30 /10 / 2011 టి ఆర్ ఎస్ లోకి వలసల వరద కొనసాగుతుంది, 2010 లో టి డి పి నుంచి చెన్నమనేని రమేష్ తో మొదలైన వలసల పరంపర తాజాగా అధికార కాంగ్రెస్ కు పాకింది, టి డి పి నుండి మాజీ మంత్రులు, మాజీ ఎం పి లు, మాజీ ఎం ఎల్ ఎ, ఎం ఎల్ ఎ లతోపాటు, వేలాదిమంది కార్యకర్తలు ఇప్పటికే టి ఆర్ ఎస్ లోకి వచ్చి ఉన్నారు, అయితే ఇప్పుడు కాంగ్రెస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, సహా ఎం ఎల్ ఎ లు రాజయ్య , సోమరపు సత్య నారాయణ లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టి ఆర్ ఎస్ లో వేలాది కార్యకర్తలతో వచ్చి చేరారు, ఈ సందర్బంగా మాట్లాడిన కే సి ఆర్ కొంతమంది సన్నాసులు టి ఆర్ ఎస్ కాంగ్రెస్ లో విలీనమౌతది అని ప్రచారం చేస్తుంది, కాని ఇప్పుడు ఏమంటారు, కాంగ్రెస్ ఎ టి ఆర్ ఎస్ లో విలీనం అవుతుంది అని అన్నారు, తెలంగాణా లో టి ఆర్ ఎస్ తప్ప ఇంకో పార్టీ ఉండదని ఆయన ఈ సందర్బంగా అన్నారు, టి ఆర్ ఎస్ తోనే తెలంగాణా సాధ్యమని పార్టీలో చేరిన ఎం ఎల్ ఎ లు అన్నారు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి