హోం

17, జూన్ 2013, సోమవారం

మీడియా పై కత్తి కట్టిన చంద్రబాబు..


తెలుగు టి వి చానల్స్ లో న్యూస్ కోసం 24 గంటల ఛానల్ లు 2004 లో మొదలయ్యాయి.  టి వి 9, ఈ టి వి 2 మొదట ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత 20 న్యూస్ చానల్స్ ఇప్పటివరకు వచ్చాయి, ఇందులో ఏదో ఒక పార్టీకో లేదా నాయకుడికో కొమ్ముకాస్తూ సాగుతున్నవే ఎక్కువ. బయటి దుమారం కంటే ఈ మీడియాలలో కనిపించే దుమారమే ఎక్కువ, యజమానుల ప్రత్యర్దులను టార్గెట్ చేస్తున్న కథనాలు ఎక్కువై పోయింది, ఇది అవతలి వారికి రుచించక పోవచ్చు, కానీ వారికి ఓ మీడియా ఉంటుంది కదా, వారు వీరిని అదేస్థాయిలో విమర్శిస్తారు, అయితే విమర్శలోనూ తేడాలు ఉంటాయి, అవతలి వారి విధాన లోపాలను ఎత్తిచూపడం ఒకరకమైతే, అవతలి వారు చేసే ప్రతి పనిని పని గట్టుకొని విమర్శించడం మరో రకం. 
                             తెలంగాణా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన 2009 నవంబర్ నెల నుండి ఒక పది రోజుల పాటు అన్ని మీడియా ఛానళ్ళు, పత్రికలూ ఉద్యమాన్ని అద్బుతంగా కవర్ చేసాయి, కాని సమైక్యంద్ర అనే కృత్రిమ ఉద్యమం ప్రారంభం కాగానే మీడియా సంస్థల అసలు రంగు బయట పడింది, అప్పటి నుండి ఇప్పటి వరకు సీమంద్ర మీడియా తెలంగాణా రాదని, "హైదరాబాద్ ను తెలంగాణా లో ఉన్చేస్తార, ఆంద్రా కు ఇచ్చేస్తార" అంటూ విష ప్రచారాలు మొదలుపెట్టింది, సీమంద్రలో పట్టుమని పది మంది కుడా లేని క్లిప్పింగ్ లను మల్లి మల్లి చూపిస్తూ,తెలంగాణాలో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఉద్యమంతో సమానం చెయ్యడంలో సఫలం అయ్యారు, కాని నిజం నిప్పు వంటిది కదా అది ఆలస్యం గా ఐన బయటకు వస్తుంది కదా, సమైక్యంద్ర అనే బోగస్ ఉద్యమం కాల గర్భం లో కలిసిపోయింది, తెలంగాణా వాదం నిత్యమై, సత్యమై నేటికి పోరాడుతున్నది. 

                              తెలంగాణా ఉద్యమానికి వ్యతిరేఖంగా టి వి 9 గతంలో ప్రసారం చేసిన వరుస కథనాలకు స్పందించిన జె ఎ సి ఆ ఛానల్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది, అప్పుడు మీడియా స్వేచ్చపై చాల మంది నాయకులు మాట్లాడారు, ముఖ్యంగా సీమాంద్రకు చెందిన టి డి పీ నాయకులు ఆ రోజు మీడియా స్వేచ్చ గురించి మాట్లాడారు, నాడు ఎం ఎస్ ఓలు , కేబుల్ టి వి ఆపరేటర్ లపై కెసులు నమోదు చేసి జైల్లో పెట్టారు, బలవంతంగా కార్యక్రమాలను ప్రసారం చేసుకున్నారు, కాని ఆనాడు టి వి 9 కోల్పోయిన ప్రజల విశ్వాసం నేటికి తిరిగి సంపాదించు కోలేకపోయింది,                                                                                                           
                         తెలంగాణా కొరకు ప్రత్యేకంగా ఒక ఛానల్ అవసరమైన సమయం లో ఉద్యమ సారధి కె సి అర్ చొరవతో టీ న్యూస్ (ఒకప్పుడు రాజ్ న్యూస్) అనే ఛానల్ పుట్టుకొచ్చింది, ఈ ఛానల్ కేవలం తెలంగాణా లోని పది జిల్లాల్లోనే తన ప్రసారాలు కొనసాగిస్తున్నది, తెలంగాణా పై ప్రభుత్వాలు చూపిన అలసత్వాన్ని, జరుగుతున్న అన్యాయాలను కళ్ళకు కట్టింది, చారిత్రక సత్యాలను వెలుగులోకి తెచ్చింది, ఉద్యమ కారులను కీర్తించింది, ఉద్యమ ద్రోహులను విమర్శించింది, చంద్ర బాబు అనుసరిస్తున్న ద్వంద వైఖరిని,  విదాన నిర్ణయాలలోని లోపాలను ఎత్తి చూపింది, టి డి పీ నేటికి తాను తీసుకున్న అస్పష్ట విదానాలను కప్పిపుచ్చుకోవడానికి టీ మీడియా పై నిషేధం విదించింది. 
     సాక్షి మీడియా సంగతిచూస్తే, వారు టి డి పీ ని, చంద్ర బాబు ను పనిగట్టుకొని విమర్శించి ఉండవచ్చును, కాని సమస్య ఎక్కడ వచ్చిందంటే సాక్షి పుట్టేవరకు అధికారంలో ఉన్నా,లేకపోయినా మీడియా చేత పొగడ బడిన చంద్ర బాబుకు ఒక్కసారిగా ఆయనను విమర్శించే మీడియా వచ్చే సరికి తట్టుకోలేకపోయారు, ఆయన అనేక సార్లు సాక్షి మీడియాపై బహిరంగంగా అసహనం వ్యక్తం చేసారు, చివరికి ఆ మీడియాను బహిష్కరించారు, చంద్ర బాబు ఎంత ప్రజా కంటక పాలన చేసినా నాటి మీడియా ఆయనకు వెన్ను దన్నుగా ఉన్నది, రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావడం ఆ మీడియాకు ఇష్టం లేదు, అందుకే పనిగట్టుకొని ఆయన విధానాలనే కాదు, ఆయన ప్రతి కదలికను విమర్శించడం ప్రారంభించింది, 2009 ఎన్నికలకు ముందు ఒక ప్రచార సభలో "చంద్రబాబుకైనా ముఖ్య మంత్రి కావాలని ఉందొ లేదో కాని, ఆ రెండు పత్రికలకు మాత్రం నేను తప్పుకుంటే ఇప్పుడే ఆయనను సి ఎం చెయ్యాలనే ఆత్రుత ఉందని" రాజశేఖర్ రెడ్డి  బహిరంగంగా విమర్శించారు, కాని ఏనాడు ఆయన ఆ మీడియాను బహిష్కరించలేదు. 

                           తొమ్మిది ఏళ్ళ సుదీర్గ పాలన, మరో తొమ్మిదేళ్ళ ప్రతిపక్ష నాయకుడు, మాట్లాడితే ప్రజాస్వామ్య పాటాలు చెప్పే ఆయనకు ప్రజాస్వామ్యంలో కేవలం అనుకూల వార్తలు రాసేవారే కాదు విమర్శించే వారు కూడా ఉంటారని తెలియక పోవడం విడ్డూరం. విమర్శలో వాస్తవం ఉంటె ప్రజలు చదువుతారు, అదే అన్ని అభూత కల్పనలే ఉంటే ఆ పత్రిక కాని లేదా ఆ టి వి ఛానల్ కాని తన విశ్వసనీయత కోల్పోతుంది, తమకు నచ్చని మీడియా ను బహిష్కరించడం అందరు ప్రారంభిస్తే తెలంగాణాకు వ్యతిరేఖ వార్తలు ప్రసారం చేసే 20 ఛానల్ లను తెలంగాణాలో బహిష్కరించ వలసి వస్తుంది, ఇది ఆరోగ్య కరమైన పరిణామమో కాదో చంద్ర బాబే ఆలోచించుకోవాలి. 
                                             

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి