హోం

31, డిసెంబర్ 2011, శనివారం

2011 సింహావలోకనం...2012 కు స్వాగతం...

* 2011 ఆదిలోనే వివక్షకు గురయ్యింది తెలంగాణా, ఈ సారి అది సినిమా రూపంలో జరిగింది, తెలంగాణా సినిమా గా గుర్తింపు తెచ్చుకున్న జై భోలో తెలంగాణా సినిమా ను విడుదల కాకుండా అడ్డుకునేందుకు సీమంద్రులు ప్రయత్నించారు, కాని ఆ కుట్రలను తెలంగాణా ప్రజలు తిప్పి కొట్టి జై భోలో తెలంగాణా సినిమా ను విడుదల చేసుకొని అపూర్వ విజయాన్ని కట్టబెట్టారు..
* 2011 లోనే ఉద్యోగుల సహాయ నిరాకరణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది..
* ఇదే క్రమంలో జరిగిన మిలియన్ మార్చ్ గ్రాండ్ సక్సెస్ కాగ ఆంద్ర ఆధిపత్య అహంకారానికి దర్పణం గా ట్యాంక్ బ్యాండ్ పై ఉన్న విగ్రహాలను తెలంగాణా ప్రజలు తొలగించారు.
* పార్టీ లతో సంబంధం లేకుండా అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు జూన్లో రాజీనామా చేసారు.
* ఆ తర్వాత కార్మిక కర్షక ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలతో పాటు సకల జనుల సమ్మె ఉధృతం గా 42 రోజులపాటు కనీవినీ ఎరుగని రీతిలో సాగింది.
* భాన్సు వాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించి తెలంగాణా ప్రజలు తమ ఆకాంక్షను మరోసారి చాటి చెప్పారు.
* పత్రిక రంగంలో తెలంగాణా కు ఒక దిన పత్రికను అందించింది ఈ సంవత్సరం.
* ప్రో . జయ శంకర్ సార్ను, మిద్దె రాములు వంటి గొప్పవారిని కోల్పోయాం.

* ఈ ఏడాది తెలంగాణా వాదులు సాధించిన గొప్ప విజయం 14 F ను రద్దు చేయించుకోవడం.. ఇదే స్పూర్తితో 2012 లో తెలంగాణా సాధించుకోవాలని ఆశిస్తూ "నా తెలంగాణా " అభిమానులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు....


27, డిసెంబర్ 2011, మంగళవారం

మట్టిమనుషుల మహత్తర పోరాటం "మా భూమి"


మా భూమి, 1980లో విడుదలైన ఒక తెలుగు సినిమా. 1930 - 1948 ప్రాంతంలో, హైదరాబాదు నిజాం కు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా ఇది. ప్రసిద్ధ దర్శకుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా ఇది. కిషన్ చందర్ రచించిన హిందీ (ఉర్దూ) నవల "జబ్ ఖేత్ జాగే" ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది.
మొట్టమొదటి సారిగా తెలంగాణా ఇతివృత్తం తెరపై దర్శనమిచ్చింది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విశేషాలు కళ్ళకు కట్టినట్టు సహజత్వం ఉట్టిపడేలా తీసారు, మాభూమి ఒక సినిమాలా కాకుండా వస్తవా పరిస్థితులు మన కాళ్ళ ముందు జరుగుతున్న అనుభూతికి ప్రతి ప్రేక్షకుడు లోనవుతాడు, తెలంగాణా గ్రామాల్లోని కల్మషం లేని మట్టి మనుషుల హృదయాలను తెరపై ఆవిష్కరించిన ఘనత దర్శకుడు గౌతం ఘోష్ కే దక్కుతుంది., తెలంగాణా రైతులు పోరాట యోధులుగా ఎలా మారారు అనేది సవివరంగా తెలియజెప్పిన చిత్రం ఇది, పాత్రల చిత్రణ వేషధారణ, భాష, యాస లు సహజంగా ఉండడం వాళ్ళ ఈ సినిమాను సినిమాలగా కాకుండా మన ముందు నిజం గా జరుగుతుండ అనే అనుభూతికి లోనవుతాడు ప్రేక్షకుడు, ఈ సినిమా అనేక అవార్డు లను గెలుచుకుంది, అంతేకాదు వాణిజ్య పరంగా కూడా ఇది ఘన విజయం సాధించింది, హైదరాబాద్ లో ఒక టాకీస్ లో 200 ల రోజులు నడిచింది, తెలంగాణా సాయుధ పోరాటానికి సంబంధించి ఇంత విపులంగా చర్చించిన సినిమా ఇంకోటి లేదు, ఇందులో ప్రజా గాయకుడు గద్దర్ బండెనక బండి కట్టి అనే పాటలో కనిపిస్తాడు, ఇదే అతని మొదటి చిత్రం. ఈ చిత్రంలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి వేషంలో కనిపిస్తాడు గద్దర్.
రామయ్య పాత్ర ఇందులో హీరో, గ్రామాలపై పది కాశీం రజ్వి సేనలు ప్రజలను దోచుకుంటాయి, అలంటి సమయంలో గ్రామాల్లోని ప్రజలు కమూనిస్ట్ ల సహకారంతో సంగాలుగా ఏర్పడి దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారు, దొరలను గడీల నుండి తరిమి తరిమి కొడతారు, చివరికి నిజాం భారత ప్రభుత్వానికి లోన్గిపోతారు, ఆ తర్వాత కొంతమంది దొరలకు అధికారం తిరిగి కట్టబెట్టాలని చూస్తారు, అయితే సంఘం మాత్రం దోరాలపై యుద్ధం అలాగే కొనసాగిస్తుంది, 1930 నుండి 1951 లో సాయుధపోరాటం విరమించే వరకు ఈ చిత్రం కొనసాగుతుంది, ఈ చిత్రాన్ని 1999 లో పబ్లిక్ గార్డెన్ హైదరాబాద్ లో ప్రదర్శించినప్పుడు చాల గొప్ప రెస్పాన్సు వచ్చింది, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరు ఈ చిత్రాన్ని చూసి ఆనందించారు.
      ఈ చిత్రం ప్రస్తుతం మార్కెట్ లో లభించడం లేదు, కేవలం ఒక గంట యాభై రెండు నిమిషాల సినిమా మాత్రమే ఆన్ లైన్ లో లభిస్తుంది. 



23, డిసెంబర్ 2011, శుక్రవారం

భారత ఆర్ధిక సంస్కరణల పితామహుడు మన పివి..!!


భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు, పాములపర్తి వెంకట నరసింహారావు 1921, జూన్ 28న జన్మించాడు. పి.వి.నరసింహారావుపీవీ (P V Narasimha Rao, PV) గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. అపర చాణక్యుడిగా పేరుపొందిన వాడు. భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి.1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం.
తొలి జీవితం: ఆంధ్రప్రదేశ్ లోని వరంగల్లు జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించాడు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు. తరువాత కరీంనగర్జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మ లు ఆయనను దత్తత తీసుకోవడంతో అప్పటినుండీ పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యాడు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడాడు. దీంతో తాను చదువుకుంటున్నఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆయనను బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడు ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్లెల్బీ చదివాడు [1].స్వామి రామానంద తీర్థబూర్గుల రామకృష్ణారావు ల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నాడు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు మర్రి చెన్నారెడ్డి, శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేసాడు. 1951 లో అఖిల భారత కాంగ్రెసు కమిటీ లో సభ్యుడిగా స్థానం పొందాడు.
రాష్ట్ర రాజకీయాల్లో పివి:1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు.
కులప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పీవీది ఒక ప్రత్యేక స్థానం. హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనది. తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన ఆయనకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్ను వరించింది. అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది.
1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణా ప్రజల, ఉద్యమనేతల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని తెలంగాణా ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమయింది. తెలంగాణా ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని ఆయన వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని ఆయన రాజకీయ నేపథ్యం ఆయనకు 1971 సెప్టెంబర్ 30 న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి.

ముఖ్యమంత్రిగా

ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాదు లో కంటే, ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసాడు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు ఆయన కొనసాగినా రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టబడ్డాడు.
తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నాడు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. నిజానికి భూసంస్కరణల విషయంలో పీవీకి సమకాలీన రాజకీయ నాయకులతో ఉన్న విభేధాల కారణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసివచ్చిందని కొందరి వాదన.
కేంద్ర రాజకీయాల్లో పివి:తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.

లోక్‌సభ సభ్యత్వం, కేంద్ర మంత్రిత్వం

మొదటిసారిగా లోక్‌సభకు హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యాడు. రెండోసారి మళ్ళీ హనుమకొండ నుండే లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి ఎనిమిదో లోక్‌సభకు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్ళీ రాంటెక్ నుండే తొమ్మిదో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి 1991 లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్‌సభలో అడుగుపెట్టాడు. 1980 - 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను వివిధ సమయాల్లో నిర్వహించాడు.

ప్రధానమంత్రిగా పీవీ

ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టాడు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెసు పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకు ఉన్న అపార అనుభవం ఆయనకు ఈ క్లిష్టసమయంలో తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు ఆయన అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి కూడా.

పీవీ విజయాలు

  • పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవథలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేసాడు. తన ఆర్థికమంత్రి, మన్మోహన్ సింగ్ కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చాడు. ఆ సంస్కరణల పర్యవసానమే, ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.
  • పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే
  • కాశ్మీరు తివ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే
  • ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాను ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా,ఇరానులతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని.
  • 1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. ఆయన కాలంలోనే బాంబు తయారయింది. ఈ విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించాడు.

    పీవీపై విమర్శ

    పీవీ తన జీవితంలో ఎదుర్కొన్న వివాదాలు, అవినీతి ఆరోపణలు దాదాపుగా అన్నీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన సంఘటనల పర్యవసానాలే.
    • 1994 లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన గండం నుండి తన మైనారిటీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి వక్ర మార్గాలను అనుసరించారని విమర్శలు ఉన్నాయి.
    • 1992 డిసెంబర్ 6 న అయోధ్యలో బాబరీ మసీదును కూలగొట్టిన సంఘటన ఆయన ఐదేళ్ళ పాలన లోనూ జరిగిన అత్యంత పెద్ద సంఘటన. దాన్ని కాపాడలేక పోవడం ఆయన వైఫల్యాల్లో అతిపెద్దది.
    • ఆయన కుటుంబ సభ్యుడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.
    • సాధువులకు, బాబాలకు ఆయన సన్నిహితంగా ఉండేవాడు. ( ఇది చాలా తప్పు అభిప్రాయం. ఆయన ప్రధాన మంత్రి పదవిలో ఉండగా ఎన్నడూ, ఎప్పుడూ, ఎవరినే దగ్గిరికి దరిచేరనివ్వలేదు. ఎందుకంటే ఆయన పదవిని, ఆయన సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకొని లబ్దిపొందుతారని ఆయన భయం. అయితే ఎవరిని నొప్పించే స్వభావం కానందువల్ల ఆయన పేరు వాడుకోవడం వల్ల ఆ అభిప్రాయం ఏర్పడింది)  
    •  అవినీతి ఆరోపణలు:ఐదేళ్ళ పదవీకాలంలో అనేక అవినీతి ఆరోపణలని పీవీ ఎదుర్కొన్నాడు. పదవి నుండి దిగిపోయాక కూడా వాటిపై జరిగిన విచారణలు ఆయన్ని వెన్నాడాయి. అయితే ఈ ఆరోపణలన్నీ కోర్టుల్లో వీగిపోయాయి. చివరి కేసు ఆయన మరణానికి సరిగ్గా సంవత్సరం ముందు వీగిపోయింది.
    •  ఆయన ఎదుర్కొన్న అవినీతి ఆరోపణలు:
      • జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు: పార్లమెంటులో మెజారిటీ సాధనకై జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులకు లంచాలు ఇచ్చాడనే ఆరోపణ ఇది. ఈ ఆరోపణలను విచారించిన ప్రత్యేక కోర్టు జడ్జి అజిత్ భరిహోక్ 2000 సెప్టెంబర్ 29 న పీవీని ఈ కోసులో దోషిగా తీర్పునిచ్చాడు. నేరస్తుడిగా కోర్టుచే నిర్ధారించబడిన మొట్టమొదటి పూర్వ ప్రధానమంత్రి, పీవీ. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది.
      • సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు: 1989 లో బోఫోర్స్ అవినీతిపై రాజీవ్ గాంధీ తో విభేధించి, ప్రభుత్వం నుండి, పార్టీ నుండి బయటకు వచ్చేసిన వి.పి.సింగ్ ను అప్రదిష్ట పాల్జేసేందుకు, కుమారుడు అజేయ సింగ్ ను ఇరికించేందుకు ఫోర్జరీ సంతకాలతో సెయింట్ కిట్స్ ద్వీపంలో ఒక బ్యాంకులో ఎకౌంటు తెరిచిన కేసది.
      • లఖుభాయి పాఠక్ కేసు: లఖుభాయి పాఠక్ అనే పచ్చళ్ళ వ్యాపారి ప్రభుత్వంతో ఏదో ఒప్పందాలు కుదుర్చుకొనేందుకై పీవీకి సన్నిహితుడైన చంద్రస్వామికి డబ్బిచ్చానని ఆరోపించాడు.
      పై మూడు కేసుల్లోను పీవీ నిర్దోషిగా పై కోర్టులు తీర్పిచ్చాయి. ఈ మూడూ కాక స్టాక్ మార్కెట్ కుంభకోణం నిందితుడు హర్షద్ మెహతా తాను సూట్‌కేసుల్తో పీవీకి డబ్బిచ్చానని ఆరోపించాడు. అయితే అవి నిరాధారాలని తేలింది.
      సాహితీ కృషి:రాజకీయాల్లో బిజీగా ఉన్నా, పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటరును ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవాడు. కంప్యూటరును ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవాడు. ఆయన చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్‌సైడర్ అనే ఆయన ఆత్మకథ. లోపలిమనిషి గా ఇది తెలుగులోకి అనువాదమయింది. ఆయన రచనలు:
      • సహస్రఫణ్విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు కు హిందీ అనువాదం. ఈ పుస్తకానికై పీవీ కి లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది.
      • అబల జీవితంపన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకానికి తెలుగు అనువాదం.
      • ఇన్‌సైడర్: ఆయన ఆత్మకథ. ఇది వివిధ భాషల్లోకి అనువాదమయింది.
      • ప్రముఖ రచయిత్రి "జయ ప్రభ" కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు
      ఇవేగాక మరెన్నో వ్యాసాలు కలం పేరుతో రాసాడు. కాంగ్రెసువాది పేరుతో 1989 లో మెయిన్‌స్ట్రీం పత్రికలో రాసిన ఒక వ్యాసంలో రాజీవ్ గాంధీ పాలనను విమర్శించాడు. 1995 లో ఆ విషయం ఫ్రంట్‌లైన్ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది[6].
      తన ఆత్మకథ రెండో భాగం రాసే ఉద్దేశ్యం ఆయనకు ఉండేది. ఆ కార్యం నెరవేరకుండానే, 2004 డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూసాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
      పివి విశిష్టత:

      • బహుభాషా పండితుడు, పీవీ. తెలుగుతో సహా, 17 భాషలలో ధారాళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఆయనది. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడిక్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో ను అబ్బురపరచాడు.
      • పీవీ నరసింహారావు చాలా నిరాడంబరుడు. తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచిన నిజాయతీపరుడు. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి ఎప్పుడూ అంగీకరించేవారు కాదు. అలాంటి వ్యక్తి చివరిదశలో కోర్టుల చుట్టూ తిరగడానికి ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది. ఆయనకాగతి పట్టడానికి కారణం ఉత్తరాది లాబీ. కానీ ఎన్ని కష్టాలొచ్చినా తుదివరకూ నిండుకుండలానే ఉన్నారాయన. పీవీ చివరిరోజుల్లో ఒకసారి ఆయన్ను కలిశాను. మాటలమధ్య... 'మీ మీద పుస్తకం రాయబోతున్నాను' అని చెస్తే 'నువ్వన్నా రాయవయ్యా, నా గురించి జనానికి నిజం తెలుస్తుంది' అన్నారు నీరసంగా నవ్వి. ఆయన్ని ఆ పరిస్థితుల్లో చూసి చాలా బాధవేసింది.--కె.విజయరామారావు (ఈనాడు8.11.2009)
      • ఆయన దగ్గరనుండి అసలు విషయం రాబట్టటం అంత తేలిక కాదు. కరణం లౌక్యం అంతా ఉపయోగించేవాడు.ఆగ్రహాన్ని దాచేవారు.శాసనసభలో, లోక్ సభలో బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవాడు. ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు. ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు, సీలింగు పరిమితులు తలపెట్టినప్పుడు ఆయనపై భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి. అప్పడు వచ్చిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని కూడా చేదు అనుభవంగా పి.వి. చవి చూచారు.
      • కల్యాణీ శంకర్ జర్నలిస్టుగా పి.వి.కి బాగా దగ్గరైంది. ఒక సందర్భంలో ఆమెను పక్కన కూర్చుండపెట్టుకుని తిరుపతిలో కల్యాణమహోత్సవంలో కూడా పాల్గొన్నారు.
      • పి.వి. ప్రధానిగా ఉండగా మన్మోహన్ సింగ్.ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పుకు నాంది పలికింది. ఆ ఖ్యాతి పి.వి.కి దక్కాలి. మరొకవైపు బాబ్రీ మసీదు కూలగొట్టడం కూడా ఆయన హయాంలోనే జరిగింది. చూసీ చూడనట్లు పోనిచ్చాడనే నెపం ఆయనపై ఉన్నది.పి.వి. పెయ్యనాకుడు విధానాన్ని అనుసరించి సమస్యలు తేల్చకుండా నాన్చి రాజకీయాలలో జిడ్డు వ్యవహారాలు నడిపాడని పేరున్నది.సమస్యలు వాటంతటవే సద్దుకుపోతుండేవి.                                                 
      • తొలి తెలంగాణా ప్రదాని ఐన పివి సరిగ్గా ఏడు సంవత్సరాలక్రితం ఈ రోజే తుది శ్వాస విడిచారు, నేడు ఆయన వర్ధంతి. తెలంగాణా ప్రజలు తమకు ఆయన ఏమి చేయ్యలదనే కోపంతో ఉన్న దేశం గర్వించదగ్గ ప్రధాని అని ఆయన గొప్పదనాన్ని తెలుసుకోవాలి, కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు బలైన పివి చిరస్మరణీయుడు....                                                       

21, డిసెంబర్ 2011, బుధవారం

పొట్టి గుట్టు...



సమైక్యంద్ర ఉద్యమం జరిగినప్పుడు కామన్ గా కనిపించిన ఫోటో పొట్టి శ్రీరాములు ది, అసలు ఆంద్ర ప్రదేశ్కు పొట్టి శ్రీరాములుకు సంబంధం ఏమిటి..? ఈ క్రింది వేడియోలో చుడండి....







18, డిసెంబర్ 2011, ఆదివారం

అంతర్గాం లో కాందిశీకుల వ్యధ...



అది రామగుండము మండలంలోని అంతర్గాం అనే గ్రామం, ఇక్కడ నెహ్రు కాలం లోనే ఒక స్పిన్నింగ్ మిల్లును ఏర్పాటు చేసారు, అయితే ఇందులో పనిచేసే వాళ్ళంతా కాన్దిశికులే, అయితే తెలంగాణాలో ఈ కాందిశీకులు ఎవరు అనుకుంటున్నారా..? 1920 వ సంవత్సరం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన కరువుతో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు బర్మాకు, శ్రీ లంక కు వలసవేల్లరు, అక్కడ దొరికిన పని ఏదో చేసుకొని బతికారు, అయితే 1952 లో విదేశీయులు కట్టుబట్టలతో తమ దేశం విడిచి వెళ్ళాలని బర్మా, శ్రీ లంక ప్రభుత్వాలు ఆగ్నపించాయి, దీనితో వారంతా తిరిగి పొట్ట చేతపట్టుకొని భరత్ కు  వచ్చారు, అయితే తినడానికి తిండి, ఉండడానికి నివాసం, చెయ్యడానికి పని ఏవి లేవు, అప్పటి ప్రధాని వీరి ఉపాధి కొరకు కొన్ని పరిశ్రమలు ప్రారంభించారు అందులో ఒకటి ఈ అంతర్గాం స్పిన్నింగ్ మిల్లు, ఇది ప్రారంభించిన పదేళ్ళ వరకు భాగానే నడిచింది, ఇందులో పనిచేసే కాన్దిశికుల నివాసం కొరకు క్వార్టర్ ల నిర్మాణం చేపట్టారు, అయితే ఉన్నతాధికారుల అవినీతితో ఈ క్వార్టర్లు నాసిరకం గా కట్టారు, అవినీతికి అలవాటుపడిన అధికారులు మిల్లును నష్టాల ఆట పట్టించారు, తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అప్పటివరకు కలెక్టర్ పరిధిలో ఉన్న మిల్లును పార్టీ నాయకుల చేతుల్లో పెట్టేసరికి 1990 లలోనే మిల్లు మూతపదినప్పటికి 1997 లో ప్రపంచమంతా కార్మిక దినోత్సవం జరుపుకుంటుండగా మే 1 న మిల్లు మూసేస్తున్నట్టు గవర్నర్ సంతకం చేసారు, అప్పటివరకు ఉన్న ఉద్యోగుల బకాయి జీతాలు ఎగ్గొట్టారు, వారికి ప్రత్యామ్నాయం చుపించనేలేదు, దీనితో ఆకలి చావులు మొదలయ్యాయి, ఇప్పటికి తినడానికి తిండిలేక 150 మంది మరణించారు, వీరు ఉంట్న్న క్వార్టర్లు కూలిపోయాయి, ఐన ప్రభుత్వం వారిగోడు పట్టించుకోవడం లేదు.. వాళ్ళు తమకు ఉపాధి కల్పించాలని, ఉండటానికి పక్క ఇల్లు నిర్మించి ఇవ్వాలని, కుటుంభానికి రెండెకరాల భూమి ఇవ్వాలని కోరుకుంటున్నారు.... 

17, డిసెంబర్ 2011, శనివారం

పొట్టి శ్రీరాములు స్ఫూర్తి తెలంగాణకు వర్తించదా..?



‘ఆంధ్ర’ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు ‘ఆంధ్రుల’ ఆశయ సిద్ధి కోసం తన ఒక్క డి ప్రాణం వదిలేశాడు. ఇది ‘ఆంధ్రులకు ఆదర్శం’ అయితే ఎంత బావుండు. ‘పొట్టి శ్రీరాములు’ త్యాగాన్ని కొనియాడే నాయకులు, ప్రభుత్వం ఆయనపై గౌరవం, ఆయన త్యాగానికి గుర్తింపును ఇ వ్వదలిస్తే తెలంగాణ మనోభావాలను కూడా గుర్తించి ఉండేవారు. ఒక్క బంట్రోతు ఉద్యోగాన్ని కొల్లగొట్టడాన్ని సహించలేని ‘ఆంద్రులకు మద్రాసు నుంచి విడిపోవడానికి చేసిన పోరాటాన్ని, ఆ పోరాటంలో అసువులు బాసిన పొట్టి శ్రీరాములు వర్ధంతి రోజు (డిసెంబర్-15) పాఠశాలల్లో నివాళులర్పించడానికి ఉత్తర్వులిచ్చారు. మరి తెలంగాణ ఉద్యమం కోసం చేసిన త్యాగాలను, ప్ర జల ఆకాంక్షను పాలకులు అర్థం చేసుకుంటే ఎంత బాగుండు! తెలంగాణ విషయంలో సాచివేత వైఖరితో అడ్డుపడటం ఆయన స్ఫూర్తిని నిరాకరించడం కాదా?
పొట్టి శ్రీరాములు కొనసాగించిన దీక్ష తీరును, ‘మద్రాస్’ పట్ల అనుసరించిన వైఖరిని ఆనాడు నెహ్రూ తీవ్రంగానే గర్హించారు. తెలంగాణ విడిపోవటం పట్లనైనా, లేదా కలయిక పట్లనైనా నెహ్రూ వ్యాఖ్యలు గుర్తించగల్గిన స్థితిలో నేటి నాయకులు ఇన్నారా? మరి, పొట్టి శ్రీరాములు వర్ధంతిని మొత్తం తెలుగు జాతి కోసం చేసిన త్యాగంగా కొనియాడడం సరి కాదు కదా.
ఇవ్వాళ హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగానో, ఉమ్మడి రాజధాని గానో చేయాలని మాట్లాడే నేతలు నాటి స్థితిని మర్చి పోయారా? పొట్టి శ్రీరాములు మరణం వల్ల కూడా సాధ్యపడని ‘మద్రాస్’ను గుర్తించగలరా? పొట్టి శ్రీరాములు హైదరాబాద్ రాష్ట్రాన్ని ‘ఆంధ్ర’లో విలీనం చేయడం కోసం పోరాడలేదు కదా? కుట్రలు కుతంవూతాలతో ‘తెలంగాణ’ను ఫజల్ అలీ కమిషన్ అభిప్రాయాలకు భిన్నంగా ‘ఆంధ్ర’ ప్రదేశ్ అవతరణ జరగడానికి పొ ట్టి శ్రీరాములుకు సంబంధం ఏమిటో విద్యార్థులకు చెబుతున్న పాఠంలో ఏమైనా చెప్పారా? ఈ పాఠం చెప్పుతున్నప్పుడు తెలంగాణ ప్రాంత పిల్లలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేని తెలంగాణ టీచర్లకు చరిత్ర వక్రీకరణలు గుండె గాయాలుగా ఒక్కొక్కటి గుర్తుకొస్తుంటాయి.
కొలువుల కోసమో భాష కోసమో మద్రాసుతో కలిసి ఉండలేక విడిపోవడం ప్రజాస్వామికమైనప్పుడు, అత్యంత అప్రజాస్వామికంగా ‘ పెద్ద మనుషుల ఒప్పందం’ పేర అమలు కాని రాష్ట్రపతి ఉత్తర్వులు, ఫలితంగా పది జిల్లాల్లో ఆగమైన బతుకులు, నీళ్ళు, బీళ్ళు, గనులు సమస్త రంగాల్లో తెలంగాణ బతుకు విధ్వంసం అవుతున్నప్పుడు విడిపోవాలనడం అప్రజాస్వామికం ఎలా అవుతుంది.‘దురుద్దేశపూరితం’గా ఆక్రమించుకున్న సామ్రాజ్యవాదులకు మాత్రమే ప్రజల ఆకాంక్ష తప్పుడుగా కనిపిస్తుంది. ఆంధ్రవూపదేశ్ అవతరణను ‘సామ్రాజ్యవాద విస్తరణ వాద కాంక్ష’గా అ న్న నెహ్రూ మాటల్ని గౌరవించినా తెలంగాణ పట్ల పాలకుల వై ఖరి ఇట్లా ఉండేది కాదు.
అందుకోసం ఉద్యమిస్తున్న ఉద్యమ కారులపై వందలాది కేసులు మోపి, నాసా, పీడీ, నల్లచట్టాలతో నిర్బంధిస్తూ పాఠాలు చెప్పే టీచర్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తమది కాని పా ఠాన్ని తమ బతుకు చిత్రాన్ని మార్చి ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నీరుగార్చిన ఆంధ్రవూపదేశ్ అవతరణ గురించి కాని, అందుకు ఊతమిచ్చిన పొట్టి శ్రీరాములు అమరత్వాన్ని గాని తెలంగాణ పిల్లలు టీచర్లు ఎట్లా కీర్తిస్తారు? పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ముందు గాంధీజీ ఆశీస్సులతో హరిజనులకు దేవాలయ ప్ర వేశం కోరుతూ దీక్ష చేపడితే.. స్పందించి నాటి ప్రభుత్వం అనుమతిస్తే, ఈనాటి ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం దళిత విద్యార్థులపై వందలాది కేసులు పెట్టి జైళ్ళల్లో నిర్బంధిస్తోంది.
తెలంగాణ జీవితానికి, చరివూతకు సంబంధం లేని పొట్టి శ్రీరాములు త్యాగం తెలంగాణ బిడ్డలకు ‘పాఠం’కావడమే సమైక్య రాష్ట్ర ఆధిపత్యానికి నిదర్శం. అసలు తెలంగాణ త్యాగాలను చరివూతను కనుమరుగు చేసిన పాఠ్యాంశాలను తొలిగించి, వాటి స్థా నంలో తెలంగాణ పోరాట చరివూతను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా పెట్టాలి. జయశంకర్ సార్ లాంటి పోరాట వీరుల చారివూత పాఠాలుగా చెప్పాలి. పాఠాలు, విగ్రహాలు, విద్రోహాలతో మొత్తం తెలంగాణ ఆకాంక్షల్ని నీరుగార్చే పాలకులకు పొట్టి శ్రీరాములు కూడా ఆదర్శం కాజాలడు. అట్లాంటి ‘ఆంధ్ర’ వీరుడి అమరత్వంతో తె లంగాణ చరివూతను ఉద్యమాన్ని అవహేళన చేయడం దోపిడీ తత్వమే తప్ప మరొకటి కాదు. ఆంధ్ర రాష్ట్ర వీరుడిగా పొట్టి శ్రీరాములును గుర్తిస్తూనే.. తెలంగాణ బిడ్డలు తెలంగాణ అమరులకు జోహర్లు అర్పిస్తున్నారు.
-కె. ప్రభాకర్
తెలంగాణ టీచర్స్ ఫోరం కన్వీనర్

24, నవంబర్ 2011, గురువారం

ట్యాంక్ బండ్ పై విగ్రహాలు..



హుస్సేన్ సాగర్‌ హైదరాబాదు నగరపు నడిబొడ్డున ఒక మానవ నిర్మిత సరస్సు. ఈ జలాశయాన్ని 1562లోఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలములో హజ్రత్ హుస్సేన్ షా వలీచే నిర్మింపబడింది. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఈ సరస్సు నగరము యొక్క మంచినీటి మరియు సాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ నదియొక్క ఒక చిన్న ఉపనదిపై నిర్మించబడింది. చెరువు మధ్యలో హైదరాబాదు నగర చిహ్నముగా ఒక ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని 1992లో స్థాపించారు. దీనికి పక్కన నెక్ లెస్ రోడ్ ఉంది
1562లో హుస్సేన్ సాగర్ నిర్మాణాన్ని ఇబ్రహీం కులీ కుతుబ్ షా కట్టించినా, దాని నిర్మాణ పర్యవేక్షణ మాత్రం ఇబ్రహీం కులీ అల్లుడు, పౌర నిర్మాణాల సూపరిండెంటైన హుస్సేన్ షా వలీ చేపట్టాడు.చెరువు తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవటంతో మూసీ నదికి అనుసంధానం చేశారు. 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 32 అడుగుల లోతుతో చెరువు ఉండేది. కుతుబ్ షా ఈ సరస్సుకు ఇబ్రహీం సాగర్ అని పేరుపెట్టాలని అనుకున్నాడు, కానీ హుస్సేన్ వలీ యొక్క ప్రాచ్యుర్యము వలన ప్రజలు ఆయన పేరు మీదుగా హుస్సేన్ సాగర్ చెరువు అని పిలవటం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న సుల్తాను చెరువులకున్న ప్రజాదరణను గమనించి వెంటనే తన పేరు మీద గోల్కొండకు 16 మైళ్ళ దూరములో ఇబ్రహీంపట్నం చెరువును నిర్మింపజేశాడు1568లో హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ గట్టుగా నిర్మించబడిన రోడ్డును టాంక్ బండ్ అంటారు. ఈ రోడ్డు హైదరాబాదు మరియు సికింద్రాబాదు జంట నగరాలను కలుపుతుంది . ఈ గట్టుమీద నుండి వెళ్ళే ట్యాంక్ బండ్ రహదారికి, జంటనగరాలలో ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. పొద్దున్న పూట వ్యాయామంలో భాగంగా ఉదయం నడక సాగించేవారికి, సాయంకాలం వాహ్యాళికి వెళ్ళేవారికి(ముఖ్యంగా ఆదివారం మరియు ఇతర శెలవు రోజుల సాయంత్ర సమయాలలో), స్నేహితులను కలుసుకొనేవారికి, ఇది ఒక ఇష్టమైన ప్రత్యేక స్థలం.
టాంక్‌బండ్ ప్రక్కనున్న హుస్సేన్ సాగర్‌లో 'జిబ్రాల్టర్ రాక్' అనబడే రాతిపైన ఒక పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది. గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి మలచిన ఈ శిల్పం 60 కి.మీ. దూరంనుండి 192 చక్రాలు గల వాహనంపై ఇక్కడికి తీసుకురాబడింది. అయితే స్థాపన సమయంలో విషాదం చోటు చేసుకొంది. బార్జ్‌తో పాటు విగ్రహం మునిగి కొందరు శ్రామికులు ప్రాణాలు పోగొట్టుకొన్నారు. మళ్ళీ డిసెంబరు 1992లో దీనిని వెలికితీసి ప్రతిష్టించారు. హైదరాబాదు నగర చిహ్నంగా చార్మినార్‌తో పాటు ఈ విగ్రహాన్ని కూడా పలు సందర్భాలలో చూపుతారు.


 టాంక్ బండ్ పై విగ్రహాలు: తెలంగాణా సంస్కృతిని ప్రజలకు చేరకుండా, అన్ద్రవారి విజయ చిహ్నాలుగా ట్యాంక్ బండ్పై విగ్రహాలు పెట్టడానికి అప్పటి ముఖ్య మంత్రి ఎన్టి ఆర్, సంకల్పించారు. ఇందులో ఎవరెవరి విగ్రహాలు పెట్టాలి అని ఎంపిక చెయ్యడం కోసం డా. సి. నారాయణ రెడ్డి తో ఒక కమిటి వేసారు, ఆయన ఎంపిక మేరకు విగ్రహాలను తాయారు చేయించి ప్రతిష్టించారు.( ఆయన ఎంపిక ఏమి లేదు, ఎన్ టి ఆర్ ముందు ఎవరి విగ్రహాలైతే పెట్టలనుకున్నదో వారివే పెట్టారు, ఈ కమిటి ఎందుకంటే తెలంగాణా వాడి సంస్కృతి మీద దాడి చేయించేది సీమంద్ర సర్కార్ ఐన చేసేది తెలంగాణా వాడు.( కత్తి వాడిది పొడిచేది మనవాడు). ఇందులో తెలంగాణా తో, ఉమ్మడి రాష్ట్రంతో  ఎ మాత్రం సంబంధం లేని అల్లూరి, టంగుటూరి ప్రకాశం, పొట్టి శ్రీ రాములు, సర్ ఆర్ధాన్ కాటన్, బళ్ళారి రాఘవ, శ్రీ కృష్ణ దేవరాయలు లాంటి అనేక మంది విగ్రహాలు పెట్టారు, అయితే విచిత్రం ఏమిటంటే హైదరాబాద్ ను, అందున ట్యాంక్ బండ్ ను నిర్మించిన కూలి కుతుబ్ష విగ్రహం లేదు, కన్నడ రాజు శ్రీ కృష్ణ దేవరాయలు విగ్రహం ఉంది కాని గణపతి దేవ చేక్రవర్తి, ప్రతాప రుద్రుల విగ్రహాలు లేవు, అల్లూరి విగ్రహం పెట్టిన వారు కొమురం భీమ విగ్రహాన్ని పెట్టలేదు, తెలంగాణా సాయుధ పోరాట వీరులలో కనీసం ఒక్కరికి కూడా ఇక్కడ చోటు దక్కలేదు, హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణ రావు, తెలంగాణా లో కాంగ్రెస్ వ్యవస్థాపకుడు రామానంద్ తీర్ధ, ప్రముఖ జర్నలిస్ట్ షోయబుల్ల ఖాన్, తెలుగు సినిమాకు జాతీయ అవార్డు తెచ్చి పెట్టిన డైరెక్టర్ బి ఎస్ నారాయణ, లే కాకుండా తెలంగాణాను సుధీర్గ కాలం పరిపాలించి తెలంగాణకు రైల్, రోడ్ మార్గాలు, విద్యుత్ సదుపాయం, కర్మాగారాల ఏర్పాటు, నదుల పై ప్రాజెక్ట్ లను నిర్మించిన నిజాం రాజుల్లో ఒక్కరి విగ్రహం కూడా అక్కడ లేదు, అమరావతి బౌద్ధ స్తూపం లాంటి నిర్మాణాన్ని అక్కడ ఏర్పాటుచేసారు, కాని తెలంగాణా సంస్కృతక చిహ్నాలని ఏర్పాటు చెయ్యలేదు.

విగ్రహాల విధ్వంసం: అనేక సంవత్సరాల ఓపిక తర్వాత ఒక రోజు తెలంగాణా తిరగ బడింది, తనపై విజయట్టహాసం చేస్తున్న అన్ద్రవారి అరువుతెచ్చుకున్న విగ్రహాలను పునాదులతో సహా పెకిలించింది, అదే మిలియన్ మార్చ్, 2011 మార్చ్ 10 న మిలియన్ మార్చ్ కు తెలంగాణా జే ఎ సి పిలుపునిచ్చింది, పోలిసుల నిర్భంధాలను తేన్చుకుంటూ తెలంగాణా సమాజం ఆ రోజు ట్యాంక్ బండ్ పైకి వచ్చి చేరింది, పోలిసుల అతితో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి, జనం చూపు ఆంద్ర విగ్రహలపై పడింది తెలంగాణా నడిబొడ్డున ఉన్న ఆంద్ర బొమ్మలను పగలగొట్టారు, నీటిలో నిమర్జనం చేసారు, తరతరాల తమ అస్తిత్వ పోరాటానికి పదును పెట్టారు, ఈ సంగాతనతో తెలంగాణా ప్రజలంతా ఉత్సాహం పొందారు, మరో మహోద్రుత ఉద్యమ రూపం కోసం ఎదురు చూస్తున్నారు.....




23, నవంబర్ 2011, బుధవారం

తెలంగాణ కో దిల్‌సే సమర్థన్ కరెంగే: లాలు



టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాకతో లోక్సభలోనే కాదు సభ వెలుపలా తెలంగాణ సందడి నెలకొంది. పార్లమెంటు ప్రాంగణంలో, సెంట్రల్ హాల్‌లో ఆయనకు తారసపడ్డ వివిధ పార్టీల ఎంపీలు జై తెలంగాణ అంటూ తమ సంఘీభావాన్ని తెలిపారు. మరీ ముఖ్యంగా శివసేన, జేడీ(యూ), అకాలీదళ్, బీజేడీ తదితర పార్టీల నాయకులు తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని ఆయనకు హామీ ఇచ్చారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ తమ పార్టీ తెలంగాణకు మద్దతిస్తుందన్నారు. ‘తెలంగాణ కో దిల్‌సే సమర్థన్ కరెంగే’ అని లాలూ అన్నారు. బీజేపీ సభ్యులు సైతం తమ సంఘీభావాన్ని తెలిపారు. అదే సమయంలో కేసీఆర్‌ను కలిసిన ఉత్తరాది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపారు. కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారట కదా.. అని వాకబు చేశారు. తెలంగాణలో అన్ని పక్షాలు మద్దతిస్తున్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీకి అభ్యంతరం ఎందుకని అసంతృప్తిని ప్రదర్శించారు. 

ఉద్యమ కార్యాచరణ....

మహాత్మా జ్యోతీరావు పూలే వర్ధంతి సందర్భంగా ఈ నెల 28న ‘తెలంగాణ విద్యార్థి ఆత్మగౌరవ సభ ’ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి జేఏసీ నాయకులు తెలిపారు. ఈరోజు సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో పోస్టర్‌లను విడుదల చేశారు. కార్యక్రమంలో పిడమర్తి రవి, రాజారాం మాట్లాడుతూ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా 24వ తేదిన కళాశాల ఎదుట కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణా జే ఎ సి కూడా ఉద్యమ కార్య చరణను ప్రకటించింది, డిసెంబర్ 1 వ తేదిని నిరసన దినం పాటించాలని, 9 వ తేది తెలంగాణా ప్రకటన వచ్చిన రోజు కావున ఆత్మ గౌరవ దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది.....

22, నవంబర్ 2011, మంగళవారం

ప్రారంభం నాడే ప్రతిష్టంభన..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి, ప్రారంభం కాగానే విపక్షాలన్నీ చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి పట్టుబట్టడంతో సభలో గంధర గోల పరిస్థుతులు ఏర్పడ్డాయి. దీనితో సభను స్పీకర్ సభను రేపటికి వాయిదా వేసారు.
        తెలంగాణా బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనే ఆశయంతో బి జే పి ఆధ్వర్యంలో తెలంగాణా పది జిల్లాల్లో నిరసన ధీక్ష లు కొనసాగాయి, అలాగే న్యూ డెమోక్రసి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ల ముట్టడి విజయ వంతంగా కొనసాగింది..

21, నవంబర్ 2011, సోమవారం

2014 ప్రధాని పీటంపై కన్నేసిన మాయ..


ఉత్తర ప్రదేశ్ ను విబజించాలంటూ యు పీ సి ఎం మాయావతి ఈ రోజు ఆ రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం ప్రవేశపెట్టారు, ఈ సందర్భంగా ఆమె మీడియా తో మాట్లాడారు, ఆంద్ర ప్రదేశ్ విబజన విషయంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం పాస్ చేస్తేనే కేంద్రం ముందుకు వెల్ల గలుగుతుంది అని చెప్పిన కాంగ్రెస్ కు సమాధానం గా ఆమె అసెంబ్లీ లో యు పీ ని విబజించాలంటూ తీర్మనంచేసి౦ది. అసెంబ్లీ తీర్మానం కావాలని కేంద్రం తెలంగాణా విషయంలో చెప్పింది, ఇప్పుడు మేము అదే చేసాం మరి ఇప్పుడు కేంద్రం యు పీ ని చిన్న రాష్ట్రాలుగా విబజిస్తుంద లేకపోతే ఆడిన మాట తప్పుతుంద అని ఆమె నిలదీసింది.
      ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, గతంలో యు పీ ని మూడు రాష్ట్రాలుగా విబజించడానికి సుముకంగా ఉన్నామని చెప్పిన కాంగ్రెస్ వైకరిని నగ్నంగా ప్రజలమున్దుంచడమే కాకా, చిన్న రాష్ట్రాల విషయంలో కాంగ్రెస్ ఆడుతున్న దొంగ నాటకాలను దేశానికి ఎత్తి చూపించి రాబోయే యు పీ ఎన్నికలలోనే కాకుండా 2014 లో తెలంగాణా లో కూడా పాగా వెయ్యాలని చూస్తుంది, తాను ప్రధాని కావడానికి ఉన్న అన్ని అనుకులతలను మాయ ఉపయోగించుకుంటుంది, ఈ పరిణామం ద్వార కాంగ్రెస్ ను ఇరుకున పెట్టడమేకాక చిన్న రాష్ట్రాలకు అనుకూలం అని చెప్పే బి జే పీ ని కూడా ఇరుకున పెటింది, యు పీ, తెలంగాణా ప్రజల ముందు కాంగ్రెస్, బి జే పీ ల వైకరులను తెలియజెప్పి తాను లాభం పొందాలని చూస్తుంది.....

19, నవంబర్ 2011, శనివారం

తెలంగాణా సాయుధ పోరాటం


1946-51 మధ్యన కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏడవ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కు వ్యతిరేకంగా జరిగింది.ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు.హైదరాబాద్‌ స్టేట్‌లో అంతర్భాగంగా తెలంగాణ ప్రాంతం బ్రిటిష్‌ పాలనతో ఎలాంటి సంబంధం లేకుండా ఆసఫ్‌ జాహీల పాలనలో ఉంది.నిజాం హాలీ సిక్కా, ఇండియా రూపాయి రెండూ వేర్వేరు.1948లో కలకత్తాలో అలభారత కమ్యూ నిస్టు పార్టీ మహాసభ "సంస్థానాలను చేర్చుకోవడానికి ఒత్తిడి చేసే అధికారం యూనియన్‌ ప్రభుత్వానికి లేదు' అని తీర్మానించింది.మఖ్దుం మొహియుద్దీన్‌ సహా మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తివేసింది.కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని తొలగించింది. హైదరాబాద్‌ రాజ్యం స్వతంత్రంగా ఉండాలని, అదే కమ్యూనిస్టు పార్టీ విధానమనిరాజబహదూర్‌ గౌర్‌ ప్రకటించారు.ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు,దేశ్ ముఖ్ లు,జమీందారులు,దొరలు గ్రామాలపై పడి నానా అరాచకాలు సృష్టించారు.ఫలితంగా ఆనాటి నుంచి కమ్యూనిస్టుల వైఖరిలో మార్పు వచ్చింది.రజాకార్‌ సైన్యాన్ని ప్రజాసైన్యంగా అభివర్ణించిన కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు.
                           మొదట నల్లగొండ జిల్లాలో పుట్టిన సాయుధ విప్లవం త్వర త్వరగా వరంగల్, బీదర్ జిల్లాలకు వ్యాపించింది. రైతులు, రైతు కూలీలు నిజాం నవాబుకు, ప్రాంతీయ ఫ్యూడల్ జమీందారులకు వ్యతిరేకంగా సాహసోపేతమైన పోరాటం చేసారు. వారి పోరాటం వెట్టి చాకిరి కి వ్యతిరేకంగా మొదలైంది. అయితే వెట్టి చాకిరీ నుంచి విముక్తి చేయడానికి ఆనాటి రాజులు, జమీందారులు సిద్ధంగా లేరు.
మన కొంపలార్చిన, మన స్త్రీల చెరచిన,
మన పిల్లలను చంపి మనల బంధించిన
మానవాధములను మండలాధీశులను
కండ కండగ కోసి కాకులకు వెయ్యాలె,
కాలంబు రాగానే కాటేసి తీరాలె” -- కాళోజీ
అదే సమయంలో నిజాం నవాబు హైదరాబాద్ రాజ్యాన్ని భారత దేశంలో విలీనం చేసే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. భారత ప్రభుత్వం సెప్టెంబరు 1948 లో నిజాం పైకి తన సైన్యాన్ని పంపింది. అయితే కమ్యూనిస్టుల నాయకత్వంలో గెరిల్లా యుద్ధ తంత్రంతో 3000 లకు పైగా గ్రామాలను విముక్తం కాబడ్డాయి. ఈ ప్రాంతంలోని జమీందారులను దొరికిన వారిని దొరికినట్టుగా చంపి వేసారు. చావగా మిగిలిన వారు పారి పోయారు. విముక్తి చేయ బడిన గ్రామాల్లో సోవియట్ యూనియన్ తరహా కమ్యూన్లు ఏర్పరచారు. ఈ కమ్యూన్లు కేంద్ర నాయకత్వం క్రింద పని చేసేవి. ఈ పోరాటానికి 'ఆంధ్ర మహాసభ' పేరుతో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. ఈ పోరాటానికి నాయకత్వం వహిచిన వారిలో మగ్దూం మొహియుద్దీన్, రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి మరియు హసన్ నాసిర్ లు ముఖ్యులు.
రజాకారు సేన ను తయారు చేసి మత విద్వేషాన్ని రెచ్చగొట్టి, దాడులు, హత్యలు, హత్యచారాలు నిర్వహించిన వాడు కాశీం రజ్వీ. ప్రోత్సాహించినవాడు మీర్ ఉస్మాన్ అలీఖాన్. 1947 ఆగస్టు15 నుంచి 1948 సెప్టెంబర్ 17 వరకు ఈ రాజాకార్లకు గ్రామాల్లో దొరలు, పెత్తందార్లు నాయకత్వం వహించారు.ఈ దొరలు, పెత్తం దార్లు 17 సెప్టెంబర్ 1948 దాకా షేర్వానిలు, చుడేదార్ పైజామా లు వేసుకుని కుచ్చుటోపీలు పెట్టుకొని నైజాం సేవ చేశారు. 1948 సెప్టెంబర్ 17 తర్వాత గ్రామాల్లో ఖద్దరు బట్టలు, గాంధీ టోపీల తో ప్రవేశించి ప్రజలు స్వాధీనం చేసుకున్న భూమిని అక్రమించి 1951 అక్టోబర్ దాకా యూనియన్ సైన్యాలు కమ్యూనిస్టులను వేటాడడంలో సహకరించారు. ముస్లింలను వేటాడడంలో పురికొల్పారు. ముఖ్యంగా మరట్వాడలో లక్షలాదిమంది ముస్లింలను హత్య చేయడంలో కేంద్ర బలగాలకు అండగా నిలిచారు. 1956 దాకా మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజప్రముఖ్‌గా ఉన్నట్లుగానే- జమీందారీ, జాగీర్దారీ చట్టం రద్దయి రక్షిత కౌల్దారీ చట్టం వచ్చేదాకా-దేశ్‌ముఖ్, దేశ్‌పాండే, ముక్తేదార్‌లుగా దొరలు కొనసాగారు. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజభరణాలు ప్రభుత్వం నుంచి పొందినట్లుగా వీళ్లు నష్టపరిహారాలు, ఇనాములు పొందారు.
కమ్యూనిస్టులు హైదరాబాదుని ఆక్రమించే చివరి దశలో ప్రాణాలపై ఆశ వదులుకున్న నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగి పోతున్నట్టుగా ప్రకటించాడు. తద్వారా 1948 లో హైదరాబాదు రాష్ట్రం భారత దేశంలో కలవడం, తెలంగాణా సాయుధ పోరాటానికి ముగింపు జరిగాయి.1952 మార్చి 6 న హైదరాబాద్‌ రాజ్యంలో బూర్గుల రామకృష్ణారావునేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.

తెలంగాణా సాయుధ పోరాటయోధులు:
మగ్దూం మొహియుద్దీన్: ఆంధ్ర ప్రదేశ్ లోని మెదక్ జిల్లా ఆందోల్ లో 1908 ఫిబ్రవరి 4 న జన్మించాడు. ఆయన పూర్తిపేరు మహ్మద్‌ మగ్దూం మొహియుద్దీన్‌ హుజ్రీ. వీరి పూర్వీకులది ఉత్తర ప్రదేశ్ లోని ఆజంగఢ్‌. ఆయన తండ్రి నిజాము ప్రభుత్వంలో సూపరింటెండెంటు గా పనిచేసేవాడు. మగ్దూం చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్ళి చేసుకోవడంతో మగ్దూం తన బాబాయి వద్ద పెరిగాడు. ప్రాథమిక విద్య హైదరాబాదు లోని ధర్మవంత హైస్కూల్లోను, మెట్రిక్యులేషనుసంగారెడ్డిలోను చదివాడు. మఖ్దూం తండ్రి పరమ భక్తుడు- మహమ్మద్ గౌస్ మొహియుద్దీన్. తల్లి- ఉమ్దా బేగం. భర్త మరణానంతరం ఆమె వేరే వివాహం చేసుకుంది. పినతండ్రి బషీరుద్దీన్ పెంచాడు. మఖ్దూం విద్యాభ్యాసం ఆందోల్ నుండి హైదరాబాద్ చేరి 1929లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తయింది. ఇంటా బయటా విరివిగా పుస్తకాలు చదవటం, సాహిత్య అధ్యయనాలు, తాత్విక విషయాల పరిశోధన మఖ్దూం నిత్యకృత్యాలైనాయి.

ప్రముఖ అధ్యాపకుడు, ఉర్దూ కవి. 'షాయరే ఇంక్విలాయ్' (ఉద్యమ కవి, విప్లవ రచయిత) బిరుదాంకితుడు. కవియేగాక నాటక కర్త, గాయకుడు మరియు నటుడు కూడా. ఇతని గజల్ లు, పాఠ్యకాంశాలలోను, సినిమాలలోనూ ఉపయోగించారు.
'ఫిర్ ఛిడీ బాత్, బాత్ ఫూలోం కి' అను గజల్(గేయం) సుప్రసిధ్ధి.
1944లో సుర్ఖ్ సవేరా (అరుణోదయం),
1961లో గుల్ ఎ తర్ (తాబీపూవు),
1966లో బిసాతె రక్స్ (నాట్య వేదిక) పేర మూడు కవితా సంపుటాలను రచించినాడు.
1944-51 మధ్యకాలంలో 'తెలంగాణ' అనే కవిత రాశాడు.
మెట్రిక్యులేషన్ తరువాత మఖ్దూం ట్యూషన్లు చెప్పినాడు. చిత్రపటాలు విక్రయించాడు. పత్రికలకు వ్యాసాలు రాశాడు. కొన్నాళ్లు హైదరాబాద్ రాష్ట్ర దఫ్తర్‌లో గుమాస్తాగా ఆ తరువాత హైదరాబాదులోని సిటి కాలేజీలో ఉపాధ్యాయవృత్తిలో చేరాడు.1941లో హైదరాబాద్ ఉర్దూ అభ్యుదయ రచయితల సంఘ స్థాపనకు పూనుకున్నాడు మఖ్దూం. 1944లో అఖిల భారత అభ్యుదయ రచయితల సమావేశాన్ని హైదరాబాదులో ఏర్పాటు చేసినాడు.
మఖ్దూం కార్మిక నాయకుడు, కమ్యూనిస్టు కార్యకర్త, శాసన మండలి సభ్యుడు. ఫాసిజానికి వ్యతిరేకంగా సమసమాజ స్థాపనకోసం క్రియాశీలంగా రాజకీయాల్లో పాల్గొన్నాడు. అందరూ కలిసి భోజనం చేసే దస్తర్‌ఖాన్ల గురించి కల గన్నాడు మఖ్దూం. ప్రగతిశీల భావాలతో పీడితుల పక్షాన కలమెత్తి నమ్మిన సిద్ధాంతానికి జీవితాన్నంకితం చేసి అమరుడైనాడు. కమ్యూనిస్టు అయిన మఖ్దూం. మతాన్ని దూషించలేదు అనుసరించలేదు. 25.08.1969 తేదీన ఆయన చనిపోయాడు.
నిజాము కు వ్యతిరేకంగా తెలంగాణా సాయుధ పోరాటం లో కీలకపాత్ర పోషించాడు. 
                                       (రావి నారాయణ రెడ్డి)                                                                       రావి నారాయణ రెడ్డి: హైదరాబాద్ సమస్తాన విమోచనకు పోరాడిన కమ్యునిస్ట్ యోధుడు..
1908 జూన్ 4న జన్మించాడు. ఆంధ్ర మహాసభకు ఆధ్యక్షుడుగా పని చేశాడు. తెలంగాణ విమోచన తరువాత ఆయన సిపిఐలో చాలాకాలం పని చేశాడు. రావి నారాయణరెడ్డి విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించాడు. నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం. 1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో నిజాం పోలీసుల దాష్టీకానికి, మతదురహంకారులైన రజాకార్ల ఆగడాలను అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటుచేసినాడు. నిజం వ్యతిరేక పోరాటంలో విజయం సాధించి౦ది.

కొమురం భీం : గిగిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్ సోంబాయి దంపతులకు 1900 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకా లోని సంకేపల్లి గ్రామంలో జన్మించాడు.
భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు మరియు జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 సెప్టెంబర్ 1 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. అది గిరిజనులు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ద పౌర్ణమి కావడంతో అప్పటి నుండి ఆ తిధి రోజునే ఆదివాసీలు కొమురం భీమ్ వర్ధంతిని జరుపుకొంటూ వస్తున్నారు.
కొమరంభీమ్ (సినిమా) - కొమురం భీమ్ జీవితగాధ ఆధారంగా రూపొంది రెండు నంది పురస్కరాలను గెలుచుకున్న చిత్రం.

http://naatelangaana.blogspot.in/2011/11/blog-post_16.html 



బద్ధం ఎల్లారెడ్డి : 1906  వ సంవత్సరంలో కరీంనగర్ జిల్లా గాలి పల్లి లో జన్మించారు. 1930 లో శాసనోల్లంగన ఉద్యమ సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేసారు.
      ఉప్పు సత్యాగ్రహం లో బాగంగా కాకినాడ తీరానికి వెళ్లి ఉద్యమం సాగిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి మద్రాస్ లో వదిలి వేసారు, ఆయన భీమవరం చేరుకొని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పికెటింగ్ నిర్వహించారు, ఆతర్వాత 7 నెలల జైలు శిక్ష అనుభవించారు. విడుదలయ్యాక కరీంనగర్ చేరుకొని ఖాది వస్త్రాలు ధరించి గాంధీ ఉద్యమాన్ని కొనసాగించారు, తన సొంత ఊరిలో హరిజనులకోసం పాతశాలను నెలకొల్పారు.
       1934 లో తొలిసారి ఆంద్ర మహా సభలలో పాల్గొన్నారు, ఆ తర్వాత మిత వాదులు, అతి వాదులుగా ఆంద్ర మహా సభ విడిపోయింది, అసిఫాబాద్లో కొమురం భీంనాయకత్వంలో జరుగుతున్న గోండుల తిరుగుబాటును గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లి అందులో పాల్గొన్నారు, తర్వాత కరీం నగర్ జిల్లా మొత్తం తిరిగి 2500 గ్రామాలను మేల్కొల్పారు. నిజాం ప్రభువుకు వ్యతిరేక ప్రచారం చెయ్యడంతో ఆయనపై రాజద్రోహం కేసు పెట్టి సంవత్సరం జైలు, 200 రూపాయల జరిమానా విధించారు, అయితే ఆయన దగ్గర జరిమనకు డబ్బు లేకపోవడంతో మరో మూడు నెలలు జైలులోనే ఉన్నారు. 1947 లో సాయుధ సమరం ఒక్కటే మార్గమని రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లా రెడ్డి, ముగ్ధుం మొహినోద్దిన్ లు పిలుపునిచ్చారు, 1948 లో నిజాం గద్దె దిగారు, ఆ తర్వాత ఒకసారి లోక్సభకు, 2 సార్లు శాసన సభకు, మరో సారి రాజ్య సభకు ఎన్నికయ్యారు, ఆయన రాష్ట్ర కమూనిస్ట్ పార్టీ కార్య దర్శి గా పనిచేసారు.
సాయుధ పోరాటయోధుడు బద్దం ఎల్లారెడ్డి 1978 లో మరణించారు...


తెలంగాణా చరిత్రకు సంబంధించిన పూర్తి వీడియో :