సరస్వతి పుష్కరాలు కరీం నగర్ జిల్లా కాళేశ్వర క్షేత్రం లో కల్లెక్టర్ స్మిత సబర్వాల్ చేతుల మీదుగా ప్రారంభం అయ్యాయి, ప్రతి 12 సంవత్సరాలకు ఒక సారి జరిగే ఈ పుష్కరాలు ఈ ఏడు జూన్ 10 వ తేది వరకు కొనసాగనున్నాయి.
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే త్రివేణి సంగమ స్థలంలో ఉన్న 3 నదుల్లో ఒకటి సరస్వతి నది, దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది బయటికి కనిపించదు, అంతర్వాహిని, నేల అడుగు భాగం నుండి ప్రవహించి అలహాబాద్ లో త్రివేణి సంగమ స్థానం లో గంగ, యమునా నదుల తో కలిసి ప్రవహిస్తుంది. గంగ, యమునా నదులతో పాటు 12 ఏళ్ళకు ఒకసారి సరస్వతి నది పుష్కరాలు కూడా జరుగుతాయి.
కాళేశ్వరం లో సరస్వతి నది: ఇక్కడి విశేషం ఏంటంటే దేవాలయంలో శివ లింగం పై పోసిన నీళ్లన్నీ ఆ శివలింగం ముక్కుద్వారా సేకరించి గోదావరి-ప్రాణహిత సంగమ స్థానంలో కలుపుతుంది, ఆ నాటి శాస్త్ర విజ్ఞానం యొక్క అధ్బుతం ఇది, శివుని ముక్కు నుండి గోదావరి-ప్రాణహిత నది సంగమ స్థానం వరకు గొట్టాల ద్వార అంతర్ వాహినిగా వెళ్ళే శివున్ని అర్చించిన జలమే సరస్వతి నది, అందుకే ఇక్కడ సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి, అలాగే ఇక్కడ సరస్వతి దేవాలయం కూడా ఉంది.
పాలకుల అశ్రద్ద కారణం గా అరకొర సాధుపాయలతోనే ఈ ఏడు పుష్కరాలు కొనసాగుతున్నాయి, ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పుష్కరాల కోసం కేటాయించలేదు, ఆలయ ఆదాయం నుండే ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
కాలేశ్వరానికి సంభందించిన మరిన్ని విశేషాల కోసం కింది లింక్ చూడండి.. http://naatelangaana.blogspot.in/2011/10/1.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి