తెలంగాణవాదుల ప్రజల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని, 700 మంది ఆత్మహత్యలకు కారకుడు అయ్యాడని జనార్థన్‌రెడ్డి అనే వ్యక్తి రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు ఫిబ్రవరి 9న కోర్టులో హాజరు కావాలని బాబుకు నోటిసులు జారీ చేసింది.తెలంగాణ విషయంలో డిసెంబర్ 7 న అకిలపక్షంలో చెప్పిన మాటను 9 వ తేది ప్రకటన తర్వాత మార్చాడని తత్ ఫలితంగా 700 మంది ఆత్మహత్య చేసుకున్నారని టిడిపి అధినేత చంద్రబాబుపై దాఖలైన పిటిషన్ పై రంగారెడ్డి కోర్టు సంచలన ఆదేశాలు జారీచేసింది. బాబుపై 417 కింద కేసు నమోదు చేయాలని, ఫిబ్రవరి 9 న కోర్టులో హాజరుపర్చాలని చైతన్యపురి పోలీసులను ఆదేశించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి