హోం

22, అక్టోబర్ 2011, శనివారం

తెలంగాణా జాతిపిత ప్రొ.జయ శంకర్




తెలంగాణా కొసం జీవితంతం పరితపించిన కొత్తపల్లి జయ శంకర్ గారు ప్రొ.జయ శంకర్ గా మనందరికి సుపరిచితుడే. నిజాం నిరంకుశ పాలనలొ మగ్గుతున్న హైదరాబాద్ సంస్థానంలొని వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కన్నపెట గ్రామంలొ 1934 ఆగస్ట్ 06 న జన్మించారు. ఆయన తల్లి మహా లక్ష్మి, తండ్రి లక్ష్మి కాంతరావు.
ఆయన బాల్యం తన సొంత ఊరిలోనే గడిచింది. ఆయన చదువుకొనే రోజుల్లో భారత స్వాతంత్ర్య ఉద్యమం ఉవ్వేతున సాగుతుంది, స్వాతంత్ర ఆకాంక్ష కలవారంత వందేమాతరం అని పలుకరించుకునేవారు, కాని హైదరాబాద్ లో మాత్రం నిజాం రాజు వందేమాతరంను నిషేధించారు.ఆయన పాటశాల వయసులోనే వందేమాతరం అని నినదించాడు, ఆ తర్వాత హన్మకొండలో ఉన్నత విద్యను అభ్యసించారు, MA economics ను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి, Ph D economics ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసారు, ఆయన B Ed కూడా ఉస్మానియా నుండి పూర్తి చేసారు.ఆయన విద్యార్థి దశలో ఉండగానే ఉద్యమం వైపు అడుగులు వేసారు. తెలంగాణా సైనిక పాలనలో ఉన్న రోజుల్లో ఉద్యోగాలన్నీ ఆంధ్రా వారికి కట్టిపెడుతున్నారని దానికి వ్యతిరేఖంగా 1952 లో నాన్ ముల్కి లేదా ఇడ్లి సాంబార్ గో బ్యాక్ ఉద్యమాలు నడిచాయి, ఈ ఉద్యమంలో జయశంకర్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు, పోలీసు ల కాల్పుల్లో ఆయన తన సహచరులను కోల్పోయారు, దీనికి చెలించిన ఆయన 10 మంది విద్యార్థులతో తెలంగాణా జనసభను ప్రారంబించారు, ఇది రోజురోజుకు విస్తరిస్తున్దడంతో భారత ప్రభుత్వం దీనిని నిషేధించింది, ఫజాల్ అలీ కమిటి (1 st SRC ) రాష్ట్రానికి వచ్చినపుడు విద్యార్థి విభాగం తరపున ఆయన కమిటిని కలుసుకొని తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగాలని బలంగా వాదించారు, ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించిన జయ శంకర్ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడేందుకు అనేకసార్లు సచివాలయం వెళ్లి మంత్రులతో మాట్లాడారు,అక్కడ వారు ఇచ్చిన అవహేళనతో కూడిన సమాధానాలు ఆయనను భాదించాయి.
మొదటి తెలంగాణా ఉద్యమం(1969):
ఖమ్మం జిల్లలో ఉద్యోగి నిరాహార దీక్షతో మొదటి తెలంగాణా ఉద్యమం ప్రరంబమైనది, ఉస్మానియా విశ్వా విద్యాలయం రగిలి పోయింది, తెలంగాణా ఉద్యోగులు సమ్మె ప్రారంబించారు, ప్రభుత్వ ఉద్యోగిగా ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా అనేక సభలలో ఉపన్యసించారు, అనేక పత్రికలకు అయన తెలంగాణా ఆవశ్యకతను వివరిస్తూ కథనాలు రాసారు, అనేక పుస్తకాలు రాసారు, తెలంగాణా ప్రజలను, విద్యార్థులను చైతన్య పరచడానికి ఆయన కృషి చేసారు, ఉద్యమం ఉవ్వేతున సాగింది, 369 మంది విద్యార్థులు పోలీసు కాల్పుల్లో అమరులయ్యారు, ఆ తర్వాత 1969 లో వచ్చిన భార్గవ కమిటి ముందు ఉద్యోగ సంఘాల తరఫున జయశంకర్ సార్ తన వాదనలు వినిపించారు.
సార్ తన జీవితం మొత్తం ఒక్కటే ఆకాంక్షతో బతికారు, ఆయన వివాహం కూడా చేసుకోలేదు, తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణా విముక్తికి అంకితం చేసారు, ఆయన చాల నిరాడంబర జీవితాన్ని గడిపారు, ఆర్ధిక శాఖ నిపుణుడు కాబట్టి ఆయన తెలంగాణా విషయంలో జరిగిన అన్యాయాల్ని అంకెలతో సహా చెప్పేవారు, వరంగల్ లోని CKM కాలేజీకి ప్రిన్సిపాల్ గా పని చేసిన ఆయన ఆ తర్వాత 1991 లో కాకతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి(VC) గా నియమిమ్పబడ్డారు.
మలిదశ తెలంగాణా ఉద్యమం:
1996 లో ప్రో. జయశంకర్ అధ్యక్షతన వరంగల్లో ఒక సదస్సు జరిగింది, దానికి అనూహ్యంగా వేలాదిమంది ప్రజలు హాజరయ్యారు, ఈ పరిణామంతో జయశంకర్ సార్ లో కొత్త ఆశలు చిగురించాయి, పరాయి పాలనా నుండి ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారని గ్రహించిన ఆయన ప్రజాసంఘాలను, కవులు,కళాకారులూ, మేధావులను ఒక్క తాటిపైకి తెచ్చారు, అనేక సభలు,సమావేశాలు నిర్వహించారు, ప్రజలలో చైతన్యం తేవడం ప్రారంబించారు, 1999 NRI తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం ను ఏర్పాటు చేసారు. 2000 సంవత్సరంలో ఆయన అమెరికా వెళ్లి అక్కడున్న NRI లను సంగటితం చేసారు,వాళ్ళను ఉద్యమం వైపుగా కదిలించగలిగారు, ఇక అందరు ఒక అభిప్రాయానికి వచ్చారు, తెలంగాణా కోసం ఒక రాజకీయ వేదిక కావాలని, అదే సమయంలో TDP కి రాజీనామా చేసిన కెసిఆర్ ప్రో.జయశంకర్ ను కలిసి ఆయన అధ్వర్యంలో తెరాస ను ఏర్పాటు చేసారు, సార్ పార్టీ సిద్ధాంతకర్తగా ఉన్నారు, ఆయన అనేక పర్యాయాలు డిల్లికి వెళ్లి అక్కడి పెద్దల్ని కలిసి తెలంగాణా ఆవశ్యకతను వారికీ వివరించారు, చివరిగా 2010 జనవరి 5 న చిదంబరం ఆధ్వర్యంలో జరిగిన అకిలపక్ష బేటికి కూడా సార్ తెరాస తరపున వెళ్లి వాస్తవాలను వివరించారు, 2009 లో కెసిఆర్ నిరాహార దిక్ష సమయంలో అయన వెంట ఉన్నారు, 11 రోజుల తర్వాత తెలంగాణా అనుకూల ప్రకటన రాగానే జయశంకర్ సార్ చేతుల మీదుగా కెసిఆర్ దిక్షను విరమించారు, సార్ రాసిన "తెలంగాణా రాష్ట్రము- ఒక డిమాండ్" పుస్తకం లో ఎ ఎ ముముఖ్య మంత్రి హయంలో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిదో సవివరంగా వివరించారు.
జీవితాంతం తెలంగాణా కోసం పరితపించిన జయశంకర్ సార్ కాన్సర్ వ్యాధితో బాధపడుతూ వరంగల్ లో జూన్ 21 , 2011 న 11 : 15 గంటలకు తుదిశ్వాస విడిచారు. తెలంగాణా జాతి పితగా ఆయన మన హృదయాల్లో ఎప్పటికి కొలువై ఉంటారు .....
సార్ అంతిమయాత్ర :







2 కామెంట్‌లు:

  1. జయశంకర్ సార్ గురించి చాలా చక్కగ వివరించారు. థాంక్యూ వెరీ మచ్ ! సార్ రాసిన " తెలంగాణ రాష్టము- ఒక డిమాండ్" పుస్తకం గురించి కూడా కాస్త వివరణ(లేదా లింకు) ఉంటే బాగుండేది.

    రిప్లయితొలగించండి