హోం

30, జనవరి 2012, సోమవారం

తెలంగాణా కుంభ మేళా..!!


వరంగల్లు జిల్లా కేంద్రము నుండి 110 కిలోమీటర్ల దూరములో తాడ్వాయి మండలములో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది. సమస్తగిరిజనుల సమారాధ్య దేవతలు, కస్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపధ్భాందవులుగా, యావదాంద్ర దేశములోనే గాక అఖిల భారత దేశములోనే వనదేవతులుగా పూజలందుకుంటున్నారు మన సమ్మక్క-సారక్క.
                     12వ శతాభ్దములో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతములోని 'పొలవాసను' పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద రాజుకిచ్చి వివాహము చేసారు. ఈ దంపతులకు సారలమ్మ,నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానము కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటిప్రతాపరుద్రుడు పొలవాస పై దండెత్తేడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాత వాసము గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే కోయరాజు 'పగిడిద్దరాజు' కాకతీయుల సామంతునిగా ఉంటాడు, కరువు కాటక పరిస్థితుల కారణముగా కప్పము కట్టలేకపోతాడు. కప్పం కట్టక పోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం తో ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు. కోయ గిరిజనులలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణముతో పగిడిద్ద రాజుపై ఆగ్రహం చెందిన ప్రతాప రుద్రుడు అతడిని అణచి వేయడానికి తన ప్రధాన మంత్రి యుగంధరుడితో సహా మాఘ శుద్ద పౌర్ణమి రోజున మేడారం పై దండెత్తుతాడు.

                      సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్ద రాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు(సారలమ్మ భర్త) వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటము చేస్తారు. కాని సుశిక్షితులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధములో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందినది.    
                  
                             ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుక గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యములోనే అద్రుశ్యమైనది. సమ్మక్కను వెదుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కాని ఆ ప్రాంతములో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల భరిణె లభించినది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ద పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపు కుంటున్నారు.

                             జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయములో భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యదా స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము(బెల్లము) నైవేద్యముగా సమర్పించుకుంటారు.

తెలంగాణా కుంభమేళా:తెలంగాణా లో జరిగే అతిపెద్ద, విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర, ఈ జాతర రెండు ఏండ్లకు ఒక సారి జరుగుతుంది, సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర ను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమె జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు,ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు, అమ్మవార్ల చిహ్నం గా గద్దెలు ఏర్పాటుచేయబడి ఉంటాయి, ఈ గద్దేలపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కు౦కుమ భరినేలను తీసుకు వస్తారు, పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతర కు తెలంగాణా నుండే కాకుండా మధ్య ప్రదేశ్, చెత్తిస్ ఘడ్, మహారాష్ట్ర, ఒరిస్సా ,రాజస్థాన్, ఝార్కండ్ రాష్ట్రాలనుండి సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.

విశిష్టతలు: ఆసియా లోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరను UNESCO గుర్తించింది.
                  ఈ సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి రోజు(ఫిబ్రవరి 8 నుండి 12 వరకు) ప్రారంభమయ్యే జాతర నాలుగు రోజులపాటు జరుగుతుంది. 2006 నుండి రాష్ట్ర ప్రభుత్వం జాతరను అధికారికంగా నిర్వహిస్తుంది.  
ఈ ఏటి జాతర విశేషాలు:ఫిబ్రవరి 8  2012 ఫాల్గుణ పౌర్ణమి రోజున జాతర ప్రారంభమైనది.
(08 -02 -2012 )
* సాయంత్రం 6 గంటల సమయంలో కోయదోరలు కన్నెపల్లి నుండి సారలమ్మను మేడారం తీసుకొని వచ్చి గద్దెపై ప్రతిష్టించారు, ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తుంది, ప్రభుత్వం తరపున జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు.

* ఈ రోజు సుమారు నలబై లక్షల మంది జనం అమ్మవారిని దర్శించుకున్నారు.
( 09 -02 -2012 )
* టి ఆర్ ఎస్ అధినేత కే సి ఆర్ ఆయన సతీమణి మేడారం చేరుకొని, సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
* కే సి ఆర్ అమ్మవార్లకు రవిక, చీర త ఎత్తు బంగారం ( 48 కిలోలు ) సమర్పించుకున్నారు.
* ఈ సందర్భంగా మీడియాతో కే సి ఆర్ ముచ్చటించారు, " వచ్చే జాతర తెలంగాణాలో జరగాలని ఆయన అమ్మవార్లను కోరుకున్నట్లు చెప్పారు, తెలంగాణా రాగానే సమ్మక్క పేరుతో విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని, 250 కోట్ల రూపాయలతో మేడారంను అభివృద్ది పరుస్తామని, జాతరను జాతీయస్థాయి లో జరిపిస్తామని" చెప్పారు. కే సి ఆర్ ప్రెస్ మీట్ విశేషాలను కింది లింక్ లో చూడండి.
* సి ఎస్ పంకజ్ ద్వివేది ఆయన సతిమణి ఈ ఉదయం అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
* చిలుకలగుట్ట నుండి సమ్మక్క బయలు దేరింది, రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జ ఆయన సతిమణి సమ్మక్కకు స్వాగతం పలికారు,ఎస్ పీ రాజేష్ కుమార్  గాలిలోకి పది రౌండ్ లు కాల్పులు జరిపి ఊరేగింపును ప్రారంభించారు , అడుగడుగునా సమ్మక్క పాదాల వద్ద భక్తులు వరం పడుతున్నారు.
*  చిలకలగుట్ట నుంచి కోయా పూజారులు సంప్రాదాయ ప్రకారం సమ్మక్కను మేడారంకు తీసుకువచ్చారు. అనంతరం గద్దెపై సమ్మక్కను తీసుకువచ్చారు. సమ్మక్క - సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. జంపన్నవాగు జనసంద్రమైంది. భక్తులతో మేడారం కిటకిటలాడుతోంది.
 జనావరణమైన మేడారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందారాజుతోపాటు తల్లి సమ్మక్క కొలువు తీరడంతో జాతర పరిపూర్ణం అయింది. ఇప్పటిదాక భక్తులు, ప్రజలు సమ్మక్క సారలమ్మల స్పూర్తిని, దీవెనలను అందుకోని మళ్లీ రెండు సంవత్సరాల వస్తామాని మొక్కకున్నారు. 
* 11 వ తేది వన దేవతలు తిరిగి అడవిలోకి ప్రవేశించడం తో ఈ ఏటి జాతరసమాప్తం అయ్యింది.        
                

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి