హోం

3, జనవరి 2012, మంగళవారం

పాఠ్యాంశాలలో పాలకుల వివక్ష..



సాధారణంగా ఒక ప్రాంత చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, ఆచార వ్యవహారాలు, పండుగల గురించి ఆ ప్రాంతంలోని వారికి బాల్యం నుంచే పరిచయం ఏర్పడుతుంది. అందుకు ప్రధాన ఆధారాలు పాఠ్యపుస్తకాలు. బోధనాభ్యసన ప్రక్రియలో అతి ముఖ్యమైనవి పాఠ్యపుస్తకాలు. విద్యార్థులకు తమ ప్రాంత చారివూతక, సాంస్కృతిక, సాహిత్య, ఆచార వ్యవహారాల నేపథ్యాలన్నీ పాఠ్యపుస్తకాల అభ్యసనం ద్వారానే తెలుస్తాయి.కానీ మన రాష్ట్రంలో తెలంగాణ విషయంలో ఘోరం జరుగుతోంది? ఆంధ్రవూపదేశ్ అవతరించిన నాటి నుంచీ తెలంగాణ ప్రాంతంలో సాంస్కృతిక విధ్వంసం జరుగుతున్నది. ప్రాధమిక , మాధ్యమిక, ఉన్నత విద్యలన్నింటిలోనూ పాఠ్యపుస్తకాలలోని పాఠ్యాంశాలను సీమాంధ్ర కు చెందిన రచయితలచేతనే తయారు చేయిస్తున్న ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి చెందిన పాఠ్యాంశాలను నామ మాత్రంగా  చేరుస్తున్నది.

తెలంగాణ చరిత్ర పాఠ్య పుస్తకాలకు ఎక్కలేదు. తెలంగాణ సంస్కృతి, పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలు తెలిపే పాఠ్యాంశాలేవి పాఠ్యపుస్తకాలలో లేవు. ఇక్కడి మహానీయుల జీవిత చరిత్రలు, స్వీయ చరిత్రలు అసలే లేవు. ఇక్కడి సాహిత్యానికి, రచయితలకు, కవులకు ప్రాచుర్యం కల్పించలేదు. తద్వారా ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణ సమాజం సాంస్కృతిక విధ్వంసానికి గురవుతున్నది. తమ ప్రాంత నేపథ్యాలు తామే తెలుసుకోలేని కుట్రకు తెలంగాణ విద్యార్థులు బలయైపోతున్నారు.
విద్యార్థుల జ్ఞానాత్మక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాలు పాఠ్యపుస్తకాలలో పాఠ్యాంశాలుండాలని జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఆర్‌టీ) సూచించింది.

జాతీయ విద్యా ప్రణాళికా చట్టం-2005, విద్యాహక్కు చట్టం-2009 కూడా నాణ్యమైన విద్య గురించి ప్రస్తావిస్తూ పాఠ్యాంశాలు ఏవిధంగా ఉండాలో స్పష్టం చేశాయి. అనేక పరిశోధన సంస్థలు, కమిషన్లు దశాబ్దాల కిందటే ఈ విషయాన్ని నొక్కి చెప్పాయి. అయితే సీమాంవూధుల పాలనలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాలలో వివక్షకు గురయింది.

తెలంగాణ చరిత్ర వక్రీకరణకు, నిరాదరణకు లోనయింది. శాతవాహనుల తొలి రాజధాని ‘కోటిలింగాల’ చరిత్ర పాఠ్యపుస్తకాలకెక్కనే లేదు.ఇక్కడి సాహిత్యానికి ప్రాచుర్యం కల్పించలేదు. ప్రాచీన సాహిత్యంలో బమ్మెర పోతన తప్ప ే ములవాడ భీమకవి, పంపన, పాల్కకురికి సోమన, మల్లినాథ సూరి, పిల్లలమర్రి పినవీరభవూదుడు, నరసింహ శతక కర్త శేషప్ప మొదలైన కవుల గురించి వారి కావ్యాల గురించి తరతరాలుగా తెలంగాణ విద్యార్థులు తెలుసుకోలేక పోతున్నారు. ఆధునిక సాహిత్యమూ ఇందుకు మినహాయింపేమీ కాదు.

తెలంగాణలో అతిపెద్ద పండుగలైన సమ్మక్క, సారలమ్మ జాతర, బతుకమ్మ, మహాంకాళి బోనాలు మొదలైన వాటి ప్రాశస్థ్యాల గురించి చెప్పలేదు. బాసర, వేములవాడ, ధర్మపురి, కొండగట్టు, భద్రాచలం, యాదగిరిగుట్ట, రామప్ప, గూడెం గుట్ట, నాంపల్లి వంటి అనేక పుణ్యక్షేవూతాలకు తెలంగాణ నిలయం. యాత్రారచన ప్రక్రియల్లో ఈ ప్రాంతాలలో వేటినీ చేర్చలేదు. కొమురం భీం, సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ,దొడ్డి కొమురయ్య వంటి యోధుల జీవిత చరివూతలు వెలుగులోకి రాకుండా చేశారు.
మాధ్యమిక స్థాయిలో తెలుగు బాష అత్యంత కీలకమైనది. తమ ప్రాంత సంస్కృతి పట్ల సామాజిక, సౌందర్యాత్మక స్పృహ విద్యార్థులకు భాష ద్వారానే ఏర్పడుతుంది. 6 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు తెలుగు వాచకాలను, ఉపవాచకాలను పరిశీలించినపుడు పాఠ్యాంశాల ఎంపికలో తెలంగాణ ప్రాంతానికి ఎంత అన్యాయం జరిగిందో తెలుస్తుంది. తద్వారా సీమాంధ్ర పాలకుల చేత తెలంగాణ ప్రాంతం ఎంతటి సాంస్కృతిక విధ్వంసానికి లోనయిందో తెలుసుకోవచ్చు.ఆరవ తరగతి తెలుగు వాచక, ఉపవాచకాలు రెండు కలిపి 17 పాఠ్యాంశాలు ఉండగా వీటిలో రెండు పాఠ్యాంశాలు మాత్రమే తెలంగాణ ప్రాంత కవులు (బమ్మెరపోతన, దాశరథి) రచించినవి. ఎనిమిది పాఠ్యాంశాలు సీమాంధ్ర కవులు రచించినవి కాగా మిగతావి తటస్థం ‘సుభాషితాలు పాఠంలో ‘బద్దెన’ రచించిన సమతీ శతక పద్యం ఒకే ఒకటున్నది. ఈ పాఠ్యంలోని మిగతా ఏడు పద్యాలు సీమాంధ్ర కవులు రచించినవే.

ఏడవ తరగతి వాచక, ఉపవాచకాలలో కలిపి 20 పాఠ్యాంశాలుండగా రెండు పాఠాలు మాత్రమే తెలంగాణకు (బమ్మెర పోతన, దేవులపల్లి రామానుజరావు) సంబంధమున్నవి. 14 పాఠాలు సీమాంవూధకు సంబంధించినవి. మిగతావి తటస్థం. ఎనిమిదవ తరగతి వాచక, ఉపవాచకాలలో 24 పాఠ్యాంశాలుండగా వీటిలో 5 పాఠాలు తెలంగాణ కు చెందినవి. 14 పాఠాలు సీమాంధ్ర కు చెందినవి. మిగతా 14 పాఠాలు తటస్థంగా ఉన్నవి. తొమ్మిదవ తెలుగు వాచకంలోనైతే మరీ దారుణం. తెలుగు వాచకంలో 20 పాఠ్యాంశాలు ఉండగా వాటిలో ఏకంగా 19 పాఠ్యాంశాలు సీమాంధ్ర ప్రాంత కవులు, రచయితలు రాసినవే. కేవలం ఒకే ఒక్క పాఠ్యాంశం (కొప్పర్రు) తెలంగాణ కు సంబంధించినది. ఇక ఉపవాచకంలో ఆరు పాఠాలుండగా వాటిలో తెలంగాణకు చెందిన పాఠం ఒక్కటైనా లేదు.

5 పాఠాలు సీమాంద్ర
కు చెందినవి.
పదవ తరగతి తెలుగు వాచకంలో మొత్తం 18 పాఠ్యాంశాలుండగా వాటిలో 16 పాఠ్యాంశాలు సీమాంధ్ర కవులు, రచయితలవే. కేవలం రెండు పాఠ్యాంశాలు, సుభాషితాలు’ లోని శరభాంక కవి రచించిన ఒక పద్యం మాత్రమే తెలంగాణకు చెందినవి. పదవ తరగతి ఉపవాచకం గా ఉన్న ‘ బారిష్టర్ పార్వతీశం’ కూడ సీమాంధ్ర రచయితకు చెందినదే.

‘భాషా వాచకాలు స్థానిక సంప్రదాయాలు, సంస్కృతిని, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించాలి’ అని ఎస్‌సీఎఫ్-2005, ఆర్‌టీఇ- 2009 చట్టాలు నొక్కి చెప్పాయి. కానీ పై ఈ స్థానిక అనేది తెలుగు వాచకాల్లో పాటించలేదని తెలుస్తున్నది. స్థానిక సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఈ ఉల్లంఘనే.

తెలంగాణ ప్రాంత వాసుల సాంస్కృతిక హక్కును కాలరాచినట్లే. 1948డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ‘యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లోను, తర్వాత 1986లో ఆమోదించిన ‘డిక్లరేషన్ ఆఫ్ రైట్ టు డెవలప్‌మెంట్’ లోను సాంస్కృతిక హక్కు కూడ జీవి నుంచి విడదీయరాని హక్కుగా అభివర్ణించారు.

తమ ప్రాంత చరిత్ర, సాహిత్యం, సాహితీవేత్తలు, మహానీయుల జీవిత చరివూతలు, పండుగలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు గురించి చదువుకోలేని దీనావస్థలో తెలంగాణ విద్యార్థులున్నారంటే అందుకు కారణం వలసపాలకుల దుర్పీతే. ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం కొనసాగినంత కాలం ఈ సాంస్కృతిక విధ్వంసం ఆగదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే దానికి అడ్డుకట్ట పడుతుంది. 
- స్తంభంకాడి గంగాధర్
బీసీ టీచర్స్ యూనియన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి