హోం

22, జనవరి 2012, ఆదివారం

ఆదివాసిల ఉత్సవం "నాగోబా"



ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో జరిగే తెలంగాణా లోని రెండో అతిపెద్ద జాతర "నాగోబా", ఆదివాసి గిరిజనులలో గోండు జాతికి చెందినా వారు జరుపుకునే ఉత్సవమే నాగోబా జాతర, ఇక్కడ ఉత్సవాలని ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తుంది, ఈ జాతరకు జిల్లా కలెక్టర్ వచ్చి ప్రారంభిస్తారు, ప్రజా ప్రతినిధులు, నాయకులు కూడా హాజారవుతారు.
      ఈ జాతర వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది, ఇక్కడ ఒక దేవాలయం ఉంది, ఇందులో ఆదిశేషుడు కొలువై ఉంటాడు, ఆయనను కొలిచే వేడుకే ఈ నాగోబా జాతర, సాంప్రదాయం ప్రకారం గోండు జాతిలోని మోస్రం వంశీయులు ఈ వేడుకలను నిర్వహిస్తారు, జాతర సందర్భంగా వీరు మర్రి చెట్లకు  కింది భాగంలో బస చేస్తారు, ఆడవారు బస చేసే ప్రాంతాన్ని గోవాడ్ అంటారు.

           మోస్రం వంశీయులు తెల్ల వస్త్రాలను ధరించి ఉంటారు, వీరు నాగోబా గుడిలో పూజ చేసిన అనంతరం పాదయాత్ర చేస్తారు, వీరు ఇంద్రవెల్లి, ఉట్నూర్, జైనూర్, సిర్పూర్ మీదుగా జిన్నారం మండలం లోని కలమడుగులో ఉన్న గోదావరి నదికి చేరుకుంటారు, నదిలో పూజలు చేసి నది నీటిని తీసుకొని పాదయాత్ర గా తిరిగి నాగోబా గుడికి చేరుకుంటారు, ఆ నీటితో నాగోబా గుడిలో పూజలు చేసి జాతర ప్రారంభం ఐనదని ప్రకటిస్తారు. ఆ తర్వాత మహా జాతర ప్రారంభం అవుతుంది, ఈ జాతర ప్రతి సంవత్సరం ఫాల్ఘుణ మాసంలో జరుగుతుంది, అయితే ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, చేత్తిస్ ఘడ్, జార్ఖండ్ నుండి కూడా భక్తులు భారి సంఖ్య లో  వస్తారు.

1 కామెంట్‌: