హోం

5, జనవరి 2012, గురువారం

పరేషాన్లో పచ్చపార్టీ..!



చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా అక్రమంగా నిర్భందించిన తెలంగాణ వాదులను అందరిని తనముందు హాజరుపరచాలని వరంగల్ పోలీసులకు చీఫ్ జుడీషియల్ మెజిస్టేట్ నిమ్మనారాయణగారు అల్టిమేటం జారీ చేశారు. మెజిస్టేట్ ఆదేశాలకు స్పందించిన జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ సెక్షన్ 151 కింద అరెస్టు చేసిన వారందరిని వెంటనే విడుదల చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ పోలీస్‌స్టేషన్‌ల పరిశీలనకు రెండు న్యాయవాద బృందాలు బయలుదేరారు. రేపు ఎలాంటి సంఘటనలకు పాల్పడవద్దని ఎస్పీ తెలంగాణ వాదులకు విజ్ఞప్తి చేశాడు.
                        చంద్రబాబు రేపు వరంగల్లు రావద్దని పరిస్థితులు బాగాలేవని వరంగల్లు ఎస్పీ రాజేష్‌కుమార్ బాబుకు నోటీస్ జారి చేశారు. గత నాలుగు రోజులగా వరంగల్ అట్టుడికిపోతున్న దశలో చంద్రబాబుకు రక్షణ కల్పించలేమని ఎస్పీ నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. చంద్రబాబు రైతు పోరుయాత్రను రద్దు చేసుకోమని వరంగల్ ఎస్పీ రజేష్‌కుమార్ సూచించడంతో తెలుగు తమ్ముల్లు గందరగోళంలో పడిపోయారు. బాబు పోరు యాత్ర చేస్తే జిల్లాలో పరిస్థితులు చేయి దాటిపోతాయని బాబుకు రక్షణ కల్పించడం మా చేతుల్లో ఉండదని ఎస్పీ నోటీసులో తెలిపారు. తాజా పరిస్థితుల్లో టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి ఆగంమగమ్ అవుతున్నాడు. అంత తయారు చేసుకున్నాక ఈ రాత్రి నోటీసులు అందించడమేంది? అని రేవురి, కడియం శ్రీహరితో సమవేశమై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఎస్పీ రజేష్‌కుమార్ ను కాసేపట్లో కలువనున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి