1 . తెలంగాణ కోసం మరో విద్యార్థి ఆత్మబలిదానం చేసుకున్నడు. ఓయూలో చదువుతున్న నగేష్ ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల లో ట్రైన్ కింద పడి చనిపోయిండు. నగేష్ స్వస్థలం సిర్పూర్ కాగజ్ నగర్. కేంద్రం వైఖరితో మనస్థాపం చెంది చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు.
2 . ఖాకీల ఓవర్ యాక్షన్ తో .. ఓయూలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంచిర్యాలలో ఓయూ విద్యార్థి నగేష్ ఆత్మహత్యకు సంతాపంగా .. స్టూడెంట్స్ ర్యాలీ తీసిన్రు. ఆర్ట్స్ కాలేజీ నుంచి తార్నాక దాకా .. ర్యాలీగా బయలుదేరిన్రు. ఐతే.. విద్యార్థుల శాంతియుత ర్యాలీపై ..ఖాకీలు జులుంచేసిన్రు. విద్యార్థుల ర్యాలీని అడ్డుకొన్నరు. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించిన్రు.
3 . తెలంగాణా ఉద్యమంపై ప్రభుత్వ అణచివేతను తెలుసుకునేందుకు.. పౌరహక్కుల సంఘాల నేతలు మెదక్ జిల్లాలో పర్యటించారు. ప్రజలు, జేఏసీ నేతల నుంచి వివరాలను సేకరించిన్రు. మాజీ ఎమ్మెల్యే రాంలింగారెడ్డితోపాటు ఇతర నేతలు .. ప్రజలు ప్రభుత్వం చేసిన దౌర్జన్యకాండను వివరించిన్రు.
4 . రూపాయి కిలో బియ్యం నాణ్యతను ప్రశ్నించిన వ్యక్తిపై దాడిచేసిన... సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. బాధితుడు చాకలి బాలరాజు ఫిర్యాదు మేరకు 323, 504 సెక్షన్ల కింద జగ్గారెడ్డిపై కేసు బుక్ చేశారు. దీనిపై తెలంగాణ వాదులు హర్హం వ్యక్తంచేశారు. వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
5 . నిమ్స్‌లో ఏడో రోజు దీక్ష కొనసాగిస్తున్న కోమటిరెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించింది. కోమటిరెడ్డి తీవ్ర కడుపు నొప్పితో, అస్తమాతో బాధపడుతున్నారు. ఆయనను పరీక్షించిన వైద్యులు దీక్ష విరమించాల్సిందేనని తెలిపారు. దీక్ష విరమించకపోతే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెప్పారు. కోమటిరెడ్డి ఆరోగ్యంపై తెలంగాణవాదులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత మంత్రులదేనని తెలిపారు.
6 . తెలంగాణ సాధన కోసం ఈ నెల 22న పార్లమెంట్ ఎదుట దీక్ష చేపడుతానని కొండా లక్ష్మణ్ బాపూజీ వెల్లడించారు. ఆరు రోజులుగా చేపట్టిన దీక్షను ఆయన ఈ రోజు విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తన దీక్షకు అన్ని పార్టీల నేతలు వస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. తమ ఎజెండా, జెండా తెలంగాణ రాష్ట్ర సాధననే అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణవాదులు శాంతియుతంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి