హోం

6, జనవరి 2012, శుక్రవారం

యమపురికి దారి-రాజీవ్ రహదారి



తెలంగాణా లోని అతిపెద్ద రహదారి అది, సింగరేణి బొగ్గును, గోదావరి ఇసుకను తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కొట్లలో ఆర్ధిక వనరులను కురిపిస్తున్న మార్గం, నిత్యం అనేక ప్రమాదాలకు నెలవు ఈ రహదారి, అదే హైదరాబాద్ నుండి కరీంనగర్ జిల్లాను కలుపుతున్న రాజీవ్ రహదారి.
                1990 వరకు ఇదొక సాధారణ రహధారే, పీవి ప్రధాని ఐన తర్వాత దీనికి మోక్షం వచ్చింది, స్వయంగా ప్రధాని రోడ్ ను విస్తరించాలని ఆదేశించడంతో హడావిడిగా ఉన్న రోడ్ నే వెడల్పు చేసి ఒదిలేసారు అధికారులు, ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి కరీంనగర్ జిల్లా రామగుండము వరకు ఉంది, ఉత్తర తెలంగాణా లోనే అతి ప్రధానమైన రహదారి, 250 కిలో మీటర్ ల దూరం కలిగి, మూడు జిల్లాలను హైదరాబాద్ కు అనుసంధానం చేస్తుంది, 6 ప్రధాన పుణ్య క్షేత్రాలను కలుపుతుంది, అంతే కాదు ఇది ప్రమాదాల్లో కూడా నెం.1 , గడిచిన 15 సంవత్సరాలలో 7000 మంది మరణించగా, 12000 మంది గాయలపాలు అయ్యారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు, తరచుగా జరుగుతున్న ప్రమాదాలను అరికట్ట మంటూ స్థానిక ప్రజలు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నారు, కాని ప్రజా ప్రతినిదులుకాని, ప్రభుత్వం కాని వీరి గోడును పట్టించుకోలేదు, అయితే 2009 ఎన్నికలకు ముందు అప్పటి రోడ్ భవనల శాఖ మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డి సొంత జిల్లా సమస్య కావడంతో అప్పటి ముఖ్య మంత్రి రాజశేకర్ రెడ్డి దీనిపై ద్రుష్టిపెట్టాడు, 1500  కోట్ల తో రోడ్ విస్తరణ కు ప్రతిపాదనలు సిద్ధం చేసారు, అయితే ఎన్నికలలో జీవన్ రెడ్డి ఓటమి, రాజశేకర్ రెడ్డి మరణంతో ఈ రహదారి విస్తరణ పనులు మూలకు పడ్డట్టే అని అంత అనుకున్నారు, కాని అనూహ్యంగా ఈ రహదారి పై ప్రభుత్వానికి ప్రేమపుట్టుకొని వచ్చింది, అది ఎందుకంటే..
                          అంచనా వ్యయాన్ని అమాంతం పెంచి 2500 కోట్లు చేసారు, అందులో 1500  కోట్లను ప్రభుత్వం విడదల చేసి సదరు గుత్తేదారు కంపనికి  అప్పగించింది, అంతే కాదు రోడ్ నిర్వహణ భాద్యతను సదరు కంపనికి 25 సంవత్సరాలవరకు రాసి ఇచ్చారు, 25 సంవత్సరాల వరకు రహదారిపై టోల్ వాసులు చేసుకునే సౌకర్యం కూడా సదరు కంపనికి ఇచ్చారు, రోడ్ ను విస్తరించడం మాత్రమే కాకుండా 3 ప్రధాన బ్రిడ్జ్ లు, 32 చిన్న బ్రిడ్జ్ లు, 413 కల్వర్టులు , 3  ఫ్లై ఓవర్లు, 3 టోల్ ప్లజాలు, 3 విశ్రాంతి భావనలు, ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలి, ఐతే టెండర్ పద్ధతిలో కాకుండా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్ట్ అప్పగించారు, ఇంతకి ఆ కంపని ఎవరిదంటే కాంగ్రెస్స్ పార్టీ నేత సుబ్బి రామి రెడ్డి యొక్క గాయత్రి కన్స్ట్రక్షన్, కేవలం 600 కోట్లతో పూర్తి కావాల్సిన ఆ రోడ్ కు 2500 కోట్లు విడుదల చేయించుకొని కనీస ప్రమాణాలు పాటించకుండా, రోడ్ను మృత్యు దారిగా మారుస్తున్నారు సదరు వ్యక్తి.


                                 ఈ రోడ్ ను విస్తరించడం లేదు, దీని కోసం అదనంగా భూమిని సేకరించడం లేదు, ఆర్ అండ్ బి వారి భూమిలో మాత్రమె డబుల్ రోడ్ పక్కన ఇంకో డబుల్ రోడ్ వేస్తున్నారు, రోడ్ ను వెడల్పు చేస్తున్నారు అంతే, అయితే ఈ రోడ్కు అధికారుల, ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ కరువయ్యింది, స్థానిక ప్రజల కధనం ప్రకారం అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సదరు కంట్రాక్టర్ నుండి మాముల్లు తీసుకొని రహదారి పర్యవేక్షణను గాలికి ఒదిలేసరని అంటున్నారు, నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రహదారి పూర్తయితే వేలమంది ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడం ఖాయం అంటున్నారు, ఈ రహదారి దేశంలో ఎక్కడలేని విధంగా నిభందనలకు విరుద్ధంగా ఉందని, ఏదో మొక్కుబడిగా విస్తరిస్తున్నారని నిపుణులు అంటున్నారు, ఈ రోడ్ పై అనేక మలుపులు , యు ఆకారంలో, s ఆకారంలో ఉన్నాయి, మాములుగా నిభంధనల ప్రకారం ఒక మలుపు తర్వాత ఒకటిన్నర నుండి రెండు కిలో మీటర్ల వరకు మరో మలుపు ఉండ కూడదు, ఆ నిభందనను ఇక్కడ ఎవరు పాటించడం లేదు, అంతే కాకుండా అనేక ఎత్తు పల్లాలు ఈ రోడ్ ప్రత్యేకం.





                            ఈ రోడ్ విస్తరణ పూర్తయితే దీని వళ్ళ ఉపయోగం ఎంతో కాని తమ ప్రాణాలను బలి తీసుకుంటుందని జనం భయపడుతున్నారు, కాంట్రాక్టర్లుకు మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్ము పైన  , 25 ఏళ్ళ వరకు వచ్చే టోల్ వసులుపైనే పూర్తి దృష్టి ఉంది, ఇక ప్రభుత్వం మాత్రం కంట్రాక్టర్ కు లాభం చెయ్యాలని చూస్తుందే కాని, ప్రజల ప్రాణాలపై దృష్టి లేదు, ఎందుకంటే కంట్రాక్టర్ సీమంద్రుడు, ప్రజలు తెలంగాణావాళ్ళు కదా.. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి