( 29 / 10 / 2011 ) నిన్న సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటి బేటి అయ్యి తెలంగాణాపై సుదీర్గంగా చర్చించారు, సమావేశ అన౦తరం చిదంబరం మాట్లాడుతూ తెలంగాణా అంశం పై సుదీర్గ మంతనాలు జరిగాయని, యు పి ఎ పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు, అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరుగనుండడంతో, అక్కడ కాంగ్రెస్ ప్రధానమైన ప్రచార అస్త్రం ఏంటంటే హరిత్ ప్రదేశ్, బుందేల్ ఖండ్ రాష్ట్రాలు ఇస్తామని, అయితే ఎ సమస్య లేకుండా ఇప్పటికే వాగ్దానం చేసిన తెలంగాణా పై ఒక నిర్ణయం తీసుకొని ప్రచారానికి వెళ్తే కలిసి వస్తుందని, లేక పోతే జనం నమ్మరని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి