హోం

26, జూన్ 2013, బుధవారం

బర్మా నిర్మాతలు మన వారే..!


అవును, బర్మా దేశపు(నేటి మయన్మార్) నిర్మాతలు మన తెలంగాణా వారే, క్రి.శ. 5 శతాబ్దంలో తెలంగాణా ను పాలించే రాజులు యుద్దంలో ఓడిపోవడంతో వారు తెలంగాణా ను వదిలి తూర్పు దిశలో ప్రయాణించి బర్మాను చేరుకున్నారట..! భారత దేశంలోని గోదావరి, కృష్ణా నదుల మధ్య ప్రాంతం నుండి వారు అక్కడికి వలస వెళ్ళినట్లు ఇప్పటికి వారి సాంప్రదాయ గ్రందాలలోను, జానపద గీతాల్లోనూ ఉండడం విశేషం, ఇలా బర్మా దేశపు రాజధాని నగరంతో పాటు అక్కడి ముఖ్య పట్టణాలను నిర్మించింది మన వారే, బర్మాలోని తెలంగాణా వాసులను మన్ లని పిలుస్తారు, వీరికి ప్రత్యేకంగా మన్ అనే రాష్ట్రంతో పాటు, డెమోక్రటిక్ పార్టి కుడా ఉంది, తెహిలం నాగరికత నుండి మేసపటోనియా నాగరికత వరకు, షోడశ జనపదాల్లో దక్షిణ భారతాన్ని ఏలిన అస్మక(రాజధాని పోతన) వరకు, మరుగున పడిన తెలంగాణా చరిత్ర వెలుగులు నింపుకుంటున్న తరుణంలో ఇలాంటి ఆసక్తికర విషయాలు బయటపడడం ఆనందదాయకం... క్రింది విడియోని  చూడండి. 
                                                                    -FROM TV9

25, జూన్ 2013, మంగళవారం

సౌత్ సూడాన్ విముక్తి పోరాటం..

               
(పై ఫోటో 1993లో కెవిన్ కార్టర్ అనే ఫోటోగ్రాఫర్ తీసారు, ఈ ఫొటోగ్రాఫ్ ద్వారా సౌత్ సూడాన్ పరీస్థితులు ప్రపంచానికి తెలిసాయి, తిండి లేక బొక్కలు తేలి కడు దీన స్థితుల్లో ఉన్న "ఆ పిల్లవాడు చనిపోతే తిందామని ఎదురుచూస్తున్న రాబంధు"ను ఫోటోలో చూడవచ్చు, ఈ ఫోటో కు పులేజ్టర్ అవార్డు వచ్చింది, కాని సూడాన్ లోని అంతర్యుద్దం కారణం గా అక్కడ నెలకొన్న కడు  దైన్య పరిస్థితులకు చలించిపోయిన ఈ ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ తీవ్ర మానసిక వేధనతో 1994లో మరణించాడు.)
                  మృత్యువుకు ఆకలి వేసింది అది సౌత్ సూడాన్ పై విరుచుకుపడింది, రక్తం తాగే నరరూప రాక్షసుల రూపంలో, అంతర్యుద్దం మిగిల్చిన నెత్తుటి ధారల రూపంలో, తాగడానికి గుక్కెడు నీరు లేక, తినడానికి పట్టెడు తిండి లేక,  ఆకలితో డొక్క లెండుక పోయిన, దాహంతో గొంతెండుకపోయిన అభాగ్యులు జీవణ సంద్యకు చేరుకుంటూ పెట్టె ఆక్రందనల రూపంలో, పాలు లేక, పాలు రాక ఆకలితో గుక్కపట్టి ఏడ్చి ఏడ్చి ఉదయించిన గంటల్లోనే అస్తమిస్తున్న పసిపిల్లల రూపంలో, ఎటు చూసినా దైన్యం, ఎటు చూసినా నైరాశ్యం, చీకట్లు తప్ప వెలుగులు చూడని బతుకులు, కటిక చీకటిలో భయంతో బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లబుచ్చుతున్న జనం. కారు, జీబు ఏ వాహనం వచ్చినా గుండెల్లో గుబులు, ఇళ్ళల్లోకి పరుగులు, రాక్షసులు వచ్చారేమోనని, తమ మాన, ప్రాణాలను కబలిస్తారని. జన్జావిడ్ల అకృత్యాలకు శవాల దిబ్బగా మారిన ఆ ప్రాంతం నీరు, సారవంతమైన భూమి లేని ఎడారి ప్రా0తం కాదు, ఖనిజాలు లేని గొడ్డు నేల కూడా కాదు, అన్ని ఉన్నా అక్కడివారికి అందని వైనం, పాలకుల వివక్ష ఆ ప్రాంతానికి శాపంగా మారింది.  ప్రపంచ విముక్తి పోరాటాల్లో 7 దశాబ్దాల కాలం జరిగి అత్యంత రక్త సిక్తం గా ముగిసిన ఆఫ్రికా ఖండపు సరికొత్త దేశం సౌత్ సూడాన్ విముక్తి పోరాట చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం.

                       సూడాన్ ఆఫ్రికా ఖండంలోని అతిపెద్ద దేశం, ఈ దేశం లో 597 ఆదిమ తెగలు, 400 బాషలు ఉన్నాయి, ఇక్కడి తెగలలో అత్యదికులు ఇస్లాం మతాన్ని స్వీకరించారు, బ్రిటిష్ పాలనలో ఉన్న రోజుల్లో ఈ దేశాన్ని విభజించు పాలించు అనే దోరణిలో వాళ్ళు పాలన సాగించారు, దక్షిణ సూడాన్ ప్రాంతం లో క్రైస్తవ మతం ప్రవేశపెట్టి ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా చూడడం ప్రారంభించారు, నిజానికి సూడాన్ 1956 లో స్వాతంత్ర్యం పొందింది, అయినా దక్షిణ సూడాన్ వాళ్ళు తమకు స్వాతంత్ర్యం వచ్చిందని భావించలేదు, ఎందుకంటే సూడాన్ మొత్తం ఒక జాతి అనే భావన వారికి లేదు,  సూడాన్లో అత్యదికులు అరబ్బులు ఉంటారు, స్వాతంత్ర్యానంతరం వచ్చిన పాలకులు కుడా వారిమధ్య ఏర్పడ్డ ఆ అగాదాన్ని పూడ్చడానికి ప్రయత్నించలేదు సరికదా దానిని మరింత పెంచారు, దక్షిణ ప్రాంతం వారిని పట్టించుకోవడమే మానేశారు, ఫలితంగా ఆకలి చావులు, తీవ్రమైన కరువు,చివరికి అంతర్యుద్దం,  తమకు స్వేచ్చ కావాలంటూ 17 ఏళ్ళు జరిపిన ఈ పోరాటంలో 5 లక్షల మంది మరణించారు, ఈ పరిణామం ప్రపంచ దేశాల దృష్టి సుడాన్ పై పడేలా చేసింది, 1973లో సుడాన్ ప్రభుత్వం దక్షిణ సూడాన్ కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామనే హామీ ఇవ్వడం ద్వారా అంతర్యుద్ధం ముగిసింది, కాని పరిస్థితులలో మాత్రం మార్పు రాలేదు, ఒప్పందాలన్నింటిని తుంగలో తొక్కిన ప్రభుత్వం, కొంతమంది అరబ్బులను చేరదీసి జన్జావిడ్ ల పేరుతో దక్షిణ సూడాన్ వాసులపై దాడులు చేయించింది.  అసలే తిండి, నీరు లేక ఆకలితో అల్లాడుతున్న బక్క జీవులపై జన్జావిడ్ సబ్యులు చేసిన అకృత్యాలు అన్ని ఇన్ని కావు, గ్రామాల్లోకి వస్తూనే కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చిపారెయ్యడం, ఆడవారిపై అత్యాచారాలు చెయ్యడం, చిన్నపిల్లలను నిర్దాక్షిణ్యం గా చంపివేయ్యడం, ప్రజలను ఇళ్ళల్లో పెట్టి సజీవ దహనాలు చెయ్యడం, జన్జావిట్ సభ్యులు గ్రామం లోకి వచ్చారంటే నిముషాలలో ఆ గ్రామం శవాల దిబ్బగా మారిపోవాల్సిందే,ఈ పరిణామాలతో 1983లో మరోసారి అంతర్యుద్దం మొదలయ్యింది. 

                    1989 లో సైనిక చర్య ద్వారా అదికారాన్ని చేజిక్కించుకున్న అల్ బషీర్ మరింత అరాచక పాలనను కొనసాగించాడు, సూడాన్ను ఏక పార్టీ ఇస్లామిక్ దేశంగా మార్చివేశాడు, మానవత్వ విలువలను మంట గలిపాడు, నిజానికి దక్షిణ సూడాన్ లోనే నైలు నది ఉన్నది కాని వాళ్లకు తాగడానికి నీళ్ళు లేవు, పంటలు లేవు, ఎటు చూసినా ఎడారిని తలపిస్తుంది, నీళ్ళను మొత్తంగా ఉత్తర సుడాన్ తన అవసరాలకు మల్లిన్చుకోవడంతో దక్షిన ప్రాంతానికి తాగడానికి గుక్కెడు నీళ్ళు లేని పరిస్థితులు దాపురించాయి, తినడానికి తిండి లేక బొక్కలు బయటకు తేలి బతికున్న కళేబరాల్లా అత్యంత దీన స్థితిలో బతుకులు వెల్లదీసారు, తాగడానికి నీరు దొరకని ఆ ప్రాంతంలో రక్తం ఏరులై పారింది, జన్జావిడ్ సబ్యుల అరాచకాలు బషీర్ పాలనలో మరింత పెరిగాయి, నిజానికి సూడాన్ దక్షిణ ప్రాంతంలో నీరు, సారవంతమైన భూములు, ఆయిల్, రబ్బర్, సహజ వాయు నిక్షేపాలకు అంతులేదు, అయినా చుక్క నీరు రాదూ, పంటలు పండవు, ఎటు చూసినా ఎడారే. ఖనిజాలు లభించేది ఇక్కడ, కాని వాటిని తరలించుకుని పోయి పరిశ్రమలు పెట్టేది అక్కడ, ఈ వివక్షను ఎదుర్కోవడానికి దక్షిణ సుడాన్ ప్రజలు "సూడాన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ" అనే దళాన్ని ఏర్పాటుచేసుకున్నారు. వీరు సూడాన్ సైన్యం తోను, జన్జావాట్ సబ్యులతోను పోరాటాలు చేసారు ఈ పోరాటంలో అనేక మంది సాదారణ ప్రజలు అసువులుబాసారు. అదే సమయంలో అమెరికాలోని ట్విన్ టవర్స్ ను  తీవ్రవాదులు కుల్చివేసారు, ఒసామా బిన్ లాడెన్ సుడాన్లో దాక్కున్నాడని సమాచారం తెలియడంతో అమెరిక ఆగ్రహించింది, సౌత్ సూడాన్ లోని పోరాటాలను గమనించి అక్కడి సుడాన్ పీపుల్ లిబరషణ్ ఆర్మీకి అత్యాధునిక ఆయుధాలు, డబ్బును అందించింది. ఈ పరిణామంతో సుడాన్ చిక్కుల్లో పడ్డది, బషీర్ ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టినా అవి సత్ ఫలితాలను ఇవ్వలేదు. సౌత్ సూడాన్ ప్రజలు గెరిల్ల పోరాటాల ద్వారా జన్జావిడ్ సబ్యులను మట్టుపెట్టడం ప్రారంబించారు. 2005 వరకు కొనసాగిన ఈ అంతర్ యుద్ధంలో 20 లక్షల మంది మరణించగా, మరో 40 లక్షల మంది నిర్వాసితులయ్యారు. 2005 సమగ్ర శాంతి ఒప్పందం ద్వారా 6 ఏళ్ళ పాటు సౌత్ సుడాన్ కు ప్రత్యేక ప్రభుత్వం ఏర్పాటుతో పాటు, ఆరేళ్ళ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణకు అద్యక్షుడు బషీర్ ఒప్పుకున్నాడు. 6 ఏళ్ళ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణలో 98.9% మంది ప్రజలు తమకు స్వేచ్చ కావాలని, సౌత్ సుడాన్ ప్రత్యేక దేశం కావాలని కోరుకున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా జూలై 9, 2011 న సౌత్ సుడాన్ స్వాతంత్ర్య దేశంగా అవతరించింది. సల్వా కీర్ మయర్దిట్ స్వతంత్ర దక్షిణ సూడాన్ కు మొదటి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 

                       సౌత్ సూడాన్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి, ముందుగా ప్రజలకు తిండి, విద్యనూ అందించాలి. దేశంలో ఉన్న ఆయిల్, గ్యాస్, రబ్బర్ యొక్క పరిశ్రమలన్నీ నార్త్ సుడాన్ లోనే ఉండడంతో కొంత కాలం ఆ దేశంపై ఆధారపడవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు నార్త్ సుడాన్ వాసుల జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి, నీరు, సహజ వాయువులు, ఆయిల్ అన్ని సౌత్ సుడాన్ లోనే  ఉండడంతో తమ భవితవ్యంపై వారు బెంగ పడుతున్నారు. మొత్తానికి 70 ఏళ్ళ పాటు సాగిన సుదీర్గ పోరాటం లక్షలాది మంది నెత్తుటి తర్పణంతో ముగిసింది, నేడు సౌత్ సూడాన్ ప్రపంచం పటంలో స్వాతంత్ర దేశంగా కొనసాగుతుంది. 

                               అన్నార్థులు అనాధలుండని
                               ఆ నవయుగమదెంత దూరం
                               కరువంటూ కాటకమంటూ 
                               కనిపించని కాలాలేపుడో 
                               పసిపాపల నిదుర కనులలో 
                               మురిసిన భవితవ్యం ఏదో 
                               గాయ పడిన కవి గుండెలలో
                               రాయబడని కావ్యాలెన్నో...  


(ప్రపంచంలో  ఎన్నో ప్రాంతాలు పాలకుల వివక్షకు గురయ్యి, సహజ వనరుల దోపిడీకి గురయ్యి తమ ఉనికి కోసం పోరాడుతూ విజయాన్ని సాధించాయి అలంటి పోరాటాలలో సౌత్ సుడాన్ పోరాటం ఒకటి. వివక్షకు, దోపిడీకి వ్యతిరేఖంగా జరిగిన ఇలాంటి పోరాట చరిత్రలు తెలుసుకోవడం ఎంతైనా అవసరమని  భావించి ఈ పోస్ట్ చేసాను..)

జన్జావిడ్ - ఒంటెలు గుర్రాలను మేపుతూ ఎడారులలో జీవించే అరబ్బుల సమూహం

21, జూన్ 2013, శుక్రవారం

ఆ చల్లని సముద్ర గర్భం...

దాశరథి కృష్ణమాచార్యులు రాసిన ఆ చల్లని సముద్ర గర్భం పాట మీ కోసం... 


20, జూన్ 2013, గురువారం

ఇది కథ కాదు.. నిజం!!


                      నిండు గర్బిని 9 నెలలు నిండాయి, తోటి కోడలికి బిడ్డ పుట్టింది, నెలలు నిండినా ఈమెకు బిడ్డ పుట్టలేదు, నరక యాతన అనుభవిస్తుంది, ఆసుపత్రి సదుపాయాలు అంతగా అభివృద్ధి చెందలేదు, ఆదుకోవడానికి అన్న వచ్చాడు, ఆమె యాతనను తొలగించే ప్రయత్నం చేసాడు మంత్రసానిని పిలిపించాడు, కాని ఆ ఇంటిపెద్ద-1 అందుకు ఒప్పుకోలేదు, అన్నను కొట్టి పంపించాడు, ఎంతో కష్టం మీద తోటికోడలు బిడ్డను కన్న సంవత్సరానికి ఆమె బిడ్డను కన్నది,  ఇంటిపెద్ద-1 బిడ్డను ఆమెకు ఇవ్వడానికి ఒప్పుకోలేదు, నిర్దాక్షిణ్యంగా ఆమెను, ఆమె  అన్నను చంపాలని ప్రయత్నించాడు, కాని ఆమె చావలేదు పారిపోయింది, మల్లి వచ్చి తన బిడ్డను తాను తీసుకపోగలననే గట్టి నమ్మకంతో వెళ్ళింది, ముక్కు పచ్చలారని  8 ఏళ్ళు ఆ పసిబిడ్డ కు పెళ్లి చేసాడు ఆ ఇంటి పెద్ద-1,  హైదరాబాద్లో కాపురం పెట్టారు, కొన్నాళ్ళకు ఆ ఇంటి పెద్ద-1 మరణించాడు, ఒకడు పోయాడు అనుకుంటే ఇంకొకడు దాపరించాడు, ఈ కుటుంబంలో కూడా ఓ కుటుంబ పెద్ద-2, అత్త, ఆడబిడ్డ తయారయ్యారు ఆమెను కాల్చుకు తినడానికి.  ఆమె తల్లి కొంతకాలానికి మల్లి వచ్చింది, తీవ్రంగా గొడవపడింది, కాని కుటుంబ పెద్ద-2 ఏమి మాట్లాడలేదు, రెండేళ్ళ తర్వాత ఆమె భర్త కుడా విడిపోవడానికి సిద్దపడ్డాడు కాని అప్పుడూ ఆ కుటుంబపెద్ద-2 ఒప్పుకోలేదు, ఏదో ఒకటి సర్దిచెప్పి కలిసి ఉండటానికి ఒప్పించాడు. పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత ఆమె కష్టాలకు అంతులేదు, ఉద్యోగం చెయ్యమని ఒత్తిడి తెచ్చాడు ఆ భర్త, ఒక ఉద్యోగంలో చేరింది,  జీతం డబ్బు తెచ్చి భర్తకు ఇవ్వాలి, ఆమె సంపాదన మీదనే కుటుంబమంత బతికి బట్టకట్టాలి, కాని ఆమె సంపాదనే ఆమెకు ఇవ్వరు, మొత్తం వాళ్ళే ఖర్చు చేసుకుంటారు, భర్త సంపాదన అతని వ్యసనాలకే సరిపోదు, తాగి ఇంటికి వచ్చి ఆమెను గొడ్డును బాదినట్టు బాదుతాడు, బూతులు తిడతాడు, గర్భం వస్తే (కొన్నినెలలపాటు సంపాదన ఉండదని) ఆమెకు గర్భం వచ్చినప్పుడల్లా గర్భ స్రావం చేయించడం మొదలు పెట్టారు, అన్ని బరించింది, సహించింది, మధ్యమధ్యలో అప్పుడప్పుడు తల్లి వచ్చి చూసి వెళ్తుండేది, దుబాయ్ లో ఉన్న తండ్రి తిరిగి వచ్చాడు, తండ్రి తనతండ్రి(కుటుంబ పెద్ద-1) చేసిన గోరాన్ని విని తట్టుకోలేకపోయాడు, బిడ్డను కాపాడుకోవడానికి కదిలాడు, ఆయనతో పాటు కుటుంబమంతా కదిలింది. 
                      ఇది గమనించిన ఆ కుటుంబ పెద్ద-2 రాజీకి వచ్చాడు,  ఇకపై సొంత కూతురిలా చూసుకుంటామని, ఈసారి గర్భ స్రావం చేయించమని హామీ ఇచ్చాడు, కాని వారి వేదింపులు ఆగలేదు, చివరికి ఆ తండ్రి తన కూతురికి న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు, కుటుంబ పెద్ద-2 కదిలాడు ఆమెకు విడాకులు ఇప్పిస్తానని ఊరందరిముందు ఒప్పుకున్నాడు, కాని ఆమె అత్త, ఆడపడుచు, ఇతర కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకోలేదు, ఆమె ఇంటి నుండి వెళ్ళిపోతే ఖర్చులకు చిల్లి గవ్వ కూడా ఉండదని వాళ్లకు తెలుసు, ఆమెను ఎలాగైనా వెళ్ళకుండా ఆపాలని ప్రయత్నించారు, కుటుంబ పెద్దను బ్లాక్ మెయిల్ చేసారు, కుటుంబ పెద్ద వెనక్కి తగ్గాడు, ఆమె బతుకు మారలేదు, అప్పటినుండి ఆమె తల్లి, తండ్రి పోరాడుతూనే ఉన్నారు, కాని ఆ కుటుంబ పెద్ద-2 మాత్రం మీ కూతురును ఇప్పుడు పంపిస్తాను, అప్పుడు పంపిస్తాను అంటూ గడువులు పెడుతున్నదే తప్ప ఆమెకు విముక్తి కల్పించడం లేదు,ఆమె తల్లి విముక్తికి పాటు పడిన ఆమె మేన మామలు ఒకరు ఆమె వైపు నిలిస్తే ఇంకొకరు ఆమెను పట్టించుకోవడం మానేశారు, ఇప్పుడామెకు కొత్త మిత్రుడు పుట్టుకోచ్చాడు అతను గతంలో ఎంతో మంది అతివలకు మేలు చేసినవాడు, అతను కుడా మేలు చేస్తానని అంటున్నాడు, కాని అతనికి ఎన్నో పనులు ఉన్నాయి, అందులో ఇది ఒకటి మాత్రమె. తల్లి, తండ్రులు మాత్రం ఆమెకు విముక్తి కల్పించాలని అదే పనిగా పెట్టుకొని పోరాడుతూనే ఉన్నారు. 
                          కార్పోరేషన్ ఎన్నికలు వచ్చాయి, కుటుంబ పెద్ద-2 నిలబడుతున్నాడు, అత్త, ఆడపడుచు, భర్త అందరు ప్రచారం కోసం ఊరంతా తిరుగుతున్నారు, ఇంటిపెద్ద-2కు వ్యతిరేఖంగా ఆమె తండ్రి పోటీ చేస్తున్నాడు, ఆమె తన తండ్రి, తల్లి సాయంతో గృహ హింసా చట్టం కింద భర్త, అత్త, ఆడపడుచు, కుటుంబ పెద్ద-2ల మీద కేసు పెడదామని అనుకుంటుంది, అలా జరిగితే ఎన్నికల నాటికి కుటుంబమంత జైల్లో కూర్చుంటుంది, ఎన్నికలలో డిపాసిట్ కుడా రాదని గమనించిన ఆమే భర్త, అత్త లు ఆమె పై విపరీతమైన ప్రేమను కురిపిస్తున్నారు, ఎలాగైనా ఆమెను కేసు వెయ్యకుండా చూడడమే కాకుండా, ఆమెను తన తండ్రికే వ్యతిరేఖంగా ప్రచారం చేసేలా మార్చాలని పథకం వేసారు, ఎన్నడు పట్టించుకోని ఆ కుటుంబ పెద్ద-2 ఆమెకు బంగారు హారం చేయిస్తున్నాడట..? ఎన్నడు మాట్లాడని ఆడబిడ్డ తండ్రి డైరెక్షన్లో ఆమె ను మంచి చేసుకోవాలని చూస్తుంది, ఇప్పుడు ఆమె అవసరం ఆ కుటుంబం మొత్తానికి కలిగింది, కాని నిజంగా తన కోసం, తన విముక్తి కోసం పోరాడుతున్న తన తల్లి, తండ్రుల వైపే ఆమె నిలిచింది, వారి మార్గనిర్దేశనం లో నడుస్తుంది, త్వరలోనే ఆమెకు విముక్తి లబిస్తుంది అని ఆశిద్దాం, మరి మీ ఓటు ఎవరికీ ఆమెను మొదటినుండి విముక్తి చెయ్యాలని చుసిన ఆమె తల్లి, తండ్రులకా..? లేక ఆమెను చిత్ర హింసలు పెట్టిన ఆమె అత్తా, ఆడపడుచులకా..? తమ స్వార్ధం కోసం ఆమెను ఉపయోగించుకునే కుటుంబ పెద్దకా..? 

( కుటుంబ పెద్ద-1,2- కాంగ్రెస్ అధిష్టానం, భర్త-సీమంద్ర, అత్త-టి డి పీ, ఆడపడుచు-టీ కాంగ్రెస్, తల్లి- తెలంగాణా ఉద్యమం, తండ్రి- టి అర్ ఎస్, మిత్రుడు- బి జె పీ, అన్న తర్వాత మామలు- కమూనిస్ట్ పార్టిలు, ఆమె- తెలంగాణ. బంగారు హారం- ప్యాకేజి)
                                                 

17, జూన్ 2013, సోమవారం

మీడియా పై కత్తి కట్టిన చంద్రబాబు..


తెలుగు టి వి చానల్స్ లో న్యూస్ కోసం 24 గంటల ఛానల్ లు 2004 లో మొదలయ్యాయి.  టి వి 9, ఈ టి వి 2 మొదట ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత 20 న్యూస్ చానల్స్ ఇప్పటివరకు వచ్చాయి, ఇందులో ఏదో ఒక పార్టీకో లేదా నాయకుడికో కొమ్ముకాస్తూ సాగుతున్నవే ఎక్కువ. బయటి దుమారం కంటే ఈ మీడియాలలో కనిపించే దుమారమే ఎక్కువ, యజమానుల ప్రత్యర్దులను టార్గెట్ చేస్తున్న కథనాలు ఎక్కువై పోయింది, ఇది అవతలి వారికి రుచించక పోవచ్చు, కానీ వారికి ఓ మీడియా ఉంటుంది కదా, వారు వీరిని అదేస్థాయిలో విమర్శిస్తారు, అయితే విమర్శలోనూ తేడాలు ఉంటాయి, అవతలి వారి విధాన లోపాలను ఎత్తిచూపడం ఒకరకమైతే, అవతలి వారు చేసే ప్రతి పనిని పని గట్టుకొని విమర్శించడం మరో రకం. 
                             తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన 2009 నవంబర్ నెల నుండి ఒక పది రోజుల పాటు అన్ని మీడియా ఛానళ్ళు, పత్రికలూ ఉద్యమాన్ని అద్బుతంగా కవర్ చేసాయి, కాని సమైక్యంద్ర అనే కృత్రిమ ఉద్యమం ప్రారంభం కాగానే మీడియా సంస్థల అసలు రంగు బయట పడింది, అప్పటి నుండి ఇప్పటి వరకు సీమంద్ర మీడియా తెలంగాణా రాదని, "హైదరాబాద్ ను తెలంగాణా లో ఉన్చేస్తార, ఆంద్రా కు ఇచ్చేస్తార" అంటూ విష ప్రచారాలు మొదలుపెట్టింది, సీమంద్రలో పట్టుమని పది మంది కుడా లేని క్లిప్పింగ్ లను మల్లి మల్లి చూపిస్తూ,తెలంగాణాలో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఉద్యమంతో సమానం చెయ్యడంలో సఫలం అయ్యారు, కాని నిజం నిప్పు వంటిది కదా అది ఆలస్యం గా ఐన బయటకు వస్తుంది కదా, సమైక్యంద్ర అనే బోగస్ ఉద్యమం కాల గర్భం లో కలిసిపోయింది, తెలంగాణా వాదం నిత్యమై, సత్యమై నేటికి పోరాడుతున్నది. 

                              తెలంగాణా ఉద్యమానికి వ్యతిరేఖంగా టి వి 9 గతంలో ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందించిన జె ఎ సి ఆ ఛానల్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది, అప్పుడు మీడియా స్వేచ్చపై చాల మంది నాయకులు మాట్లాడారు, ముఖ్యంగా సీమాంద్రకు చెందిన టి డి పీ నాయకులు ఆ రోజు మీడియా స్వేచ్చ గురించి మాట్లాడారు, నాడు ఎం ఎస్ ఓలు , కేబుల్ టి వి ఆపరేటర్ లపై కెసులు నమోదు చేసి జైల్లో పెట్టారు, బలవంతంగా కార్యక్రమాలను ప్రసారం చేసుకున్నారు, కాని ఆనాడు టి వి 9 కోల్పోయిన ప్రజల విశ్వాసం నేటికి తిరిగి సంపాదించు కోలేకపోయింది,                                                                                                           
                         తెలంగాణా కొరకు ప్రత్యేకంగా ఒక ఛానల్ అవసరమైన సమయం లో ఉద్యమ సారధి కె సి అర్ చొరవతో టీ న్యూస్ (ఒకప్పుడు రాజ్ న్యూస్) అనే ఛానల్ పుట్టుకొచ్చింది, ఈ ఛానల్ కేవలం తెలంగాణా లోని పది జిల్లాల్లోనే తన ప్రసారాలు కొనసాగిస్తున్నది, తెలంగాణా పై ప్రభుత్వాలు చూపిన అలసత్వాన్ని, జరుగుతున్న అన్యాయాలను కళ్ళకు కట్టింది, చారిత్రక సత్యాలను వెలుగులోకి తెచ్చింది, ఉద్యమ కారులను కీర్తించింది, ఉద్యమ ద్రోహులను విమర్శించింది, చంద్ర బాబు అనుసరిస్తున్న ద్వంద వైఖరిని,  విదాన నిర్ణయాలలోని లోపాలను ఎత్తి చూపింది, టి డి పీ నేటికి తాను తీసుకున్న అస్పష్ట విదానాలను కప్పిపుచ్చుకోవడానికి టీ మీడియా పై నిషేధం విదించింది. 
     సాక్షి మీడియా సంగతిచూస్తే, వారు టి డి పీ ని, చంద్ర బాబు ను పనిగట్టుకొని విమర్శించి ఉండవచ్చును, కాని సమస్య ఎక్కడ వచ్చిందంటే సాక్షి పుట్టేవరకు అధికారంలో ఉన్నా,లేకపోయినా మీడియా చేత పొగడ బడిన చంద్ర బాబుకు ఒక్కసారిగా ఆయనను విమర్శించే మీడియా వచ్చే సరికి తట్టుకోలేకపోయారు, ఆయన అనేక సార్లు సాక్షి మీడియాపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేసారు, చివరికి ఆ మీడియాను బహిష్కరించారు, చంద్ర బాబు ఎంత ప్రజా కంటక పాలన చేసినా నాటి మీడియా ఆయనకు వెన్ను దన్నుగా ఉన్నది, రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడం ఆ మీడియాకు ఇష్టం లేదు, అందుకే పనిగట్టుకొని ఆయన విధానాలనే కాదు, ఆయన ప్రతి కదలికను విమర్శించడం ప్రారంభించింది, 2009 ఎన్నికలకు ముందు ఒక ప్రచార సభలో "చంద్రబాబుకైనా ముఖ్య మంత్రి కావాలని ఉందొ లేదో కాని, ఆ రెండు పత్రికలకు మాత్రం నేను తప్పుకుంటే ఇప్పుడే ఆయనను సి ఎం చెయ్యాలనే ఆత్రుత ఉందని" రాజశేఖర్ రెడ్డి  బహిరంగంగా విమర్శించారు, కాని ఏనాడు ఆయన ఆ మీడియాను బహిష్కరించలేదు. 

                           తొమ్మిది ఏళ్ళ సుదీర్గ పాలన, మరో తొమ్మిదేళ్ళ ప్రతిపక్ష నాయకుడు, మాట్లాడితే ప్రజాస్వామ్య పాటాలు చెప్పే ఆయనకు ప్రజాస్వామ్యంలో కేవలం అనుకూల వార్తలు రాసేవారే కాదు విమర్శించే వారు కూడా ఉంటారని తెలియక పోవడం విడ్డూరం. విమర్శలో వాస్తవం ఉంటె ప్రజలు చదువుతారు, అదే అన్ని అభూత కల్పనలే ఉంటే ఆ పత్రిక కాని లేదా ఆ టి వి ఛానల్ కాని తన విశ్వసనీయత కోల్పోతుంది, తమకు నచ్చని మీడియా ను బహిష్కరించడం అందరు ప్రారంభిస్తే తెలంగాణాకు వ్యతిరేఖ వార్తలు ప్రసారం చేసే 20 ఛానల్ లను తెలంగాణాలో బహిష్కరించ వలసి వస్తుంది, ఇది ఆరోగ్య కరమైన పరిణామమో కాదో చంద్ర బాబే ఆలోచించుకోవాలి. 
                                             

13, జూన్ 2013, గురువారం

మన అసెంబ్లీ పై మన జెండా..



 తెలంగాణా ఆకాంక్ష మరోసారి ప్రపంచానికి తెలియచెప్పిన అద్బుత దృశ్యం నిన్న ఆవిష్కరించబడింది, తెలంగాణా జె ఎ సి ఇచ్చిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం దిగ్విజయం గా ముగిసింది, తెలంగాణా ను ప్రజలు ఎంత బలం గా కోరుకుంటున్నారు అనే విషయం నిన్న ఆద్యంతం జరిగిన సంఘటనలు గమనిస్తే తెలుస్తుంది. 



                         తెలంగాణా జనం సీమంద్ర సర్కార్పై రణ నినాదం చేసారు, మా అసెంబ్లీ మాకే కావలి అంటూ పది జిల్లాల ప్రజలు హైదరాబాద్ నడిబోడ్డుకు చేరుకున్నారు, ఎన్ని నిర్బందాలు విదించిన ఆ నిర్బంధాలను చేదించుకుంటూ జన సునామి రాజధాని కి చేరుకుంది, ఆ జన ప్రవాహ జోరుకు భీతిల్లిన సి ఎం ఉదయం 5 గంటలకే అసెంబ్లీకి వచ్చి కూర్చున్నాడు, వెళ్ళే టప్పుడు దామోదర రాజనర్సింహ కార్ లో వెళ్ళిపోయాడు, దొంగలు పడే రాత్రి వచ్చిండు, దొంగోలె పోయిండు, కాన్వాయి కుడా లేకుండా డొక్కు కారులో వచ్చిన సి ఎం సాబు 6 నిమిషాల అసెంబ్లీ నడుపుకొని ఇంటికి పోయిండు. వేలాది మందిని అరెస్ట్ చేసారు, తెలంగాణా నాయకుల0దరిని అరెస్ట్ చేసారు, 45 మంది ఎం ఎల్ ఎ లు, ఇద్దరు ఎం ఎల్ సి లు, ముగ్గురు ఎం పీ లు అరెస్ట్ అయిన  వారిలో ఉన్నారని సి పీ తెలియజేసారు. 

              హైదరాబాద్ లో ప్రభుత్వం బంద్ ప్రకటించింది, మాములుగా ఐతే ప్రతిపక్షాలు, లేదా వివిధ సంస్థలు బంద్ ప్రకటిస్తారు కాని నిన్న జె ఎ సి ఇచ్చిన చెలో అసెంబ్లీ పిలుపు సందర్బంగా ప్రభుత్వం వణికిపోయింది, ప్రభుత్వం  పాటశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించింది, మద్యం దుకాణాలకు 3 రోజులు బంద్ ప్రకటించింది, రైళ్ళు, బస్సులు రద్దు చేసారు, ఫ్లై ఓవర్ లు మూసేసారు, దాదాపు 20,000 మంది పోలీస్ లతో సిటీ మొత్తాన్ని ఖాకీవనం చేసారు, సిటీ చుట్టూ 17 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసారు, అసెంబ్లీ లోకి సందర్శకులను నిషేదించారు, బయటికి వెళ్ళాలంటే ఐ డి ప్రూఫ్ తప్పనిసరి, ఉస్మానియా యూనివర్సిటీ అన్ని పరిక్షలు రద్దు చేసింది, నారాయణ గుడ, అర్ టి సి క్రాస్ రోడ్, హిమాయత్ నగర్ నుండి అసెంబ్లీ వైపు వెళ్ళే వాళ్ళు నడిచి వెళ్ళాలని పోలీస్లు ఆదేశించారు, చాల రోడ్ లు ముసెసారు, దారులు మళ్ళించారు, మార్కెట్లు కూడా బంద్. 

                              జిల్లాల్లో దాదాపు 30,000 వేల మందిని అరెస్ట్ చేసారు, అయితే అప్పటికే 2 లక్షల మంది తెలంగాణా ప్రజలు హైదరాబాద్ చేరుకున్నరని సమాచారం, నిన్న ఉదయం 5 గంటలకే డొక్కు కార్ లో కాన్వాయి లేకుండా సి ఎం అసెంబ్లీ కి చేరుకున్నారు, స్పీకర్ కూడా అదే సమయం లో చేరుకున్నారు. 


                    పోలీసుల నిర్బంధాలను లెక్కచేయకుండా టీఆర్‌ఎస్వీ విద్యార్థులు ఉదయాన్నే అసెంబ్లీని ముట్టడించారు. సీమాంధ్ర అహంకారాన్ని ఎదురించి, నిర్బంధాలను అధిగమించి తమ లక్ష్యాన్ని విద్యార్థులు ముద్డాడారు. అసెంబ్లీ ముందు తెలంగాణ నినాదాలు మార్మోగాయి. అయితే విద్యార్థులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. విద్యార్థులను పోలీసులు బూటు కాళ్లతో గొడ్లను తన్నినట్లు తన్నారు. ఇవేమి లెక్క చేయని విద్యార్థులు జై తెలంగాణ నినాదాలు వినిపించారు. మరోవైపు కానిస్టేబుళ్లను ఉద్దేశించి మీరు సీమాంధ్ర ప్రభుత్వంలో ఇలాగే ఉండిపోతారు... తెలంగాణ వస్తే ఎస్‌ఐ అవుతావు కదా అని విద్యార్థి నేత రమేష్ ఆగ్రహంతో అన్నారు. తాము ఏమి దోచుకోవడానికి రాలేదని, తెలంగాణ ఆకాంక్షను చాటి చెప్పేందుకు వచ్చామని చెప్పారు. అసెంబ్లీకి ముట్టడిచి వచ్చిన ఓయూ విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. 

                           అసెంబ్లీ మొదటిసారి వాయిదా పడిన సందర్భంలో టి అర్ ఎస్ ఎల్ పీ భవనం పైకి ఎక్కినా టి అర్ ఎస్ ఎం ఎల్ ఎ లు వినయ భాస్కర్, సమ్మయ్య లు నల్ల జెండాలతో అసెంబ్లీ పైకి ఎక్కి నల్ల జెండా ఎగుర వేసారు. 
అనేక బృందాలుగా వచ్చిన వివిధ సంఘాలు నిర్బందాలు చేదించుకొని లక్ష్యాన్ని చేరుకున్నారు, మధ్యాహ్నం అకస్మాత్తు గా అసెంబ్లీ ముందుకు వచ్చిన విజయశాంతి పోలీస్ లకు చుక్కలు చూపించారు, కార్యకర్తలతో వచ్చిన విజయ శాంతి అసెంబ్లీ ముట్టడించారు.

                       జె ఎ సి చైర్మెన్ ప్రొ. కోదండ రామ్ ను, జాగృతి అధ్యక్షురాలు కవిత ను ఇందిరా పార్క్ వద్ద అరెస్ట్ చేసారు, లంచ్ సమయం లో గన్ పార్క్ కు చేరుకున్న తెలంగాణా ఉద్యమకారిణి  రేహమున్నిస ను పోలీస్ లు అరెస్ట్ చేసారు. మరోసారి ఓ యు రణరంగం అయ్యింది, బాష్పవాయు గోళాలు,  రాబ్బర్బుల్లేట్ లు, వాటర్ కేనన్ లు ప్రయోగించి విద్యార్థులను అనచివేయ్యలని ప్రయత్నించారు, ఉదయం నుండి జరిగిన ఈ నిర్భందాన్ని వ్యతిరేఖిస్తూ కె సి అర్ శనివారం బంద్ కు పిలుపునిచ్చారు. 


12, జూన్ 2013, బుధవారం

స్మిత..జన హిత..

        

ఐఏఎస్-2001 బ్యాచ్‌కు చెందిన స్మితా సబర్వాల్, 2011 ఏప్రిల్ 18న కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న ఆమె, జిల్లాపై తనదైన ముద్ర వేశారు. ‘అమ్మలాలన’, ‘మార్పు’ పథకాల అమలులో రాష్ట్రంలోనే జిల్లాను ఆదర్శంగా నిలిపారు. వసతి గృహాల్లో విద్యాప్రమాణాల పెంపునకు ‘స్కైప్’ విధానం ప్రవేశపెట్టి, విద్యార్థులకు చేరువయ్యారు. ముఖ్యంగా విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ‘అమ్మలాలన’ ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ ప్రసవాల పెంపు కోసం విశేష కృషి చేశారు. గురుకులాల్లో, వసతి గృహాల్లో ‘స్కైప్’ విధానం ప్రవేశపెట్టి విద్యాప్రమాణాల పెంపుకోసం పాటుపడ్డారు. నేరుగా విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కారం దిశగా కృషి చేస్తూ విద్యార్థులకు చేరువయ్యారు. ‘మార్పు’ పథకాన్ని వివిధ శాఖలకు అనుసంధానం చేస్తూ అమలులో జిల్లాను ముందుంచారు. 

              ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోనూ ‘స్కైప్ వీడియో కాలింగ్ సిస్టమ్’ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు మెరుగుపడేందుకు కృషి చేశారు. ప్రభుత్వ పథకాల అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నందుకు గాను 2012-13కు రెండు బంగారు పతకాలను సైతం స్మితా అందుకున్నారు. ‘20 సూత్రాల పథకం’ అమలులో 2011-12కు గాను జిల్లాను నంబర్‌వన్ స్థానంలో నిలిపి, సీఎం నుంచి అవార్డు అందుకున్నారు. అమ్మలాలన, ప్రజావాణి కార్యక్రమాల అమలులో, నిర్మల్ భారత్ అభియాన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచి, కొనుగోళ్లలోనూ వరుసగా రెండేళ్లు జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. జనరిక్ మందులను పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు మహిళా సమాఖ్య ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో జనరిక్ మందుల షాపును ప్రారంభించారు.

                అవినీతి దరిచేరకుండా కఠినంగా వ్యవహరించారు. కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొత్తలోనే ఒకేసారి 40 మంది తహసీల్దార్లను బదిలీ చేశారు. 15 మంది జిల్లా స్థాయి అధికారులనూ బదిలీ చేయడంతో పాటు పలువురిని మాతృ సంస్థలకు పంపించారు. గ్రామాల్లో అందుబాటులో ఉండని వైద్యులపై, రోగులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కొరడా ఝులిపించారు. బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గత నెల నుంచే స్మితా సబర్వాల్ బదిలీ అవుతారన్న ప్రచారం జరిగింది. ఆమె హైదరాబాద్ లోని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(NHRM) డైరెక్టర్ గా నియమించబడ్డారు .                                                   -from namaste telangana

10, జూన్ 2013, సోమవారం

బాబూ..అవిశ్వాసానికి టైమొచ్చింది..!



చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతాడా , లేదా..? అనే విషయమై ఇద్దరు స్నేహితుల మాటా-మంతి ... 

వేణు: మహేష్! చంద్ర బాబు అవిశ్వాసం పెదతాడంటావా ..?

మహేష్ : చంద్ర బాబు అవిశ్వాసం ఎప్పుడు పెడతాడో తెలుసా నీకు..?

వేణు: ఆ తెలుసు, ప్రభుత్వం ఎప్పుడు వీక్ గా ఉంటె అప్పుడు పెడతాడు,

మహేష్ : అక్కడే పప్పులో కాలేశావ్ నువ్వు, కాంగ్రెస్ ప్రభుత్వం కూలదని తెలిసినప్పుడే చంద్ర బాబు అవిశ్వాసం పెడతాడు,

 వేణు: అదెట్లా..? చంద్ర బాబు కాంగ్రెస్ కి వ్యతిరేఖం కదా..? ఆ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ కి పోటీగా కదా..?

మహేష్: నిజమే, ఆ పార్టీ పుట్టింది కాంగ్రెస్ కు వ్యతిరేఖం గానే, కాని ఇప్పుడు మాత్రం చంద్ర బాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నాడు.

వేణు: అదెలాగ..?

మహేష్: గతం లో అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెట్టాడు,  ప్రభుత్వం మైనారిటీ లో ఉన్నప్పుడు కాకుండా పీ అర్ పీ విలీనం ఐపోయాక, ప్రభుత్వానికి ఎం డోకా లేదని తెలిసాక ప్రవేశపెట్టాడు.

వేణు: అప్పుడేదో ఒకసారి అలా జరిగి ఉండొచ్చు, దానికే చంద్ర బాబు కాంగ్రెస్ సర్కార్ ను కాపాడుతున్నాడు అని ఎలా అనుకుంటాం..?

మహేష్:  ఒక్కసారి కాదు ఇప్పటికి అనేక సార్లు రుజువయ్యింది, గత అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం మైనారిటీ లో ఉంది, మిగతా విపక్షాలన్నీ అవిశ్వాసం పెట్టమని టి డి పీ పై ఒత్తిడి తెచ్చాయి కాని చంద్రబాబు కు తెలుసు అప్పుడు అవిశ్వాసం పెడితే ప్రభుత్వం పడిపోతుందని అందుకే అవిశ్వాసం ప్రవేశ పెట్టకపోగా, టి అర్ ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వెయ్యకూడదని పార్టీ విప్ కుడా జారి చేసాడు చంద్ర బాబు, అలా కిరణ్ సర్కార్ ను కాపాడాడు. 

వేణు: కాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడాల్సిన అవసరం చంద్ర బాబు కు ఏముంది..? 2014 లో యు పీ ఎ లో చేరుతున్నడా ఏమిటి..?

మహేష్: యు పీ ఎ లో చేరడు కాని, తక్షణం ఎన్నికలు రావడం ఆయనకు ఇష్టం లేదు, తెలంగాణా పై అస్పష్ట విదానం తో తెలంగాణా లో ఆయన విశ్వాసం కోల్పోయాడు, ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రైతులను ఏ నాడు పట్టించుకోక పోవడం తో ఈయన మారాను అని చెప్పిన అక్కడి జనం కూడా నమ్మడం లేదు, అయితే ప్రభుత్వ అస్థిరత, ఆకాశం లో నిత్యావసరాల ధరలు, పవర్ కట్, రైల్, బస్ చార్జీల పెంపు, పంటలు ఎండిపోవడం, తాగే నీరు కూడా  దొరకని పరిస్థితులు, విద్యుత్ సర్ చార్జీలు ఇలా జనం సమస్యలతో అల్లాడుతుంటే పట్టించుకునే నాదుడే లేని సమయం లో చంద్ర బాబు పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళడంతో ఆయనకు కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది, ఇప్పుడే ఎన్నికలకు వెళ్ళకుండా మరికొంత సమయం తీసుకొని మరో బస్సు యాత్రో, సైకిల్ యాత్రో చేసి బలపడుదామని ఆయన భావిస్తున్నారు. 

వేణు: అవునా, మరి ఇక ఎన్నికల దాక అవిశ్వాసం పెట్టడన్న మాట.. 

మహేష్: లేదు, ఈ సమావేశాల్లో అవిశ్వాసం పెట్టడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇవి గత బడ్జెట్ సమావేశాల కొనసాగింపు, బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాసం పెట్టారు కాబట్టి ఒకే సెషన్ లో రెండు సార్లు అవిశ్వాసం పెట్టడానికి ఛాన్స్ లేదు , కావున ఒక వేల మల్లి వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తే అంధులు చంద్రబాబు అవిశ్వాసం ప్రవేశ పెడతాడు. 

వేణు: అంత ఖచ్చితం గా ఎలా చెప్పగలవు..? 

మహేష్: ఎలా అంటే నిన్న ( జూన్ 9) పార్టీ విప్ ను దిక్కరించారని 15 మంది ఎం ఎల్ ఎ లపై వేటు వేసారు సభాపతి, వీరు 2014 సాదారణ ఎన్నికల వరకు వీరు మాజిలే, ఎందుకంటే ఎన్నికలకు సంవత్సరం లోపు కాళీ ఐన నియోజక వర్గాల్లో ఉపఎన్నికలు నిర్వహించరు, 2009 మే నెలలో అసెంబ్లీ ఏర్పడింది, 2009 జూన్ 4 న మొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కావున ఎలా చూసుకున్న ఎన్నికలకు సంవత్సర కాలం కన్నా తక్కువగానే ఉంది, ఫలితం గా అసెంబ్లీ లో సంఖ్యా బలం 294 నుండి 279 కి తగ్గింది, కావున మాజిక్ ఫిగర్ 137, కాంగ్రెస్ పార్టీ కి ప్రస్తుతం 145 మంది ఎం ఎల్ ఎ ల మద్దతు ఉంది కావున ప్రభుత్వం చాలా కాలం తర్వాత మైనారిటి నుండి మెజారిటి కి వచ్చింది, ఇప్పడు బాబు అవిశ్వాసం ప్రవేశపెడితే ప్రభుత్వం కూలిపోదు, గతం లో కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యాడు అనే నిందను తొలగించుకోవచ్చు, కాబట్టి ఈ అవకాశాన్ని చంద్ర బాబు వదులుకోడు. 

వేణు: ఓహో..! ఇంతుందా..? చంద్ర బాబు మామూలోడు కాదు జిత్తుల మారే.. !

8, జూన్ 2013, శనివారం

చేపా! నీవైనా నిజాలు చెప్పవా..?


           బత్తిని సోదరులకు అన్యాయం జరుగుతున్నది. వారు అన్ని వ్యాధులను నయం చేస్తామ ని మోసపూరితంగా డబ్బు సంపాదించడంలేదు. శాస్త్రం మొత్తం చదివామని డిగ్రీలు పెట్టుకొని స్టార్ హోటళ్ల మాదిరి ఆసుపత్రులు కట్టి సొమ్ము చేసుకుంటలేరు. వారసత్వంగా సంక్రమించిన జ్ఞానం తో మందు తయారు చేసి, నమ్మకంతో వచ్చిన వాళ్లకు ఉచితంగానే ఇస్తున్నారు. ఉచితంగానే ఇవ్వడం వల్ల ఒకసారి ప్రయత్నిస్తే నష్టమేమీ లేదని చాలామంది బత్తిని సోదరులు ఇచ్చే చేపమందు తీసుకుంటున్నరు.
మందుల స్వభావం ఏదైనా వాటి వాడకంలో విశ్వాసాలు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకు అల్లోపతిలో క్యాన్సర్‌కు ఇచ్చే కొన్ని మందులు చాలా సందర్భాల్లో పని చేయవని తెలుసు. అయినా వాడే వాళ్లు చాలామందే ఉన్నారు. మందు ఇప్పించకపోతే లోకం ఏమనుకుంటుందోనన్న భయంతో కొందరు మందు ‘గుణం’ ఇస్తుందేమోనన్న ఆశతో కొందరు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. సరే అన్ని పేషెంట్‌కు తెలియవు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ తెలిసిన కొన్ని ఆసుపత్రులు ప్రజల బలహీనతలను వాడుకొని వ్యాపారం చేసుకుంటున్నా యి. ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

ఒక మందు గురించి మొత్తం తెలిసినా దాని వాడకం హేతుబద్ధంగా ఉంటుందన్న గ్యారంటీలేదు. రైతులు వాడే పురుగులమందులు ఇం దుకు ఉదాహరణ. వాటి వాడకంలో పెట్టుబడి పెరుగుతున్నది. దీర్ఘకాలంలో అనేక అనర్థాలు తలెత్తుతున్నాయి. పంట దిగుబడి కోసం ఆశప డి ప్రజలు విశ్వాసంతో వాడుతున్నారు.ఆ విశ్వాసాలను వాడుకొని కంపెనీలు సొమ్ము చేసుకోవాలనుకున్నప్పు డు, మార్కెట్‌పైన, ఆర్థిక వ్యవస్థపైన ఆధిపత్యాన్ని పొందాలనుకున్నప్పుడు సమాజం జోక్యం చేసుకోవాలి. మందు వాడకానికి సంబంధించిన చర్చలో నైతి క విలువల ప్రస్తావనను వదలకూడదు. శాస్త్రం తెలిసి మోసపూరితంగా వ్యవహరించే కంపెనీలు, సంస్థలకన్నా, వ్యాపారుల కన్నా బత్తిని సోదరులు వేయిట్లు నయం. చేప మందుపై వ్యాఖ్యానించేటప్పుడు ఈ విషయాన్ని గుర్తించాలి.

మందు కంపోజిషన్ ఏమిటన్నది రెండవ విషయం. బత్తిని సోదరులకు అనుభవపూర్వకంగా మందు పనిచేస్తుందని మాత్రమే తెలుసు. అంతకుమించి న ఆధునిక విశ్లేషణ వారికి తెలియదు. బత్తిని సోదరులే కాదు సాంప్రదాయక సమాజం ప్రపంచాన్ని అనుభవం ఆధారంగానే అర్థం చేసుకున్నది. ప్రకృతికి సంబంధించిన జ్ఞానమంతా ఆధునిక శాస్త్రమే పెంపొందించలేదు.మనిషి పుట్టినప్పటి నుంచి ప్రకృతిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రకృతి భగవంతుని సృష్టి కాబట్టి భగవంతున్ని తెలుసుకోగలిగితే ప్రకృతి అర్థమవుతుందనిభావించేవాళ్లు గణనీయమైన సంఖ్య లో ఉన్నారు.

కానీ మతంతో నిమిత్తం లేకుండా ప్రకృతిని తెలుసుకునే ప్రయత్నాలు కూడా ఆది నుంచి ఉన్నాయి. లోకాయతలు ఆ కోవకు చెందినవారే. రోజువారీ జీవితంలో కూడా అనేకరంగాల్లో మనిషి ఈ దృక్పథాన్ని కొనసాగించాడు. మంత్రాలకు చింతకాయలు రాలవన్న సామెత సమాజరీతికి ప్రతీక.

కనుక అనుభవపూర్వకంగా అనేకానేక విషయాలపై మనుషులు సమాచారాన్ని, అవగాహనను పెంపొందించుకున్నారు. రైతులు వ్యవసాయానికి సంబంధించిన జ్ఞానాన్ని నేత కార్మికులు పత్తి గురించి, నేత గురించి, మాదిగ కులస్థుల తోలు గురించి ఈవిధంగానే వివిధ కులాలకు చెందినవారు ప్రకృతిలోని అనేక అంశాల గురించి లోతైన అవగాహనను సంపాదించుకున్నారు. ఈ పద్ధతిలోనే చేప మందు వచ్చింది. అనుభవం ఆధారంగానే రూపొందింది. అనువంశికంగా బత్తిని సోదరులకు చేరుకున్నది. ఆధునిక శాస్త్రం ప్రకృతిని అర్థం చేసుకోవడానికి రెండు విధాలుగా దోహదపడింది. మతానికి ఉన్న ఆధిపత్యాన్ని ఛేదించి హేతువును పూర్తిగా విముక్తి చేసింది. స్వేచ్ఛగా, ధైర్యంగా ఆలోచించగల శక్తినిచ్చింది.మరోవైపు ప్రకృతిని శోధించడానికి కొత్త పద్ధతులను ఆధునిక శాస్త్రం ముందుకు తీసుకొచ్చింది.

ఈ నూతన దృక్పథం మొదట పాశ్చాత్య దేశాలలో పెంపొందినా క్రమంగా మూడో ప్రపంచదేశాలకు విస్తరించింది. ఈ విస్తరణకు తోడ్పడిన మూడో ప్రపంచ దేశాలకు తెచ్చిన పాశ్చాత్య దేశాల పరిజ్ఞానాన్ని మూడో ప్రపంచ దేశాలకు తెచ్చిన పాశ్చాత్య దేశాల సంస్థలు కూడా ఉన్నాయి. ఈ సంస్థలు మూడో ప్రపంచదేశాలపై పాశ్చాత్య దేశాల గుత్త సంస్థల ఆధిపత్యాన్ని స్థాపించడానికి తోడ్పడినాయి.

హరిత విప్లవం ఇందుకు ఉదాహరణ. పంటల ఉత్పత్తిని పెంచడానికి పాశ్చాత్య పరిజ్ఞానాన్ని మూడో ప్రపంచ దేశాలపై అమెరికా బలవంతంగా రుద్దింది. అం దువల్ల స్థానిక పంటలు, స్థానిక వ్యవసాయ పద్ధతులు, పరిజ్ఞానం నిర్లక్ష్యానికి లోనయ్యాయి. అందువల్ల పెట్టుబడి పెరిగి చిన్న, సన్నకారు రైతు లు తీవ్రంగా నష్టపోయారు.
అందుకే స్థానీయమైన జ్ఞానాన్ని చూస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించడం అవసరం. శాస్త్రం స్థానిక వనరులను గుర్తించడానికి, వాటి ప్రయోజనాలను తెలుసుకోవడానికి, స్థానికంగా అందుబాటులో ఉన్న జ్ఞానాన్ని పెంపొందించడానికి తోడ్పడాలి. కానీ ఆబాధ్యతను స్వీకరించే బదులు మూడో ప్రపంచదేశాల శాస్త్రజ్ఞులు చాలామంది పాశ్చాత్య దేశాలను అనుకరిస్తున్నారు.

ఇన్ని శాస్త్రీయ పరిశోధన సంస్థలు ఉండి బత్తిని సోదరులు వాడే మందుపై పరిశోధన చేయకపోవడమే శోచనీయం. ఎక్కడి నుంచో వచ్చిన జర్మనీ శాస్త్రవేత్తలు అందుకు కృషి చేశారే తప్ప మనవారు పట్టించుకోలేదు.తప్పచేసింది ఈ సంస్థలే కానీ బత్తినిసోదరులు కాదు. చైనాలో సాంప్రదాయకంగా వాడే ఆక్యుపంక్చర్ పై పరిశోధన చేసి ఆచికిత్స పద్ధతిని ఆధునీకరించారు. మనదేశంలో ఆప్ర యత్నాలు లేవు. అట్లాంటి ప్రయత్నా లు చేసిన తర్వాత చేప మందు పరిమితుల గురించి మాట్లాడవచ్చు. అట్లాంటి కృషి జరగకుండా దాన్ని మూఢనమ్మకంగా చిత్రీకరించి, హేతువు విముక్తికి అది ఏకైకమైన అవరోధంగా చూపడం మనం కోరుకుంటున్న శాస్త్రానికీ వ్యతిరేకమే.

మరొకవైపు శాస్త్రీయ పరిశోధన పూర్తి గా నిష్ఫాక్షికమైన జ్ఞానాన్ని అందిస్తుందని అనుకోవడం కూడా సరైనది కాదు. పరిశోధనాంశం ఎంపికను, పరిశోధన లో సేకరించే సమాచారాన్ని వ్యక్తుల ఆలోచనలు, అభివూపాయాలు, ఆశయా లు ప్రభావితం చేస్తాయి. సమాచార సేకరణ ఆధారంగా సిద్ధాంతీకరించే ప్ర మాణాన్ని కూడా వ్యక్తిగత భావాలు ప్ర భావితం చేస్తుంటాయి. ఉదాహరణకు నాకు తెలిసిన మేరకు ఈమందుపై పరిశోధన చేసిన సంస్థలు అందులో కార్టిజన్లు లేవని తేల్చి చెప్పారే తప్ప అం దులో ఏమున్నదో చెప్పలేదు. అంటే కార్టిజన్లు మాత్రమే దమ్మును నివారిస్తాయి. వేరొక మందుకు ఆశక్తి లేదని నిర్ధారణకు వచ్చి ఆ ప్రమాణం ఆధారంగా చేప మందును పరిశీలించడం అన్యాయం. చేపమందులో ఉన్నదేమిటో నిర్ధారించి అది ఏవిధంగా పనిచేస్తుందో తేల్చవలసి ఉన్నది.

మనిషి హేతువు విముక్తి, దాని ఆధారంగా సమాజాన్ని నిర్మించుకునే పరిస్థితి రావాలని కోరుకుందాం. ఆ క్రమంలో స్థానిక అనుభవాల ఆధారంగా కలిగిన జ్ఞానాన్ని పెంపొందించుకుందాం. ఆ జ్ఞానాన్ని సమా జ పునర్నిర్మాణానికి ఏమేరకు ఉపయోగపడితే ఆమేరకు ఉపయోగించుకుందాం. ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం గా పనిచేద్దాం. అంతేకాని కార్పొరేట్ సంస్థలను వదిలి, బహుళజాతి సం స్థలను పక్కనబెట్టి పిట్ట మీద బ్రహ్మస్త్రం వేసినట్టు ఎవ్వరికి హానిచేయని బత్తిని సోదరులపై దాడి తగదు.
పొఫెసర్ ఎం. కోదండరామ్ 
నమస్తే  తెలంగాణా నుండి 

6, జూన్ 2013, గురువారం

మన ఆత్మ గౌరవ పతాకకు రెండేళ్ళు..!!


తెలంగాణా ఉద్యమం ఉవ్వేతున్న సాగుతున్న సందర్భం, ఒకవైపు కె సి అర్ నిరాహార దీక్ష మరో వైపు ఉస్మానియా విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి పిలుపు, బందులు, ధర్నాలు తెలంగాణా జనమంతా రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు, తెలుగు పత్రికలూ, టి వీ లు బాగా ప్రాజెక్ట్ చేస్తున్నాయి, వారి కళ్ళ ముందు వచ్చిన అతి పెద్ద ప్రజా ఉద్యమం ఇదే కదా మరి, ఎప్పుడో ఎక్కడో పుస్తకాల్లో చదువుకున్నదే తప్ప నిజంగా అతి పెద్ద ప్రజా ఉద్యమం అంటే ఎలా ఉంటుందో రుచి చూపింది తెలంగాణా ఉద్యమం. 
                           కేంద్రం దిగి వచ్చి ఒక ప్రకటన చేసింది, ఈ ప్రకటన తర్వాత సీమంద్ర నాయకులంతా రాజీనామా లు చెయ్యడంతో మీడియా కూడా రెండుగా విడిపోయింది, సమైక్యంద్ర ఉద్యమం బలంగా జరుగుతుందని అన్ని ఛానళ్ళు చూపించాయి, కాని అప్పటికి ఉన్న తెలంగాణా మీడియా చాల తక్కువ, హెచ్ ఎం టి వి  తెలంగాణా కు మద్దతిచ్చే ఛానల్ కాని వాళ్ళు పూర్తిగా తెలంగాణా వాదాన్ని వినిపించలేదు, సీమంద్రలో కూడా వారి ఛానల్ నడవాలి కావున సమైక్యంద్ర అనే కృత్రిమ ఉద్యమాన్ని కూడా ప్రాజెక్ట్ చేసారు, శైలేష్ రెడ్డి జీ 24 గంటలు ఛానల్ లో ఛానల్ హెడ్ గా ఉన్న రోజులు, ఆయన పాలమూరు బిడ్డ, తెలంగాణా వాదాన్ని నేత్తికేత్తుకున్నాడు, అక్కడ జరుగుతున్నదంతా దొంగ ఉద్యమం అని చెప్పిండు, పొట్టి శ్రీ రాములు విశాలాంద్ర కోసం ప్రాణత్యాగం చెయ్యాలే అని చెప్పిండు, గ్రామాల్లో ఉన్న ప్రజా వాణి ని జీ 24 గంటలు వినిపించింది, అయితే తెలంగాణా కొరకు అంటూ ప్రత్యేకంగా ఒక ఛానల్ లేదు, ఇక పత్రికల విషయానికి వస్తే అన్ని ఆంద్ర విష పుత్రికలే తప్ప తెలంగాణా పత్రికలు లేనే లేవు(ఒక్క వార్త పత్రిక మాత్రం తెలంగాణాకు అనుకూలంగా స్టాండ్ తీసుకుంది), కాని జరుగుతున్న విషయాలను వార్తలుగా చూపిస్తే సరిపోదు, ఇప్పుడు కావాల్సింది కేవలం వార్తను వార్త గా అందించే మీడియా కాదు, సీమంద్ర మీడియా శక్తులతో పోరాడి నిలవగలిగే ఒక తెలంగాణా బావుటా కావలి, తడారిపోయిన వ్యధా జీవుల గుండె గొంతుకల ఆక్రందనలను ప్రపంచానికి తెలియజీసే పొలికేక కావలి. 
                     తెలంగాణా గత చరిత్రను, వర్తమాన ఉద్యమాన్ని, భవిష్యత్తును దిశానిర్దేషణం చేసే విషయంలో ఒక లోటు ఏర్పడింది, తెలంగాణా కోసమే ఒక పత్రిక రావాల్సిన చారిత్రక అవసరం ఆ సమయం లో ఏర్పడింది, సరిగ్గా ఆ సమయంలో ఆ లోటును పూడ్చడానికి "మన పత్రిక- మన ఆత్మ గౌరవం" అంటూ దూసుకు వచ్చిన తెలంగాణా కర పత్రిక " నమస్తే తెలంగాణా". 2011 జూన్ 06 తెలంగాణా అమరవీరుడు శ్రీ కాంత్ చారి తల్లి శంకరమ్మ చేతులమీదుగా విడుదలయ్యింది, ప్రో . జయశంకర్ సార్  దిశా నిర్దేశనం లో, సి ఎల్ రాజం చైర్మెన్ గా, అల్లం నారాయణ ఎడిటర్ గా ప్రారంభమైన పత్రిక ఏ పార్టీ కి కొమ్ముకాయకుండా స్వతంత్రంగా తెలంగాణా ఉద్యమ పక్షాన నిలబడి పనిచేస్తుంది, నేడు నమస్తే తెలంగాణా పత్రిక ద్వితీయ వార్షికోత్సవం, పత్రిక ప్రారంభమైన రెండు సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా ప్రచురించబడే సీమంద్ర పత్రికలను తట్టుకొని నిలబడి రాష్ట్రంలోని 4 ప్రధాన పత్రికలలో ఒకటిగా నిలిచింది. 

                     నమస్తే తెలంగాణా ఆదివారం అనుబంధంగా వస్తున్న బతుకమ్మ, మహిళలు బతుకమ్మ పండుగకు ఒక్కొక్క పువ్వును ఎంత అందంగా పెరుస్తారో, అలా బతుకమ్మ లో తెలంగాణా గత సమాజం, పాటలు, పొడుపుకథలు, వీరుల చరిత్రలు, గొప్ప కట్టడాలు, పుణ్య క్షేత్రాలు, మరుగున పడ్డ చరిత్ర ఆనవాళ్ళు, వర్తమాన ఉద్యమ విశేషాలు ఇలా దేనికది ఏర్చి కూర్చి  అందంగా ఒక బతుకమ్మలాగా ముస్తాబు చేస్తారు, నిజంగా తెలంగాణా సంస్కృతి, ఆచారాలు, వీర చరిత్రలను ప్రపంచానికి తెలియజేసే సాంస్కృతిక వారధిగా బతుకమ్మ తన బాధ్యతను నెరవేరుస్తుంది, ఈ ఆదివారం అనుబంధంలో ప్రతి పేజి విలువైనదే, ప్రతి పుట తెలంగాణా కు సంభందించిన ఏదో ఒక విషయాన్నీ తెలియజేస్తుంది. నమస్తే తెలంగాణా ప్రచురించిన  "టెంపుల్స్ ఆఫ్ తెలంగాణ" అనే పుస్తకం తెలంగాణా లోని ప్రాచీన ఆలయాలను, మరుగున పడ్డ పాత కట్టడాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను వెలుగులోకి తెచ్చింది. 
                           తెలంగాణా గత వైభవంతో పాటు నేటి ఉద్యమ పరిణామాలను  ఏ రోజుకారోజు ప్రజలకు అందిస్తూ ఉద్యమ స్పూర్తిని నింపుతుంది నమస్తే తెలంగాణా పత్రిక, ఆంద్ర వలసవాదుల దోపిడిని ఎండగడుతూ, సీమంద్రుల కుట్రలను చేదిస్తూ, తెలంగాణా ప్రజలకు వాస్తవాలను అందిస్తూ, ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్నది నమస్తే తెలంగాణా పత్రిక, కేవలం తెలంగాణా విషయాలే కాకుండా ఒక పత్రిక కు కావాల్సిన అన్ని లక్షణాలతో తెలుగులో స్టాండర్డ్ వార్తా పత్రికలలో ఒకటిగా వెలుగొందుతున్న మన ఆత్మ గౌరవ పతాక నమస్తే తెలంగాణా మరిన్ని వార్షికోత్సవాలను జరుపుకోవాలని మనసార కోరుకుంటుంది ***నా తెలంగాణా!! 
                      

4, జూన్ 2013, మంగళవారం

భాజాపా ద్వంద నీతి..!



తెలంగాణా ఉప ప్రాంతీయ పార్టీ లతో అసాధ్యం, ప్రత్యేక రాష్ట్రము కావాలంటే జాతీయ పార్టీలతోనే సాధ్యం, కాంగ్రెస్ ఎలాగు తెలంగాణా ఇవ్వదని తేలిపోయింది, ఇక మిగిలిన ఒకే ఒక ప్రత్యామ్నాయం భా జా పానే, 2014 ఎన్నికలకు ముందే పార్లమెంట్ లో బిల్లు పెట్టండి మద్దతు ఇస్తాం, లేదా మేం అధికారం లోకి రాగానే 100 రోజులలో తెలంగాణా ఇస్తాం, ఇవి ఇప్పటివరకు మనం విన్న బి జె పీ నాయకుల మాటలు. 
                           నిజంగా బి జె పీ తెలంగాణా ఇస్తుందా..? అంటే నమ్మడం కష్టమే, ఎందుకంటే గతం లో జరిగిన పరిణామాలు ఈ విషయాన్నీ స్పష్టం చేస్తున్నాయి, 1996 లో కాకినాడ తీర్మానం లో తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రచారం చేసారు, అటు కేంద్రం లోను, ఇటు రాష్ట్రం లోను( టి డి పీ+బి జె పీ) ఎన్ డి ఎ అధికారం లోకి వచ్చింది, ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలను ఏర్పాటు చేసారు కాని తెలంగాణా ని మాత్రం ఏర్పటు చెయ్యలేదు, టి అర్ ఎస్ పార్టీ ఆవిర్భవించి తెలంగాణా నినాదాన్ని ఎత్తుకున్న తర్వాత బి జె పీ అగ్ర నాయకుడైన అద్వానీ రాజధాని ఉన్నవాళ్లు రాష్ట్రం అడగడం ఏమిటి..? అని వ్యాఖ్యానించారు, 2004 లో ఓడిపోయాక 2006 లో తెలంగాణా పై తీర్మానం చేసి మేము తెలంగాణా కు అనుకూలం అని చెప్పారు, 2009 లో జె ఎ సి ఏర్పడేంత వరకు వీరు ఎలాంటి ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొనలేదు, నిజానికి 2009 సాధారణ ఎన్నికలలో గెలిచిన ఇద్దరు అభ్యర్థులు తెలంగాణా వాదం పై గెలవలేదు. 
                              తాజాగా జూన్ 3 వ తేదిన బి జె పీ నిర్వహించిన ఆత్మ గౌరవ సభలో దాని అసలు రంగు బయటపడింది, తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఆ పార్టీ లో చేరుతున్నానని నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి ప్రకటించి బి జె పీ లో చేరిన అదే సభలో ఆ పార్టీ జాతియాధ్యక్షుడు ఆ పార్టీ విధానాన్ని స్పష్టం చేసాడు, బి జె పీ అధికారం లోకి వస్తే వచ్చిన ఒక సంవత్సర కాలం లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేస్తాం, ఒక వేల మిత్రపక్షాలతో కలిసి ఎన్ డి ఎ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణా పై ఆయా పార్టీలను ఒప్పించడానికి కొంత సమయం పడుతుంది అని వ్యాఖ్యానించారు, ప్రస్తుత పరిస్థితులలో కేంద్రంలో ఏక పార్టీ పాలన వచ్చే అవకాశాలు లేవు, తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది, అంటే రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యల ద్వార తెలిసిందేమిటంటే ఎన్ డి ఎ కూడా తెలంగాణా పై ఏకాభిప్రాయం కుదరాలి అంటుందని, ఏకాభిప్రాయం కుదరడం లేదంటూ యు పీ ఎ ఇప్పటికే 9 సంవత్సరాలుగా సాగాదీస్తుంది, మరి ఎన్ డి ఎ అధికారం లోకి వస్తే వాళ్ళు ఎన్నిరోజులు సాగదీస్తారో మరి..?
                        సభ ముగిసాక రాజ్ నాథ్ సింగ్ పార్టీ నాయకులూ కార్య కర్తలతో ఈ సారి ఎన్నికలలో తెలంగాణా లో 15 ఎం పీ, 40 ఎం ఎల్ ఎ సీట్లు గెలవాలని చెప్పారు, దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ప్రభుత్వంలో భాగం కావాలి, డిల్లి లో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన ఎం పీ లను సమకుర్చాలి అలా అయితేనే వీళ్ళు తెలంగాణా గురించి ఆలోచిస్తారు లేకపోతే లేదు, ఐన ఎవరు వచ్చిన వాళ్ళకు కావాల్సింది వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టే ఎం పీ స్థానాలే తప్ప ప్రజల ఆకాంక్ష ఎవరికీ పట్టదు, రేపు ఒకటో రెండో ఎం పీ సీట్లు ఇచ్చి తెలంగాణా రాష్ట్రం ఇవ్వమంటే ఎన్ డి ఎ మాత్రం ఎందుకు ఇస్తుంది..? కావున తెలంగాణా స్వీయ రాజకీయ శక్తిగా ఎదగాలి, అప్పుడే డిల్లి ని పాలించాలనుకునే వాళ్ళకు మన అవసరం పడుతుంది, వాళ్ళు అప్పుడు మన దగ్గరకు వచ్చి తెలంగాణా ఇస్తారు. కావున తెలంగాణా పార్టీ లనే గెలిపిద్దాం.. తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుందాం...
                                                      - (మూల వార్త ఆంద్ర జ్యోతి పత్రిక నుండి తీసుకోబడింది)

                                              

2, జూన్ 2013, ఆదివారం

అసెంబ్లీ తీర్మానం, ప్రకటనతో సరి పెడతారా..?


డిల్లి లో ఎం జరుగుతుంది..? తెలంగాణా కాంగ్రెస్ ఎం పీ లు ఇద్దరు టి అర్ ఎస్ లో చేరడం పై కోర్ కమిటిలో చర్చించిన అధినాయకురాలు ఎం చెప్పారు..? నిజం గా కాంగ్రెస్ నుండి ప్రకటన వస్తుందా..?
                  ఎన్నికల సీజన్ దగ్గరపడుతుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణా విషయం లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తుంది, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎం పీలు పార్టీని వీడడంతో  హడావిడి ప్రకటనలు గుప్పిస్తుంది కాంగ్రెస్, మొదట 6 గురు ఎం పీ లు పార్టీ మారడానికి సిద్దపడిన ఆ తర్వాత ఆ సంఖ్యను 2 కు తగ్గించడంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం వ్యూహం ఫలించింది, ఇప్పుడు పార్టీ మారిన ఇద్దరితో మరికొంత మంది బయటకు వెళ్ళకుండా తీసుకునే చర్యల పైనే నిన్నటి కోరే కమిటి మీటింగ్ జరిగింది, ఎం పీ లు బయటకు వెళ్ళడం తో తెలంగాణా కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేఖం అనే ప్రచారం ప్రజల్లోకి వెళ్ళకుండా ఉండే విధంగా జాగ్రత్తపడాలని సోనియా గాంధీ అదేశినట్టు సమాచారం, అందుకే నేడు ఆజాద్ నెలరోజుల్లో ప్రకటన అని చెప్పారు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అయితే ఏకంగా ఇంకో అడుగు ముందుకు వేసి జూలై 5 న పార్లమెంట్ లో బిల్లు పెడుతున్నారని చెప్పాడు, ఇవన్ని కేవలం జనాల్ని మభ్యపెట్టడానికి మాత్రమే, కాంగ్రెస్ తెలంగాణా కు వ్యతిరేఖం అనే భావన ప్రజలకు కలగకూడదనే...
                          మరి ఇలా సంకేతాలు ఇచ్చి ఊరికే ఉంటారా..? తెలుగు దేశం పార్టీ మహా నాడులో తెలంగాణా పై తీర్మానం చేసింది ఐన ఆ తీర్మానం పై సమైక్యంద్ర వాదులనుండి ఎలాంటి వ్యతిరేఖత వ్యక్తం కాలేదు, కావున ప్రకటన చెయ్యడానికి కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఏర్పడింది, ప్రస్తుత పరిస్థితులే ఉంటె 2014 ఎన్నికలలో కాంగ్రెస్ కు కేవలం 8 ఎం పీ స్థానాలు వస్తాయని పలు సర్వేల్లో తేలింది, అదే ఇప్పుడు తెలంగాణా పై ప్రకటన చెయ్యడం ద్వార ఆ సంఖ్యా పెరుగుతుంది, పైగా మహానాడు తీర్మానం పై వ్యతిరేఖత రాకపోవడం వాళ్ళ సీమంద్ర నేతల్లో కుడా మార్పు వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది, కావున ఇప్పుడు ఏదో ఒక ప్రకటన చెయ్యవలసిన పరిస్థితి. 
              మరి ఎం ప్రకటన చేస్తారు..? అసెంబ్లీ లో తీర్మానం చేయించి, తెలంగాణా  ప్రక్రియ మొదలయ్యింది, రాష్ట్ర ఏర్పాటు జరగడానికి కొంత సమయం పడుతుంది కావున 2014 ఎన్నికలు ఐపొయెవరకు ఆగాలని ప్రకటించే అవకాశం ఉంది, ఈ ప్రకటన కు కెసిఅర్ కన్విన్సు అయ్యి జె ఎ సి ని ఒప్పించాగలిగితే రాష్ట్రంలో టి అర్ ఎస్, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. 
                                     ఒకవేళ యు పీ ఎ 3 తెలంగాణా ఇస్తే టి డి పీ నుండి వచ్చిన దళితుడు కడియం శ్రీ హరి కంటే కాంగ్రెస్ నుండి వచ్చిన వివేక్ వైపే కాంగ్రెస్ మొగ్గుచూపుతుంది కావున వివేక్ లేదా వినోద్ సి ఎం అయ్యే అవకాశం ఉంది, అందుకే ఈ జంపింగ్..?? కావున మరోసారి మోసం చెయ్యడానికి కాంగ్రెస్ సిద్ధమయ్యింది, తెలంగాణా ప్రక్రియ మొదలయ్యిందని అసెంబ్లీ లో ఒక తీర్మానం చేసి ప్రజలను 2014 లో వాడుకొని ఒధిలెయ్యదనికి పథకం సిద్ధమయ్యింది, కావున తెలంగాణా వాదులు టి అర్ ఎస్ లోకి వస్తున్న వలసలను చూసి మురిసి పోకుండా జాగ్రత్తగా పరిణామాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది, తెలియకుండానే మరో మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి కావున తస్మాత్ జాగ్రత్త ..!
                             

                  

1, జూన్ 2013, శనివారం

సరస్వతీ పుష్కరాలు..!!


సరస్వతి పుష్కరాలు కరీం నగర్ జిల్లా కాళేశ్వర క్షేత్రం లో కల్లెక్టర్ స్మిత సబర్వాల్ చేతుల మీదుగా ప్రారంభం అయ్యాయి, ప్రతి 12 సంవత్సరాలకు ఒక సారి జరిగే ఈ పుష్కరాలు ఈ ఏడు జూన్ 10 వ తేది వరకు కొనసాగనున్నాయి.  
             హిందువులు అత్యంత పవిత్రంగా భావించే త్రివేణి సంగమ స్థలంలో ఉన్న 3 నదుల్లో ఒకటి సరస్వతి నది, దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది బయటికి కనిపించదు, అంతర్వాహిని, నేల అడుగు భాగం నుండి ప్రవహించి అలహాబాద్ లో త్రివేణి సంగమ స్థానం లో గంగ, యమునా నదుల తో కలిసి ప్రవహిస్తుంది. గంగ, యమునా నదులతో పాటు 12 ఏళ్ళకు ఒకసారి సరస్వతి నది పుష్కరాలు కూడా జరుగుతాయి. 

 కాళేశ్వరం లో సరస్వతి నది: ఇక్కడి విశేషం ఏంటంటే దేవాలయంలో శివ లింగం పై పోసిన నీళ్లన్నీ ఆ శివలింగం ముక్కుద్వారా సేకరించి గోదావరి-ప్రాణహిత సంగమ స్థానంలో కలుపుతుంది, ఆ నాటి శాస్త్ర విజ్ఞానం యొక్క అధ్బుతం ఇది, శివుని ముక్కు నుండి గోదావరి-ప్రాణహిత నది సంగమ స్థానం వరకు గొట్టాల ద్వార అంతర్ వాహినిగా వెళ్ళే శివున్ని అర్చించిన జలమే సరస్వతి నది, అందుకే ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి, అలాగే ఇక్కడ సరస్వతి దేవాలయం కూడా ఉంది.
                  పాలకుల అశ్రద్ద కారణం గా అరకొర సాధుపాయలతోనే ఈ ఏడు పుష్కరాలు కొనసాగుతున్నాయి, ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పుష్కరాల కోసం కేటాయించలేదు, ఆలయ ఆదాయం నుండే ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 
కాలేశ్వరానికి సంభందించిన మరిన్ని విశేషాల కోసం కింది లింక్ చూడండి.. http://naatelangaana.blogspot.in/2011/10/1.html