1969 లో తెలంగాణా ఉద్యమంలో అమరులైన విద్యార్థి వీరుల స్మృత్యర్థం ఒక స్థుపాన్ని ఏర్పాటుచెయ్యాలని తలచారు, ఐతే తెలంగాణా చిహ్నం ఒకటి హైదరాబాద్లో ఉండటం సీమంద్ర సర్కార్కు నచ్చలేదు స్థూపం ఏర్పాటుకు అనుమతించలేదు, ఐన పట్టువదలకుండా 1975 లో అప్పటి హైదరాబాద్ మున్సిపల్ చైర్మెన్ సహకారంతో అసెంబ్లీ కి ఎదురుగా ఉన్న గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం ఏర్పాటుచేసారు, ఐతే సీమంద్ర సర్కార్ స్థూపం ఏర్పాటును అడ్డుకునేందుకు అసెంబ్లీ పరిసర ప్రాంతాలను మొత్తం పోలీసులతో నిమ్పివేసింది, ఆ రోజు లాటి చార్జ్ జరిగింది, తెలంగాణా వాదులను తరిమి కొట్టాలని చూసారు కాని చివరికి స్థుపాన్ని గన్ పార్క్ లో ఏర్పాటుచేసారు, అయితే ఈ స్థుపాన్ని ఇంతవరకు ఎవరు ప్రారంభోత్సవం చెయ్యలేదు, స్థూపాన్ని ఏర్పాటు చెయ్యగానే నాయకులందరిని పోలీసులు అరెస్ట్ చెయ్యడంతో అల ఆ రోజు ప్రారంభోత్సవం ఆగిపోయింది, ఐన తెలంగాణా వాదులు తమ కోసం ఆత్మబలి దానం చేసిన తమ యోధులను ఆ స్తూపంలో చూసుకుంటున్నారు.
అమరవీరుల స్థూపాన్ని తయారుచేసిన శిల్పి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన యాదగిరి, ఆయనది పాలమూరు జిల్లా, కాని ఆయన హైదరాబాద్ పాత బస్తి లో జీవిస్తున్నారు, ఆయన రూపొందించిన అమరవీరుల స్తూపంలో ఎన్నో నిగూడ అర్థాలు ఇమిడి ఉన్నాయి, స్థూపం అడుగు భాగం నల్లరాయితో తయారయ్యింది, స్తూపం నారింజ, ఎరుపు రంగుల్లో ఉంటుంది, నారిజ త్యాగానికి, ఎరుపు విప్లవానికి చిహ్నం, స్థూపం నాలుగు వైపులా పుష్పాలు ఉంటై అవి అమరవీరులకు అర్పించే నీరాజనం, పై భాగంలో అశోక చక్రాన్ని తీసుకున్నారు, ఇది శాంతి, ధర్మం, సహనాలకి చిహ్నం, స్థూపం పై భాగంలో ఉండే తెల్లని మల్లెపువ్వు స్వేచ్చకు చిహ్నం, అమరవీరుల ఆశయం, వారి సాహసం, వారి త్యాగం ఎన్నటికి వాడిపోవని అది చెప్తుంది.
తెలంగాణా రాష్ట్రము కోసం దశాబ్దాలుగా జరుగుతున్న సమరానికి, సాహసానికి, సజీవ సాక్షంగా నిలిచి ఉంది ఈ అమరవీరుల స్తూపం, చరిత్రలో సీమంద్రుల రక్త దాహానికి భాలైన తెలంగాణా వీరుల త్యాగాలను, సీమంద్రుల దౌర్జన్యాలను మనకు నిరంతరం గుర్తుచేస్తూ, పోరాటం వైపుగా తెలంగాణా ప్రజలను మరలిస్తున్నది తెలంగాణా అమరవీరుల స్థూపం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి