హోం

13, జనవరి 2012, శుక్రవారం

కళలకు ఖిల్లా-కరీంనగర్ జిల్లా.!!



అక్షాంశరేఖాంశాలు18.4579.13 కరీంనగర్ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమునకు చెందిన ఒక జిల్లా. జిల్లాకు ఉత్తరాన అదిలాబాదు జిల్లా, ఈశాన్యమున మహారాష్ట్ర మరియు చత్తీసుగఢ్ రాష్ట్రాలు, దక్షిణాన వరంగల్ జిల్లా, ఆగ్నేయాన మెదక్జిల్లా, మరియు పశ్చిమాన నిజామాబాదు జిల్లా సరిహద్దులు.


చరిత్ర:కరీంనగర్, సయ్యద్ కరీముద్దీన్ ఖిలాదారు పేరుమీదుగా నామకరణము చేయబడినది. పురాతన కాలము నుండి వేద అభ్యాసన కేంద్రముగా ప్రసిద్ధికెక్కినది. పూర్వము ఈ ప్రాంతమునకు 'సబ్బినాడు' అని పేరు. కరీంనగర్ మరియు శ్రీశైలములలో దొరికిన,కాకతీయ రాజులు ప్రోల II మరియు ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంత ఘనమైన చరిత్రకు నిదర్శనాలు. నిజాం పరిపాలనలో కరీంనగర్ ఒక రాజధాని మరియు మాజీ భారత ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు, ప్రసిద్ధ కవులు సింగిరెడ్డి నారాయణ రెడ్డి(సినారె), వేములవాడ భీమకవి,దన్దు కమలాకర్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు బద్దం యెల్లారెడ్డి, సినిమా దర్శకుడు బి ఎస్ నారాయణ, మొదటి దాదా సాహెబ్ పల్కే గ్రహీత జై రాజ్,సాయుధ పోరాట యోధుడు అనభేరి ప్రభాకర్, ఉన్నత విద్యకే మకుటం ప్రో.రామ్ రెడ్డి,  పొన్నమ్ ప్రబాకర్' వంటి పలు సుప్రసిద్ధ వ్యక్తులు ఈ జిల్లా వాస్తవ్యులే. గోదావరినది ఈ ప్రాంత సౌందర్యమును మరింత ఇనుమడింపజేస్తున్నది. కరీంనగర్ గోండ్లు, కోయలు, చెంచులు మొదలైనటువంటి అనేక గిరిజన జాతులకు ఆవాసము. ఈ ప్రాంతీయులు సున్నితమైన లోహకళ అయినటువంటి వెండి నగిషీ పనిలో(సిల్వర్ పిలిగ్రి) మంచి నిపుణులు.
తెలుగు జాతికి మొదటి రాజధాని నగరం కోటిలింగాల కరీంనగర్ జిల్లలో ఉంది, తెలుగు జాతి ఉనికి మొదలయ్యింది ఇక్కడినుండే, శాతవాహనుల మొదటి రాజధాని నగరం కోటిలింగాల, తెలంగాణా చరిత్రను మొత్తం మరుగున పడేసిన ఆంద్రులు మొదటి రాజధాని ధరనికోటగా రాసుకున్న, తవ్వకాల్లో దొరికిన సాక్షలను బట్టి కోటిలింగాల నే శాతవాహనుల మొదటి రాజధానిగా గుర్తించారు, అంతే కాకుండా కాకతీయుల పూర్వికులు కూడా కరీం నగర్ వాసులే.వీరి వంశం ప్రారంభం అయ్యింది కరీంనగర్ లోనే.
నేటి కరీంనగర్ ప్రాంతాన్ని పూర్వం సబ్బినాడు అని వ్యవహరించేవారు. 1905కు పూర్వము జిల్లా ఎలగందల్ జిల్లాగా ప్రసిద్ధి చెందినది. 1905లో వరంగల్‌ జిల్లా నుండి పర్కాల తాలూకాను జిల్లాలో కలిపి, లక్సెట్టిపేట మరియు చెన్నూరు తాలూకాలను అదిలాబాద్‌ జిల్లాలో, సిద్దిపేట తాలూకాను మెదక్‌ లో చేర్చి జిల్లాను 7 తాలూకాలతో పునర్‌వ్యవస్థీకరించి కరీంనగర్ జిల్లాగా నామకరణము చేశారు.
కరీంనగర్ కు 30. కి.మీ. దూరంలో గోదావరి నది శాఖైన మూలవాగు తీరంలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి, గోదావరి తీరాన గల ప్రసిద్ధ కాళేశ్వర క్షేత్రము ఈ జిల్లా లో కలదు. కరీంనగర్ కు ఉత్తరంగా 50 కి.మీ. దూరంలో గోదావరీ తీరంలోని ధర్మపురిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉంది. ఇవికాక జగత్యాల కొండగట్టు దగ్గర శ్రీఆంజనేయస్వామి ఆలయం ఎత్తైన పర్వతంపై ఉంది. హజూరాబాద్ సమీపానగల కొత్తగట్టు వద్ద అరుదైన శ్రీ మత్సగిరీంద్ర స్వామి వారి ఆలయం ఉన్నది. రామగుండం వద్ద ఉన్న ఫెర్టిలైజర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా బొగ్గు ముడిపదార్థంగా ఉపయోగించి ఎరువును తయారుచేసిన మొట్టమొదటి ఫ్యాక్టరీ. నల్ల బంగారం ఉత్పత్తిలో సిరులపంట పండిస్తున్న సింగరేణి, ఖజానాలో ఎక్కువ ఆదాయం లభించేది రామగుండం నుంచే. 2001 జనాభాలెక్కల ప్రాధమిక అంచనా ప్రకారం ఈ జిల్లాలో పురుషుల కంటే స్త్రీల జనాభా అధికంగా ఉంది.
గణాంకాలు:
  • రాష్ట్రవైశాల్యంలో జిల్లా వైశాల్యం శాతం - 4.29
  • రాష్ట్రజనాభాలో జిల్లా జనాభా శాతం - 4.59
  • నగరీకరణ - 20.55%
  • వర్షపాతం - 953 మి.మీ.
  • అడవుల శాతం - 21.18
  • రెవిన్యూ డివిజన్లు : 5 (కరీంనగర్, పెద్దపల్లి, మంథని, జగిత్యాల, సిరిసిల్ల)
  • శాసనసభ నియోజకవర్గాలు: 13 (రామగుండము, వెములవాడమంథనిపెద్దపల్లిహుజూరాబాద్, హుస్నాబాద్,మానకొండూర్,  కరీంనగర్, చొప్పదండిజగిత్యాల, ధర్మపురి, కోరుట్ల, సిరిసిల్ల)
  • లోక్‌సభ స్థానాలు : 2 (పెద్దపల్లి, కరీంనగర్)
  • పురపాలక సంఘాలు : 5 
  • కార్పోరేషన్లు: 2 ( కరీంనగర్, రామగుండము)
  • నదులు: మానేరు. గోదావరి నది దాదాపు 283 కిలో మీటర్లు ఈ జిల్లాలో ప్రవహిస్తోంది.
  • పుణ్య క్షేత్రాలు: వేములవాడ, ధర్మపురి, మంథని, కాళేశ్వరం, కొండగట్టు, బిజ్ గిర్ షరీఫ్.
  • దర్శనీయ ప్రదేశాలు: రామగిరి ఖిల్లా, ఎలగందుల ఖిల్లా.

మండలాలు:భౌగోళికంగా కరీంనగర్ జిల్లాను 57 రెవిన్యూ మండలాలుగా విభజించినారు.


సంస్కృతి జీవనవిధానం :కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా మాట్లాడబడు తెలుగు భాషతో పాటు ఉర్దూ కూడా వాడుకలో ఉంది. సాంప్రదాయబద్ధమైన చీర, ధోవతితో పాటు ఆధునిక ధోరణి కూడా ఉంది. తెలంగాణా సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పెద్ద పండగ. ఇంకా వినాయక చవితి, దీపావళి, హోళీ, మహాశివరాత్రి, ఉగాది, సంక్రాంతి, రంజాన్, బక్రీద్ పండుగలను కూడా బాగా జరుపుకుంటారు.,

కరీంనగర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థకు లాభసాటిగానున్నది. ప్రధాన వ్యాపార కేంద్రాలను కలుపు రైలు మార్గమేమీ లేనందువల్ల, రోడ్డు రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందింది. దీనివల్ల అదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం మరియు కరీంనగర్ జిల్లాలకు జోనల్ హెడ్ క్వార్టర్ గా కరీంనగర్ జిల్లా బస్ స్టేషన్ ఉంది.
పుణ్య క్షేత్రాలు: కరీంనగర్ జిల్లా పుణ్య క్షేత్రాలకు ఆలవాలంగా ఉంది, ఇక్కడున్న దేవాలయాలు అనేక విశేషాలను కలిగి బక్తులచేత విశేష  పూజలు అందుకుంటున్నాయి.

వేములవాడ:ఈ పురాతన గ్రామం పశ్చిమ చాళుక్యుల కాలం నుండీ ఉన్నదని ఇక్కడ లభించిన పురాతత్వ ఆధారాలను బట్టి తెలుస్తోంది. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాయమునకు వేములవాడ ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ బిరుదు పేరిట గాని, లేదా అతడు కట్టించినందువలన గాని ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని భావిస్తున్నారు. రాజాదిత్య మొదటి వినయాదిత్య యుద్ధమల్లుని మనుమడు. దేవాలయానికి ఉత్తరాన ధర్మగుండం అనే కోనేరు కలదు. గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వాగు ఈ కోనేటికి నీటి వనరు. వద్దేగేశ్వర స్వామి దేవాలయము కూడా ఇక్కడ ఉన్నది.శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజున ప్రత్యేక పూజలు జరుపుతారు. వంద మంది అర్చకులతో మహాలింగార్చన జరుపుతారు. అర్ధరాత్రి వేళ శివునికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. రాత్రివేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్ధులకు ఉచిత వసతి, భోజన ఏర్పాట్లు చేస్తారు. ఇంకా, ఈ దేవాలయం ఇతర చిన్న ఆలయాలకు దానధర్మాలు చేస్తుంది.
కాళేశ్వరం:కరీంనగర్ జిల్లా లోని అతి ముఖ్యమైన ఆలయాల్లో ఒకటి కాళేశ్వర క్షేత్రం, కరీంనగర్ పట్టణం నుండి 125 కిలో మీటర్ల దూరంలో ఉన్నది కాళేశ్వరం, కాళేశ్వరం లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయ్ గోదవరి ప్రాణహిత నదులు సంగమించే చోట ఈ క్షేత్రం ఉంది, ఇక్కడ శివ లింగంతోపాటు యమ లింగం కూడా ఉంటుంది.
అనేక ప్రత్యేకతలకు నెలవు ఈ ఆలయం, పచ్చని ప్రకృతి మధ్య నెలవైన ఈ క్షత్రంకు వచ్చిన వారు భక్తి తన్మయత్వంలో మునిగిపోతారు, అతి అరుదైన సరస్వతి క్షేత్రాలలో ఒకటి ఇక్కడ ఉంది, సరస్వతి దేవి ఆలయాలు దక్షిణ భారతంలో కేవలం రెండే ఉన్నాయ్, ఆ రెండింటిలో ఇది ఒకటి, అలాగే మరో అరుదైన ఆలయం కూడా ఇక్కడున్నది, అదే సూర్య దేవాలయం, ఆంద్ర ప్రదేశ్ లో కేవలం రెండే సూర్య దేవాలయాలు ఉండగా అందులో ఒకటి ఇక్కడ ఉంది.
కాలేశ్వరానికి సంబంధించిన మరిన్ని వివరాలకు ఇదే బ్లాగ్ లోని http://naatelangaana.blogspot.com/2011/10/1.html  లింక్ చుడండి.
ధర్మపురి:ధర్మపురి తెలంగాణాలోని ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం, తీర్థరాజం. శ్రీ లక్ష్మీనృసింహుడు యోగనారసింహుడిగా, ఉగ్ర నారసింహుడిగా రెండు అవతారాల్లో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఉత్తర తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాకు ఉత్తరంగా 65 కిలోమీటర్ల దూరంలో,జగిత్యాలకు 27 కిలోమీటర్ల దూరంలో గోదావరి నదీతీరాన ఈ క్షేత్రరాజం కలదు. ఇక్కడ గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించుచు తన పవిత్రతను చాటుకొనుచున్నది. ఎంతో ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు, చరిత్ర కలిగిన ఈ క్షేత్రం ప్రాచీన కాలంనుంచి వైదిక విద్యలకు, జ్యోతిశ్శాస్త్రానికి ప్రముఖస్థలముగా పేరొంది నేటికీ సాంప్రదాయ వేదవిద్యలకు నెలవైయున్నది.

స్థల పురాణము

పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గూర్చి తపమాచరించగా, నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడుగా ఈ క్షేత్రమందు అవతరించెను. ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధము. కుజదోషమున్న వారు ఈ క్షేత్రమందు స్వామివారికి కళ్యాణము చేయించిన వారి కుజదోష నివారణము జరిగి శీఘ్రంగా వివాహమవటం ఇక్కడి క్షేత్ర మహాత్మ్యం. సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహారక్రియలు చేసుకోవటం చేస్తుంటారు. కొన్ని సార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక జీవితం సమస్యల పాలవటం కద్దు. ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారం. దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిగంగ స్నానాలాడి, స్వామివారిని అర్చించినచో ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి.
కొండగట్టు:కొండగట్టు, కరీంనగర్ నుండి దాదాపు 35 కి.మీ.లు దూరమున ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయము. ఇది జిల్లాలో జగిత్యాల నుండి 15 కెలోమీటర్ల దూరములో కలదు. కొండలు, లోయలు మరియు సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యము కలిగిన ప్రదేశము. జానపదాల ప్రకారము, ఈ గుడిలో 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానము లేని వారికి సంతానము కలుగుతుందని భక్తుల నమ్మకము.
పూర్వము రామ రావణ యుద్దము జరుగు కాలమున లక్ష్మణుడు మూర్చనొందగా సంజీవనిని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. అతడు సంజీవనిని తెచ్చునపుడు ముత్యంపేట అనెడి ఈ మార్గమున కొంతభాగము విరిగిపడుతుంది. ఆ భాగమునే కొందగట్టుగా కల పర్వతభాగముగా పిలుస్తున్నారు.ఈ గుడిని 300 సంవత్సరాల క్రితం ఒక ఆవులకాపరి నిర్మించినాడు. ప్రస్తుతము ఉన్న దేవాలయము 160 సంవత్సరాల క్రితము క్రిష్ణారావు దేశ్‌ముఖ్‌ చే కట్టించబడినధీ.


* కోరుట్ల సాయినాధుడి దేవాలయం కూడా చాల ప్రసిద్ది చెందింది. 
* బిసిగిర్ షరీఫ్ దర్గా కూడా చాల ప్రసిద్ది చెందింది, ప్రతియేడు జరిగే ఉత్సవాల సమయంలో హిందు, ముస్లింలు ఈ జాతరకు సోదరభావంతో తరలి వస్తారు.


పరిశ్రమలు:పరిశ్రమలు అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది రామగుండము. ఇక్కడ నిజాం కాలంలోనే పరిశ్రమలకు భీజం పడింది.
* నిజాం కాలంలో ప్రతిపాదించిన అజామాబాద్ పవర్ స్టేషన్ మొట్టమొదటి థర్మల్ విద్యుత్ కేంద్రం.ఇది RTS -1.


* RTS -2 ని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎ పీ జెన్ కో ఆధ్వర్యంలో ప్రారంబించింది, దీని సామర్ధ్యం 62 .5 MW.


* NTPC - దేశం లోనే అతి పెద్ద మహా రత్న కంపనిల్లో ఒకటి ఇక్కడ ఉంది, అదే N T P C ఇది 2600 MW ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూ దేశంలోనే రెండవ అతిపెద్ద విద్యుత్ కేంద్రం గా ఉంది, 7 ప్లాంట్ లు నడుస్తున్నాయి, ఇది మన రాష్ట్రానికే కాకా పొరుగు రాష్ట్రాలకు కూడా విద్యుత్ను అందిస్తుంది.
* FCI - బొగ్గు నుండి ఫెర్టిలైజెర్ ను తయారుచేసే మొదటి కంపని ఇది, ఉన్నత లక్షంతో ప్రారంభం అయ్యింది, కాని ఒక దశాబ్దం లోనే మూతపడింది.
* అంతర్గాం స్పిన్నింగ్ మిల్: కాన్దిశికుల కోసం ఏర్పాటుచేసారు కాని ఇది కూడా తొందరగానే మూతపడింది. ఈ మిల్లు యొక్క మరిన్ని వివరాలకు కింది లింక్ చుడండి.
http://naatelangaana.blogspot.com/2011/12/blog-post_18.html 

* కేశోరం సిమెంట్ ఫ్యాక్టరీ : ఇది బిర్లా గ్రూప కు  చెందినది, రామగుండంలోని బసంత్ నగర్ సమీపంలో ఈ సిమెంట్ పరిశ్రమ ప్రారంభించారు. 
                                         ***
ప్రారంభం కానున్నవి: 25 MW సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంట్.
* FCI తిరిగి ఓపెన్ చెయ్యడానికి కేంద్రం అంగీకరించింది.
* nTpc లో 8 వ ప్లాంట్.
* బి పీ ఎల్ : గతంలో పనిచేసిన అజామాబాద్ పవర్ స్టేషన్ కాల పరిమితి తీరడంతో అదే స్థానంలో 500 MW తో బి పీ ఎల్ వారు కొత్త విద్యుత్ కేంద్రం ఏర్పాటు చెయ్యడానికి ప్రణాళికలు వేసారు అయితే ఇది మధ్యలోనే ఆగిపోయింది.
                                     ***
మరికొన్ని పరిశ్రమలు: నిజామాబాదు సరిహద్దు( కరీం నగర్ జిల్లా లోని) గ్రామాల్లో అనేక చెక్కర పరిశ్రమలు ఉన్నాయి.
* కరీంనగర్ ముల్కనూర్ సహకార డయిరి: మహిళలు ఒక సహకార గ్రూప్ గ  ఏర్పడి సాధించిన అపురూప విజయం ముల్కనూర్ సహకార డయిరి, ఇది అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది.


* సిరిసిల్ల సెస్: ఇదొక సహకార సంఘం ఆధ్వర్యంలో నడిచే సహకార విద్యుత్ సంస్థ, ఇది మానేరు తీరాన నిర్మితంయ్యింది, ఇది 173 గ్రామాలకు విద్యుత్ని అందిస్తుంది, 2004 నాటికి ఇది 51403 వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చి రాష్ట్రంలోనే ప్రధమ శ్రేణిలో నిలిచింది, లక్ష 18 వేల 20 భారి , కుటీర పరిశ్రమలకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి, సిరిసిల్ల పట్టణానికి చెందిన 20 వేల మర మగ్గాలకు విద్యుత్ను 3 ఫేజ్ లలో అందిస్తుంది.
* మల్లాపూర్ మండలం లోని ముత్యంపేట్ లోని  నిజాం దక్కన్ షుగర్ ఫాక్టరీ, నిజాం రాజు ప్రారంభించిన కర్మాగారాల్లో ప్రముఖమైనది, అయితే లాభాల్లో ఉన్న ఈ ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు హయాంలో ప్రవేట్ పరం చేసారు, దీనిలో పనిచేసే కార్మికులు రోడ్డున పడ్డారు.
* జిల్లలో మరొక ప్రముఖ కుటీర పరిశ్రమ బీడీ పరిశ్రమ, జిల్లా లోని అనేక మంది మహిళలు కుటీర పరిశ్రమగా బిడీపరిశ్రమను ఎంచుకొని ఉపాధి పొందుతున్నారు.
వివక్ష: అయితే జిల్లలో ఇన్ని పరిశ్రమలున్న, పారిశ్రామికంగా సీమంద్రుల వివక్షకు గురయ్యిందనే చెప్పవచ్చు, రామగుండము ఎ పవర్ సెషన్ మూసివేసిన తర్వాత ఆ ప్రాంతంలో బి పీ ఎల్ అనే మరో కొత్త పరిశ్రమకు అనుమతినిచ్చారు, కానీ పాలకుల అశ్రేద్ద కారణంగా అక్కడ ఇంతవరకు పనులు ముందుకు కదలలేదు.
* లాభ సాటిగా ఉన్న FCI ని ప్రభుత్వం అకారణంగా మూసివేసింది, ఇప్పుడు తెరవదానికి మీనమేషాలు లెక్కిస్తుంది.
* కందిశికుల  ఉపాధి కొరకు ఏర్పాటుచేసిన అంతర్గాం స్పిన్నింగ్ మిల్ కూడా నిర్వహణ లోపంతో ధశాబ్దం తిరగకుండానే మూతపడింది, అక్కడ ఆకలి చావుల సంఖ్య గణనీయంగా ఉంది.
* చెక్కర కర్మాగారాలను ప్రవేట్ పరం చేసారు.
* కరీంనగర్ సమీపంలో  గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ ఏర్పాటుచేస్తామని చెప్పారు, కాని అది జరగలేదు.
* చుట్టూ గోదావరి, పక్కనే బొగ్గు ఉన్న రామగుండంలో ఎ పీ జెన్కో విద్యుత్ కేంద్రం సామర్థ్యం 62 .5 MW, ఇది ప్రారంభం నుండి ఇంతే ఉంది, కాని నీరు , బొగ్గు ఏది లేని రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ను మాత్రం 4 దశల్లో విస్తరించి దాని సామర్థ్యాన్ని మంతం 1000 MW లకు  పెంచారు, ఇది వివక్ష కాదా..?
జిల్లా ఎదుర్కుంటున్న సమస్యలు:
* జిల్లలో ఉన్న ప్రధాన సమస్యల్లో వలసలు ప్రధానమైనది, జిల్లా ఇంత సుసంపన్నంగా ఉన్నా జిల్లా నుండి దుబాయ్, ముంబై కి వలస వెళ్ళిన వాళ్ళు అనేకం, దుబాయ్, ముంబై, బొగ్గుబాయి అన్నట్టుగా ఉంది జిల్లా పరిస్థితి, గల్ఫ్ కు వెళ్ళే వాళ్ళ కుటుంబాలు ఇక్కడ, వాళ్ళేమో ఎడారి దేశాల్లో ఉండి కష్టపడి కుటుంబాలను పోషిస్తున్నారు, పాలకుల వివక్ష వలన ఇన్ని వనరులున్న జిల్లా ప్రజలకు వినియోగించేది మాత్రం అరకొరగానే..
* జిల్లలో ఉన్న మరొక సమస్య ఆకలి చావులు, సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం వారి చావులకు కారణం అయ్యింది.
* రైతుల ఆత్మహత్యలు, జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సదుపాయం ఉన్న అనేకప్రాంతలు నీటి ఎద్ధదితో కొట్టు మిట్టాడుతున్నాయి, నదులు ఉన్న సరైన ప్రాజెక్ట్లు లు నిర్మించాక పోవడం వాళ్ళ ఇప్పటికి రైతులు వర్షాలపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు, ఇక్కడ ప్రధానంగా బోరు బావులపై ఆధారపడి పంటలు పండిస్తారు, కాబట్టి కరెంట్ కూడా ప్రధాన సమస్య గా ఉంది, దీనితో అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
కళలకు కాణాచి మన కరీం నగరం: కరీంనగర్ కు మాత్రమె పరిమితమైన అరుదైన కళ సిల్వర్ పిలిగ్రి, ఇది సున్నితమైన కళ, సన్నని వెండి తీగాలని పెట్టెలకు, కత్తి ఒరలకు అల్లికలు వేస్తారు, ఇది ప్రపంచంలోనే అరుదైన కళ.


సిరిసిల్ల: చేనేతకు ప్రసిద్ది సిరిసిల్ల, ఇప్పటికి నేత వృత్తిని నమ్ముకొని అనేక కుటుంబాలు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి, అయితే పాలకుల అశ్రేద్ద కారణంగా ఇక్కడ తరచు ఆకలి చావులు సంభవిస్తున్నాయి.
అగ్గిపెట్టెలో పట్టే చీర:సిరిసిల్ల చేనేత కార్మికుడు పరంధామయ్య ఈ ఘనతను సాధించాడు, 1990 లో మొదటి సారిగా అగ్గిపెట్టెలో పట్టేచీర ను నేసి ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచారు, ఇది అప్పట్లో ఇక సంచలనం, ఆయన 1994 చిన్న అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసారు, నిత్యం ప్రయోగాలు చేసే ఆయన తాను నేసిన బట్టలను రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఎన్టి ఆర్ కు భాహుకరించాడు, 
నేదురుమల్లి, కోట్ల, ఎన్ టి ఆర్, చంద్రబాబు లాంటి నాయకులంతా ఆయనను అభినందించారు, 2000 అట్లాంటా ఒలంపిక్స్ కు బానర్ ను నేసి ఇచ్చిన అరుదైన ఘనతను సాధించి సిరిసిల్ల ప్రతిభను ప్రపంచానికి చాటారు పరంధామయ్య, 2005 లో తానా సభల్లో ఆయన వస్త్రాల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసారు..
రామగిరి ఖిల్లా
కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలంలోని రామగిరి ఖిల్లాది శతాబ్దాల చరిత్ర. కాకతీయులు, శాతవాహనులు దీన్ని తమ ప్రధాన సైనిక స్థావరంగా చేసుకుని మధ్య, ఉత్తర భారతాన్ని పాలించినట్లు తెలుస్తోంది. ఇక్కడున్న శత్రు దుర్భేద్య కోటలు, బురుజులు, ఫిరంగులు అలనాటి రాచరికానికి ఆనవాళ్ళుగా నిలుస్తున్నాయి. కోటగోడల మీది శిల్పకళ కళాకారుల అద్భుత నైపుణ్యానికి అద్దం పడుతోంది. ఖిల్లాపై అనేక రకాల ఔషధ మొక్కలు కనిపిస్తయి.





సిరులపంట సింగరేణి: జిల్లాలోని గోదావరి లోయలో అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయి, జిల్లలో గోదావరిఖని బొగ్గు ఉత్పత్తికి ప్రసిద్ది, ఇక్కడ అనేక బొగ్గు బావులు, ఒపన్ కాస్ట్లులు ఉన్నాయి, అనేక వేల కుటుంభాలు ప్రత్యక్షం గా , పరోక్షంగా సింగరేణి ద్వారా ఉపాది పొందుతున్నాయి.


* సున్నపురాయి నిల్వలు కూడా జిల్లలో అత్యధికంగా ఉన్నాయి.
* రెడ్ ఫ్లవర్ గ్రనేట్ : ఇది ప్రపంచంలోనే అరుదైన గ్రనేట్ ఇది కేవలం కరీంనగర్ జిల్లాలోనే దొరుకుతుంది, దీనిని చైనా ఒలంపిక్స్ కోసం నిర్మించిన బర్డ్ నెస్ట్ స్టేడియం అలంకరణకు వాడారు.
రవాణా సౌకర్యాలు: జిల్లలో రవాణ సౌకర్యాలు కొంతమేరకు మెరుగ్గానే ఉన్నాయి.
* 1944 లో కరీంనగర్ పట్టణంలో తొలి సారిగా బస్సు తిరిగింది.
* ఒక్క డిపోతో ప్రారంభమైనది, ఇప్పుడు 11 డిపో లు ఉన్నాయి జిల్లలో.
* రాజీవ్ రహదారి హైదరాబాద్ నుండి కరీంనగర్ ను కలుపుతుంది.
* ఉత్తర తెలంగాణా లోనే అతి పెద్ద బస్ స్టాండ్ కరీం నగర్ బస్సు స్టాండ్, ఇది నాలుగు జిల్లాలకు కేంద్రంగా ఉంటూ ప్రభుత్వానికి ఆర్థికంగా లాభాలను చేకూరుస్తుంది.



* రైల్ మార్గాల విషయానికి వస్తే జిల్లలో బల్లార్శ నుండి సికింద్రబాద్ రైల్ మార్గం ప్రధానమైనది, జిల్లలో ఉన్న  ప్రధాన రైల్ జంక్షన్ రామగుండము, ఇది ప్రయాణికుల అవసరాలతో పాటు, బొగ్గు, సిమెంట్ రవాణాకు  ఉపయోగ పడుతుంది, అలాగే ఇక్కడ HP towers  ను కూడా ఏర్పాటు చేసారు.
* ఇక కరీం నగర్ రైల్ మార్గం అనేక దశాబ్దాలపాటు నలిగి ఇప్పుడు విద్యుత్ లేకుండా సింగిల్ మార్గం పూర్తయ్యింది, ఈ మార్గం ఇప్పుడు జగిత్యాల్ వరకు పూర్తయ్యింది, కోరుట్ల, మెట్ పల్లి మీదుగా నిజామాబాదు కు కలపాలని ప్రణాళిక, కాని పనులు మాత్రం మందకొడిగా జరుగుతున్నాయి.
 కొత్తగా చెప్పుకోదగిన రైల్ మార్గాలు  ఏమీలేవు.


* ఎంతో కాలంగా రామగుండము ఎయిర్ పోర్ట్ పెండింగ్లో ఉంది, ఇక్కడ బిర్లా తనకోసం ఒక ప్రవేట్ ఎయిర్ పోర్ట్ ను ఏర్పాటుచేసుకున్నాడు, అయితే దాన్ని అభివృద్ది పరచి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
నీటి పారుదల: కరీంనగర్ రైతులు బోరు బావుల మీదనే ఆధారపడి పంటలు పండిస్తునారు.
మానేరు డాం: కరీంనగర్ పట్టణంలో ఉన్న డాం ఇది, లోయర్ మానేర్ డాం ప్రధానంగా nTpc కి  నీరందిస్తుంది, అలాగే వ్యవసాయానికి కూడా నీరందిస్తుంది, కాకతీయ కలువ ద్వార వరంగల్ నీటి అవసరాలు కూడా తీర్చుతుంది.
                                        (మానేరు డాం)
ఎస్ ఆర్ఎస్ పీ కెనాల్: SRSP కెనాల్ రాకతో కరీంనగర్ రైతుల కష్టాలు చాలావరకు తీరాయి, శ్రీ రామ్ సాగర్ నుండి ఈ కెనాల్ మానేరు డాం వరకు ఉంది , జిల్లాలోని ప్రధాన కాలువ ఇది.
ఎల్లంపల్లి ప్రాజెక్ట్: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్, nTpc వారి సహకారంతో మొదటి దశను పూర్తి చేసుకున్నది ఈ ప్రాజెక్ట్.
నాగులపెట్ సైఫాన్:కోరుట్ల మండలం లోని నాగుల పెట్ గుండా శ్రీ రామ్ సాగర్ ప్రధాన కాలువ వెళ్తుంది, అయితే ఈ ఊరి చివర అకస్మాత్తుగా ఈ కలువ మాయం అవ్తుంది ఆ తర్వాత కొంత దూరంలో మల్లి ప్రత్యక్షం అవుతుంది, అదొక అపురూప సొరంగం అని చెప్పొచ్చు అదే సైఫాన్, దీనిని ఇంజనీర్ రామకృష్ణ రాజు ఆధ్వర్యంలో నిర్మించారు, ఇదొక వింత, ఇదొక అద్భుతం, ప్రపంచంలోనే చాల అరుదైన సైఫాన్. ఈ ఊరిలో ఒక వాగు ఉన్నదీ, ఈ వాగు శ్రీరామ్ సాగర్ కాలువకు అడ్డుగా వెళ్తుంది, అయితే ఈ వాగు ప్రవాహానికి ఎ విధమైన అడ్డు లేకుండా వాగు కింది భాగంలో ఈ సైఫాన్ ను ఏర్పాటు చేసారు, ఈ సైఫాన్ గుండా కాలువ నీరు వెళ్తుంది, పైన వాగు ప్రవహిస్తుంది,  కాలువ నీరు వదలడానికి తూర్పు, పడమర భాగాల్లో ఐదేసి ఖానాలు 144 అడుగుల వైశాల్యంతో ఉంటాయి.వీటికి ఇనుప షేటర్ లను ఏర్పాటు చేసారు, ఈ సైఫాన్ పొడవు 300 ల అడుగులు, కాలువ ప్రవాహ వేగం మాములుగా 4 .22 అడుగులు కాగ సైఫాన్ పద్ధతి వలన ఈ వేగం 11 . 38 అడుగులకు పెరిగింది, దీని ద్వార సైఫాన్ ఆవల నీరు మాములు వేగం తో ప్రయాణిస్తుంది, ఈ సైఫాన్ ద్వార సెకనుకు 8200 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది.
వ్యవసాయం: జిల్లా మొక్కజొన్న పంటకు ప్రసిద్ది.
* 2006 - 07 , 2007 -08 సంవత్సరాలలో వారి ఉత్పత్తిలో జిల్లా నెం.1 గా నిలిచింది, ఎందుకంటే ఆయా సంవత్సరాలలో వర్షం పుష్కలంగా కురిసింది, అంటే ఇక్కడ రైతులు ప్రధానంగా వర్షాల మీద ఆధార పడిపంటలు పండిస్తున్నారు.
* ప్రస్తుతం వరి ఉత్పత్తిలో జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది,
* జొన్న, పసుపు, పత్తి, సన్ ఫ్లవర్, చెరకు లాంటి పంటలు జిల్లలో పండుతాయి.
* కోళ్ళ ఫారం లకు జిల్లా ప్రసిద్ది.
విద్య:స్వాతంత్ర్యం నాటికి జిల్లలో నాలుగు శాతం విద్యావంతులు ఉండేవారు, ఇప్పుడు 77 శాతం మంది విద్యావంతులు ఉన్నారు, జిల్లలో శాతవాహన విశ్వవిద్యాలయం ఏర్పడేవరకూ ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేదు, 
కరీం నగర్ లో ప్రధాన విద్య కేంద్రం ఎస్ ఆర్ ఆర్, ఇది 1956 లో వేముల వాడ దేవాలయ సహకారంతో ఇది ప్రారంభించారు, ఇది స్వర్ణోత్సవాలు జరుపుకుంది, అనేక మంది మేధావులు , రాజకీయ నాయకులు ఈ కాలేజి విద్యార్థులే, 1970 లలో ప్రవేట్ విద్య సంస్థలు ఏర్పడటం ప్రారంభం అయ్యింది, 
1996 నుండి జిల్లలో 370 పభుత్వ పాటశాలలు నడుస్తున్నాయి, 24  ప్రభుత్వ జూనియర్  కాలేజిలు ఉన్నాయి. 
* ప్రతిమ అనే ఒక ప్రవేట్ మెడికల్ కాలేజి ఉంది, 
* జిల్లలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజి కూడాలేదు.
జిల్లాలోని ప్రముఖులు:
ఆదికవి పంపకవి: తెలుగులో కావ్యాలు రచించిన మొదటి కవి పంపకవి.. ఈయన కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందినా వారుగా చెప్తారు, నన్నయకంటే ఈయన చాల పుర్వికుడు ఐన ఈయనను ఆదికవిగా గుర్తించలేదు సీమంద్రులు, ఈయన కన్నడలో కూడా అనేక కావ్యాలు రాసారు అందుకే కన్నడిగులు ఈయనను ఆదికవిగా గౌరవిస్తున్నారు.. కన్నడిగులకు ఉన్న సంస్కారం ఆంద్రులకు లేదు. 
పీవీ:మాజీ ప్రధాని, ఏకైక తెలుగు ప్రధాని.ఆయనకు సంభందించిన పూర్తి వివరాలకు కింది లింక్ చుడండి.
http://naatelangaana.blogspot.com/2011/12/blog-post_23.html
బద్దం ఏళ్ళ రెడ్డి:సాయుధ పోరాట యోధుడు, ఈయన పేరును జిల్లాకు పెట్టాలని ప్రతిపాదించింది ప్రభుత్వం కాని కమూనిస్ట్ పార్టీ అందుకు ఒప్పుకోలేదు: ఈయనకు సంబంధించిన మరిన్ని వివరాలకు కింది లింక్ చుడండి.
 http://naatelangaana.blogspot.com/2011/11/blog-post_19.html 
* దూరవిధ్యకు పిత్మహుడు ప్రో.రాంరెడ్డి: ఈయన చందుర్తి మండలం బండపల్లి లో జన్మించారు, ఈయన ఉస్మానియా, IGNOU లకు వైస్  చాన్సలర్ గా పని చేసారు, అలాగే యూనివర్సిటి గ్రాంట్స్ కమీషన్ చైర్మెన్ గా పనిచేసారు, మారుమూల గ్రామాల ప్రజలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలని తలంచారు, అందుకే ఆయన దేశంలోనే మొదటి దూర విద్య విశ్వవిద్యాలయం డా.బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు, దేశంలో దూరవిద్య పితామహుడు ఆయన, ఆయన పదిహెన్ సంవత్సరాల క్రితం మరణించారు, ఆయన గౌరవంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్య కేంద్రానికి ఆయన పేరు పెట్టారు, ప్రో.రాంరెడ్డి దూరవిద్య కేంద్రం...
* సిని హీరో , మొదటి దాదా ఫాల్కే అవార్డు గ్రహీత జైరాజ్: ఈయన కరీంనగర్ పట్టణంలో జన్మించారు, ఉత్తరాదికి వెళ్లి హిందీ సిని పరిశ్రమ లో మొదటి తరం హీరోగా గొప్ప కీర్తినందుకున్నారు, ఆయన మొత్తం 300 ల సినిమాలలో  నటించారు, 11 మూఖి, 156 టాకీ లలో ఆయన హీరోగా నటించారు, షాహిద్ ఎ ఆజం సినిమా లో ఆయన వేసిన చంద్రశేకర్ ఆజాద్ పాత్రకు ఆయనకు మంచి పేరు వచ్చింది, ఆయన అనేక సినిమాలకు దర్శకత్వం వహించారు, ఆయన రాజ్ కపూర్, శేమ్మి కపూర్, లతో మల్టీ స్టారర్ సినిమాల్లో నటించారు, 1990 లో టీవీ సిరియల్ లో నటించారు, ఆయన సిని పరిశ్రమకు అందించిన సేవలకు గాను ఆయనకు 1980 లో సిని పరిశ్రమలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అందుకున్నారు. ఆయన పదేళ్ళ కిందట మరణించారు.
* సిని దర్శకుడు బి ఎస్ నారాయణ: ఈయన జిల్లాలోని కొత్త పల్లి లో జన్మించారు, 1977 లో ఈయనతీసిన ఊరుమ్మడి బతుకులు సినిమాకు బంగారు నంది వచ్చింది, 1979 లో ఈయన తీసిన నిమర్జనం సినిమాకు తెలుగులో మొదటి జాతీయ అవార్డు లభించింది, ఆ సినిమాలో నటనకు శారదకు జాతీయ ఉత్తమ నటి అవార్డు "ఊర్వశి" లభించింది, ఆయన తెలుగు, తమిళ్, కన్నడ , మలయాళం లో అనేక సినిమాలను నిర్మించారు కూడా, ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు, కాని ఆయన భార్య మరణం, తర్వాత ఆయన సంతానం కూడా మరణించడంతో ఆయన కుంగిపోయారు, ఆయనకు షుగర్ వచ్చింది, ఆయన చూపు కోల్పోయారు, ఐన ఆయన తన పట్టుదల వీడలేదు, మార్గదర్శి అనే సినిమా తీసారు, ఇది నంది అవార్డు గెలుచుకుంది, అలాగే ఆయన అంధ డైరెక్టర్ గా లిమ్కా బుక్ లో స్థానం పొందారు, ఆయన 1994 లో తన సొంత ఊరిలో మరణించారు.
ఇంకొంతమంది ప్రముఖులు: 
* ఒగ్గుకతకు మారు పేరు మిద్దె రాములు,
* ఆర్ధిక రంగానికి అండ హనుమంత రావు,
* సాయుధ పోరాటయోధుడు అనేభేరి ప్రభాకర్,
* కవి జ్ఞాన పీట్ అవార్డు గ్రహీత సినారే,
* చిత్రకళకు చిరునామా పి. టి .రెడ్డి,
* కెమరా కవి రాజన్ బాబు,
*  నవ చిత్ర వైతాళికుడు తోట వైకుంతం,
* తొలితరం కథకుడు సీతారాం, 
* సామాజిక తత్వవేత్త బి ఎస్ రాములు,
* పరాక్రమానికి, శౌర్యానికి తావు కెప్టన్ విజయ రఘునందన్.


తెలంగాణా ఉద్యమం లో జిల్లా పాత్ర: తెలంగాణా సాయుధ పోరాట కాలం నుండి ఉద్యమం లో జిల్లా చురుకైన పాత్ర పోషిస్తుంది, సాయుధ పోరాటాయోదుల్లోని ప్రముఖులు బద్దం యెల్లారెడ్డి కరీంనగర్ జిల్లా వాసి, ఆయన అనేక వందల గ్రామాల్లో ప్రజా ఉద్యమ చైతన్యాన్ని నింపారు.
* కమూనిస్ట్ పార్టీకి మాత్రు రూపం ఐన ఆంద్ర మహా సభ నాల్గోవ సమావేశం 1935 లో జిల్లాలోని సిరిసిల్ల లో జరిగింది, దీనికి బద్దం యెల్లారెడ్డి, అనభేరి ప్రభాకర్ లు నాయకత్వం వహించారు, దీనిలో రావి నారాయణ రెడ్డి, ముగ్ధుం మొహినోద్దిన్ లు పాల్గొన్నారు.
* 1947 సెప్టెంబర్ లో గాలి పల్లిలో గ్రామస్తులంత కలిసి నిజాం పోలీసు లను గ్రామం నుండి తరిమి కొట్టారు, అయితే ఆ పోలీసు లు మరింత మందిని కలుపుకొని కొన్ని గంటల్లోనే గాలి పల్లి పై విరుచుకుపడ్డారు, ఈ కాల్పుల్లో 18 మంది అక్కడికక్కడే మరణించారు, గాలిపల్లి లో రక్తపుటేరులు పారాయి.
* 1969 ఉద్యమ సమయంలో కరీంనగర్ లోని  ఇందిరా చౌక్ వద్ద జరిగిన రిలే ధీక్ష లు ప్రపంచాన్నే ఆకర్షించాయి, ఇక్కడ మూడు నెలలపాటు BBC ప్రతినిధి ఉంది ఇక్కడి వార్తలను కవర్ చేసారు.
* ప్రస్తుత ఉద్యమానికి వెన్నుముక కే సి ఆర్ ను  మొదట అత్యధిక మెజారిటి తో ఎన్నుకునది కరీంనగర్ ప్రజలే.
* ప్రస్తుతం కూడా జిల్లా నుండి తెలంగాణా రాష్ట్ర సమితికి  6 గురు ఎం ఎల్ ఎ లు శాసన సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
                ( కరీం నగర్ జిల్లా మేట్ పల్లిలో సకల జనుల సమ్మె)
రాజీవ్ రహదారి: హైదరాబాద్ నుండి కరీంనగర్ ను కలిపే ప్రధాన రహదారి, దీన్ని విస్తరిస్తుంది ప్రభుత్వం అయితే నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇచ్చి ఇక్కడ చేస్తున్న పనుల గురించి కింది లింక్లో చుడండి;
http://naatelangaana.blogspot.com/2012/01/blog-post_06.html 



2005 నాటికి కరీంనగర్ నగరం ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయ్యింది ఈ సందర్భంగా అప్పటి రాష్ట్ర మంత్రి ఎం ఎస్ ఆర్ ఇక్కడ టీవీ నందుల ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా " శత వసంతాల కరీంనగరం " అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు దీనిలో కరిమ్ నగర్ కు సంభందించిన అన్ని విషయాలు ఉన్నాయి.తప్పక చదవండి...  

5 కామెంట్‌లు:

  1. ANNA, METPALLY LO SUGAR FACTORY, DESHAMLONE PRASIDDHI CHENDINA KHADI PARISHRAMA, ASIA KHANDAMLONE SECOND PLACELO UNNA "KORUTLA MONDAL LONI "NAGULAPET SAIFAAN" NI MARCHIPOYAVA ANNA? JARA GADIGUDA EE BLOGLO PETTANNA.

    JAI TELANGANA! JAI METPALLY!

    రిప్లయితొలగించండి
  2. ok, mottam okkasaarigaa raayadaniki veelu kaledhu , idhi raayadanike naalugaidhu rojulu pattindhi andhuke, tharuvatha update cheddamani post chesi sankranthiki pandakki intiki vellaniu, andhuke konni vishayalu asalu prasthavanaku raaledhu, pramukhula gurinchi poorathiga raayalanukunnanu kaani time leka raaya leka poyanu veelu chusukoni anninti gurinchi raasthanu... mee sahakaaraniki kruthagnathalu, ika mundhu kuda mee sahakaram ilage undalani korukuntunnanu...

    రిప్లయితొలగించండి
  3. 1.sircilla also one revenue division in karimnagar dist.2.west side nizamabad dist is there ,not east side

    రిప్లయితొలగించండి
  4. ok meeru cheppinatte sari chesanu..raju gaaru.. thanx for ur cooperation..

    రిప్లయితొలగించండి
  5. You forgot to write about ramadugu shilpa kala kandalu,its located in gangadhara mandal nealy 30kms from karimnagar

    రిప్లయితొలగించండి