర్వాత్ పోలీసులు వచ్చి జగన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు.
ఉప ఎన్నికలు: JAC పిలుపు మేరకు రాజీనామా చేసిన తెలంగాణా వాదులకు పోటిగా కాంగ్రెస్, టి డి పి లు తమ అబ్యర్తులను నిలబెట్టాయి, జాక్ తన అబ్యర్తులను గెలిపించుకోవడానికి, విద్యార్థులు బస్సు యాత్ర చేసారు, అమరవీరుల కుటుంబాలు ప్రచారంలో పాలు పంచుకున్నై, టి ఆర్ ఎస్, బి జే పి లు ప్రచారం చేసాయి, జూలై 30 ,2010 ఎన్నికల ఫలితాలు వచ్చాయి, అన్ని స్థానాల్లో జాక్ అభ్యర్థులు భారి మెజారిటితో విజయం సాధించారు, కాంగ్రెస్ నాల్గు, టి డి పి పన్నెండు స్థానాల్లో డిపాసిట్ కోల్పోయాయి.
సహాయనిరాకరణ: శ్రీ కృష్ణ కమిటి ఎ పరిష్కారం చూపక పోయే సరికి జాక్ సహాయనిరకరణకు పిలుపునిచ్చింది, 17 ఫిబ్రవరి 2011 న ప్రరంబమైన సహాయనిరకరణలో 3 లక్షల ఉద్యోగులు పాల్గొన్నారు, టి ఆర్ ఎస్ ఎం పి లు పార్లమెంట్ను స్తంబింప జేసారు, బి జే పి నాయకురాలు సుష్మ స్వరాజ్ కాంగ్రేస్స్ను నిలదీసింది. 25 రోజుల పాటు ఈ సమ్మె కొనసాగింది, మే లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్ వేచి ఉండాలి అని చెప్పడంతో సమ్మెను విరమించారు, అయితే అనేక ఆరోపణలు వచ్చాయి ఈ సమ్మె విరమనపై..
మిలియన్ మార్చ్: సహాయ నిరాకరణ లో బాగంగా మార్చ్ 10 న మిలియన్ మార్చ్ కు జాక్ పిలుపునిచింది, అయితే ప్రభుత్వం విద్యార్థులను , రాజకీయ నాయకులను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్లు చేసింది, రైల్వే స్టేషన్ బస్సు స్టాండ్ లలో పోలీసులను పెట్టి జనాన్ని అరెస్ట్ చేయించింది, సిటీ చుట్టూ 13 చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసింది, ఐన వేలాదిగా ట్యాంక్ బ్యాండ్ పైకి జనం తరలి వచ్చారు, ఆరోజు 50 వేల నుండి లక్ష మంది జనం పాల్గొన్నారు, ఆంద్ర వారికి ప్రతిరూపంగా ఉన్న విగ్రహాలను పగులగొట్టి సాగర్ లో నిమర్జనం చేసారు. మిలియోన్ మార్చ్ జనాలలో ఉత్సాహాన్ని నింపింది.
జాక్ ఆ తర్వాత పట్నం రోడ్లపై పొయ్యి పెడదాం అనే కార్యక్రమాన్ని చేపట్టింది, రైల్ రోకో ను కూడా విజయ వంతంగా నిర్వహించింది.
సకల జనుల సమ్మె: గతం లో జరిగిన లోటు పాట్లను సవరించుకుంటూ జాక్ సకల జనుల సమ్మె కు పిలుపు నిచ్చింది, గతం లో సహాయ నిరాకరణ సమయంలో బస్సు ఎక్కి టికెట్ తీసుకోకుండా జై తెలంగాణా అనాలని జే ఎ సి పిలుపు నిచ్చింది, కాని ఇది సాధ్యం కాలేదు, అందుకే ఈ సారి సీమంద్ర సర్కార్ ఆర్ధిక మూలాలను దెబ్బ తీయాలని RTC ఉద్యోగులనే సమ్మేలోకి దించింది, అలగే గతంలో కరెంట్ బిల్లులు కట్టవద్దని కూడా పిలుపు నిచ్చింది, కాని అది కూడా సాధ్యం కాలేదు, అందుకే ఈ సారి విధ్యుతుద్యోగుల్ని సమ్మెలో భాగం చేసింది, అలాగే వాటర్ బిల్, ఇంటి పన్ను లాంటివి చెల్లించ వద్దని పిలుపునిచ్చారు, అయితే ఈ సారి ఏకంగా మున్సిపల్ ఉద్యోగుల్ని, GHMC ని ఉద్యమంలో కలుపుకున్నారు, మద్యం దుకాణాల బంద్ కు గతం లో పిలుపు నిస్తే అది పూర్తిగా విజయ వంతం కాలేదు, అలాగే మద్యం విషయంలో ప్రజలు స్వయం నియంత్రణ పాటించాలని జే ఎ సి పిలుపునిచ్చింది, అయితే ఈ సారి మద్యం తయారి కంపనిల ఉద్యోగుల్ని,అలాగే ఎక్షజ్ శాఖ ఉద్యోగుల్ని కలుపుకొని సమ్మెను తీవ్రం చేసారు, 12 సెప్టెంబర్ న కరీం నగర్ లో నిరవహించిన సభ తో సమ్మె ను ప్రారంబించారు, 13 వ తేది నుండి సకల జనులు సమ్మెలో పాల్గొన్నారు, అన్ని శాఖల ప్రభుత్వ ప్రవేట్ తెలంగాణా ఉద్యోగులు, వ్యాపార సంస్థలు, ఫిలిం జాక్ , సింగరేణి, RTC , GHMC కులసంగాలు పాల్గొన్నారు, కాని రాజకీయ నాయకులూ భాగం కాలేదు, దీనితో 42 రోజులు సమ్మె చేసిన ఉద్యోగులు ఆ తర్వాత విరమించారు.
అయితే సకల జనుల సమ్మె ముక్య ఉద్దేశ్యం ఏంటంటే ఒక నియోజక వర్గంలో లక్ష యాభై వేల మంది జనం ఉంటారు వారంతా సమ్మెలో పాల్గొనడం జరగదు, ఆ నియోజక వర్గ ఎం ఎల్ ఎ రాజీనామా చేసి సమ్మెలో పాల్గొంటే అది సకల జనుల సమ్మె అవుతుంది, కాని 42 రోజుల పాటు ఒత్తిడి తెచ్చిన కాంగ్రెస్ నాయకులూ కదలలేదు, అందుకే ద్రోహులుగా మంత్రులను ప్రజల ముందు నిలబెట్టి సమ్మెను విరమించారు ఉద్యోగులు, JAC పై కొంతమంది ఉద్యమంలో కలిసి రాని మనుషులు విమర్శలు కురిపిస్తున్నారు, అయితే వీళ్ళు గతంలో సహాయ నిరాకరణ ముగించిన తర్వాత కూడా ఇలాగె ప్రవర్తించారు, కాని ఏనాడూ ఉద్యమాన్ని ముందుకు నడిపించలేదు, కాని JAC అవన్నీ పట్టించుకోకుండా తన గత అనుభవాలను పాటలుగా చేసుకొని కొత్త కార్య చరనతో అనేక సంఘాలను కలుపుకొని సకల జనుల సమ్మె గా వహ్చింది, అలాగే సకల జనుల సమ్మె నుండి కూడా పాటలు నేర్చుకొని భవిష్యత్ ఉద్యమాన్ని మరింత పకడ్బందిగా రూపొందిస్తుంది....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి