హోం

27, అక్టోబర్ 2011, గురువారం

తెలంగాణా ఉద్యమ వేదిక-టి.ఆర్.ఎస్

(28 /10 /2011 ) టి ఆర్ ఎస్ ఏర్పడటానికి దాదాపు పదేళ్ళ ముందు శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ డాంపై కూర్చొని కే సి ఆర్ అన్న మాటలు ఆరోజు నిజమయ్యాయి, టి డి పి స్థాపించిన నాటి నుండి ఆ పార్టీలో క్రమశిక్షణ కల నాయకునిగా ఉంటూ విశేష సేవలన్దిచిన తనకు ఆ పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఒకవైపు, తెలంగాణకు టి డి పి చేస్తున్న అన్యాయాలను చూసి ఉరుకోలేక ఆయన పార్టీకి ఆ పార్టీ ద్వార వచ్చిన పదవికి రాజీనామా చేసారు, అప్పటికే మేధావులను, ప్రజా సంఘాలను, NRI లను, ఏకం చేసిన జయ శంకర్ సర్ రాజకీయ వేదిక కోసం వెతుకుతున్న తరుణంలో ఆయన మార్గ నిర్దేశనంలో కల్వకుంట్ల చంద్ర శేకర్ రావు పార్టీ అధ్యక్షునిగా, ప్రో.జయ శంకర్ పార్టీ సిద్దాంత కర్త గా 27 -04 -2001 న  తెలంగాణా రాష్ట్ర సమితి ఏర్పడింది, 
                                          పార్టీ స్థాపించిన 60 రోజుల్లోనే మెదక్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 75 % మండల పరిషత్తు స్థానాలను , 25 % జిల్లా పరిషత్తు స్థానాలను గెలుచుకుంది, ఆ తర్వాత వచ్చిన సిద్దిపేట అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  కే సి ఆర్ గణ విజయం సాధించారు, తొలిసారిగా రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణా గొంతుకు స్థానం దక్కింది..
          కరీం నగర్ లో టి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారి భహిరంగ సభకు 12 లక్షల మంది హాజరయ్యారు, దీంతో కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ తన మానిఫెస్టోలో తెలంగాణా అంశం చేర్చి టి ఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకుంది..2004  సార్వత్రిక ఎన్నికల్లో 5 పార్లమెంట్ స్థానాల్లో పోటి చేసిన టి ఆర్ ఎస్ 5 స్థానాలను గెలుచుకుది, 26 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది, 18 నెలలపాటు శాక లేని మంత్రిగా కేబినెట్లో కొనసాగారు కే సి ఆర్, అయితే అనుకోని పరీస్తితులలో  ఆలే నరేంద్ర (ఎం,పి) పార్టీని వీడ వలసి వచ్చింది.

                                       రెండు సంవత్సరాల నిరీక్షణ తర్వాత రాష్ట్ర మంత్రి వర్గం నుండి టి ఆర్ ఎస్ బయటకు వచ్చింది,  బయటకు వచ్చే ముందు అసెంబ్లీ లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను అసెంబ్లీ సాక్షిగా చెప్పారు హరీష్ రావు, ఆ తర్వాత కేంద్రం నుండి కూడా బయటికి వచ్చి, తన ఎం.పి పదవికి రాజీనామా చేసారు కే సి ఆర్, అయితే ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వై ఎస్ ఆర్ , ఇవి తెలంగాణకు రిఫరెండం అన్నారు, అయితే 2006 కరీం నగర్ ఉపఎన్నికలలో కే సి ఆర్ భారి మెజారిటితో గెలిచారు, ఆ తర్వాత ఆయన అనేకమంది జాతీయ నాయకులను కలిసి వారితో తెలంగాణకు అనుకూలంగా ఒప్పించగలిగారు, వారందరిని ఒకే వేదిక మీదకు తెచ్చి తెలంగాణకు అనుకూలం అని చెప్పించారు, ఐన కేంద్రంలో కదలిక రాలేదు,.

                                      పైగా పార్టీని చీల్చడంలో రాజశేకర్ రెడ్డి సక్సెస్ అయ్యారు, పది మంది ఎం ఎల్ ఎ లు పార్టీ నుండి వెళ్లి పోయారు, ఈ పరిణామం తర్వాత కే సి ఆర్ రాజీనామానే మరోసారి ఆయుధంగా ఎంచుకున్నారు, మొత్తం 16 మంది ఎం ఎల్ ఎ లు, నల్గురు ఎం పి లు రాజీనామా చేసారు అయితే ఈ ఎన్నికల్లో టి ఆర్ ఎస్ కు తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలింది, కేవలం 7 ఎం ఎల్ ఎ , 2 ఎం పి స్థానాలను మాత్రమే గెలిచింది టి ఆర్ ఎస్, ఐన కే సి ఆర్ కుంగిపోలేదు, కలిసి వచ్చిన తల్లి తెలంగాణా పార్టీని టి ఆర్ ఎస్ లో విలీనం చేసుకున్నాడు, తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన టి డి పి తో కలిసి కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా 2009 ఎన్నికల్లో  ముందుకు వెళ్ళాడు, కాని ఈ ఎన్నికల్లో టి ఆర్ ఎస్ కేవలం రెండు పార్లమెంట్, పది అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుహుకుంది, ఈ పరిణామంతో కే సి ఆర్ కుంగిపోయారు, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానన్నారు.
                                  కొద్ది రోజుల్లోనే కొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు కే సి ఆర్, రాష్ట్ర పతి ఉత్తర్వుల్లోని 14 F ను రద్దు చెయ్యాలని, లేకపోతే తను నిరాహార ధిక్షకు దిగుతానని ప్రధానికి, రాష్ట్రపతికి, ముక్యమంత్రికి తెలియజేసారు, సిద్దిపేట వేదికగా 29 నవంబర్ 2009 న ఉదయం కరీం నగర్ నుండి ధిక్ష స్థలానికి బయలు దేరారు, అయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో కే సి ఆర్ ను అర్రెస్ట్ చేసి ఖమ్మం సబ్ జైలు కు తరలించింది, ఈ వార్త తెలిసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం రగిలి పోయింది, శ్రీ కాంత చారి అనే విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకొని అందరు చూస్తుండగానే ఆత్మ హత్యా చేసుకున్నాడు, ఈ సంఘటన తో యావత్ తెలంగాణా  భగ్గుమంది, పది జిల్లాల్లో నిరసనలు దిష్టి బొమ్మల దహనాలు జరిగాయి, ఓ యు జాక్ రెండు రోజుల బంద్ కు పిలుపునిచ్చింది, రెండవ రోజు లాటీలు విరిగాయి, అనేక మంది విద్యార్థులు గాయలపాలు అయ్యారు, రబ్బరు బుల్లెట్లు , భాష్ప వాయు గోలలు ప్రయోగించారు, అంత కంతకు కే సి ఆర్ ఆరోగ్యం ధిగ జారుతుంది అని డాక్టర్లు చెప్పే సరికి విద్యార్థులు ఆవేశంతో రగిలి పోయారు, 
పంజాగుట్టలోని షాపులపై దాడులకు దిగారు, dec 10 న అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు పిలుపు నిచ్చారు, కే సి ఆర్ ఆరోగ్య పరిస్థితి, అసెంబ్లీ ముట్టడి ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోం మంత్రి ద్వార డిసెంబర్ 09 2009 న ఒక ప్రకటన చేయించింది, " తెలంగాణా రాష్ట్రము ఏర్పాటు చేస్తాం" అని, ఈ ప్రకటన తో కే సి ఆర్ నిరాహార దిక్ష విరమించారు, తెలంగాణా అంతట సంబరాలు జరిగాయి, కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు, సీమంద్రలో కృత్రిమ ఉద్యమం ప్రారంబమైంది, దీనితో కేంద్రం వెనక్కి వెళ్ళింది.

                                      కే సి ఆర్ , జానా రెడ్డి ఇంటికి వెళ్లి జే ఎ సి ని ఏర్పాటు చేసారు, దీనికి చైర్మెన్ ప్రో. కోదండ రామ్, అయితే కాంగ్రెస్ రాజీనామా లకు జడిసి జాక్ నుండి బయటికి వెళ్ళింది, టి డి పి ద్వంద విధానాలు పాటిస్తున్డడంతో జాక్ దాన్ని బయటకు పంపింది, ఇక జాక్ లో టి ఆర్ ఎస్ , బి జే పి, న్యూ డెమోక్రసీ , ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు  ఉన్నాయ్.అయితే టి డి పి ద్వంద విధానాలకు విసిగి పోయిన నాయకులూ కార్య కర్తలు టి ఆర్ ఎస్ లోకి రావడం ప్రారంబించారు, ఎం ఎల్ ఎ లు కూడా పార్టీ ని వదిలే పరిస్థితి వచ్చింది, జాక్ పిలుపు మేరకు, టి ఆర్ ఎస్ 10 మంది , బి జే పి ఒకరు, టి డి పి కి రాజీనామా చేసి( టి ఆర్ ఎస్ లో చేరారు )  మరొకరు ఎం ఎల్ ఎ లు రాజీనామాలు చేసారు, అయితే జనం వీళ్ళను భారి మెజారిటీతో గెలుపించుకున్నారు, టి డి పి అన్ని స్థానాల్లో ధరావత్ కోల్పోగా, కాంగ్రెస్ నాల్గు స్థానాల్లో ధరావత్ కోల్పోయింది, ఈ పరిణామం తో టి డి పి నుండి వలసలు పెద్ద సంఖ్యలో టి ఆర్ ఎస్ వైపు వెళ్ళాయి, డిసెంబర్ 2010 లో చరిత్రలో కానీ విని ఎరుగని రీతిలో 25 లక్షల మందితో మహా ఘర్జన సభను వరంగల్ లో నిర్వహించింది, 2011 ఏప్రిల్ 27 నాటికీ టి ఆర్ ఎస్ ఏర్పడి పది సంవత్సరాలయ్యింది, JAC  ప్రధాన భాగస్వామ్య పక్షంగా జాక్ ఇచ్చే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలంగాణా ఆశయ సాధన వైపుగా ముందుకు వెళ్తుంది, తెలంగాణ ఉద్యమ వేదిక..టి ఆర్ ఎస్.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి