హోం

28, అక్టోబర్ 2011, శుక్రవారం

మన ఆలయాలు-1 "కాళేశ్వరం"



( 29 / 10 / 2011 ) కరీంనగర్ జిల్లా లోని అతి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి కాళేశ్వర క్షేత్రం, కరీంనగర్ పట్టణం నుండి 125 కిలో మీటర్ల దూరంలో ఉన్నది కాళేశ్వరం, కాళేశ్వరం లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయ్ గోదవరి ప్రాణహిత నదులు సంగమించే చోట ఈ క్షేత్రం ఉంది, ఇక్కడ శివ లింగంతోపాటు యమ లింగం కూడా ఉంటుంది. ఎందుకంటే,
                        పురాతనకాలంలో యముడు మనుషుల పాపాలను తొలగించి వారికి ముక్తిని ప్రసాదించమని శివున్ని ప్రార్ధించాడు, అప్పుడు ప్రత్యక్షమైన శివుడు యముని కోరికని మన్నించాడు, అలా ఈ క్షేత్రంలో ఒకే ప్రాణ మట్టంపై రెండు లింగాలు ఉంటాయి. ఒకటి యమలింగం కాగ, మరొకటి శివ లింగం, కాలుడు మనుషుల పాపాలు తొలగిస్తే, శివుడు ముక్తిని ప్రసాదిస్తాడు, కావున ఈ క్షేత్రాన్ని కాళేశ్వర-ముక్తేశ్వర క్షేత్రం అంటారు, అయితే ఇక్కడి మరో ప్రత్యేకత ఏంటంటే ముందు యమున్ని ధర్శించుకున్నకే, శివుని దర్శనం లభిస్తుంది.

                              అనేక ప్రత్యేకతలకు నెలవు ఈ ఆలయం, పచ్చని ప్రకృతి మధ్య నెలవైన ఈ క్షత్రంకు వచ్చిన వారు భక్తి తన్మయత్వంలో మునిగిపోతారు, అతి అరుదైన సరస్వతి క్షేత్రాలలో ఒకటి ఇక్కడ ఉంది, సరస్వతి దేవి ఆలయాలు దక్షిణ భారతంలో కేవలం రెండే ఉన్నాయ్, ఆ రెండింటిలో ఇది ఒకటి, అలాగే మరో అరుదైన ఆలయం కూడా ఇక్కడున్నది, అదే సూర్య దేవాలయం, ఆంద్ర ప్రదేశ్ లో కేవలం రెండే సూర్య దేవాలయాలు ఉండగా అందులో ఒకటి ఇక్కడ ఉంది.

              కాళేశ్వరం లో మరో ప్రత్యేకత కూడా ఉంది, ఇది త్రివేణి సంగమ పవిత్ర భూమి, ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు సంగమిస్తాయి, ఇక్కడ మూడు నదుల పుష్కరాలు జరుగుతాయి, అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశి అంటారు, ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదుల పుష్కరాలు చాల వైభవంగా జరుగుతాయి.ఇక్కడ శివ రాత్రి వేడుకలు అతి వైభవంగా జరుగుతాయి..


సరస్వతి నది: ఇక్కడ మరో విశేషం ఏంటంటే దేవాలయంలో శివ లింగం పై పోసిన నీళ్లన్నీ ఆ శివలింగం ముక్కుద్వారా సేకరించి గోదావరి-ప్రాణహిత సంగమ స్థానంలో కలుపుతుంది, అయితే ఆ నాటి శాస్త్ర విజ్ఞానం యొక్క అధ్బుతం ఇది, శివుని ముక్కు నుండి గోదావరి-ప్రాణహిత నది సంగమ స్థానం వరకు గొట్టాల ద్వార అంతర్ వాహినిగా వెళ్ళే శివున్ని అర్చించిన జలమే సరస్వతి నది, అందుకే ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి, అలాగే ఇక్కడ సరస్వతి దేవాలయం కూడా ఉంది.
                         కాళేశ్వర క్షేత్రం పెద్దల పిండ ప్రదానానికి ముఖ్యమైన క్షేత్రం, కాశికి వెల్లలేని వాళ్ళు ఇక్కడ గోదావరి-ప్రాణహిత-సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు, ఇది కాశిలో జరిపించినంత  పుణ్యమని చెప్తారు.

                      కాళేశ్వర- ముక్తేశ్వర క్షేత్రం భక్తి పరంగానే కాకుండా ఇది మంచి పర్యాటక కేంద్రం కూడా, ఇది దట్టమైన అడవిలో ఉండడం వలన ఎటు చుసిన పచ్చని ప్రకృతి ఉంటుంది, గోదావరి-ప్రాణహిత నదుల సంగమ స్థానం కూడా చూడదగిన ప్రాంతమే, అలాగే ఇక్కడ బోటు సౌకర్యంకూడా ఉండటంతో హాయిగా బోటింగ్ కూడా చెయ్య వచ్చు, ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ క్షేత్రం తప్పకుండ చూడవలసిందే......

1 కామెంట్‌: