హోం

18, డిసెంబర్ 2011, ఆదివారం

అంతర్గాం లో కాందిశీకుల వ్యధ...



అది రామగుండము మండలంలోని అంతర్గాం అనే గ్రామం, ఇక్కడ నెహ్రు కాలం లోనే ఒక స్పిన్నింగ్ మిల్లును ఏర్పాటు చేసారు, అయితే ఇందులో పనిచేసే వాళ్ళంతా కాన్దిశికులే, అయితే తెలంగాణాలో ఈ కాందిశీకులు ఎవరు అనుకుంటున్నారా..? 1920 వ సంవత్సరం మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన కరువుతో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు బర్మాకు, శ్రీ లంక కు వలసవేల్లరు, అక్కడ దొరికిన పని ఏదో చేసుకొని బతికారు, అయితే 1952 లో విదేశీయులు కట్టుబట్టలతో తమ దేశం విడిచి వెళ్ళాలని బర్మా, శ్రీ లంక ప్రభుత్వాలు ఆగ్నపించాయి, దీనితో వారంతా తిరిగి పొట్ట చేతపట్టుకొని భరత్ కు  వచ్చారు, అయితే తినడానికి తిండి, ఉండడానికి నివాసం, చెయ్యడానికి పని ఏవి లేవు, అప్పటి ప్రధాని వీరి ఉపాధి కొరకు కొన్ని పరిశ్రమలు ప్రారంభించారు అందులో ఒకటి ఈ అంతర్గాం స్పిన్నింగ్ మిల్లు, ఇది ప్రారంభించిన పదేళ్ళ వరకు భాగానే నడిచింది, ఇందులో పనిచేసే కాన్దిశికుల నివాసం కొరకు క్వార్టర్ ల నిర్మాణం చేపట్టారు, అయితే ఉన్నతాధికారుల అవినీతితో ఈ క్వార్టర్లు నాసిరకం గా కట్టారు, అవినీతికి అలవాటుపడిన అధికారులు మిల్లును నష్టాల ఆట పట్టించారు, తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక అప్పటివరకు కలెక్టర్ పరిధిలో ఉన్న మిల్లును పార్టీ నాయకుల చేతుల్లో పెట్టేసరికి 1990 లలోనే మిల్లు మూతపదినప్పటికి 1997 లో ప్రపంచమంతా కార్మిక దినోత్సవం జరుపుకుంటుండగా మే 1 న మిల్లు మూసేస్తున్నట్టు గవర్నర్ సంతకం చేసారు, అప్పటివరకు ఉన్న ఉద్యోగుల బకాయి జీతాలు ఎగ్గొట్టారు, వారికి ప్రత్యామ్నాయం చుపించనేలేదు, దీనితో ఆకలి చావులు మొదలయ్యాయి, ఇప్పటికి తినడానికి తిండిలేక 150 మంది మరణించారు, వీరు ఉంట్న్న క్వార్టర్లు కూలిపోయాయి, ఐన ప్రభుత్వం వారిగోడు పట్టించుకోవడం లేదు.. వాళ్ళు తమకు ఉపాధి కల్పించాలని, ఉండటానికి పక్క ఇల్లు నిర్మించి ఇవ్వాలని, కుటుంభానికి రెండెకరాల భూమి ఇవ్వాలని కోరుకుంటున్నారు.... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి