హోం

4, జనవరి 2012, బుధవారం

పోరాటాల పురిటిగడ్డ వరంగల్ జిల్లా..!


వరంగల్:
అక్షాంశరేఖాంశాలు1879.58 వరంగల్ (వరంగల్లు , పూర్వము ఓరుగల్లు,ఏకశిలా నగరము) దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం లో ఒక జిల్లా. ఇది రాష్ట్ర రాజధాని అగు హైదరాబాదునకు ఉత్తర దిశలో 157 కి.మి దూరంలో ఉన్నది. వరంగల్ జిల్లా కు ముఖ్య పట్టణం - వరంగల్. కాకతీయ విశ్వవిద్యాలయము కాకతీయ మెడికల్‌ కాలేజి,నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (పూర్వపు రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్), కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్,కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొదలైన ప్రముఖ విద్యా సంస్థలు వరంగల్లులో ఉన్నాయి.
వరంగల్ జిల్లా:
వరంగల్ జిల్లా 12,846 చ.కి.మీ.లలో వ్యాపించి 32,31,174 (2001 లెక్కలు) జనాభా కలిగి ఉంది. బొగ్గు మరియు గ్రానైటు గనులకు (నలుపు, బ్రౌను రకాలు) జిల్లా ప్రాముఖ్యత చెందింది. వరి, మిరప, పత్తి మరియు పొగాకు పంటలు విరివిగా పండుతాయి.
చరిత్ర:

క్రీ.శ. 12 - 14 శతాబ్దాలలో పరిపాలించిన కాకతీయుల రాజ్యానికి వరంగల్ రాజధాని. కాకతీయులు నిర్మించిన ఎన్నో కట్టడాలు జిల్లాలో ఉన్నాయి. నాలుగు వైపులా శిలా ద్వారాలు కలిగిన పెద్ద కోట (వరంగల్ కోట), స్వయంభూ దేవాలయము, రామప్ప దేవాలయము మొదలైనవి వీటిలో కొన్ని. కాకతీయుల పాలనా దక్షత గురించి ఇటలీ యాత్రికుడు మార్కోపోలో తన రచనలలో రాసాడు. కాకతీయులలో ప్రముఖ పాలకులుగణపతిదేవ చక్రవర్తిరుద్రమ దేవిప్రతాపరుద్రుడు.

14 వ శతాబ్దంలో ఢిల్లీ తుగ్లక్ సుల్తానుల చేతిలో ఓడిపోవడంతో కాకతీయుల పరిపాలన అంతమయింది. తరువాత అదిముసునూరి నాయకులురేచెర్ల నాయకులు, బహమనీ సుల్తానులు, గోల్కొండను పాలించిన దక్కను సుల్తానుల పాలన లోకి వచ్చింది. మొగలు చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను 1687 లో ఆక్రమించినపుడు అది మొగలు సామ్రాజ్యంలోభాగమయింది. తరువాత 1724లో ఈ సామ్రాజ్యం లోని దక్షిణ ప్రాంతం విడివడి హైదరాబాదు రాజ్యం ఏర్పడినపుడు వరంగల్లు ఆ రాజ్యంలో భాగమైంది. 1948లో వరంగల్లుతో సహా హైదరాబాదు భారత దేశంలో కలిసి పోయింది. 1956లోభాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా హైదరాబాదు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడింది.
పురావస్తు శాఖవారు ఈ మధ్యకాలంలో చారిత్రాత్మక కట్టడం అయిన వేయి స్తంభముల దేవాలయాన్ని మరమత్తు చేయడానికి పూనుకొన్నారు. అయితే వారు జరిపిన త్రవ్వకాలలో ఒక విస్మయం చెందే విషయం బయటపడినది. ఉత్తరం దిక్కుగా ఉన్న ఆలయం క్రింద ఒక నీటితొ నిండిన బావి బయటపడినది. ఉపరితలం నుండి సుమారు 3-4 మీటర్ల లోతున ఈ బావి ఉంది. అంతేకాకుండా కట్టడం క్రింద అనగా పునాది క్రింద మొత్తం ఇసుకతో ఉండడం మరొక విషయం. ఆకాలం నాటి సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం. ఇలా పునాది క్రింద మొత్తం ఇసుకతో కట్టడానికి భూకంపాలనుండి రక్షించడానికి అని కొంతమంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఈ విషయం మీద పురావస్తు శాఖ ఇంకా తన పరిశోధన కొనసాగిస్తుంది.
ముఖ్య విషయాలు:
  • జిల్లాలో ప్రతీ రెండేళ్ళ కొకసారి జరిగే సమ్మక్క-సారక్క జాతరకు కోటి  మందికి పైగా యాత్రికులు వస్తారు. ఈ జాతరకు తెలంగాణా నుండే కాకుండా మహారాష్ట్ర మధ్య ప్రదేశ్, చేట్టిస్ ఘడ్, కర్ణాటక, ఒరిస్సా ల నుండి జనం తరలి వస్తారు, వరంగల్లుకు 90 కి.మీ ల దూరంలో గల మేడారం గ్రామం వద్ద జరిగే ఈ జాతర అధర్మ చట్టాన్ని ఎదిరించి పోరాడిన ఒక తల్లీ, కూతురుల ప్రతిఘటనకు స్మృత్యర్ధం జరుగుతుంది.
  • పీపుల్స్‌వార్‌ గ్రూపు, (ప్రస్తుత మావోయిస్టుల)కు వరంగల్లు జిల్లా ఒకప్పుడు గట్టి స్థావరం.
  • కాకతీయ విశ్వవిద్యాలయం 1976 లో హన్మకొండ లో  ఏర్పతుచేయ్యడంతో ఉత్తర తెలంగాణకు విద్య ప్రాంగణం అయ్యింది వరంగల్లు.
  • వరంగల్ లో ప్రతిష్టాత్మక NIT (REC ) ని ఏర్పాటు చేసారు.
  • MGM ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి, మెడికల్ కాలేజి కావడంతో ఉత్తర తెలంగాణాలోని రోగులకు సేవలందిస్తుంది.
  • వరంగల్లు ఆంధ్ర ప్రదేశ్ లోకెల్లా ఐదవ అతి పెద్ద నగరము.
  • రెవిన్యూ డివిజన్లు (5): వరంగల్, మహబూబాబాద్,ములుగు,జనగాం,నర్సంపేట.
  • లోక్‌సభ స్థానాలు (2): వరంగల్, మహబూబాబాద్
  • శాసనసభ స్థానాలు (14): వరంగల్ (తూర్పు), వరంగల్ (పశ్చిమ), మహబూబాబాద్స్టేషన్ ఘనపూర్ములుగుపరకాల , వర్ధన్నపేటడోర్నకల్పాలకుర్తినర్సంపేట,భూపాలపల్లిజనగాం. 
  • మహబూబాబాద్‌, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి పంచాయతీలను మునిసిపాలిటీలుగా మార్చాలని ప్రతిపాదించారు.
 వరంగల్ మండలాలు:

భౌగోళికంగా వరంగల్ జిల్లాను 51 రెవిన్యూ మండలములుగా విభజించినారు.
సంఖ్యపేరుసంఖ్యపేరుసంఖ్యపేరు
1చేర్యాల18తొర్రూర్35దుగ్గొండి
2మద్దూర్19నెల్లికుదురు36గీసుకొండ
3నర్మెట్ట20నర్సింహులపేట37ఆత్మకూరు
4బచ్చన్నపేట21మరిపెడ38శాయంపేట
5జనగాం22డోర్నకల్లు39పరకాల
6లింగాల ఘనా‌‌పూర్‌23కురవి40రేగొండ
7రఘునాథపల్లి24మహబూబాబాద్‌41మొగుళ్ళపల్లి
8స్టేషన్‌ ఘనా‌పూర్‌25కేసముద్రం42చిట్యాల
9ధర్మసాగర్‌26నెక్కొండ43భూపాలపల్లి
10హసన్‌పర్తి27గూడూరు44ఘనపూర్‌
11హనుమకొండ28కొత్తగూడెం45ములుగు
12వర్ధన్నపేట29ఖానాపూర్‌46వెంకటాపూర్‌
13జాఫర్‌గఢ్‌30నర్సంపేట47గోవిందరావుపేట
14పాలకుర్తి31చెన్నారావుపేట48తాడ్వాయి
15దేవరుప్పుల32పర్వతగిరి49ఏటూరునాగారం
16కొడకండ్ల33సంగెం50మంగపేట
17రాయిపర్తి34నల్లబెల్లి51వరంగల్                                                                                           
దర్శనీయ ప్రదేశాలు:
  • ఓరుగల్లు కోట: ఓరుగల్లు కోట చరిత్ర 13వ శతాబ్ధము నుండి ఉన్నది. ఓరుగల్లు కోట 13 వరంగల్లు పట్టణానికి 2 కి.మి దూరములో ఉన్నది. ఇప్పుడు కోట అవశేషాలు మాత్రమే కనిపిస్తాయి. చరిత్ర ప్రకారం ఈ కోటకు మూడు ప్రాకారాలు ఉన్నాయి, ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికి కూడా చూడవచ్చు. మొదటి ప్రాకారం మట్టితో చేసినది దీనిని ధరణి కోట అని పిలుస్తారు. ఇది 20 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండవ ప్రాకారములో ఉన్నది రాతి కోట గ్రానైటు రాళ్ళతో నిర్మితమైనది. రాతి కోటకు పెద్ద పెద్ద ఏకశిలా రాతి ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాల ఎత్తు 30 అడుగులు ఉండి ఏకశిల నిర్మితమైనవి. కోట ద్వారం మీద కీర్తి తోరణాలు ఉన్నాయి (పూర్ణ కుంభం వంటివి). ఈ కీర్తి తోరణాలు ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆధికారిక చిహ్నంగా ఉపయోగిస్తున్నది.

  • వెయ్యి స్థంభాల గుడి: 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంభాల గుడి వరంగల్నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున కలదు.దీనిని 1163 లో రుద్రదేవ మహారాజు నిర్మించారు, ఇందులోని ప్రధాన దైవం శివుడు, లింగ రూపంలో దర్శనం ఇస్తాడు, దేవాలయంలో ఒక కోనేరు కూడా ఉంది, ముందు భాగంలో కళ్యాణ మండపం ఉంటుంది, దేవాలయానికి, కళ్యాణ మండపానికి మధ్యలో నది ఉంటుంది.
  • ఇక్కడ శివ రాత్రి ఘనం గా జరుగుతుంది, కార్తిక పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జర్గుతాయి, గుడి మొత్తం నునే దీపాలతో అలంకరిస్తారు.
  • అయితే మరమ్మత్తుల పేరుతో కళ్యాణ మండపాన్ని కుల్చేసారు, ఈ మండపం పునాదిలో ఒక నీటి భావి ఉంది, పై భాగం మొత్తం ఇసుకతో ఉంది, భూకంపాలనుండి రక్షణ కోసం ఇసుకను పునాది లో ఉంచారని అనుకుంటున్నారు, కాని బావి ఎందుకు నిర్మించారో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే ఈ మరమ్మత్తుల పనులకు మంత్రి నేదురుమల్లి రాజేశ్వరి శంకు స్థాపన చేసిన ఇంతవరకు పనులు జరగలేదు.

  • రామప్ప దేవాలయము : దీనిని రామ లింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు.
  •  వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఇది వరంగల్లు జిల్లాలో చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు కలదు. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది ఇది ఇప్పటికి వేల ఎకరాల పంటలకు అధారంగా ఉన్నది. పాలంపేట చారిత్రత్మాక గ్రామము కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్ధాల మధ్య వెలుగొందింది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు.
  • ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవంపేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడి విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయం అని కూడా వ్యవహరిస్తారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. విష్ణువు ఆవతారము రాముడు మరియు శివుడు కలిసి ప్రధాన దైవముగా ఉన్న దేవాలయము.ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి యైన ఎత్తైన పీఠంపై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయము తూర్పు దిశాభిముఖముగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున మూడు వైపుల ప్రవేశ ద్వారము గల మహామండపం కలిగి ఉన్నది. ఇందలి గర్భాలయమున ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగము కలదు. ఇందలి మహామండపము మధ్య భాగమున కల కుడ్య స్థంభములు, వాటిపై గల రాతి దూలములు రామాయణ, పురాణ, ఇతిహాస గాధలతో కూడిన నిండైన అతి రమణీయమైన శిల్పములు కలిగి ఉన్నవి. ఈ మహా మండపము వెలుపలి అంచున పై కప్పు క్రింది భాగమున నల్లని నునుపు రాతి పలకములపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరముగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ దేవాలయ ప్రాంగణలో ఇతర కట్టడములలో నంది మండపము, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు చూడదగినవి. దేవాలయము శిల్ప సంపదకాకతీయ రాజుల నాటి శిల్ప శైలి తెలుపుతున్నది.దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైనది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి అని చెబుతారు.ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లుంటుంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంబాల మీద అత్యంత రమణీయమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిలకళాసౌందర్యము చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల రెండుశివుని సన్నిధులు ఉన్నాయి. శివుడి వైపు చూస్తున్న నంది చాలా ఆందముగా చెక్కబడి ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్నది. ఈ గుడి తరచు జరిగిన దండయాత్రల బారికి గురైనది. 17వ శతాబ్ధములో వచ్చిన భూకంపము వలన కొద్దిగా శిధిలము అయ్యింది. ఆలయ ముఖ ద్వారము శిధిలమైపోయింది.
  • పద్మాక్షమ్మ గుట్ట : పెద్ద రాయి కింద గుహలో ఉంటుంది అమ్మవారు.వరంగల్ నగరం లో బతుకమ్మ పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది ఆ పండుగ పద్మాక్షమ్మ సమక్షంలోనే జరుగుతుంది, గుట్ట కింద ఉన్న కోనేరులో బతుకమ్మలను నిమర్జనం చేస్తారు.

  • పాకాల చెఱువు: 1213 సంవత్సరంలో కాకతీయ రాజు గణపతి దేవుడు 30 చదరపు కి.మీ విస్తీర్ణములో త్రవ్వించాడు. ఈ ప్రదేశము ఇప్పుడు పర్యాటకులకు చాలా నేత్రానందం కలిగిస్తున్నది. ఈ చెఱువు ఒడ్డున పాకాల వన్యప్రాణీ సంరక్షణ కేంద్రం 839 చదరపు కి.మీ విస్తీర్ణంలో ఉన్నది. ఈ వన్యప్రాణి సంరక్షణా కేంద్రానికి ఏతునగరం సంరక్షణా కేంద్రం అని కూడా పేరు కూడా ఉన్నది. ఇక్కడ దట్టమైన అడవులు మరియు జంతు సంపద ఉన్నది. స్వేఛ్ఛగా తిరుగాడే జింకలు, చిరుతపులులు, హైనాలు, తోడేళ్ళు, గుంట నక్కలు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, నీలగాయి, ముళ్ళపందులు, లంగూర్లు వంటి క్షీరదాలకూ, కొండ చిలువలు, నాగుపాములు, కట్లపాములు, ఉడుములు మరియు మొసళ్ళవంటి సరీసృపాలకు ఈ సంరక్షణా కేంద్రము ఆవాసాన్నిస్తున్నది.
  • వన విజ్ఞాన కేంద్రం : వన విజ్ఞాన కేంద్రం అంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ వారి ఆధ్వర్యములో సామాన్య ప్రజానీకానికి వన్య సంరక్షణ గురించి తెలుపడానికి ఏర్పాటు చేయబడినది. ఈ విజ్ఞాన కేంద్రాన్ని ప్రతి రోజు 500 మంది వరకు సందర్శకులు సందర్శిస్తుంటారు. 50 ఎకరాల విస్తీర్ణములో విస్తరించి ఉన్న ఈ విజ్ఞాన కేంద్రం, వరంగల్లు హంటర్ రోడ్డు మీద ఉన్నది.



  • కొమురవెల్లి : సిద్ధిపేట నుండి సికిందరాబాదు వెళ్ళే మార్గంలో సిద్ధిపేటకు 10 కి.మీ దూరంలో ఉన్న కమురవల్లి మల్లన్న స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి రైలు సౌకర్యం లేదు. ఇక్కడ జాతర జనవరి నెలలో ప్రారంభమై ఉగాది వరకు జరుగుతుంది. జాతర చివరి వారంలో ఇక్కడ బాణా సంచా కాలుస్తారు దీనిని అగ్ని గుండాలు అని పిలుస్తారు.

    శ్రీ భద్రకాళి అమ్మవారు
  • భద్రకాళి దేవాలయము: వరంగల్ నగరం నడిబొడ్డున శ్రీ భద్రకాళి అమ్మవారు కొలువైవున్నారు. శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారమై విల్లసిల్లుతున్నారు. అందమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రక్కన భద్రకాళి చెరువు, గుడి వెనుక అందమైన తోటలతో శోభయమయంగా వెలుగొందుతున్న ప్రముఖ దేవాలయం. దసరా పండుగ నాడు నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు జరుగును . దసరా పండుగనాడు లక్షలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు . వరంగల్ జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాలనుండి కూడా భక్తులు అశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
ప్రత్యేకతలు:
పెంబర్తి: ఇత్తడి పనిలో కళా కాండాలను సృష్టించి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గ్రామం పెంబర్తి, ఇక్కడ ఇత్తడితో ప్రతిమలు తయారు చేస్తారు, ఒకప్పుడు ప్రభుత్వ౦ ఇచ్చే నందులు ఇక్కడే చేసేవారు, పెంబర్తి జనగాం కు ఆలేరుకు మధ్యలో ఉంటుంది.
పేరిణి శివ తాండవం: దేశంలోని శాస్త్రీయ నృత్యలన్ని స్తీలు చేసేవే, కాని ఒకే ఒక్క శాస్రియ పురుష నృత్యం పేరిణి, ఇది కాకతీయుల కాలంలో పుట్టింది, దీనిని యుద్ధానికి వెళ్ళే ముందు సైనికులను ఉత్సాహ పరచడానికి చేసేవారు, అయితే ఇది ఆ తర్వాత కాలగర్భంలో కలిసి పోయింది,నటరాజ రామకృష్ణ పేరిణి శివతాండవం అను నృత్య రీతిని రామప్ప శిల్పాల నుండి గ్రహించి కంపోజ్ చేశారు. ఈయన చేసిన ఈ కళ కు చేసిన సేవకు గాను  పద్మ శ్రీ అందుకున్నారు. 

పురాతన కవులు:

పాల్కురికి సోమన: ఈయన నన్నయకు పూర్వపు కవి, కాని నన్నయ ఆంద్ర ప్రాంతానికి చెందినవాడు కావడం వాళ్ళ ఆది కవి అయ్యాడు, సోమన రచనలు అన్ని తెలంగాణా మాండలికంలో సాగుతాయి, ఈయన రచనల్లో ప్రముఖ మైనది బసవపురాణం.ఈయన రచన బెజ్జ మహా దేవి కథ కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ తెలుగు పుస్తకంలో పాట్యంశంగా  ఉంది.

పోతన:పోతన వరంగల్ జిల్లా లోని బమ్మెర గ్రామానికి చెందినా వారు, ఈయన ఒక సాధారణ రైతుగానే తన జీవితాన్ని గడిపారు, శ్రీ మహా భాగవతాన్ని తెలుగులో రచించిన గొప్ప కవి,ఆయన సహజ కవి.

జిల్లలో ప్రముఖులు: 
ప్రో.జయశంకర్: తెలంగాణా కొసం జీవితంతం పరితపించిన కొత్తపల్లి జయ శంకర్ గారు ప్రొ.జయ శంకర్ గా మనందరికి సుపరిచితుడే. నిజాం నిరంకుశ పాలనలొ మగ్గుతున్న హైదరాబాద్ సంస్థానంలొని వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కన్నపెట గ్రామంలొ 1934 ఆగస్ట్ 06 న జన్మించారు. ఆయన తల్లి మహా లక్ష్మి, తండ్రి లక్ష్మి కాంతరావు. 
ఆయన బాల్యం తన సొంత ఊరిలోనే గడిచింది. ఆయన చదువుకొనే రోజుల్లో భారత స్వాతంత్ర్య ఉద్యమం ఉవ్వేతున సాగుతుంది, స్వాతంత్ర ఆకాంక్ష కలవారంత వందేమాతరం అని పలుకరించుకునేవారు, కాని హైదరాబాద్ లో మాత్రం నిజాం రాజు వందేమాతరంను నిషేధించారు.ఆయన పాటశాల వయసులోనే వందేమాతరం అని నినదించాడు, ఆ తర్వాత హన్మకొండలో ఉన్నత విద్యను అభ్యసించారు, MA economics ను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి, Ph D economics ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసారు, ఆయన B Ed కూడా ఉస్మానియా నుండి పూర్తి చేసారు.ఆయన విద్యార్థి దశలో ఉండగానే ఉద్యమం వైపు అడుగులు వేసారు. తెలంగాణా సైనిక పాలనలో ఉన్న రోజుల్లో ఉద్యోగాలన్నీ ఆంధ్రా వారికి కట్టిపెడుతున్నారని దానికి వ్యతిరేఖంగా 1952 లో నాన్ ముల్కి లేదా ఇడ్లి సాంబార్ గో బ్యాక్ ఉద్యమాలు నడిచాయి, ఈ ఉద్యమంలో జయశంకర్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు, పోలీసు ల కాల్పుల్లో ఆయన తన సహచరులను కోల్పోయారు, దీనికి చెలించిన ఆయన 10 మంది విద్యార్థులతో తెలంగాణా జనసభను ప్రారంబించారు, ఇది రోజురోజుకు విస్తరిస్తున్దడంతో భారత ప్రభుత్వం దీనిని నిషేధించింది, ఫజాల్ అలీ కమిటి (1 st SRC ) రాష్ట్రానికి వచ్చినపుడు విద్యార్థి విభాగం తరపున ఆయన కమిటిని కలుసుకొని తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగాలని బలంగా వాదించారు, ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించిన జయ శంకర్ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడేందుకు అనేకసార్లు సచివాలయం వెళ్లి మంత్రులతో మాట్లాడారు,అక్కడ వారు ఇచ్చిన అవహేళనతో కూడిన సమాధానాలు ఆయనను భాదించాయి.ఈయనకు సంభందించిన పూర్తి వివరాలకు కింది లింక్ చుడండి.
కాలోజి:తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం ప్రతిధ్వని కాళోజి నారాయణరావు. రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కాళోజి. కవిత్వం రాసి ప్రజాకవి. హక్కులడిగి ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది.హేతువాది . మొత్తంగా తెలంగాణ జీవిత చలన శీలి కాళోజి. పుటక చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి.కాళోజీ జయంతి సెప్టెంబర్ 9 ని “తెలుగు మాండలిక భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.


  • కాళోజి నారాయణరావు కాళన్నగా, కాళోజిగా ప్రఖ్యాతుడు. 1914 సెప్టెంబర్ 9 న కర్ణాటక బీజాపూర్ జిల్లా రట్టేహళి గ్రామంలో జన్మించిండు.కాళోజివరంగల్ జిల్లా మడికొండ గ్రామంల పెరిగిoడు.
  • కాళోజి న్యాయవాద విద్య అభ్యసించినా వృత్తి ముందుకు సాగలేదు.
  • హైదరాబాదుల సంచరించినా హనుమకొండలనే ఆయన జీవితం.
  • కవిత్వం రాసినా ప్రజా చైతన్య మార్గమే ఆయన లక్ష్యం. రాజకీయాలు ఆయన ప్రాణం.
  • కాళోజి రామేశ్వరరావు ఆయన అన్న, ఉర్దూ కవి.తమ్ముడికన్నా అన్న ఆరు సంవత్సరాలు పెద్ద
  • కాళోజీ అసలు పేరు-రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాం రాజా కాళోజి-
  • తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు.
  • కాళోజీ జన్మించిన అయిదారు నెలలకే రమాబాయమ్మ చనిపోవడంతో అన్నే అమ్మగా మారి తమ్ముడు కాళోజిని పెంచి పెద్దచేశారు.నా ఏడవ నెలలో అన్నగారి భుజాలమీద ఎక్కిన నేను నా 80వ ఏట కూడా ఆ భుజాలమీద అట్లనే ఉన్న. ఆయన అట్లనే మోస్తున్నాడు! అన్నాడు
  • పి.వి. నరసింహారావు, కాళోజీ ఒరే అనే టంత చనువు వున్న స్నేహితులు,
  • కాళోజీ నాన్ వెజి టేరియన్ తినేవాడు. ఇష్టం గా రమ్ము తాగేవాడు. తాపీగా భోజనం చేస్తూ బోలెడు కబుర్లు చెప్పేవాడు.
  • రాయ్ ను యూనివర్శల్ పర్సన్ అనేవారు. ఆంధ్రప్రదేశ్ కావాలని కోరిన కాళోజీ, 1969 లో ప్రత్యేక తెలంగాణాను సమర్ధించి, అలాగే నిలిచిపోయారు.
  • 1977లో సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేశాడు కాళోజీ. డిపాజిట్ పోయింది.
  • తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-సంకోచ పడియెదవు సంగతేమిటిరా?
                 అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా అన్నారు కాళోజీ.ఈయనకు సంభందించిన పూర్తి వివరాలకు కింది లింక్ చుడండి.
దాశరధి:వారు ఆతర్వాత వరంగల్ జిల్లాకు వలస వెళ్లారు, ఆయనొక అభ్యుదయవాది, ఆయన నిజాం వ్యతిరేకంగా 150 మందితో ఏర్పాటు చేసిన సైన్యంలో ఒకడిగా పనిచేసారు, కామునిస్ట్ పార్టీలో ఉన్న ఆయన ఒక మహా సభ ను ఏర్పాటుచేసారు, ఆ తర్వాత జనాన్ని చైతన్య పరచటానికి, తెలంగాణా మొత్తం తిరిగారు, ఆయన 1946 నుండి 1948 వరకు వరంగల్, ఆతర్వాత నల్లికుదురు నిజామాబాదు జైలు లలో ఉన్నారు, అయన జైలు నుండి తప్పించుకొని, మహబూబాబాద్ అడవుల్లో అజ్ఞాత౦ లోకి వెళ్లి, తన కార్యకలాపాలు కొనసాగించారు.ఈయనకు సంభందించిన పూర్తి వివరాలకు కింది లింక్ చుడండి.
ఇంకొంత మంది ప్రముఖులు:
* మిమిక్రి ఆర్టిస్ట్ నేరెళ్ళ వేణుమాధవ్,
* సుప్ర సిద్ధ కవి అందేశ్రీ ,
* ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి.
రవాణ సౌకర్యాలు: జిల్లలో నిజాం కాలంలో నిర్మించిన రైల్వే లు ప్రముఖంగా సేవలందిస్తున్నాయి.కాజిపేట్ జంక్షన్ ఉత్తర, దక్షిణ భారత దేశాలను కలిపే ప్రధాన రైల్వే స్టేషన్, నిత్యం రద్దీగా ఉండే స్టేషన్ కూడా, ఇది బల్లార్ష-సికింద్రాబాద్ మార్గంలో ఉంటుంది, ఇక హైదరాబాద్ - విజయవాడ మార్గంలో వరంగల్ రైల్వే స్టేషన్ ఉంటుంది.
* నిజాం కాలం లోనే బస్ లు ప్రారంభం అయ్యాయి. జిల్లా నుండి తెలంగాణా లోని అన్ని జిల్లాలకు బస్ లు నడుస్తాయి.
* ఎయిర్ పోర్ట్ ప్రతిపాదన ఉన్న పాలకుల నిర్లక్ష్యంతో అది కార్య రూపం దాల్చడం లేదు.
పారిశ్రామిక రంగం: పారిశ్రామిక రంగంలో జిల్లా వెనక బడి ఉందని చెప్పవచ్చు, వరంగల్, హన్మకొండ, కాజిపేట్ లు కలిసి కార్పోరేషన్ గా ఉంది, ఇక జిల్లలో ఒక్క మున్సిపాలిటి కూడా లేదు.
* నిజాం కాలంలో ప్రారంభించిన ఆసియాలోనే అతిపెద్ద అజంజాహి మిల్లు, ఇది మంచి లాభాల్లో ఉండగానే ఎన్టి ఆర్ అర్ధంతరంగా మూయించారు, ఇందులోని యంత్రాలు తుప్పు పట్టిపోయాయి.
ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీ: యునివర్సిటి ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజికి ఎంతో పేరు ఉంది, ఇక్కడే ఎంతో మంది ప్రముఖులు ఉన్నత విద్యను అభ్యసించారు, తెలుగు ప్రధాని పివి, కవి సినారే, మిమిక్రి ఆర్టిస్ట్ నేరెళ్ళ వేణుమాధవ్, ప్రో.జయ శంకర్, .. ఇలా అనేక మంది మేధావులు, రాజకీయ నాయకులు ఇక్కడ చదువుకున్నారు.
  • తెలంగాణా ఉద్యమం లో జిల్లా పాత్ర: తెలంగాణా ఉద్యమం లో జిల్లా ప్రజలు వయసుతో సంబంధం లేకుండా పాల్గొంటున్నారు, ప్రస్తుత ఉద్యమంలోనే కాకుండా సాయుధపోరాట కాలంలో కూడా జిల్లా పోరాటాల ఖిల్లనే, రజకార్ మూకలను తిప్పికొట్టడానికి గ్రామాల్లో ఏర్పడిన ప్రజా రక్షక దళాల అపూర్వ పోరాటానికి చిహ్నం పరకాల. బైరాన్ పల్లి అనే గ్రామం లో జరిగిన మారణ హోమం మరో జలియన్ వాళ బాఘ్ ను తలపించింది, గ్రామంలోకి ప్రవేశించిన రజాకర్ మూకలను రెండు సార్లు సమర్దవంతం గా తిప్పికొట్టాయి గ్రామా రక్షక దళాలు, కాని మూడో సారి ఎవ్వరు ఊహించని విధంగా మరింత సైన్యంతో రజాకార్లు గ్రామంపై విరుచుకుపడ్డారు, గ్రామ రక్షక దళ సభ్యులను, ఊరిజనాన్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చారు రజాకార్లు, ఆ నెత్తుటి గురుతులు ఒక ఉదాహరణ మాత్రమె, అలంటి భీకర పోరాటాలు, భయానక సంగటనలు అనేకం.
                                      ( భైరాన్ పల్లి బురుజు)
  • జిల్లా లో కాకతీయ ఉనివేర్సిటి మరో ఉద్యమ వేదికగా ఉంది, విశ్వవిద్యాలయ విద్యార్థులు జిల్లా ప్రజలను చైతన్య పరచడంలో ప్రముఖ పాత్ర పోషించారు, వరంగల్ లో విద్యార్థి పొలికేక మహా సభను నిర్వహించారు.దీనికి ఏడు లక్షల మంది తెలంగాణా యువకులు హాజారయ్యారు.
  •  2010 వరంగల్ ఉప ఎన్నికల్లో తెలంగాణా అభ్యర్థిని గెలిపించి తమ తెలంగాణ ఆకాంక్షను చాటిచెప్పారు, 
  • 2010 లో టి ఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ లో జరిగిన మహా ఘర్జన సభ కు దేశంలో ఎక్కడ కనివిని ఎరుగని రీతిలో 25 లక్షల మంది హాజారయ్యారు.
  • పార్లమెంట్లో సీమంద్ర ప్లకార్డు పట్టుకున్న సీమంద్ర జగన్కు మానుకోట చుక్కలు చూపించింది.
  • తెలంగాణా జాతి పిత ప్రో.జయ శంకర్ వరంగల్ జిల్లా వాసి కావడం మరో గొప్ప విషయం.

  • తెలంగాణా ఉద్యమం లో కీలక భూమికను పోషిస్తూ, రాణి రుద్రమ పోరాట పటిమను , సమ్మక్క సారలమ్మ ల తెగువను చూపిస్తుంది ఓరుగల్లు...
ప్రపంచస్థాయి వారసత్వ నగరంగా ఓరుగల్లు నగరానికి గుర్తింపు:


మన ఓరుగల్లు నగరానికి తీపి కబురు. నగరి సిగలో చరిత్రకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ పర్యాటక వారసత్వ నగరంగా వరంగల్ నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఘనమైన వారసత్వ సంపద, వేల ఏళ్ల నాటి చరిత్ర నగరాన్ని కీర్తి శిఖరాన నిలబెట్టాయి. కాకతీయుల నాటి సామ్రాజ్య పాలనలో నెలకొల్పిన వైభవ తోరణాలు నేడు కళారూపాలుగా కనువిందు చేస్తున్నాయి. రమణీయ శిల్పాల నృత్య వి లాసం, చారిత్రక కట్టడాల అపూర్వ వైభవం ఈ గుర్తింపున కు ప్రధాన కారణాలు. 12వ శతాబ్దపు ఓరుగల్లును అరుదైన వారసత్వ నగరంగా గుర్తింపు పొందడం విశేషం. 

అంతర్జాతీయ గుర్తింపు:
దేశంలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కాకుంటే ఓరుగల్లుకు సుదీర్ఘకాలపు చరిత్ర ఉంది. ఈ కారణంగానే జిల్లాకు గుర్తింపు లభించింది. వారసత్వపు గుర్తింపు లక్ష్యం జిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తించడమే. దీంతో దేశంలో ని ప్రముఖ పర్యాటక కేంద్రాల సరనన జిల్లా చేరుతుంది. పర్యాటకుల రాక కూడా గణనీయం గా పెరుగుతుంది. దేశ, విదేశీ పర్యాటకులు నగరానికి రావడానికి ఆసక్తి చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నగర ప్రజలకు కాకతీయుల చరిత్రలో తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి. నాటి నగర జీవన విధానం, సాంకేతిక పరిజ్ఞానం, పరిపాలనా విధానం నేటి తరానికి ఓ పట్టాన అర్ధం కాదు. వీటిపై మరింత పరిశోధనాత్మక చరివూతను అందించగలిగితే ఇలాంటి గుర్తింపులు మరెన్నో వస్తాయి. దీనిమూలంగా యునెస్కో గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది. పరోక్షంగా నగరానికి దేశ, విదేశీ ఆదాయం లభిస్తుంది. విదేశీ పర్యాటకులు ఇప్పటికే నగర చారివూతక కట్టడాలపై ఆసక్తి చూపిస్తున్నారు. పర్యాటక శాఖ లెక్కల ప్రకారం సగటున నెలకు 100మంది విదేశీ పర్యాటకులు, వేలసంఖ్యలో దేశ పర్యాటకులు వస్తున్నట్టు తెలుస్తున్నది. అంటే సంవత్సరానికి విదేశీ పర్యాటకులు వెయ్యి నుంచి 15వందల మంది వస్తున్నారు. రానున్న రోజుల్లో వీరి రాక పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు జిల్లా పర్యాటక శాఖాధికారి ఎం.శివాజి తెలిపారు. మరిన్న మౌలిక సదుపాయాలు కల్పిస్తే విదేశీయులను ఎక్కువగా తీసుకురావడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు.

ఉత్సవ వేళ...
700ఏళ్ల కాకతీయ ఉత్సవాలను జరుపుకుంటున్న వేల జిల్లాకు వారసత్వ గుర్తింపు లభించడం విశేషం. చరిత్ర తాలూకు వైభవాన్ని పున:స్మరించుకుంటున్న జిల్లాకు ఇది కచ్చితంగా శుభవార్తే. ప్రతినెల కాకతీయ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇక గుర్తింపుపై కూడా ఉత్సవాలు చేసుకోవాల్సిన తరుణం ఇదని జిల్లావాసులు అభివూపాయపడుతున్నారు. శిల్పకాంతులు పంచే రామప్ప, పరిపాలనా, ధీరత్వాన్ని చాటే ఓరుగల్లు ఖిల్లా, వైభవ తోరణం, కనువిందు చేసే వేయిస్తంభా ల ఆలయం, చారిత్రిక ఆనవాళ్లు ఉన్న ఘనపురం, పద్మాక్షి, భద్రకాళి, కటాక్షాపూర్ లాంటి అపురూప సంపద తరిగిపోనిది. కళాప్రేమికుల మది నింపే జ్ఞాన సంపద ఇక్కడి సొంతం. ఈ సంపదను దేశ, విదేశీ ప్రజలకు గర్వంగా చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు వారసత్వ గుర్తింపు ఒక ఉన్నతమైన మార్గం.

2 కామెంట్‌లు:

  1. Dear Venu,
    తెలంగాణ సంస్కృతి, చరిత్రలను ఇంటర్నెట్లో ఉన్న వాళ్ళందరికీ అందించాలన్న మీ ఆలోచన బాగున్నది. కేవలం ఆలోచనతోటే ఆగిపోకుండ చాల శ్రమపడి మీరు రాస్తున్న వ్యాసాలు బాగున్నయ్.
    అక్కడక్కడ వస్తున్న అచ్చుతప్పుల్ని సరిచేసుకుంటే ఇంకా అద్భుతంగా (నా లాంటి వాళ్లెవ్వరూ వంక పెట్టలేనంత బాగ) ఉంటది.
    మీరు పైన బైరాన్ పల్లి స్తూపమని పేర్కొంటూ ఒక ఫోటో వేసిన్రు. అది నిజానికి బైరాన్ పల్లి బురుజు (స్తూపం కాదు). సాయుధ రైతాంగ పోరాట కాలంలో ఆ బురుజు మీద నుంచే గ్రామరక్షకదళాలు కాపలా కాసేటివి. స్తూపం వేరే ఉంది. ఈ పొరపాటును సవరించుకోగలరు.

    రిప్లయితొలగించండి
  2. ముందుగా మీకు కృతజ్ఞతలు అవినాష్ గారు, ఈ బ్లాగ్ ను ఫాలో అవుతున్నందుకు, మీరు చెప్పినట్టుగానే పొరపాటును సరిదిద్దాను, మీ సహకారం ఇక ముందు కూడా ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాను...

    రిప్లయితొలగించండి