హోం

31, అక్టోబర్ 2011, సోమవారం

నవంబర్ 1 బ్లాక్ డే:

నవంబర్ 1 తెలంగాణా ను బలవంతం గ ఆంధ్రలో కలిపి తెలంగాణా అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేసిన రోజు కావున తెలంగాణా ప్రజలంతా తమ ఇళ్ళ పై నల్ల జండాలు ఎగురవేసి నిరసన తెలపాలని తెలంగాణా JAC కోరుతున్నది, ప్రజలు  నల్ల జండాలతో రాలిలు నిర్వహించాలని, రాష్ట్ర అవతరణ వేడుకలలో మంత్రులు పాల్గొంటే వారిని అడ్డుకోవాలని పిలుపు నివ్వడం జరిగింది, నా వంతుగా నేను నా బ్లాగ్ లో నల్ల జెండా ఎగుర వేస్తున్నాను మీరు కూడా ఎగురవేయ్యండి.....


టి డి పి ఒడిలో కొండ లక్ష్మన్ బాపూజీ దిక్ష !!

తెలంగాణా బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలనే డిమాండ్ తో సాయుధ పోరాట యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ నవంబర్ 1 నుండి డిల్లి లోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దిక్షకు దిగనున్నారు, అయితే ఈ దిక్షలొ టి డి పి ఎం ఎల్ ఎ లు ఎం పి లు కూడా దశలవారిగా పాల్గొననున్నారు. దిక్షతొ బాపూజీ మరో అన్న అవుతార లేక టి డి పి ప్లాన్ బెడిసికొడుతుంద వేచి చూడాలి....



టిఆర్ఎస్ లో కాంగ్రెస్ విలీనమవుతది....

30 /10 / 2011 టి ఆర్ ఎస్ లోకి వలసల వరద కొనసాగుతుంది,  2010 లో టి డి పి నుంచి  చెన్నమనేని రమేష్ తో మొదలైన వలసల పరంపర తాజాగా అధికార కాంగ్రెస్ కు పాకింది, టి డి పి నుండి మాజీ మంత్రులు, మాజీ ఎం పి లు, మాజీ ఎం ఎల్ ఎ, ఎం ఎల్ ఎ  లతోపాటు, వేలాదిమంది కార్యకర్తలు ఇప్పటికే టి ఆర్ ఎస్ లోకి వచ్చి ఉన్నారు, అయితే ఇప్పుడు కాంగ్రెస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, సహా ఎం ఎల్ ఎ లు రాజయ్య , సోమరపు సత్య నారాయణ లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టి ఆర్ ఎస్ లో వేలాది కార్యకర్తలతో వచ్చి చేరారు, ఈ సందర్బంగా మాట్లాడిన కే సి ఆర్ కొంతమంది సన్నాసులు టి ఆర్ ఎస్ కాంగ్రెస్ లో విలీనమౌతది అని ప్రచారం చేస్తుంది, కాని ఇప్పుడు ఏమంటారు, కాంగ్రెస్ ఎ టి ఆర్ ఎస్ లో విలీనం అవుతుంది అని అన్నారు, తెలంగాణా లో టి ఆర్ ఎస్ తప్ప ఇంకో పార్టీ ఉండదని ఆయన ఈ సందర్బంగా అన్నారు, టి ఆర్ ఎస్ తోనే తెలంగాణా సాధ్యమని పార్టీలో చేరిన ఎం ఎల్ ఎ లు అన్నారు...

28, అక్టోబర్ 2011, శుక్రవారం

మన ఆలయాలు-1 "కాళేశ్వరం"



( 29 / 10 / 2011 ) కరీంనగర్ జిల్లా లోని అతి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి కాళేశ్వర క్షేత్రం, కరీంనగర్ పట్టణం నుండి 125 కిలో మీటర్ల దూరంలో ఉన్నది కాళేశ్వరం, కాళేశ్వరం లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయ్ గోదవరి ప్రాణహిత నదులు సంగమించే చోట ఈ క్షేత్రం ఉంది, ఇక్కడ శివ లింగంతోపాటు యమ లింగం కూడా ఉంటుంది. ఎందుకంటే,
                        పురాతనకాలంలో యముడు మనుషుల పాపాలను తొలగించి వారికి ముక్తిని ప్రసాదించమని శివున్ని ప్రార్ధించాడు, అప్పుడు ప్రత్యక్షమైన శివుడు యముని కోరికని మన్నించాడు, అలా ఈ క్షేత్రంలో ఒకే ప్రాణ మట్టంపై రెండు లింగాలు ఉంటాయి. ఒకటి యమలింగం కాగ, మరొకటి శివ లింగం, కాలుడు మనుషుల పాపాలు తొలగిస్తే, శివుడు ముక్తిని ప్రసాదిస్తాడు, కావున ఈ క్షేత్రాన్ని కాళేశ్వర-ముక్తేశ్వర క్షేత్రం అంటారు, అయితే ఇక్కడి మరో ప్రత్యేకత ఏంటంటే ముందు యమున్ని ధర్శించుకున్నకే, శివుని దర్శనం లభిస్తుంది.

                              అనేక ప్రత్యేకతలకు నెలవు ఈ ఆలయం, పచ్చని ప్రకృతి మధ్య నెలవైన ఈ క్షత్రంకు వచ్చిన వారు భక్తి తన్మయత్వంలో మునిగిపోతారు, అతి అరుదైన సరస్వతి క్షేత్రాలలో ఒకటి ఇక్కడ ఉంది, సరస్వతి దేవి ఆలయాలు దక్షిణ భారతంలో కేవలం రెండే ఉన్నాయ్, ఆ రెండింటిలో ఇది ఒకటి, అలాగే మరో అరుదైన ఆలయం కూడా ఇక్కడున్నది, అదే సూర్య దేవాలయం, ఆంద్ర ప్రదేశ్ లో కేవలం రెండే సూర్య దేవాలయాలు ఉండగా అందులో ఒకటి ఇక్కడ ఉంది.

              కాళేశ్వరం లో మరో ప్రత్యేకత కూడా ఉంది, ఇది త్రివేణి సంగమ పవిత్ర భూమి, ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు సంగమిస్తాయి, ఇక్కడ మూడు నదుల పుష్కరాలు జరుగుతాయి, అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశి అంటారు, ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదుల పుష్కరాలు చాల వైభవంగా జరుగుతాయి.ఇక్కడ శివ రాత్రి వేడుకలు అతి వైభవంగా జరుగుతాయి..


సరస్వతి నది: ఇక్కడ మరో విశేషం ఏంటంటే దేవాలయంలో శివ లింగం పై పోసిన నీళ్లన్నీ ఆ శివలింగం ముక్కుద్వారా సేకరించి గోదావరి-ప్రాణహిత సంగమ స్థానంలో కలుపుతుంది, అయితే ఆ నాటి శాస్త్ర విజ్ఞానం యొక్క అధ్బుతం ఇది, శివుని ముక్కు నుండి గోదావరి-ప్రాణహిత నది సంగమ స్థానం వరకు గొట్టాల ద్వార అంతర్ వాహినిగా వెళ్ళే శివున్ని అర్చించిన జలమే సరస్వతి నది, అందుకే ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి, అలాగే ఇక్కడ సరస్వతి దేవాలయం కూడా ఉంది.
                         కాళేశ్వర క్షేత్రం పెద్దల పిండ ప్రదానానికి ముఖ్యమైన క్షేత్రం, కాశికి వెల్లలేని వాళ్ళు ఇక్కడ గోదావరి-ప్రాణహిత-సరస్వతి నదుల త్రివేణి సంగమ స్థానంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించుకుంటారు, ఇది కాశిలో జరిపించినంత  పుణ్యమని చెప్తారు.

                      కాళేశ్వర- ముక్తేశ్వర క్షేత్రం భక్తి పరంగానే కాకుండా ఇది మంచి పర్యాటక కేంద్రం కూడా, ఇది దట్టమైన అడవిలో ఉండడం వలన ఎటు చుసిన పచ్చని ప్రకృతి ఉంటుంది, గోదావరి-ప్రాణహిత నదుల సంగమ స్థానం కూడా చూడదగిన ప్రాంతమే, అలాగే ఇక్కడ బోటు సౌకర్యంకూడా ఉండటంతో హాయిగా బోటింగ్ కూడా చెయ్య వచ్చు, ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ క్షేత్రం తప్పకుండ చూడవలసిందే......

కాంగ్రెస్ కోర్ కమిటి బేటి...

( 29 / 10  / 2011 ) నిన్న సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటి బేటి అయ్యి తెలంగాణాపై సుదీర్గంగా చర్చించారు, సమావేశ అన౦తరం చిదంబరం మాట్లాడుతూ తెలంగాణా అంశం పై సుదీర్గ మంతనాలు జరిగాయని, యు పి ఎ పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు, అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరుగనుండడంతో, అక్కడ కాంగ్రెస్ ప్రధానమైన ప్రచార అస్త్రం ఏంటంటే హరిత్ ప్రదేశ్, బుందేల్ ఖండ్ రాష్ట్రాలు ఇస్తామని, అయితే ఎ సమస్య లేకుండా ఇప్పటికే వాగ్దానం చేసిన తెలంగాణా పై ఒక నిర్ణయం తీసుకొని ప్రచారానికి వెళ్తే కలిసి వస్తుందని, లేక పోతే జనం నమ్మరని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది..... 

చాయ్, సమోసాల కోసం కాంగ్రెస్ స్టీరింగ్ కమిటి సమావేశం...

(29  /10 / 2011 ) ఎవరికైనా చాయ్ తాగాలనిపించిన, సమోసా తినాలనిపించిన ఎం చేస్తారు..? ఎ ఇరానీ చై హోటల్ కో వెళ్తారు, కానీ మన తెలంగాణా కాంగ్రెస్ లీడర్ ల రూటే సపరేటు, అందరు కలిసి ఒక సమావేశం అని పెట్టుకొని వీళ్ళు చాయ్ తాగి, సమోసా తిని, వచ్చిరాని ముచ్చట్లు మాట్లాడుకొని తీరిగ్గా బయటికి వస్తారు, ఎలాగో ఈ వి ఐ పి ల మాటలు వినాలని మీడియా ఉత్సాహంగా ఉంటుంది కదా వాళ్ళముందు అవి చర్చించాం ఇది చర్చించాం అని కాకర కాయ కబుర్లన్నీ చెప్పి చక్కగా వెళ్లి పోతారు, కాలక్షేపానికి కాలక్షేపం, పబ్లిసిటి కి పబ్లిసిటి, కాంగ్రెస్ స్టీరింగ్ కమిటి సమావేశం లో ఎం చేస్తున్నారో కింది చిత్రంలో చూడండి..


కాంగ్రెస్ కో కథం కరో, తెలంగాణా కో హాసిల్ కరో ...

(29 /10 /2011 ) గత నాలుగు రోజులుగా కే సి ఆర్ పైన, నమస్తే తెలంగాణా పేపర్ పైన మాటల దాడిని తీవ్రం చేసింది టి డి పి, నిన్న ఏకంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే స్వయంగా మీడియా ముందుకు వచ్చి కే సి ఆర్ పై విమర్శలు చేసారు, దీనికి కే సి ఆర్ స్పందించారు, గత నాలుగు రోజులుగా టి డి పి నేతలు వాగుతుంటే ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగు తాయి అనుకున్నాను కానీ నిన్న ఏకంగా చంద్ర బాబే రంగం లోకి దిగి విమర్శించడంతో మీడియా ముందుకు రావలసి వచ్చిందని చెప్పారు,
               పోలవరం విషయంలో జరుగుతున్న దుమారానికి తెర దించారు, పోలవరాన్ని మొదటినుండి వ్యతిరేకిస్తున్నది టి ఆర్ ఎస్ ఎ నని, 2005 లో పోలవరానికి వ్యతిరేకంగా హై కోర్ట్ కు వెళ్ళమని అయితే హై కోర్ట్ అన్ని అనుమతులు తీసుకున్నాకే, ప్రాజెక్ట్ను మొదలు పెట్టాలని చెప్పిందని, అందుకు సంబంధిచిన తీర్పు కాపిని చూపించారు, ఆ తర్వాత సుప్రీం కోర్టకు కూడా వెళ్ళమని ఇంకా కేసు విచారణ లోనే ఉందని, కేసు విచారణలో ఉండగా టెండర్లు ఇవ్వడం ఏమిటని మల్లి ఈ నెల 14 న సుప్రీం కోర్టులో మరో పిటిషన్ వేశామని చెప్పారు, తను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే పోలవరం విషయం సోనియా దృష్టికి తీసుకెల్లానని, అప్పటి కేంద్ర మంత్రి, ఆది వాసి ఐన శిభు సోరెన్ ను ఖమ్మం ఆది వాసుల దగ్గరికి తీసుకొని వచ్చి వారి వాయిసు కేంద్రానికి తెలిసేలా చేసానని, ఈ రోజుకి కూడా మేము స్పష్టంగానే ఉన్నామని, టెండర్లను రద్దు చెయ్యాలని సి ఎం కు లేఖ రాసానని, ఎలైన్ మెంట్ మార్చాలని అనేదే మా ప్రధాన డిమాండ్ అని అన్నారు, నమస్తే తెలంగాణా పత్రికకు కానీ , తనకు కానీ పోలవరం టెండర్ లతో ఎలాంటి సంబంన్ధం లేదని ఆయన స్పష్టం చేసారు, తనకు ఎవరు బినమిలు లేరని, షూ అనే కంపెనీకి తనకు ఎలాంటి సంబంధం లేదని, అది ప్రారంబించి 55 సంవత్సరాలు అవుతుందని, తనకు ఇప్పుడు 57 సంవత్సరాలని 2 ఏళ్ళ వయసులో బినమిని పెట్టి కంపని పెట్టాన అని ప్రశ్నించారు.. నమస్తే తెలంగాణాలో తను 4  కోట్ల పెట్టు బదులు పెట్టనని, అవికూడా తన మిత్రుని దగ్గర అప్పుగా తీసుకున్నానని, ఆ వివరాలు  రిజిస్ట్రేషన్ ఆఫీసు లో కూడా ఇచ్చానని వీళ్ళు కొత్తగా బయట పెట్టింది ఏమి లేదని అన్నారు, తాము తెలంగాణా కు జరుగుతున్న అన్యాయాలను ఎత్తి చూపడానికి ఒక కర పత్రం కావాలని నమస్తే తెలంగాణా ను స్త్తాపించమే తప్ప "నీలగ బినామీ పేర్లతో హెరిటేజ్ లు పెట్టలేదు కదా" అని చంద్రబాబు ను ఉద్దేశించి అన్నారు, అయితే నమస్తే తెలంగాణా పేపర్లో చాలామంది పెట్టుబడులు పెట్టారని అందులో ఒకరు రాజం అని, ఆయన కు ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో మనకు ఎం తెలుసని, ఆయన ను నియంత్రించాల్సిన అవసరం మనకేంటని, తెలంగాణా కోసం ఒక పత్రిక పెట్టం, అందులోని షేర్ హోల్దేర్స్ ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారే తప్ప వాళ్ళకు పత్రికకు ఎం సంబంధం అని ఆయన ప్రశ్నించారు.
                                    2 ఎకరాల భూమి ఉన్న కుటుంబం లో చంద్ర బాబు పుట్టాడని, తన ఇల్లే తను పుట్టేనాటికి 2  ఎకరాల్లో ఉండేదని, అది ఇప్పుడు సిద్దిపేట లో జిల్లా పరిషత్ స్కూల్ కు విరాళంగ ఇచ్చామని కెసిఆర్ చెప్పారు, తన దగ్గర దాచు కోవడానికి ఏమి లేదని, కే సి ఆర్ తన ఆస్తుల వివరాలను భహిర్గతం చేసారు, ఆయనకు మెదక్ జిల్లలో లో 24 ఎకరాల పంట భూమి ఉందని, హైదరాబాద్లో ఒక ఇల్లు, 2006 ఎన్నికల తర్వాత కరీం నగర్లో ఒక ఇల్లు కట్టుకున్నానని ఆయన తెలిపారు, నమస్తే తెలంగాణా పత్రికలో నాలుగు కోట్లు అప్పు తీసుకొని పెట్టుబడి పెట్టనని, అలాగే టి న్యూస్ లో 55 లక్షల పెట్టు బడులు ఉన్నాయని అన్నారు, చంద్ర బాబు ఇంటి పేరు నమ్మక ద్రోహం, ఒంటి పేరు నయ వంచన, అసలు పేరు కుంబకోణం అని ఎద్దేవా చేసారు.
                                           టి ఆర్ ఎస్ కేవలం తమనే టార్గెట్ చేస్తుంది అంటున్న టి డి పి నేతలకు కూడా ఆయన సమాధానం చెప్పారు, మొన్ననే  జే ఎ సి కొత్త నినాదం తీసుకుందని, కాంగ్రెస్ కో కథం కరో, తెలంగాణా కో హాసిల్ కరో  అని ఇది ఎవరిని టార్గెట్ చేసినట్టు అని ఆయన ప్రశ్నించారు.
                                            అయితే రెండు మూడు రోజుల నుండి జరుగు తున్న పరిణామాలను చూస్తే టి డి పి, కాంగ్రెస్, సీమంద్ర మీడియా కలిసి కుట్ర చేసి పథకం ప్రకారమే దాడికి దిగినట్టు అర్థం అవుతుంది, ముక్యంగా టి డి పి వారికీ కొరకరాని కొయ్యగా మారిన నమస్తే తెలంగాణా పై బురధజల్లాలని చూసారు, కాని అది బెడిసి కొట్టింది, షూ కంపని ని తెరపైకి తెచ్చారు, అలాగే నమస్తే తెలంగాణా ఎం డి పై కూడా కామెంట్స్ చేసారు అయితే రాజం అనే వ్యక్తి కి అనేక వ్యాపారాలు ఉన్నాయ్, ఆయన తెలంగాణా పత్రికలో ఒకానొక వాటా దారు మాత్రమే కాని పత్రిక అతనిది కాదు, మనకున్న సమాచారం మేరకు ఆయనకు వచ్చింది కూడా కేవలం 3 % కాంట్రాక్టు మాత్రమే, అతనికి టి ఆర్ ఎస్ తో ఎ సంభందం లేదని తెలిసి కూడా బురద జల్లి పబ్బం గడపుకోవాలని చూసారు, తెలంగాణా లో రాజీవ్ రహదారిని సుబ్బరామి రెడ్డి కట్ట వచ్చు కాని, పోలవరం ను మంతనీ కి చెందినా రాజం అనే వ్యక్తి కంపని కట్ట కూడద..?, అయితే నాకు తెలిసిన చాల మంది కూడా అన్న మాట ఇదే, కే సి ఆర్ అమ్ముడు పోయాడని కాంట్రాక్టు తెచ్చుకున్నాడని, అయితే టి ఆర్ ఎస్ కొన్నేళ్ళుగా పోలవరంకు వ్యతిరేకంగా పోరాడుతుంది అనే విషయం ఎవరికీ తెలియదు, గద్దర్ ఏదో మాట్లాడే సరికి మనవాళ్ళు కే సి ఆర్ ను అను మానిస్తారు, మరి గద్దర్ వెళ్లి ఆపగలడ పోలవరాన్ని..? అన్ని సార్లు కోర్ట్ కు  వెళ్లి ఆపెయ్యలని తీర్పు తెచ్చుకున్న అపనివాళ్ళు గద్దర్ ఏదో చెప్తే వింటారా..? కే సి ఆర్ ఉద్యమాన్ని తాకట్టు పెట్టాడని టి డిపి , గజ్జెల కాంతం, విమలక్క, గద్దర్, మంద కృష్ణ మాదిగ అంటూ ఉంటె సీమంద్ర మీడియా దాన్నే మల్లి మల్లి చూపిస్తే మనం అనుమనిస్తం, నిజంగా మనం తెలంగాణా ను కోరుకునే వాళ్ళం అయితే 100 స్థానాలు కట్ట బెట్టిన కాంగ్రెస్ , టి డి పి లు చెప్పే మాటలు విని , కేవలం 10 స్థానాలు ఇచ్చిన టి ఆర్ ఎస్ ను అనుమానించడం ఎంతవరకు సమంజసం..? ఆ 100  స్థానాలు టి ఆర్ ఎస్ కు వచ్చి ఉంటె ఈ పాటికి తెలంగాణా రాకపోయ్యేద ..? మనం వీళ్ళను ఇన్ని సార్లు రాజీనామా చెయ్యండి అని అడిగే అవసరం ఉండేదా ..? 2009  లో కే సి ఆర్ దిక్ష చేసిన 11  రోజులు కాని ఆతర్వాత జరిగిన ఉద్యమంలో కానీ గద్దర్ ఎక్కడైనా కనిపించాడ..? దళితున్ని ముఖ్య మంత్రిని చేస్తాను అనగానే కెసిఆర్ పక్కకు వెళ్లి, తెలంగాణా ప్రకటన వెనక్కి వెళ్ళంగానే బయటకు వెళ్లి టి ఆర్ ఎస్ ను తిడుతున్నా మంద కృష్ణ మదిగనా మనం నమ్మేది..? సకల జనుల సమ్మె జరుగుతున్న సమయంలో కలిసిరాని వాళ్ళ ఇళ్ళను ముట్టడించని గజ్జెల కాంతం  42  రోజులు సమ్మె చేసి ముగించిన తర్వాత కోదండ రామ్ ఇంటిపై దాడి చెయ్యడం ఎంత వరకు సమంజసం...?  ఇక నైన నిజం గ తెలంగాణా కోసం పోరాడేది ఎవరో గుర్తించడం ప్రజలుగా మన భాద్యత, విమర్శించే వాడు ఎవడు వాడి స్థాయి ఏంటి అనేదానితో పాటు అది ఎ ఛానల్ లో ప్రసారం అయ్యింది అనేది కూడా ఈ రోజుల్లో ముక్యమే. సహాయ నిరాకరణ ముగిసిన తర్వాత ఉద్యమం ఐపోయింది అని ప్రచారం చేసిన సీమంద్ర ఛానల్ లను నమ్మిన వాళ్ళు ఆరోజు కూడా ఉద్యోగ సంఘాలు అమ్ముడు పోయాయి అన్నారు, కాని అంత కంటే గొప్పగా సకల జనుల సమ్మె చేసి చూపించారు, ఇప్పుడు మన కర్తవ్యం ఏంటంటే నోట్లకు సీట్లకు అమ్ముడు పోయేది ఎవరో అందరికి తెలిసి పోయింది, రచ్చబండ కార్యక్రమమని రాషన్ కార్డ్లు లు ఇస్తామని మల్లి గ్రామాల్లోకి అడుగు పెడదామని అనుకుంటున్నా కాంగ్రెస్ మంత్రులు, ఎం ఎల్ ఎ లను బహిష్కరించాలి...ఆ ద్రోహులను అడ్డుకోవాలి... ఇప్పుడు మన నినాదం ఒక్కటే..కాంగ్రెస్ కో కథం కరో, తెలంగాణా కో హాసిల్ కరో ...

ఉద్యమ నేతలపై సర్కార్ ముప్పేట దాడి...

(28/10/2011) 42  రోజుల సకల జనుల సమ్మే ను విరమింపజేయడంలో సక్సెస్ సాధించమని విర్ర వీగుతున్న సర్కార్, ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన వారిని టార్గెట్ చేసింది, దీనికి సీమంద్ర మీడియా పూర్తి సహకారం అందిస్తుంది, స్వామి గౌడ్ పై తెలంగాణా స్ట్రగుల్ ఫోరం వాళ్ళు తమ భూములు స్వామి గౌడ్ ఆక్రమించుకున్నాడని వాదిస్తున్నారు, దీనికి సీమంద్ర మీడియా విశేష ప్రచారం కల్పిస్తుంది, అయితే ఆ ఫోరం వాళ్ళు కూడా ఉద్యోగులే, ఉద్యోగుల్లో చీలిక తెచ్చి నాయకత్వానికి దెబ్బ కొట్టాలనే ఆంద్ర సర్కార్ ప్లాన్ కు మీడియా కూడా తోడవడంతో స్వామి గౌడ్ పై బురద జల్లడం ప్రారంబించారు, అయితే ఆ ఫోరం వాళ్ళు ఈ విషయమై గవర్నర్ ను కలిసి స్వామి గౌడ్ పై ఫిర్యాదు చేస్తామని చెప్పారు, అయితే వాళ్ళు వెళ్ళలేదు పిర్యాదు చెయ్య లేదు, ఎందుకంటే ఫిర్యాదు చెయ్యాలంటే ఆధారాలు ఉండాలి కదా, కాని సీమంద్ర ఛానల్ లు పెద్ద పెద్ద అక్షరాలతో బ్రేకింగ్ న్యూస్ ను ఇచ్చాయి, ఫోరం వాళ్ళు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసారని, ఇక స్వామి గౌడ్ పని అయిపోయిందని వ్యక్యనాలు చేసుకున్నారు, అయితే చివరికి గవర్నర్ తన వద్దకు ఎవరు రాలేదని, తనకు అంత మతి మరుపు లేదని, వినతి పత్రం ఇచ్చి ఉంటె తనకు గుర్తు ఉండేదని, ఆయన అన్నారు, దీనితో సీమంద్ర మీడియా తెలంగాణా నాయకత్వాన్ని దెబ్బ తీయడానికి ఎంతల ప్రయత్నిస్తుందో అర్థం అవుతుంది.
                             ఇక రాజకీయ దాడి కూడా తక్కువగా జరగడం లేదు, పోలవరం టెండర్ల విషయంలో నమస్తే తెలంగాణా పత్రికపై బురద జల్లడానికి చూసారు, టెండర్లు నమస్తే తెలంగాణా ఎం డి కంపని కి వచ్చాయని టి డి పి నానా యాగి చేసింది, అయితే టెండర్లు ఇంకా ఎవరికీ ఇవ్వలేదని సి ఎం చెప్పే సరికి ఇప్పుడు కెసిఆర్ పై పడ్డారు, నీ ఆస్తులు ఎంత అంటే నీ ఆస్తులు ఎంత అని వాగుతున్నారు టి డి పి వాళ్ళు, ఇక తెలంగన కు చెందినా టి ఆర్ఎస్ వ్యతిరేక వర్గం ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎన్నడు కలిసి రాని, కొంతమంది, గద్దర్, మంద కృష్ణ మాదిగ , వీళ్ళకు మద్దతు దారులు, కొండ లక్ష్మన్ బాపుజిల తో మరో వైపు మాటల యుద్ధం చేయిస్తున్నారు, వాటికి సీమంద్ర మీడియా విశేష ప్రచారం చేస్తుంది, అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్కటే మొదటి నుండి నిబద్ధతతో ఉన్నదీ ఎవరు అని, ఉద్యమం జరుగుతున్న సమయంలో ఉద్యమాన్ని కించపరిచి, కానీసం పాల్గొనకుండా ఈ రోజు ఉద్యమం విఫలమైందని, దానికి వాళ్ళు అమ్ముడు పోయారని వీళ్ళు అమ్ముడు పోయారని అని అంటున్నారు, ఎన్నడైనా ఉద్యమానికి వీళ్ళు కలిసి వచ్చారా..? మరి  మాట్లాడే హక్కు ఎక్కడిది...? 
                                                                మరో వైపు రచ్చబండ పేరుతో సి ఎం , మంత్రులు గ్రామాల్లోకి వచ్చేందుకు చూస్తున్నారు, వాళ్ళను అడ్డుకుంటే అభివృద్దికి ఆటంకం కల్గిస్తున్నారని సీమంద్ర మీడియాతో విశేష ప్రచారం చేయించాలనేది ఉపాయంగా తోస్తుంది, ఎలాగో తెలంగాణా ఉద్యమానికి కలిసిరాని, అమ్ముడు పోయే వాళ్ళు తెలంగాణాలో చాల మందే ఉన్నారు కదా వాళ్ళను ఉపయోగిన్చుకున్ధమని కిరణ్ చూస్తున్నారు..

27, అక్టోబర్ 2011, గురువారం

తెలంగాణా ఉద్యమ వేదిక-టి.ఆర్.ఎస్

(28 /10 /2011 ) టి ఆర్ ఎస్ ఏర్పడటానికి దాదాపు పదేళ్ళ ముందు శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ డాంపై కూర్చొని కే సి ఆర్ అన్న మాటలు ఆరోజు నిజమయ్యాయి, టి డి పి స్థాపించిన నాటి నుండి ఆ పార్టీలో క్రమశిక్షణ కల నాయకునిగా ఉంటూ విశేష సేవలన్దిచిన తనకు ఆ పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఒకవైపు, తెలంగాణకు టి డి పి చేస్తున్న అన్యాయాలను చూసి ఉరుకోలేక ఆయన పార్టీకి ఆ పార్టీ ద్వార వచ్చిన పదవికి రాజీనామా చేసారు, అప్పటికే మేధావులను, ప్రజా సంఘాలను, NRI లను, ఏకం చేసిన జయ శంకర్ సర్ రాజకీయ వేదిక కోసం వెతుకుతున్న తరుణంలో ఆయన మార్గ నిర్దేశనంలో కల్వకుంట్ల చంద్ర శేకర్ రావు పార్టీ అధ్యక్షునిగా, ప్రో.జయ శంకర్ పార్టీ సిద్దాంత కర్త గా 27 -04 -2001 న  తెలంగాణా రాష్ట్ర సమితి ఏర్పడింది, 
                                          పార్టీ స్థాపించిన 60 రోజుల్లోనే మెదక్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 75 % మండల పరిషత్తు స్థానాలను , 25 % జిల్లా పరిషత్తు స్థానాలను గెలుచుకుంది, ఆ తర్వాత వచ్చిన సిద్దిపేట అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  కే సి ఆర్ గణ విజయం సాధించారు, తొలిసారిగా రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణా గొంతుకు స్థానం దక్కింది..
          కరీం నగర్ లో టి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారి భహిరంగ సభకు 12 లక్షల మంది హాజరయ్యారు, దీంతో కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ తన మానిఫెస్టోలో తెలంగాణా అంశం చేర్చి టి ఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకుంది..2004  సార్వత్రిక ఎన్నికల్లో 5 పార్లమెంట్ స్థానాల్లో పోటి చేసిన టి ఆర్ ఎస్ 5 స్థానాలను గెలుచుకుది, 26 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది, 18 నెలలపాటు శాక లేని మంత్రిగా కేబినెట్లో కొనసాగారు కే సి ఆర్, అయితే అనుకోని పరీస్తితులలో  ఆలే నరేంద్ర (ఎం,పి) పార్టీని వీడ వలసి వచ్చింది.

                                       రెండు సంవత్సరాల నిరీక్షణ తర్వాత రాష్ట్ర మంత్రి వర్గం నుండి టి ఆర్ ఎస్ బయటకు వచ్చింది,  బయటకు వచ్చే ముందు అసెంబ్లీ లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను అసెంబ్లీ సాక్షిగా చెప్పారు హరీష్ రావు, ఆ తర్వాత కేంద్రం నుండి కూడా బయటికి వచ్చి, తన ఎం.పి పదవికి రాజీనామా చేసారు కే సి ఆర్, అయితే ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వై ఎస్ ఆర్ , ఇవి తెలంగాణకు రిఫరెండం అన్నారు, అయితే 2006 కరీం నగర్ ఉపఎన్నికలలో కే సి ఆర్ భారి మెజారిటితో గెలిచారు, ఆ తర్వాత ఆయన అనేకమంది జాతీయ నాయకులను కలిసి వారితో తెలంగాణకు అనుకూలంగా ఒప్పించగలిగారు, వారందరిని ఒకే వేదిక మీదకు తెచ్చి తెలంగాణకు అనుకూలం అని చెప్పించారు, ఐన కేంద్రంలో కదలిక రాలేదు,.

                                      పైగా పార్టీని చీల్చడంలో రాజశేకర్ రెడ్డి సక్సెస్ అయ్యారు, పది మంది ఎం ఎల్ ఎ లు పార్టీ నుండి వెళ్లి పోయారు, ఈ పరిణామం తర్వాత కే సి ఆర్ రాజీనామానే మరోసారి ఆయుధంగా ఎంచుకున్నారు, మొత్తం 16 మంది ఎం ఎల్ ఎ లు, నల్గురు ఎం పి లు రాజీనామా చేసారు అయితే ఈ ఎన్నికల్లో టి ఆర్ ఎస్ కు తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలింది, కేవలం 7 ఎం ఎల్ ఎ , 2 ఎం పి స్థానాలను మాత్రమే గెలిచింది టి ఆర్ ఎస్, ఐన కే సి ఆర్ కుంగిపోలేదు, కలిసి వచ్చిన తల్లి తెలంగాణా పార్టీని టి ఆర్ ఎస్ లో విలీనం చేసుకున్నాడు, తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన టి డి పి తో కలిసి కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా 2009 ఎన్నికల్లో  ముందుకు వెళ్ళాడు, కాని ఈ ఎన్నికల్లో టి ఆర్ ఎస్ కేవలం రెండు పార్లమెంట్, పది అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుహుకుంది, ఈ పరిణామంతో కే సి ఆర్ కుంగిపోయారు, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానన్నారు.
                                  కొద్ది రోజుల్లోనే కొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు కే సి ఆర్, రాష్ట్ర పతి ఉత్తర్వుల్లోని 14 F ను రద్దు చెయ్యాలని, లేకపోతే తను నిరాహార ధిక్షకు దిగుతానని ప్రధానికి, రాష్ట్రపతికి, ముక్యమంత్రికి తెలియజేసారు, సిద్దిపేట వేదికగా 29 నవంబర్ 2009 న ఉదయం కరీం నగర్ నుండి ధిక్ష స్థలానికి బయలు దేరారు, అయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో కే సి ఆర్ ను అర్రెస్ట్ చేసి ఖమ్మం సబ్ జైలు కు తరలించింది, ఈ వార్త తెలిసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం రగిలి పోయింది, శ్రీ కాంత చారి అనే విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకొని అందరు చూస్తుండగానే ఆత్మ హత్యా చేసుకున్నాడు, ఈ సంఘటన తో యావత్ తెలంగాణా  భగ్గుమంది, పది జిల్లాల్లో నిరసనలు దిష్టి బొమ్మల దహనాలు జరిగాయి, ఓ యు జాక్ రెండు రోజుల బంద్ కు పిలుపునిచ్చింది, రెండవ రోజు లాటీలు విరిగాయి, అనేక మంది విద్యార్థులు గాయలపాలు అయ్యారు, రబ్బరు బుల్లెట్లు , భాష్ప వాయు గోలలు ప్రయోగించారు, అంత కంతకు కే సి ఆర్ ఆరోగ్యం ధిగ జారుతుంది అని డాక్టర్లు చెప్పే సరికి విద్యార్థులు ఆవేశంతో రగిలి పోయారు, 
పంజాగుట్టలోని షాపులపై దాడులకు దిగారు, dec 10 న అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు పిలుపు నిచ్చారు, కే సి ఆర్ ఆరోగ్య పరిస్థితి, అసెంబ్లీ ముట్టడి ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోం మంత్రి ద్వార డిసెంబర్ 09 2009 న ఒక ప్రకటన చేయించింది, " తెలంగాణా రాష్ట్రము ఏర్పాటు చేస్తాం" అని, ఈ ప్రకటన తో కే సి ఆర్ నిరాహార దిక్ష విరమించారు, తెలంగాణా అంతట సంబరాలు జరిగాయి, కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు, సీమంద్రలో కృత్రిమ ఉద్యమం ప్రారంబమైంది, దీనితో కేంద్రం వెనక్కి వెళ్ళింది.

                                      కే సి ఆర్ , జానా రెడ్డి ఇంటికి వెళ్లి జే ఎ సి ని ఏర్పాటు చేసారు, దీనికి చైర్మెన్ ప్రో. కోదండ రామ్, అయితే కాంగ్రెస్ రాజీనామా లకు జడిసి జాక్ నుండి బయటికి వెళ్ళింది, టి డి పి ద్వంద విధానాలు పాటిస్తున్డడంతో జాక్ దాన్ని బయటకు పంపింది, ఇక జాక్ లో టి ఆర్ ఎస్ , బి జే పి, న్యూ డెమోక్రసీ , ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు  ఉన్నాయ్.అయితే టి డి పి ద్వంద విధానాలకు విసిగి పోయిన నాయకులూ కార్య కర్తలు టి ఆర్ ఎస్ లోకి రావడం ప్రారంబించారు, ఎం ఎల్ ఎ లు కూడా పార్టీ ని వదిలే పరిస్థితి వచ్చింది, జాక్ పిలుపు మేరకు, టి ఆర్ ఎస్ 10 మంది , బి జే పి ఒకరు, టి డి పి కి రాజీనామా చేసి( టి ఆర్ ఎస్ లో చేరారు )  మరొకరు ఎం ఎల్ ఎ లు రాజీనామాలు చేసారు, అయితే జనం వీళ్ళను భారి మెజారిటీతో గెలుపించుకున్నారు, టి డి పి అన్ని స్థానాల్లో ధరావత్ కోల్పోగా, కాంగ్రెస్ నాల్గు స్థానాల్లో ధరావత్ కోల్పోయింది, ఈ పరిణామం తో టి డి పి నుండి వలసలు పెద్ద సంఖ్యలో టి ఆర్ ఎస్ వైపు వెళ్ళాయి, డిసెంబర్ 2010 లో చరిత్రలో కానీ విని ఎరుగని రీతిలో 25 లక్షల మందితో మహా ఘర్జన సభను వరంగల్ లో నిర్వహించింది, 2011 ఏప్రిల్ 27 నాటికీ టి ఆర్ ఎస్ ఏర్పడి పది సంవత్సరాలయ్యింది, JAC  ప్రధాన భాగస్వామ్య పక్షంగా జాక్ ఇచ్చే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలంగాణా ఆశయ సాధన వైపుగా ముందుకు వెళ్తుంది, తెలంగాణ ఉద్యమ వేదిక..టి ఆర్ ఎస్.


తెలంగాణా శివాజీ-సర్వాయి పాపన్న...


సర్దార్ సర్వాయి పాపన్న వరంగల్ జిల్లా జనగాం దగ్గర కైలాస్ పూర్ గ్రామంలో గౌడ కులంలో 1650 లో జన్మించారు, తండ్రి చిన్న తనం లోనే చనిపోయారు, సర్వమ్మ అతడి తల్లి, పాపడు అని అతన్ని పిలిచేవారు.పాపన్న ఎల్లమ్మకు పరమ భక్తుడు, అతను శివున్ని ఆరాధించేవాడు, తల్లి కోరిక మేరకు గౌడ వృత్తిని స్వీకరించాడు, కాని అతని మనసులో మాత్రం తెలంగాణా లో అంతకంతకు పెరుగుతున్న ముస్లింల ఆధిపత్యాన్ని అంతం చెయ్యాలని ఉండేది, అందుకోసం అతను గెరిల్ల సైన్యాన్ని తాయారు చేసాడు, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యం పై దాడి చేసే వాడు,1675 లో సర్వాయి పేట లో తన రాజ్యాన్ని స్థాపించాడు, తన సొంత ఊరు కైలాస్ పూర్ రాజధాని.
                                            ఇతను శివాజీకి సమకాలికుడు, శివాజీ ముస్లింల పాలనా అంతానికి మహారాష్ట్రలో ఎలాగైతే పోరాడాడో, పాపన్న కూడా తెలంగాణాలో ముస్లింల పాలనా అంతానికి పోరాడాడు, 1687 - 1724 వరకు అప్పటి మొగల్ చక్రవర్తి ఔరంగాజేబ్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాడు, పాపన్న ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించి విజయ దుర్గాలు నిర్మించాడు, 1678  వరకు తాటికొండ, వేములకొందాలను తన ఆధీనం లోకి తెచ్చుకొని దుర్గాలను నిర్మించాడు, 1700  - 1705 మధ్య కలం లో షా పుర లో మరొక దుర్గం నిర్మించాడు, అతని సామ్రాజ్యం తాటికొండ, కొలనుపాక, చేర్యాల నుండి కరీం నగర్ జిల్లా లోని హుసనాబాద్, హుజురా బాద్ విస్తరించింది, భువనగిరి కోటను రాజధానిగా చేసుకొని అతను ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు.

                                    పాపన్నఒక సాధారణ గౌడ కుటుంబం నుండి వచ్చిన వాడు కనుక అతనికి ప్రజల కష్ట నష్టలన్నీ తెలుసు, అందుకే పాపన్న రాజ్యంలో పన్నులు లేవు, ఖజానా కొరకు అతను జమిందార్, సుబేదార్ లపై తన గెరిల్ల సైన్యంతో దాడి చేయించేవాడు, పాపన్న అనేక ప్రజామోద యోగ్యమైన పనులు చేసాడు, అతని రాజ్యం లో సామజిక న్యాయం పాటించేవాడు, తాటి కొండలో చెక్ డాం నిర్మించాడు, అతను ఎల్లమ్మకు పరమ భక్తుడు కావున హుజురా బాద్ లో ఎల్లమ్మ గుడి కట్టించాడు, అది నేటికి రూపం మారిన  అలానే ఉంది.
                                            పాపన్న గెరిల్ల సైన్యం తో మొగల్ సైన్యం పై దాడి చేస్తున్నాడని ఔరంగజేబ్ కు తెలిసింది, అతడు రుస్తుం దిల్ ఖాన్ కు భాద్యతలు అప్పగించాడు, రుస్తుం దిల్ ఖాన్ యుద్దానికి ఖాసిం ఖాన్ ను పంపించాడు, శఃపుర వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి, నెలలపాటు యుద్ధం జరిగింది, చివరికి రుస్తుం దిల్ ఖాన్ రంగం లోకి దిగాడు, సుమారు 3 నెలలపాటు యుద్ధం జరిగింది, పాపన్న తన ప్రాణ స్నేహితున్ని కోల్పోయాడు, దాంతో ఆయన యుద్దాన్ని విరమించుకున్నాడు, అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, మొగల్ సైన్యాలు అతని కోసం వెతకడం ప్రారంభించాయి, అయితే పాపన్న తన సొంత ఊరు జనగామ కు వెళ్లి అక్కడ గౌడ కులం వారు ఎక్కువగా ఉండే చోట జీవితం గడిపాడు, ఔరంగజేబ్ మరణించిన తర్వాత దక్కన్ పాలకుడు కంబక్ష్ ఖాన్ బలహీన పాలనను చుసిన పాపన్న 1 ఏప్రిల్ 1708 లో వరంగల్ కోటపై దాడి చేసాడు, అయితే ఈ దాడిలో పాపన్న పట్టుబడ్డాడు.
                                  1708 లో గోల్కొండకు తీసుకెళ్ళి పాపన్న తల తీసి కోట ముఖ ద్వారానికి వెల్లడ దీసారు. తెలంగాణా పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర సమైక్య పాలన లో అజ్ఞాతంలోకి వెళ్ళింది, బహుజన గౌడ కులానికి చెందిన పాపన్న జీవిత చరిత్రను కమ్మ కుల ఆధిపత్యం గల ఆన్ద్రవాళ్ళు బయటికి రాకుండా చేసారు, మన పోరాట యోధులను మనమే గుర్తించాల్సిన అవసరం, ఆ భాద్యత మనపైనే ఉంది...
                                                                        కొంపల్లి వెంకట్ గౌడ్ గారి రిసెర్చ్ బుక్ సర్దార్ సర్వాయి పాపన్న ఆధారంగా పటాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వంలో సుమన్, కృష్ణ, జైహింద్, ప్రధాన పాత్రల్లో సినిమా వచ్చింది.వీలైతే తప్పక చూడండి.....

26, అక్టోబర్ 2011, బుధవారం

పార్లమెంట్లో తెలంగానం

బి జే పీ అగ్ర నాయకురాలు సుష్మ స్వరాజ్ పార్లమెంట్లో తెలంగాణా కై పోరాడిన  వీడియోలు చూడండి...








ఢిల్లీ AICC భవన్ ముందు టి-జేఎసి ధర్నా


(15/10/11)రైల్‌రోకో సెగ ఢిల్లీకి తాకింది. సకల జనుల సమ్మెలో భాగంగా ఢిల్లీ తెలంగాణ జేఏసీ ఏఐసీసీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. భారీ సంఖ్యలో తెలంగాణవాదులు అక్కడికి చేరుకుని జైతెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ ఏర్పాటుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, తెలంగాణలో ఉద్యమ కారుల అక్రమ అరెస్టులను ఆపాలని డిమాండ్ చేశారు. చిన్నరాష్ట్రాల కమిటీ ఛైర్మన్ తోమన్ ఈ ధర్నాకు హాజరయ్యారు. కాగా.. ఏఐసీసీ భవన్, సోనియా నివాసం వద్ద బద్రతా బలగాలను మోహరించారు.


తెలంగాణా సాయుధ పోరాట గాధ "రాజన్న"

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో ఆనాటి సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న చిత్రం ‘రాజన్న’. నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్నారు. రజాకార్ల, భూస్వాముల ఆగడాలపై సమరశంఖం పూరించిన తెలంగాణ పోరాట యోధుడు, స్వాతంత్య్ర సయరయోధుడు ‘రాజన్న’గా ఆయన ఈ చిత్రంలో కనిపించనున్నారు. స్వీయనిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యస్.యస్.రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్  దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలోని పోరాట సన్నివేశాల్ని యస్.యస్.రాజమౌళి పర్యవేక్షణలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పాట మినహా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. నాగార్జున చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన నాలుగు యదార్థ సంఘటనలను ఆధారంగా తయారుచేసుకున్న కథాంశమిది. 

విజయేంద్ర ప్రసాద్  చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. రాజమౌళి పర్యవేక్షణలోని యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రధానాకర్షణగా వుంటాయి. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో ఎనిమిదేళ్ల పాప ఏని అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో పాప పాత్రకు చాలా ప్రాముఖ్యత వుంది. ఈ చిత్రం కోసం భారీ సెట్స్ వేసి స్వాతంవూతోద్యమ కాలం నాటి వాతావరణాన్ని సృష్టించాం. రాజన్న చిత్రాన్ని చేయడం వ్యక్తిగతంగా నాకెంతో సంతృప్తినిచ్చింది. మా సంస్థలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. దేశభక్తిని రగిలిస్తూ, పోరాట స్ఫూర్తిని చాటే ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్షికమాల్ని జరుపుతున్నాం. ఆర్.ఆర్.ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా డిసెంబర్ మూడో వారంలో ఈ చిత్రాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. 

స్నేహ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బేబి ఏని, శ్వేతమీనన్, నాజర్, అజయ్, సుప్రీత్, ప్రదీప్‌రావత్, ముఖేష్‌కాలే, గాంధీ తదితరులు ముఖ్యపావూతల్ని పోషించారు. ఈ చిత్రానికి సినిమాటోక్షిగఫీ: శ్యామ్ కె నాయుడు, అనిల్‌బండారి, పూర్ణ, ఆర్ట్: రవీందర్, ఫైట్స్: విజయ్, రామ్‌లక్ష్మన్, సంగీతం: యం.యం.కీరవాణి, సమర్పణ: అక్కినేని అన్నపూర్ణ, కథ-వూస్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: విజయేంవూదవూపసాద్.

తెలంగాణా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు....


(26 /10 /2011)తెలంగాణా ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు...

25, అక్టోబర్ 2011, మంగళవారం

తెలంగాణా సినిమా జై భోలో తెలంగాణా !!




(25/10/2011)కే సి ఆర్ నిరాహార దిక్ష  తర్వాత ఉదృతంగా సాగుతున్న ఉద్యమానికి మద్దతుగా, నల్గొండలో జరిగిన ధూంధాం లో పాల్గొని తెలంగాణకు మద్దతు తెలిపాడు తెలంగాణా ముద్దు బిడ్డ డైరెక్టర్ ఎన్. శంకర్, ఆ మరుసటి రోజే ఆయనతో గతంలో పనిచేసి రెండు హిట్స్ అందుకొన్న సీమంద్ర హీరో ఒకడు అయన గురించి చులకనగా మాట్లాడాడు, దానికి స్పందనగా ఆయన తెలంగాణా పై ఒక ఉద్యమ సినిమా తీస్తానని ప్రకటించారు, అన్నట్టుగానే కొత్త నటి నటులతో జై భోలో తెలంగాణా సినిమాను ప్రారంబించారు, అయితే ఈ చిత్రం తీయడానికి నిర్మాతలెవరు ముందుకు రాకపోయే సరికి శంకర్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు, ఈ సినిమా ప్రారంబించిన నాటినుండి సీమంధృలు అనేక రకాల ఇబ్బందులకు గురి చేసారు, సినిమా షూటింగ్ పూర్తైన పోస్ట్ ప్రొడక్షన్ కు స్టూడియో లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు, సినిమా సంక్రాంతి బరిలో లేకుండా చేసారు, ఈ సినిమా కోసం శంకర్ తన ఇంటిని కూడా తాకట్టు పెట్టారంటే ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్ట పడ్డారో, ఆయనకు తెలంగాణా పై ఎంతటి కమిట్మేంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు, సినిమా రిలీజ్ డేట్ 28  జనవరి 2011 న అనుకున్నారు కానీ, సెన్సార్ రూపంలో సినిమాను అడ్డుకున్నారు సీమంధృలు , చుసిన సబ్యుల్లో ఎక్కువమంది సర్టిఫీకేట్ ఇవ్వడానికే మోగ్గుచూపిన, ఒక ఆంద్ర అధికారి మాత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ముంబైకి పంపించింది సినిమాను, అయితే ముంబైకి వెళ్లిందంటే ఆ సినిమా మూడు నలుగు నెలలు దాటితే కాని సర్టిఫీకేట్ ఇవ్వరు, ఆలోగా జనం ఆ సినిమా ను గురించి మరచిపోతారు, మనసు పెట్టి తీసిన సినిమా అలా అయిపోవడంతో శంకర్  కంట కన్నీరు ఆగలేదు, ఆ దృశ్యాల్ని టివి లో చుసిన తెలంగాణా జనం రగిలి పోయారు, తెలంగాణా లో అన్ని జిల్లాల్లో నడుస్తున్న సినిమాలన్నీ నిలిపివేయించారు, సీమంద్ర సెన్సార్ బోర్డు దిష్టిబొమ్మలు తగులబెట్టారు, కొన్ని చోట్ల సినిమా రీళ్ళను తగులబెట్టారు,     ఓ యు జాక్ సెన్సార్ బొర్ ఆఫీసును ముట్టడించింది, కొందరు యువకులు సెల్ టవర్ ఎక్కారు, ఆ తర్వాత లాయర్లు కూడా సెన్సార్ బోర్డు ఆఫీసును ముట్టడించారు, జిల్లాల్లో థియేటర్ల ముందు నిరసనలు కొనసాగాయి, పరిస్థితి చేయి దాటుతుందని తెలుసుకున్న సెన్సార్ వాళ్ళు శంకర్ను పిలిచి A  సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు, రక్త చేరిత్రలాంటి సినిమాలకు సెన్సార్  చేసి సర్టిఫికేట్ లు ఇచ్చే వాళ్ళు మానవత విలువల్ని పెంపొందించే ఇలాంటి సినిమాలకు సర్టిఫికేట్ ఇవ్వకపోవడాన్ని తెలంగాణా వాదులంత ముక్త క౦టం  తో కండించారు,  ఇక విడుదల కాదేమో అనుకున్న సినిమా తెలంగాణా ప్రజల పోరాటం తో 4 ఫిబ్రవరి 2011 న విడుదలైంది,
                               
            సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు జగపతి బాబు బందగి గోపన్న అనే తెలంగాణా సమర యోదుడిగా నటించగా, స్మృతి ఇరానీ తల్లి పాత్రలో నటించి మెప్పించారు,హీరోయిన్ మీరా నందన్ అచ్చమైన తెలుగమ్మాయిల ఉంది, తెలంగాణా ఉద్యమ కారులు మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రో.కొదందారం, శ్రవణ్, వేద వ్యాస్, అల్లం నారాయణ, దేశపతి శ్రీనివాస్, ఇలా చాల మంది నటించారు, ఈ సినిమా కు సంగీతం తెలంగాణా ముద్దు బిడ్డ చక్రి అందించారు, పాటలు గోరేటి వెంకన్న, నందిని సిద్దారెడ్డి, సుద్దాల అశోక్ తేజ అందించారు, కే సి ఆర్ ఒక సన్నివేశంలో కనిపిస్తారు, ఈ చిత్రం కోసం ఒక పాటను కూడా రాసారు, ఇక ఈ సినిమాకు హై లైట్ గద్దర్ అని చెప్పుకోవచ్చు, ఈ సినిమా కోసం అయన ఒక పాట రాసి, పాడి, దానిపై ఆయన అబినయించారు, సినిమా చేరిత్రలోనే ఎప్పుడు రానంత స్పందన ఈ చిత్రం లోని ఆ పాటకు వచ్చింది, థియేటర్ లోని జనమంతా లేచి డాన్సు చేసరంటేనే ఈ పాట ఎంతగా జనం లోకి వెళ్లిందో చెప్పవచ్చు, అందే శ్రీ రాసిన జై భోలో తెలంగాణా పాత కూడా జనానికి నచ్చింది, ఈ సినిమా 50 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది, తెలంగాణా నుండి  60 % కలేక్షణ్ లు పొందే ఆంధ్రులు ఈ సినిమాను చూడలేదు, కేవలం తెలంగాణా జిల్లాల్లో మాత్రమే నడిచి 60 % కలేక్షణ్ సాదించి ఈ సంవత్సర విజయాలలో ఒకటిగా నిలిచింది.

                          అంతే కాదు తెలుగు సినిమా చరిత్రలోనే మొదటి సారిగా ధక్షినాసియా చలన చిత్రోత్సవానికి ఎంపికైంది ఈ సినిమా, గోవా లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన అంతర్జాతీయ ప్రముకులు ఈ సినిమాను చూసి తెలంగాణా లోని వాస్తవ పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు.....

24, అక్టోబర్ 2011, సోమవారం

42 రోజుల సకల జనుల సమ్మె సంపూర్ణం...

(24/10/2011) 42 రోజుల సకలజనుల సమ్మెకు ప్రభుత్వం దిగి వచ్చింది, మొత్తం తొమ్మిది డిమాండ్ లను ఉద్యోగులు ప్రభుత్వం ముందు ఉంచారు, వాటన్నింటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది, అవి : 1 . 610 జిఓ అమలుకు రిటైర్డ్ జడ్జితో కమిటి 2 . ఉద్యోగుల వాదనలను వినడానికి కమిటి, 3 . ఉద్యమ సమయంలో పెట్టిన కేసుల ఎత్తివేత  4  . 177 జి ఓ నిలిపి వెత, 5 . ఎస్మా పరిదినుంది అన్ని శాఖల మినహాయింపు, 6 . హాఫ్ పే సాలరీ, 7 . దీపావళి బోనస్, 8 అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడం, అక్రమ బదిలీలను నిలిపి వేయడం, 9 . స్వామి గౌడ్ పై హత్యా యత్నం పై విచారణ, ఈ డిమాండ్లకు కు ప్రభుత్వం ఒప్పుకుంది, తెలంగాణా పై హామీకి ఉద్యోగ సంగాలు పట్టు బట్టాయి కాని అది కేంద్రం పరిధి లో ఉందని , ఉద్యోగుల మనోభావాల్ని ఎప్పటికప్పుడు డిల్లీకి చేరవేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు, అయితే సమ్మెకు విరామం మాత్రమే ఇస్తున్నామని, భవిష్యత్తులో JAC ఇచ్చే అన్ని కార్యక్రమాల్లో ఉద్యోగులు పాల్గొంటారని స్వామి గౌడ్ చెప్పారు. 42 రోజులుగా తమ వంతు ప్రయత్నం తాము చేసామని ఐన కలిసి రాని రాజకీయ నాయకుల సంగతి ప్రజలే చూసుకోవాలని అన్నారు, ఈ సమ్మె ద్వార తెలంగాణా ద్రోహులెవరో అందరు గుర్తించారని ఇకపై వారి పైనే పోరాటమని కోదండ రామ్ అన్నారు, నవంబర్ 1 నుండి ప్రజా ప్రతినిధుల దిక్షలు ప్రారంభం అవుతాయని ఆయన అన్నారు...

నల్ల సూరీల్లకు సలాం

(24/10/2011)తెలంగాణా లోని నాల్గు జిల్లాల్లో ఉన్న సింగరేణి గని కార్మికులంత తెలంగాణా కోసం ఒక్కటయ్యారు, జాక్ ఇచ్చిన పిలుపు మేరకు సెప్టెంబర్ 13 నుండి సకల జనుల సమ్మెలో భాగామయ్యిండ్రు, సింగరేణి కార్మికుల సమ్మె రాష్ట్రము పైనే కాక దేశవ్యాప్తంగా ప్రభావం చూపింది, తెలంగాణా వచ్చే దాక బొగ్గు పెల్ల పెకిలించేది లేదని తేల్చి చెప్పిన్రు, సింగరేణి సమ్మె ప్రభావం విద్యుత్ రంగం పై పడింది, దీనితో రాష్ట్రము లో మొదట రెండు గంటలతో ప్రరంబమైన విధ్యుత్కోతలు ఆ తర్వాత నగరాల్లో నాల్గు, పట్టణాల్లో ఆరు , గ్రామాల్లో పది గంటలు, వ్యవసాయానికి మూడు నుండి నాల్గు గంటలు విధించే వరకు వెళ్ళింది, పరిశ్రమలపై కూడా సమ్మె ప్రబావం పడింది, ఎన్నడు లేని విధంగా మొదటి సరిగా వర్షాకాలంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించారు, అంతేకాదు, వారానికి రెండు రోజులు పవర్ హాలిడే అని ఒక రోజు వీక్ ఆఫ్ అని, పీక్ అవర్స్ ( 6 to 10 pm ) కరంటు కోతలు విధించారు, ఈ సమ్మె ప్రబావం మనరాస్త్రం తో పటు కర్ణాటక, కేరళ, తమిళ నాడు, ఢిల్లీ, మధ్య ప్రదేశ్, పశ్చిమ బంగా రాష్ట్రాలపై కూడా పడింది,
            బొగ్గు నిల్వలు లేక పోవడంతో NTPC వెయ్యి MW ల ఉత్పత్తిని నిలిపి వేసింది, KTPP , RTPP లను షట్ డౌన్ చేసారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యుత్ కేంద్రాల సామర్ధ్యం తగ్గించారు, మన రాష్ట్రము లోనే కాకుండా మహారాష్ట్రలో వెయ్యి MW ల విద్యుత్ కేంద్రం షట్ డౌన్ చేసారు, ఉత్తర ప్రదేశ్ కు కూడా సింగరేణి నుండే బొగ్గు వేల్తున్దడంతో అక్కడ కూడా ఉత్పతి నిలిచి పోయింది, మొత్తం గా NTPC తన అన్ని కేంద్రాల్లో కలిపి వెయ్యి MW మాత్రమే ఉత్పతి చేసింది.
                      35  రోజుల సింగరేణి సమ్మెతో దేశవ్యాప్తంగా అందకారం అలుముకుంది, కార్మికులను ఒక్క రోజు పని చేస్తే ఐదు రోజుల జీతం ఇస్తామని మబ్య పెట్టింది ప్రభుత్వం కాని ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టారు కార్మికులు, NTPC పైనే పూర్తిగా ఆధార పడిన కర్ణాటకలో సమ్మె మొదలైన మొదటి వారంలోనే ఎనిమిది గంటలు జిల్లాల్లో, రెండు గంటలు బెంగలూరు లో కరెంటు కోతలు విధించారు, ఇక మహారాష్ట్ర లో గ్రామీణ ప్రాంతాల్లో కర్రెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక జనం తిరగబడ్డారు, రోజుకు అప్రకటితంగా పది గంటల విద్యుత్ కోత ఉండేది, దేశ వాణిజ్య రాజధాని ముంబై, రాజధాని ఢిల్లీ లకు కూడా కర్రెంట్ కోతలు తప్పలేదు అన్ని రాష్ట్రాల సి ఎం లు సమస్య త్వరగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు. 
                    సింగరేణి ప్రబావం కేవలం విధ్యుత్రంగం మీదనే కాదు, పారిశ్రామిక రంగం పై కూడా పడింది, బొగ్గు ఆధారిత పరిశ్రమలైన సిమెంట్ రంగం పై తీవ్ర ప్రభావం చూపింది, అంతే కాదు బొగ్గు ఆధారంగా నడిచే మధ్యతరహ, చిన్న తరహా పరిశ్రమలన్నీ మూత పడ్డాయి.                                                                                                                                                          35 రోజుల సమ్మెతో ఇది తెలంగాణా సత్తా అని లోకానికి చాటి చెప్పారు మన సింగరేణి కార్మికులు, ఇంకో పది రోజులు సమ్మె చేస్తే దేశం అందకారంలో కొట్టుమిత్తడుతుందని దాని ప్రబావం తొలగిపోవడానికి చాల సమయం పడుతుందని ప్రజల సౌకర్యార్ధం సమ్మెను విరమించుకున్నారు, చీకటి సూర్యుల్లకు సలాం.....

23, అక్టోబర్ 2011, ఆదివారం

సీమంద్ర కుట్రలను చేదిస్తున్న తెలంగాణా మీడియా!!


తెలంగాణా గుండె గొంతుక టీ న్యూస్:
సీమంద్ర మీడియా ఎకచత్రాదిపత్యాన్ని, తెలంగాణా పై వారి పక్షపాతాన్ని ప్రశ్నిస్తూ మార్చ్ 6 2010 న రాజ్ న్యూస్ తెలంగాణా గుండెచప్పుడుగా మన ముందుకు వచ్చింది. జయ జయ హే తెలంగాణా పాటతో ఛానల్ ప్రారంబించిన మూడు నెలల్లోనే ఆంద్ర చానెల్స్ ను పక్కకు నెట్టి తెలంగాణా పది జిల్లాల్లో no .1 గానిలిచింది, అనునిత్యం సీమంద్రు కుట్రలను పటాపంచలు చేస్తూ, మరుగున పడ్డ తెలంగాణా యోధుల జీవితాలను పరిచయం చేస్తూ, తెలంగాణాకు జరిగిన అన్యాయాలను ఏకరువు పెడుతున్న రాజ్ న్యూస్, 2011 ఉగాది రోజున పూర్తి తెలంగాణా యాజమాన్యంతో టీ న్యూస్ గా అవతరించింది, నిజాలను విప్పిచేప్పుతూ, తెలంగాణా ఉద్యమానికి బాసటగా ఉండటం వలన ఇది మా మీడియా అని తెలంగాణా ప్రజలంతా గర్వంగా చెప్పుకుంటున్నారు, అందుకే టీ న్యూస్ డజెన్ ఆంద్ర ఛానల్ లతో పోటిపడి నిలదొక్కుకుంటుంది....
 తెలంగాణా కర దీపిక:                                    


                  పత్రికా ప్రపంచంలో తనకు పోటీ ఎ లేదని తను రాసిందే వార్త తను విస్మరించింది జనాలకు తెలియదని ఆంధ్రా పత్రికలూ విర్రవీగుతుంటే, మాకు ఒక పత్రిక ఉంటె బాగుండు అనుకుంటున్నా తెలంగాణా ప్రజల కోరికను తీరుస్తూ "మన పత్రిక-మన ఆత్మ గౌరవం" అనే శీర్షికతో 6-6-2011న  వచ్చింది తెలంగాణా కర దీపిక నమస్తే తెలంగాణా, కేవలం తెలంగాణా జిల్లాలకే పరిమితం ఐన రాష్ట్ర వ్యాప్త పత్రికలతో పోటి పడుతూ తెలంగాణాలో no 1 గా నిలిచి సీమంద్ర పత్రికల ఆధిపత్యానికి గండికొట్టింది. రాష్ట్ర వ్యాప్త పత్రికలలో నల్గోవ అతిపెద్ద పత్రికగా అవతరించింది.
                 తెలంగాణా సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ నమేస్తే తెలంగాణా పత్రికకు ఆదివారం అనుబంధం, బతుకమ్మ తెలంగాణాలో మరుగున పడిన కళలను వెలికి తీస్తూ, గ్రామీణ వాతావరణాన్ని చుట్టివస్తుంది, మనసున్న మనుషుల్ని, పోరాట యోధుల్ని పరిచయం చేస్తుంది.తెలంగాణా బతుకుల్ని ఉన్నది ఉన్నట్టు చూపెడుతుంది, అందుకే ఈ పత్రిక మా పత్రిక అని తెలంగాణా ప్రజలు సగర్వంగా చాటి చెప్తున్నారు.
                              తెలంగాణా పై అబద్ధాల విషం గక్కే చానెల్ లను, పేపర్ లను కూడా తెలంగాణా ప్రజలు ఆదరిస్తున్నారు, కాని సీమంద్రలో మాత్రం టీన్యూస్ కానరాదు, నమస్తే తెలంగాణా చదవరు, ఎందుకంటే వాళ్ళకు నిజం అంటే భయం, నిజాన్ని వాళ్ళు ఎదుర్కొనలేరు, అసత్యాల సామ్రాజ్యాలకు కొమ్ముకాస్తూ ఉంటారు, ఐన తెలంగాణా మీడియా ఎప్పుడు no 1.
                  For Tnews please visit: http://www.tnewslive.com/
          For NAMASTE TELANGANA paper visit : http://www.namasthetelangaana.com/

అవసరమైతే మళ్లీ RTC , సింగరేణి సమ్మె: స్వామి గౌడ్


టిజివో , టిఎన్జివో లు ఇంకా సమ్మెలోనే ఉన్నారని, సింగరేణి, ఆర్టిసి , టీచర్ లు మినహా అందరు సమ్మెలోనే ఉన్నారని అవసరం అనుకుంటే వాళ్ళతో కూడా మళ్లీ సమ్మె చేయిస్తామని స్వామి గౌడ్ చెప్పారు, AP కో ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులు తెలంగాణా బ్యాంకు JAC ని నిన్న ఏర్పాటుచేసుకున్నారు, ఉద్యమంలో తాము కూడా చురుగ్గా పాల్గొంటామని చెప్పారు.

22, అక్టోబర్ 2011, శనివారం

తెలంగాణా జాతిపిత ప్రొ.జయ శంకర్




తెలంగాణా కొసం జీవితంతం పరితపించిన కొత్తపల్లి జయ శంకర్ గారు ప్రొ.జయ శంకర్ గా మనందరికి సుపరిచితుడే. నిజాం నిరంకుశ పాలనలొ మగ్గుతున్న హైదరాబాద్ సంస్థానంలొని వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కన్నపెట గ్రామంలొ 1934 ఆగస్ట్ 06 న జన్మించారు. ఆయన తల్లి మహా లక్ష్మి, తండ్రి లక్ష్మి కాంతరావు.
ఆయన బాల్యం తన సొంత ఊరిలోనే గడిచింది. ఆయన చదువుకొనే రోజుల్లో భారత స్వాతంత్ర్య ఉద్యమం ఉవ్వేతున సాగుతుంది, స్వాతంత్ర ఆకాంక్ష కలవారంత వందేమాతరం అని పలుకరించుకునేవారు, కాని హైదరాబాద్ లో మాత్రం నిజాం రాజు వందేమాతరంను నిషేధించారు.ఆయన పాటశాల వయసులోనే వందేమాతరం అని నినదించాడు, ఆ తర్వాత హన్మకొండలో ఉన్నత విద్యను అభ్యసించారు, MA economics ను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి, Ph D economics ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసారు, ఆయన B Ed కూడా ఉస్మానియా నుండి పూర్తి చేసారు.ఆయన విద్యార్థి దశలో ఉండగానే ఉద్యమం వైపు అడుగులు వేసారు. తెలంగాణా సైనిక పాలనలో ఉన్న రోజుల్లో ఉద్యోగాలన్నీ ఆంధ్రా వారికి కట్టిపెడుతున్నారని దానికి వ్యతిరేఖంగా 1952 లో నాన్ ముల్కి లేదా ఇడ్లి సాంబార్ గో బ్యాక్ ఉద్యమాలు నడిచాయి, ఈ ఉద్యమంలో జయశంకర్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు, పోలీసు ల కాల్పుల్లో ఆయన తన సహచరులను కోల్పోయారు, దీనికి చెలించిన ఆయన 10 మంది విద్యార్థులతో తెలంగాణా జనసభను ప్రారంబించారు, ఇది రోజురోజుకు విస్తరిస్తున్దడంతో భారత ప్రభుత్వం దీనిని నిషేధించింది, ఫజాల్ అలీ కమిటి (1 st SRC ) రాష్ట్రానికి వచ్చినపుడు విద్యార్థి విభాగం తరపున ఆయన కమిటిని కలుసుకొని తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగాలని బలంగా వాదించారు, ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించిన జయ శంకర్ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడేందుకు అనేకసార్లు సచివాలయం వెళ్లి మంత్రులతో మాట్లాడారు,అక్కడ వారు ఇచ్చిన అవహేళనతో కూడిన సమాధానాలు ఆయనను భాదించాయి.
మొదటి తెలంగాణా ఉద్యమం(1969):
ఖమ్మం జిల్లలో ఉద్యోగి నిరాహార దీక్షతో మొదటి తెలంగాణా ఉద్యమం ప్రరంబమైనది, ఉస్మానియా విశ్వా విద్యాలయం రగిలి పోయింది, తెలంగాణా ఉద్యోగులు సమ్మె ప్రారంబించారు, ప్రభుత్వ ఉద్యోగిగా ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా అనేక సభలలో ఉపన్యసించారు, అనేక పత్రికలకు అయన తెలంగాణా ఆవశ్యకతను వివరిస్తూ కథనాలు రాసారు, అనేక పుస్తకాలు రాసారు, తెలంగాణా ప్రజలను, విద్యార్థులను చైతన్య పరచడానికి ఆయన కృషి చేసారు, ఉద్యమం ఉవ్వేతున సాగింది, 369 మంది విద్యార్థులు పోలీసు కాల్పుల్లో అమరులయ్యారు, ఆ తర్వాత 1969 లో వచ్చిన భార్గవ కమిటి ముందు ఉద్యోగ సంఘాల తరఫున జయశంకర్ సార్ తన వాదనలు వినిపించారు.
సార్ తన జీవితం మొత్తం ఒక్కటే ఆకాంక్షతో బతికారు, ఆయన వివాహం కూడా చేసుకోలేదు, తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణా విముక్తికి అంకితం చేసారు, ఆయన చాల నిరాడంబర జీవితాన్ని గడిపారు, ఆర్ధిక శాఖ నిపుణుడు కాబట్టి ఆయన తెలంగాణా విషయంలో జరిగిన అన్యాయాల్ని అంకెలతో సహా చెప్పేవారు, వరంగల్ లోని CKM కాలేజీకి ప్రిన్సిపాల్ గా పని చేసిన ఆయన ఆ తర్వాత 1991 లో కాకతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి(VC) గా నియమిమ్పబడ్డారు.
మలిదశ తెలంగాణా ఉద్యమం:
1996 లో ప్రో. జయశంకర్ అధ్యక్షతన వరంగల్లో ఒక సదస్సు జరిగింది, దానికి అనూహ్యంగా వేలాదిమంది ప్రజలు హాజరయ్యారు, ఈ పరిణామంతో జయశంకర్ సార్ లో కొత్త ఆశలు చిగురించాయి, పరాయి పాలనా నుండి ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారని గ్రహించిన ఆయన ప్రజాసంఘాలను, కవులు,కళాకారులూ, మేధావులను ఒక్క తాటిపైకి తెచ్చారు, అనేక సభలు,సమావేశాలు నిర్వహించారు, ప్రజలలో చైతన్యం తేవడం ప్రారంబించారు, 1999 NRI తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం ను ఏర్పాటు చేసారు. 2000 సంవత్సరంలో ఆయన అమెరికా వెళ్లి అక్కడున్న NRI లను సంగటితం చేసారు,వాళ్ళను ఉద్యమం వైపుగా కదిలించగలిగారు, ఇక అందరు ఒక అభిప్రాయానికి వచ్చారు, తెలంగాణా కోసం ఒక రాజకీయ వేదిక కావాలని, అదే సమయంలో TDP కి రాజీనామా చేసిన కెసిఆర్ ప్రో.జయశంకర్ ను కలిసి ఆయన అధ్వర్యంలో తెరాస ను ఏర్పాటు చేసారు, సార్ పార్టీ సిద్ధాంతకర్తగా ఉన్నారు, ఆయన అనేక పర్యాయాలు డిల్లికి వెళ్లి అక్కడి పెద్దల్ని కలిసి తెలంగాణా ఆవశ్యకతను వారికీ వివరించారు, చివరిగా 2010 జనవరి 5 న చిదంబరం ఆధ్వర్యంలో జరిగిన అకిలపక్ష బేటికి కూడా సార్ తెరాస తరపున వెళ్లి వాస్తవాలను వివరించారు, 2009 లో కెసిఆర్ నిరాహార దిక్ష సమయంలో అయన వెంట ఉన్నారు, 11 రోజుల తర్వాత తెలంగాణా అనుకూల ప్రకటన రాగానే జయశంకర్ సార్ చేతుల మీదుగా కెసిఆర్ దిక్షను విరమించారు, సార్ రాసిన "తెలంగాణా రాష్ట్రము- ఒక డిమాండ్" పుస్తకం లో ఎ ఎ ముముఖ్య మంత్రి హయంలో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిదో సవివరంగా వివరించారు.
జీవితాంతం తెలంగాణా కోసం పరితపించిన జయశంకర్ సార్ కాన్సర్ వ్యాధితో బాధపడుతూ వరంగల్ లో జూన్ 21 , 2011 న 11 : 15 గంటలకు తుదిశ్వాస విడిచారు. తెలంగాణా జాతి పితగా ఆయన మన హృదయాల్లో ఎప్పటికి కొలువై ఉంటారు .....
సార్ అంతిమయాత్ర :







21, అక్టోబర్ 2011, శుక్రవారం

T-NRI ల పోరాటం...

(22/10/2011) సకల జనుల సమ్మెకు మద్దతుగ తెలంగాణా అమెరికన్ ఎన్ ఆర్ ఐ లు కూడా కదం తొక్కారు, వాషింగ్టన్ డి సి లో అక్టోబర్ 15 న తెలంగాణా మార్చ్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది NRI లు పాల్గొని తెలంగాణా ఏర్పాటుచెయ్యాలని భారత ప్రభుత్వాన్ని కోరారు, ఆ ప్రాంగణమంత జై తెలంగాణా నినాదాలతో మారు మోగింది....




సకల జనుల సమ్మె @ 40 వ రోజు...

(22/10/2011) సెప్టెంబర్ 12 న కరీంనగర్ లో జరిగిన సభతో తెలంగాణా జేఎసి ఉద్యమ శంకారావాన్ని పూరించింది, 13 వ తేది నుండి ప్రరంబమైన సకల జనుల సమ్మె నేటికి 40 రోజుకు చేరుకుంది, మొదట ఉద్యోగ, ఉపాధ్యాయ, సింగరేణి కార్మిక సంఘాలతో ప్రారంభమైన సమ్మె లో 18 వ తేది నుండి ఆర్టిసి చేరింది, ఆ తర్వాత ఎక్షెజ్ శాఖ, ikp మహిళలు, పాలిటెక్నిక్, మెడికల్, న్యాయశాఖా, సచివాలయ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో భాగం అయ్యారు, తెలంగాణా పరిశ్రమలు, ఆటో సంఘాలు బంద్ పాటించాయి, ఆ తర్వాత అన్ని కుల సంఘాలు ఉద్యమంలో భాగమయ్యాయి, 40 రోజుల ఈ మహత్తర ఘట్టానికి సంబంధించిన ఫోటోలు మీకోసం......