బి జే పీ తెలంగాణా కోసం మరో సారి సమర శంకం పూరించింది, బి జే పి తెలంగాణా పోరుయాత్ర నిన్న మహబూబ్ నగర్ జిల్లా కృష్ణ గ్రామంలో ప్రారంభం అయ్యాయి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మొత్తం తెలంగాణా లోని పది జిల్లాలను, 80 శాసన సభ నియోజక వర్గాలను కలుపుతూ రధయాత్రకు పూనుకున్నారు, ఈ కార్యక్రమం కృష్ణ అనే తెలంగాణా-కర్ణాటక సరిహద్దు గ్రామం లో ప్రారంభమయ్యింది, మక్తల్ గ్రామం వద్ద బి జే పీ జాతియధ్యక్షుడు నితిన్ గడ్కారి పాల్గొని ప్రసంగించారు, 2014 లోపు కాంగ్రెస్ తెలంగాణా బిల్ పార్లమెంట్ లో పెడితే బి జే పీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, ఒక వేల 2014 వరకు కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వకపోతే తాము అధికారం లోకి రాగానే తెలంగాణా ఇస్తామని గడ్కారి ప్రకటించారు, కాంగ్రెస్ తెలంగాణా ప్రజలను మోసం చేసిందని కావున కాంగ్రెస్ ను అంతం చేస్తేనే తెలంగాణా సాధ్యమని ఆయన అన్నారు, బి జే పీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ 700 మంది విద్యార్థుల మరణానికి కాంగ్రెస్ , టి డి పీ లే కారణమని ఆ రెండు పార్టీలను మట్టికరిపించాలని అన్నారు, ఈ మధ్య జగన్, చంద్ర బాబులు తెలంగాణా లో పర్యటించి ఉద్యమం నీరుగారిపోయిందని ప్రచారం చేస్తున్నారని, అది ఎంతమాత్రం వాస్తవం కాదని నిరూపించడానికి, మల్లి తెలంగాణ ప్రజల్లో ఉత్సాహం నింపడానికి తాను యాత్ర చేపట్టనని చెప్పారు. మక్తల్ లో ఏర్పాటు చేసిన భహిరంగ సభలకు ప్రజలు భారిగా తరలి వచ్చారు.
ఈ రోజు కిషన్ రెడ్డి చేపట్టిన రధయాత్ర రెండో రోజుకు చేరుకుంది, కిషన్ రెడ్డికి ఈ రోజు కూడా అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు మహబూబ్ నగర్ జనం, ఆయన ఈ సందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు, ఆ తర్వాత పాలమూరు విశ్వా విద్యాలయం విద్యార్థులతో సమావేశం అయ్యారు. ఆయన యాత్రకు ప్రజలు వేలాదిగా తరలి వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు.
యాత్ర ముగింపు రోజు ముఖ్య అతిధిగా ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమన్ సింగ్ హాజారు కానున్నారు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి