హోం

13, జూన్ 2013, గురువారం

మన అసెంబ్లీ పై మన జెండా..



 తెలంగాణా ఆకాంక్ష మరోసారి ప్రపంచానికి తెలియచెప్పిన అద్బుత దృశ్యం నిన్న ఆవిష్కరించబడింది, తెలంగాణా జె ఎ సి ఇచ్చిన చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం దిగ్విజయం గా ముగిసింది, తెలంగాణా ను ప్రజలు ఎంత బలం గా కోరుకుంటున్నారు అనే విషయం నిన్న ఆద్యంతం జరిగిన సంఘటనలు గమనిస్తే తెలుస్తుంది. 



                         తెలంగాణా జనం సీమంద్ర సర్కార్పై రణ నినాదం చేసారు, మా అసెంబ్లీ మాకే కావలి అంటూ పది జిల్లాల ప్రజలు హైదరాబాద్ నడిబోడ్డుకు చేరుకున్నారు, ఎన్ని నిర్బందాలు విదించిన ఆ నిర్బంధాలను చేదించుకుంటూ జన సునామి రాజధాని కి చేరుకుంది, ఆ జన ప్రవాహ జోరుకు భీతిల్లిన సి ఎం ఉదయం 5 గంటలకే అసెంబ్లీకి వచ్చి కూర్చున్నాడు, వెళ్ళే టప్పుడు దామోదర రాజనర్సింహ కార్ లో వెళ్ళిపోయాడు, దొంగలు పడే రాత్రి వచ్చిండు, దొంగోలె పోయిండు, కాన్వాయి కుడా లేకుండా డొక్కు కారులో వచ్చిన సి ఎం సాబు 6 నిమిషాల అసెంబ్లీ నడుపుకొని ఇంటికి పోయిండు. వేలాది మందిని అరెస్ట్ చేసారు, తెలంగాణా నాయకుల0దరిని అరెస్ట్ చేసారు, 45 మంది ఎం ఎల్ ఎ లు, ఇద్దరు ఎం ఎల్ సి లు, ముగ్గురు ఎం పీ లు అరెస్ట్ అయిన  వారిలో ఉన్నారని సి పీ తెలియజేసారు. 

              హైదరాబాద్ లో ప్రభుత్వం బంద్ ప్రకటించింది, మాములుగా ఐతే ప్రతిపక్షాలు, లేదా వివిధ సంస్థలు బంద్ ప్రకటిస్తారు కాని నిన్న జె ఎ సి ఇచ్చిన చెలో అసెంబ్లీ పిలుపు సందర్బంగా ప్రభుత్వం వణికిపోయింది, ప్రభుత్వం  పాటశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించింది, మద్యం దుకాణాలకు 3 రోజులు బంద్ ప్రకటించింది, రైళ్ళు, బస్సులు రద్దు చేసారు, ఫ్లై ఓవర్ లు మూసేసారు, దాదాపు 20,000 మంది పోలీస్ లతో సిటీ మొత్తాన్ని ఖాకీవనం చేసారు, సిటీ చుట్టూ 17 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసారు, అసెంబ్లీ లోకి సందర్శకులను నిషేదించారు, బయటికి వెళ్ళాలంటే ఐ డి ప్రూఫ్ తప్పనిసరి, ఉస్మానియా యూనివర్సిటీ అన్ని పరిక్షలు రద్దు చేసింది, నారాయణ గుడ, అర్ టి సి క్రాస్ రోడ్, హిమాయత్ నగర్ నుండి అసెంబ్లీ వైపు వెళ్ళే వాళ్ళు నడిచి వెళ్ళాలని పోలీస్లు ఆదేశించారు, చాల రోడ్ లు ముసెసారు, దారులు మళ్ళించారు, మార్కెట్లు కూడా బంద్. 

                              జిల్లాల్లో దాదాపు 30,000 వేల మందిని అరెస్ట్ చేసారు, అయితే అప్పటికే 2 లక్షల మంది తెలంగాణా ప్రజలు హైదరాబాద్ చేరుకున్నరని సమాచారం, నిన్న ఉదయం 5 గంటలకే డొక్కు కార్ లో కాన్వాయి లేకుండా సి ఎం అసెంబ్లీ కి చేరుకున్నారు, స్పీకర్ కూడా అదే సమయం లో చేరుకున్నారు. 


                    పోలీసుల నిర్బంధాలను లెక్కచేయకుండా టీఆర్‌ఎస్వీ విద్యార్థులు ఉదయాన్నే అసెంబ్లీని ముట్టడించారు. సీమాంధ్ర అహంకారాన్ని ఎదురించి, నిర్బంధాలను అధిగమించి తమ లక్ష్యాన్ని విద్యార్థులు ముద్డాడారు. అసెంబ్లీ ముందు తెలంగాణ నినాదాలు మార్మోగాయి. అయితే విద్యార్థులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. విద్యార్థులను పోలీసులు బూటు కాళ్లతో గొడ్లను తన్నినట్లు తన్నారు. ఇవేమి లెక్క చేయని విద్యార్థులు జై తెలంగాణ నినాదాలు వినిపించారు. మరోవైపు కానిస్టేబుళ్లను ఉద్దేశించి మీరు సీమాంధ్ర ప్రభుత్వంలో ఇలాగే ఉండిపోతారు... తెలంగాణ వస్తే ఎస్‌ఐ అవుతావు కదా అని విద్యార్థి నేత రమేష్ ఆగ్రహంతో అన్నారు. తాము ఏమి దోచుకోవడానికి రాలేదని, తెలంగాణ ఆకాంక్షను చాటి చెప్పేందుకు వచ్చామని చెప్పారు. అసెంబ్లీకి ముట్టడిచి వచ్చిన ఓయూ విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. 

                           అసెంబ్లీ మొదటిసారి వాయిదా పడిన సందర్భంలో టి అర్ ఎస్ ఎల్ పీ భవనం పైకి ఎక్కినా టి అర్ ఎస్ ఎం ఎల్ ఎ లు వినయ భాస్కర్, సమ్మయ్య లు నల్ల జెండాలతో అసెంబ్లీ పైకి ఎక్కి నల్ల జెండా ఎగుర వేసారు. 
అనేక బృందాలుగా వచ్చిన వివిధ సంఘాలు నిర్బందాలు చేదించుకొని లక్ష్యాన్ని చేరుకున్నారు, మధ్యాహ్నం అకస్మాత్తు గా అసెంబ్లీ ముందుకు వచ్చిన విజయశాంతి పోలీస్ లకు చుక్కలు చూపించారు, కార్యకర్తలతో వచ్చిన విజయ శాంతి అసెంబ్లీ ముట్టడించారు.

                       జె ఎ సి చైర్మెన్ ప్రొ. కోదండ రామ్ ను, జాగృతి అధ్యక్షురాలు కవిత ను ఇందిరా పార్క్ వద్ద అరెస్ట్ చేసారు, లంచ్ సమయం లో గన్ పార్క్ కు చేరుకున్న తెలంగాణా ఉద్యమకారిణి  రేహమున్నిస ను పోలీస్ లు అరెస్ట్ చేసారు. మరోసారి ఓ యు రణరంగం అయ్యింది, బాష్పవాయు గోళాలు,  రాబ్బర్బుల్లేట్ లు, వాటర్ కేనన్ లు ప్రయోగించి విద్యార్థులను అనచివేయ్యలని ప్రయత్నించారు, ఉదయం నుండి జరిగిన ఈ నిర్భందాన్ని వ్యతిరేఖిస్తూ కె సి అర్ శనివారం బంద్ కు పిలుపునిచ్చారు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి