హోం

28, ఏప్రిల్ 2012, శనివారం

దర్శనీయ ప్రదేశం-పిల్లలమర్రి


పిల్లలమర్రిచెట్టు (Pillalamarri Treeమహబూబ్ నగర్ జిల్లా చిహ్నమైన పిల్లల మర్రి మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకపెద్ద మర్రి చెట్టు. అనేక దూర ప్రాంతాలనుంచి ఈ మహావృక్షాన్ని చూడడానికి యాత్రికులు తరలివస్తుంటారు. ముఖ్యంగా డిసెంబర్, జనవరి మాసాలలో పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి మహా వృక్షాన్ని సందర్శిస్తారు. సుమారు 700 సంవత్సరాలనాటి ఈ మర్రి వృక్షం పరిమాణంలో భారతదేశంలోనే మూడవది. దూరం నుంచి చూస్తే ఈ చెట్టు దట్టమైన చెట్లతో నిండిఉన్న చిన్న కొండలాగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే వెయ్యిమందికి నీడనిచ్చే పెద్ద గొడుగులాగా కనిపిస్తుంది. మర్రిచెట్టు ప్రక్కనే మ్యూజియం, జింకలపార్కు ఉన్నాయి.
              ఇక్కడొక మహా మర్రివృక్షం కనిపిస్తుంది. కనీసం 700 సంవత్సరాల గతానుభవాల్ని మౌనంగా వీక్షించిన ఈ ఘన వృక్షం పిల్లలమర్రికి ప్రత్యేకతను సాధించి పెట్టింది. చెట్లు సైతం రాళ్ళవలే కలకాలం బ్రతుకుతాయి సుమా! అనుకునేట్టుగా పుట్టి పెరిగి ఎదిగిపోయిన పిల్లల మర్రిని చూడడం నిజంగానే అద్బుత అనుభవం. మహబూబ్ నగర్ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రిని తప్పక చూడాలి. పిల్లల మర్రి నీడలో దర్జాగా వెయ్యిమంది కూర్చోవచ్చునన్నది నిజంగానే నిజమైన నమ్మలేని నిజం. ఈ మహావృక్షం వైశాల్యాన్ని కొలవాలంటే అడుగులు, మీటర్లు బొత్తిగా సరిపోవు. ఇది మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించింది. మర్రికి పిల్లలు అంకురించడంతో ఇది పిల్లల మర్రిగా మారింది. వందల సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడి ఇది మహావృక్షమైంది. ఈ చెట్టు యొక్క ప్రధాన కాండం ఎక్కడుందో చెప్పడం కష్టం. దీని పుట్టుకకు సంబంధించిన ఆధారాలు కూడా లేవు. ఇక్కడొక జంతు ప్రదర్శనశాల, మ్యూజియంఆక్వేరియంఉన్నాయి. వర్షాకాలంలో అయితే చక్కగా బోటు షికారూ చేయవచ్చు. అందుకు అవసరమైన సౌకర్యాలున్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందడం వల్ల ఇక్కడి ఏర్పాట్లు కూడ చురుగ్గా సాగుతున్నాయి. పిల్లల కోసం ఆటస్థలం, సందర్శకులకై పురావస్తు మ్యూజియం, మినీ జూపార్క్, అక్వేరియం చూపురులకు ఆకట్టుకొంటున్నాయి.


                     పిల్లల మర్రి మ్యూజియాన్ని 1976 లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో లభ్యమైన కమనీయ శిల్పాలను పురావస్తుశాఖ మ్యూజియంలో ఉంచారు. వివిధ పురాతన కాలాల్లో పరిణామం చెందిన శిల్ప శైలిని, అప్పటి మానవులు ఉపయోగించిన వస్తు సామాగ్రిని ఈ మ్యూజియం లో పొందుపర్చినారు. క్రీ.శ.7 వ శతాబ్ది నుంచి 15 వ శతాబ్ది శిల్ప పరిణతిని చాటే అపురూప శిల్పాలున్నాయి. హిందూ, బౌద్ధ, జైన మత ధోరణులకు అద్దం పట్టే అనేక శిల్పాలున్నాయి. రెండు వేల సంవత్సరాల కాలం నాటి మద్య రాతి యుగానికి చెందిన శిథిలమైన వస్తువులు షోకేసుల్లో భద్రపర్చినారు. చాళుక్యుల కాలం నుంచి విజయనగర కాలం నాటి వరకు రూపుదిద్దుకున్న అనేక శిల్పాలున్నాయి.
                         విహార యాత్రకు వచ్చే వారి కోసం ఇక్కడ మినీ జూ పార్కు ఉంది. రకరకాల పక్షులునెమళ్ళుకుందేళ్ళుకోతులు మున్నగునవే కాకుండా, చేపల అక్వేరియం కూడా పర్యాటకులను ఆకట్టుకొంటున్నది. పిల్లల కోసం ఆటస్థలం ఉంది. ఇక్కడే జింకల పార్కు కూడా ఉంది. పురావస్తుశాఖ, అటవీశాఖాధికారులు పిల్లలమర్రిని 1976లో తమ శాఖల పరిధిలోకి తీసుకున్నారు.పురావస్తుశాఖచే మ్యూజియం ఏర్పాటుచేయించారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటిముంపు కారణంగా కృష్ణా నది తీరంలోని ఈర్లదిన్నె గ్రామం నీటమునగగా, 1981లో అక్కడి నుంచి రాజరాజేశ్వరీ మాత ఆలయంలోని విగ్రహాన్ని పిల్లలమర్రికి తీసుకువచ్చారు. ఇక్కడ పాలరాతితో దేవాలయాన్ని నిర్మించి 1983లో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ప్రతిష్టింపచేశారు.

25, ఏప్రిల్ 2012, బుధవారం

స్వచ్చమైన నది మూసి..?


మూసీ నది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని దక్కన్ ప్రాంతములో కృష్ణా నది యొక్క ఉపనది. హైదరాబాదు నగరం మధ్యనుండి ప్రవహిస్తూ చారిత్రక పాత నగరాన్ని, కొత్త ప్రాంతం నుండి వేరుచేస్తూ ఉంటుంది. పూర్వము ఈ నదిని ముచుకుందా నది అని పిలిచేవారు. హైదరాబాదు యొక్క త్రాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ యొక్క ఉపనదిపై హుస్సేన్ సాగర్ సరస్సు నిర్మించబడింది. మూసి అంటే అర్థం స్వచమైన అని.

మూసీనది హైదరాబాదు నగరానికి 90 కిలోమీటర్లు పశ్చిమాన రంగారెడ్డి జిల్లావికారాబాదు వద్ద అనంతగిరి కొండల్లో పుట్టి నల్గొండ జిల్లా, వాడపల్లి (వజీరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. 2,168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా ప్రవహించి హైదరాబాదు గుండా ప్రవహిస్తుంది. నగరాన్ని దాటిన తర్వాత మూసీలో చిన్నమూసీ నది మరియు అలేరు నదులు కలుపుకొని దక్షిణపు దిశగా మలుపు తిరుగుతుంది. మూసీలో ఆలేరు కలిసేచోట సూర్యాపేట వద్ద 1963లో పెద్ద జలాశయాన్ని నిర్మించారు. ఆ తరువాత పాలేరు నదిని కలుపుకొని వజీరాబాదు వద్ద కృష్ణానదిలో కలిసేటప్పటికి 200 అడుగుల ఎత్తుకు దిగుతుంది. మూసీ నది యొక్క బేసిన్ వైశాల్యము 4,329 చదరపు మైళ్ళు. ఇది మొత్తం కృష్ణానది యొక్క బేసిన్ వైశాల్యములో 4.35%, సాధారణంగా చిన్న వాగులాగా ప్రవహించే ఈ నది వరదలు వచ్చినప్పుడు భీభత్సము, అత్యంత జననష్టము కలిగించిన చరిత్ర కలదు.

మూసీ నదిపై హైదరాబాదు నగరంలో దాదాపు ఏడు వంతెనలు ఉన్నప్పటికీ పురానా పూల్ (పాత వంతెన) అత్యంత పురాతనమైనది. గోల్కొండను పాలించిన కుతుబ్ షాహీలు 16వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. ఇప్పటికీ ఈ వంతెన వాడుకలో ఉంది. నయా పూల్ (కొత్త వంతెన) వంతెన హైకోర్టు సమీపములో అఫ్జల్ గంజ్ వద్ద ఉన్నది. ఇవికాక ఇతర వంతెనలు డబీర్‌పూరా, చాదర్‌ఘాట్, అంబర్‌పేట, నాగోల్ మరియు ఉప్పల్ కలాన్ వద్ద ఉన్నవి. విజయవాడ వెళ్ళే జాతీయ రహదారి 7, వరంగల్ వెళ్ళే జాతీయ రహదారి 202 ఈ నది యొక్క ఉత్తర మరియు దక్షిణపు ఒడ్డుల వెంట సాగుతాయి.
          20వ శతాబ్దపు తొలి దశాబ్దాల వరకు మూసీ నది తరచూ వరదలకు గురై హైదరాబాదు నగరాన్ని ముంచెత్తి నాశనం చేసేది. 1908 సెప్టెంబరు 28, మంగళవారము నాడు ఒక్కరోజులో 17 అంగుళాల వర్షం నమోదయ్యింది. ఈ భారీ వర్షము ధాటికి మూసీనది పొంగి వరదై హైదరాబాదు నగరమంతా పారింది. అఫ్జల్ గంజ్ వద్ద నీటిమట్టము 11 అడుగుల ఎత్తుకు చేరింది. మరికొన్ని ప్రాంతాలలో అంతకంటే ఎత్తుకు కూడా చేరింది. ఈ వరదలు హైదరాబాదు నగర జనజీవనాన్ని స్తంభింపజేసి అపార ఆస్తినష్టం కలుగజేసింది. జంటనగరాల అభివృద్ధిలో ఆధునిక శకం 1908లో ఈ వరదల తర్వాతనే ప్రారంభమైంది. దీనితో అంచెల వారిగా ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి అనివార్యమైంది.

                    నగారాభివృద్ధికి ప్రణాళికను తయారుచెయ్యటానికి నియమించబడిన సాంకేతిక నిపుణుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య, వరదల పునరుక్తిని నివారించడానికి మరియు నగరంలో మౌళిక పౌర సౌకర్యాలను మెరుగుపరడానికి కొన్ని సూచనలు చేస్తూ 1909, అక్టోబర్ 1న తన నివేదిక సమర్పించాడు. ఏడవ నిజాం 1912లో ఒక నగరాభివృద్ధి ట్రస్టును ప్రారంభించాడు. వరదలను నివారించేందుకు ఒక వరద నివారణ వ్యవస్థను కట్టించాడు. 1920లో మూసీ నదిపై ఒక నగరానికి పది మైళ్ళ ఎగువనఉస్మాన్ సాగర్ ఆనకట్టను కట్టించారు. 1927లో మూసీ ఉపనదైన ఈసీ నదిపై హిమాయత్ సాగర్ అనే మరో జలాశయము నిర్మించారు. ఈ రెండు జలాశయాలు మూసీ నదికి వరదలు రాకుండా నివారించడముతో పాటు హైదరాబాదు నగరానికి ప్రధాన మంచినీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయి.
సీమాంధ్రుల పాలనలో మూసి:-

                                 1980వ దశకము నుండి హైదరాబాదు నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలలో వెలువడిన పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలను మూసీ నదికి నీరును జతచేసే చిన్న చిన్న నాలాల్లో వదలడం, గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలో మురికినీరును మూసీనదిలోకి వదలడంతో మూసీ ఒక మురికి కాలువ స్థాయికి చేరించి. ప్రతిరోజూ జంటనగరాల నుండి వెలువడుతున్న 350 మిలియన్ లీటర్ల మురికినీరు మరియు పారిశ్రామిక వ్యర్ధ పదార్ధాలు నదిలో కలుస్తున్నవని అంచనా. ఆ తరువాత 1990వ దశకంలో ఈ మురికినీటిని శుద్ధి పరచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో భాగంగానే మూసీ నది వెంట అంబర్ పేట ప్రాంతంలో కలుషిత నీటి శుద్ధి ప్లాంటును ప్రారంభించారు. కానీ దీనికి కేవలం 20% నీటినే పరిశుద్ధ పరచగల సామర్ధ్యం ఉన్నది. 2000లలో నగరంలో నదిలోని నీటిని ఒక చిన్న కాంక్రీటు కాలువ ద్వారా ప్రవహింపజేసి ఆ విధంగా సమకూరిన నదీతలాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేసేందుకై అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నందనవనం అనే ప్రాజెక్టును ప్రారంభించింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. నందనవనం ప్రాజెక్టులో భాగంగా మూసీ నదీగర్భంలో మురికివాడలను నిర్మూలించాలని ప్రయత్నించారు. కానీ, మూసీ బచావ్ ఆందోళన్ వంటి సామాజిక సంస్థలు మరియు రాజకీయ ప్రతిపక్షాలు మరియు వామపక్షాల వ్యతిరేకతతో అది సాధ్యం కాలేదు. ఈ మురికివాడల్లో 20 వేల మంది పైగా ప్రజలు ముప్పై ఏళ్లుగా నివసిస్తున్నారని అంచనా.
    ఎ ప్రాంతంలో అయితే సహజవనరులు పరి రక్షించబడుతాయో ఆ ప్రాంతం నిజంగా అభివృద్ది చెందినట్టు అని చెప్తుంది ఐక్య రాజ్య సమితి, మరి సమైక్యంద్ర పాలకులు ఒక జీవనదిని అందున స్వచ్చమైన నీటిని కలిగిన మూసి నదిని మృతనదిగా మార్చారు, మరి అభివృద్ది అంటే ఇదేనా..?

23, ఏప్రిల్ 2012, సోమవారం

టి-ముఖ్యమంత్రి టి-అంజయ్య..



టంగుటూరి అంజయ్య(ఆగష్టు 16,1919 - అక్టోబర్ 19,1986), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి. ఈయన 1980 అక్టోబర్ నుండి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
ఆల్విన్ పరిశ్రమలో ఆరణాల కూలీగా జీవితము ప్రారంభించిన అంజయ్య, కార్మిక నాయకునిగా ఎదిగి ఆ తరువాత కేంద్ర కార్మిక మంత్రి అయ్యాడు. కాంగ్రేసు పార్టీకి చెందిన అంజయ్య మెదక్ జిల్లా రామాయంపేట నియోజకవర్గము నుండి రాష్ట్ర శాసన సభకు ఎన్నికైనాడు.
                1980లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో అసమ్మతి ఉధృతమై, అవినీతి ఆరోపణలు పెరిగిపోవడముతో కాంగ్రేసు పార్టీ అధిష్టాన వర్గము ఆయన్ను తొలగించి, కేంద్రములో ఇందిరా గాంధీ మంత్రివర్గములో కార్మిక శాఖా మంత్రిగా పనిచేస్తున్న అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. పార్టీలో సొంత వర్గమంటూ లేని అంజయ్య వివిధ వర్గాల వారికి మంత్రివర్గములో పదువులు ఇవ్వాల్సి వచ్చింది. 61 మంది మంత్రులతో, అంజయ్య భారీ మంత్రివర్గాన్ని హాస్యాస్పదంగా జంబో మంత్రివర్గమని పిలిచేవారు. మంత్రుల సభ్యులను తగ్గించాలని అధిష్టానవర్గం ఒత్తిడితేగా, తొలగించినవారికి పదవులిచ్చి సంతృప్తి పరచడానికి అనేక నిరుపయోగమైన కార్పోరేషన్లు సృష్టించాడు. అసమ్మతిదారుల విలాసాల కోసము హెలికాప్టర్లు, కార్లు వంటి వాటి మీద ఖర్చుచేశాడు. అంజయ్య ప్రభుత్వములో కూడా 1982 కల్లా అసమ్మతి వర్గము పెరిగిపోయి ఈయన అధిష్టానవర్గ ఆదేశముననుసరించి ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చింది.
అంజయ్య ముఖ్యమంత్రి కాగానే చేసిన ముఖ్యమైన పనులలో పంచాయితీ రాజ్ సంస్థలకు ఎన్నికలు జరిపించటం ఒకటి.
1984 పార్లమెంటు ఎన్నికలలో సికింద్రాబాదు నియోజకవర్గము నుండి గెలిచి మరణించే వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. ఆ ఎన్నికలలో రాష్ట్రము నుండి ఎన్నికైన ఆరుగురు కాంగ్రేసు పార్టీ పార్లమెంటు సభ్యులలో అంజయ్య ఒకడు అవటము విశేషము. ఈ కాలములోనే అంజయ్య కేంద్ర కార్మిక శాఖా మత్రిగా రాజీవ్ గాంధీ మంత్రివర్గములో పనిచేశాడు. ఈయన తర్వాత ఈయన సతీమణి టంగుటూరి మణెమ్మ కూడా సికింద్రాబాదు నియోజకవర్గము నుండి పార్లమెంటుకు ఎన్నికైనది.


విశేషాలు:-
అసలు పేరు తాళ్ళ అంజయ్య కానీ తన పేరు టంగుటూరి కృష్ణారెడ్డి అని, తాను రెడ్డినే అని అంజయ్య ముఖ్యమంత్రి అయిన తరవాత చెప్పారు. అప్పటి వరకు ఆయన సామాజిక వర్గం ఎవరికి తెలియనివ్వలేదు.
హిందీ, ఉర్దూ మాట్లాడటం,అంజయ్యకు కలిసివచ్చాయి.ముఖ్యమంత్రిగా ఆయన జంబో జెట్ మంత్రివర్గాన్ని 61మందితో ఏర్పరచి ఏమంత్రికి ఎవరి సిఫారసు ఉన్నదో బయట పెట్టాడు.కాదనలేక జాబితా పెంచుతూ పోయాడు.
              ఆయన ప్రజల వద్దకు పాలన అనే సిద్ధాంతానికి బాటలు వేసారు, మొదటిసారిగా ప్రభుత్వ హేలికప్టేర్ను కొనుగోలు చేసారు, దానికి "యాదగిరి" అని నామకరణం చేసారు, ఆయన బాష ఉచ్చారణ పూర్తిగా తెలంగాణా యాసకు ప్రతిభిమ్భం గా ఉండేవి, అది తట్టుకోలేని సీమంద్ర పత్రికలూ ఆయన భాషపై చేలోక్తులు విసిరాయి, ఆయన మాటల్ని వ్యంగ్యానికి వెటకారం జోడించి ఆయనను జనాల్లో చులకన చేసాయి, అంజయ్య మాట్లాడేదే అసలైన తెలుగని దాశరథి వ్యాఖ్యానించారు.సముద్రంలో తేల్ పడిందంట లాంటి తెలుగు ఉర్దూ కలిపిన పదాలు ఆయన ఎన్నో వాడుతుండేవారు. 

18, ఏప్రిల్ 2012, బుధవారం

కవ్వాల్ అడవుల్లో హెచ్చరిక బోర్డులు..!



కవ్వాల్ అడవుల్లో పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటూ, ప్రభావం మొదలైంది. కవ్వాల్ అడవుల గుండా ఉన్న రహదారి మీదుగా భారీ వాహనాలు రా వొద్దంటూ రోడ్లపై అధికారులు హెచ్చరిక బోర్డుల ను ఏర్పాటు చేశారు. కోర్ ఏరియాను ఆనుకొని ఉండే పది కిలో మీటర్ల బఫర్ ఏరియాలో రహదారిపై ప్రతి కిలో మీటరుకు ఒక బోర్డును ఏర్పా టు చేశారు. బోర్డులపై ఒక వైపు పులి బొమ్మ, మ రో వైపు భారీ వాహనాలు కవ్వాల్ అడవుల్లోకి రా కూడదని, రాత్రి 9 గం. తరువాత ఎటువంటి వా హనాలు రాకూడదని హెచ్చరికలు చేశారు.

పులుల సంరక్షణ కేంద్రం పూర్తి స్థాయిలో ఏ ర్పాటు కాకుండానే బఫర్ ఏరియాలో ఇటువంటి నిబంధనలు పెడుతున్న అధికారులు.. ఇక కోర్ ఏరియాలో నివసిస్తున్న ఆదివాసులపై ఎటువంటి నిర్భందాన్ని ప్రయోగిస్తారో అనే అనుమానాలు కలుగుతున్నాయి. గ్రామాల నుంచి బలవంతంగా ఖాళీ చేయించం, ఎవరిపై ఆంక్షలు విధించబోమ ని చెబుతున్న అధికారులు గుట్టు చప్పుడు కాకుం డా నిశ్శబ్ద హెచ్చరికలు చేస్తున్నారు. కోర్ ఏరియా ను ఆనుకొని ఉండే బఫర్ ఏరియా ఉట్నూర్ మం డలంలోని శ్యాంపూర్ గ్రామం వరకు వస్తుంది. ఈప్రాంతం వరకు హెచ్చరికల బోర్డులను ఏర్పా టు చేశారు. పొమ్మన లేక పొగబెట్టిన చందానా అధికారులు హెచ్చరిస్తున్నా రు. రాబోవు రోజుల్లో పాదచారులు కూడా అడవుల్లోకి వెళ్లకుండా నిర్భందాన్ని విధించే అవకాశాలు లేక పోలేదు. 

టైగర్ జోన్‌పై సమరానికి సమయాత్తం 
ఆదివాసీల మనుగడకు ముప్పు తెచ్చే పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుపై ఆదివాసీలు యుద్దానికి సిద్ధమవుతున్నారు. ఆదివాసీ, ప్రజా సంఘా లు ఒక్కొక్కటిగా ఉద్యమంలోకి వస్తున్నాయి. ఆదివాసీల అస్థిత్వం కోసం జిల్లాలో మరో ఇంద్ర పోరాటం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నాలు గు గ్రామాలతో ప్రారంభించి, విడతల వారిగా 40 గ్రామాలను ఖాళీ చేయించాలనే అధికారుల విధానాలను ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

సీపీఐఎంఎల్ న్యూడెమోక్షికసీ అనుబంధ సంస్థ అఖిల భారత రైతు కూలీ సంఘం, ఆదివాసీ సం క్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఇప్పటికే కవ్వాల్ అడవుల్లోని ఆదివాసీ గ్రామాలు సమరానికి సిద్ధమవుతుంటే, గిరిజన సంఘం ఆధ్వర్యంలో గ్రామాల్లో ఉద్యమకమిటీలను వేస్తున్నారు. ఈ నెల 24న జ న్నారం డివిజినల్ అటవీ కార్యాలయం (డీఎఫ్‌ఓ) ఎదుట ధర్నానిర్వహించనున్నట్లు ఆ సంఘం జి ల్లా ప్రధాన కార్యదర్శి తొడసం ప్రభాకర్ తెలిపా రు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గ్రా మాల్లో సభలు నిర్వహిస్తూ టైగర్ జోన్‌నిలిపి వేయాలంటూ గ్రామాల్లో తీర్మానించారు. మండలంలోని పాతహీరాపూర్ గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం ఉపాధ్యక్షులు కాకి మధు, జిల్లా అద్యక్షుడు కనక యాదవ్‌రావు ఆధ్వర్యంలో గ్రా మ సభ నిర్వహించి టైగర్ జోన్‌కు వ్యతిరేకంగా తీర్మానించారు. గ్రామాల్లో ఆదివాసీ జెండాను ఎ గురవేస్తూ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కోర్ ఏరియాలో వస్తున్న 40 గ్రామాల్లో తీర్మాణాలు చేపట్టి వీటి ద్వారా హైకోర్టుకు వెళ్లనున్నట్లు ఆ సంఘం నాయకులు పేర్కొన్నారు.


ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు 
టైగర్ జోన్ ఏ ర్పాటుకు ప్రభుత్వం జారిచేసిన జీవో 27 జీవో 27 రద్దు చేయాలని కోరుతూ జా తీయ ఎస్టీ కమిషన్‌ను ఆదివాసీ అడ్వకేట్ ఫోరం ఆశ్రయించింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెందూర్ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి ఆరెం పా పారావు ఎస్టీ జాతీయ కమిషన్ సభ్యురాలు కమలకుమారిని కలిశారు. టైగర్ జోన్‌ను వెంటనే నిలుపు దల చేయాలని కోరారు. వీరి వెంట సెం ట్రల్ సోషల్ డెవలప్‌మెంట్ సొసైటీ డైరెక్టర్ కల్పన కన్నాభిరాం, సిడాం మురళీ తదితరులు ఉన్నారు. 

27న రౌండ్‌టేబుల్ సమావేశం 
జన్నారం : టైగర్ జోన్ ఏ ర్పా టుకు ప్రభుత్వం జారిచేసిన జీవో 27పైన చ ర్చించేందుకు మండల కేంద్రంలోని సాయిబా బా ఆలయం సమీపంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఎంసీపీఐయూ జిల్లా నాయకులు గవ్వల శ్రీకాంత్ తెలిపారు. ఈ సమా వేశానికి ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయ కులు, విద్యావంతులు, గిరిజన సంఘాల నేతలు, మేధావులు, తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని గవ్వల శ్రీకాంత్ కోరారు.
(FROM namaste telangana)

17, ఏప్రిల్ 2012, మంగళవారం

ఇంద్రవెల్లి విప్లవాల పాలవెల్లి..

ఇంద్ర మారణకాండ జరిగి ఈ ఏప్రిల్ 20కి 31 సంవత్సరాలు. అంటే, అప్పటికీ ఇప్పటికీ ఓ తరం మారింది.
ఈ మూడు దశాబ్దాల్లో ఇంద్రలో పారిన రక్తం గోదావరి, ప్రాణహిత, శబరి, ఇంద్ర నదులు దాటి అదిలాబాద్ 
indra2అడవుల నుంచి దండకారణ్యమంతా విస్తరించింది. అప్పటి విప్లవ జ్వాలలు ఇప్పుడు జంగల్ మహల్ దాకా వ్యాపించాయి. అప్పుడు పోలీస్ కాల్పులుగా ఆదివాసీల మీద ప్రారంభమైన ఈ మారణకాండ ఇప్పుడు ‘గ్రీన్‌హంట్ ఆపరేషన్’గా మారింది. రెండవ దశలో సైనిక మోహరింపు ‘మాడ్’ను మూడు వైపులనుంచీ చుట్టు ముట్టింది. సైనిక, అర్థ సైనిక, ఆక్రమణ యుద్ధ వ్యూహంగా వర్తమాన భారతదేశాన్ని ఇప్పుడు చూస్తున్నాం. ‘రైతుకూలీ సంఘం’ ఆదివాసీల కొన్ని డిమాండ్‌ల మేరకు తలపెట్టిన నాటి సభ నుంచి ఇవ్వాళ దండకారణ్యంలో ‘క్రాంతికారి జనతన సర్కార్’ స్థాయికి ఒక ప్రత్యామ్నాయ ప్రజాపాలన స్థితి ఎదిగింది. అదిప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అంతర్గత పెను ప్రమాదంగా కొనసాగుతూనే ఉంది. సాల్వాజుడుంలు-అటువంటి మరెన్నో చట్టవ్యతిరేక అంతర్యుద్ధ కుట్రలు, గ్రీన్‌హంట్ ఆపరేషన్‌ల వరకూ -చేసిన యుద్ధ ప్రయత్నాలన్నీ ఓడిపోయాయే తప్ప విప్లవ సంకల్పాన్ని, ప్రజల పురోగమనాన్ని నిరోధించలేక పోయాయి. మరి ఇంత దావానలానికి ఇంగలమైన ఆ ఇంద్ర ఎక్కడ ఉన్నది? అక్కడ ఏప్రిల్ 20న ఏం జరిగింది? ఇంద్ర అదిలాబాద్ జిల్లా హైదరాబాద్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ పోయే రోడ్డుపై గుడి హత్నూర్ నుంచి ఉట్నూర్, లక్సెట్టిపేట రోడ్డుపై ఉంటుంది. మరొక వైపు నుంచి వస్తే హనుమకొండ నుంచి లక్సెట్టిపేట మీదుగా గుడి హత్నూర్ పోయే రోడ్డుపై కూడా తగులుతుంది. 

1981 ఏప్రిల్ 20న ఇక్కడ అదిలాబాద్ గిరిజన రైతుకూలీ సంఘం ఒక సభ జరుప తలపెట్టింది. ఆ సభ, తదనంతర పరిణామాలను మరోసారి గుర్తు చేయడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం. 

ఒక్క ఇంద్ర మాత్రమే కాదు, ఆదిలాబాద్ ప్రధానంగా గోండు, కోలాం, పరధాన్లు, పరమేశులు మెదలైన ఆదివాసీ ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉన్న జిల్లా అది. ఆదిలాబాద్ అటవీ ప్రాంతమంతా ఆదివాసులే. ఇంద్ర ఒకప్పుడు 97% ఆదివాసీలు ఉండేవారు. ఈ జిల్లా మహారాష్ట్ర ప్రాంతానికి కూడా దగ్గర్లో ఉండటం వల్ల ఆ రాష్ట్రం వైపు నుంచి కూడా బంజారాలు, ఇంకా వివిధ ప్రాంతాల నుంచి మార్వాడీలు, నీటి పట్టు ఉన్న చోట్లకు కోస్తా జిల్లాల నుంచి వచ్చిన వారు వచ్చి ఇక్కడి భూములను ఆక్రమించుకున్నారు. వడ్డీ వ్యాపారం చేశారు. అడవిని, కొండలను పోడు చేసుకొనే ఆదివాసీలు క్రమంగా లోతట్టు ప్రాంతాలకు నెట్టబడ్డారు. నిజానికి ఇక్కడివి సారవంతమైన నల్లరేగడి భూములు. ఇక్కడి గోండులు మెట్ట పంటలే కాకుండా పత్తి, జొన్న వంటి వ్యాపార పంటలను కూడా పండిస్తారు. అటవీ సంపద సరేసరి. కానీ, ఇంద్ర ఓ వ్యాపార కేంద్రంగా మారి వస్తు వినిమయంతో తప్పుడు తూకాలతో ఈ ఆదివాసీలను మోసం చేస్తూ వస్తున్నది. 
ఈ ప్రాంతంలో రాంజీ గోండు, కొమురం భీంది.

బ్రిటీష్ సామ్రాజ్యవాదులతో, నిజాం ఫ్యూడల్ నిరంకుశ పాలనతో పోరాడిన వారసత్వం. ‘మా గ్రామాల్లో మా రాజ్యం’ అని ప్రకటించి పన్నెండు గ్రామాల్లో కొమురం భీం ప్రజా అధికారాన్ని స్థాపించి జోడేఘాట్ కేంద్రంగా నిజాంతో పోరాడిందీ. ఒకవైపు ఈ పోరాట వారసత్వం నుండి మరొక వైపు 1967లో నక్సల్బరీ శ్రీకాకుళ రైతాంగ పోరాటం మార్గదర్శకత్వమైంది. సన్నిహితంగా 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి 1978 ‘జగిత్యాల జైత్రయాత్ర’ నిర్వహించిన విప్లవకారుల నాయకత్వం లభించింది. వాళ్ళే ఎమ్జన్సీ కాలంలోనే ఈ అడవుల్లోకి పొరకల సార్లుగా ప్రవేశించారు. జగిత్యాల జైత్రయాత్ర తర్వాత 1980లో పీపుల్స్‌వార్ ఏర్పడగా ఒక వైపు పెద్ది శంకర్, మరొక వైపు మరొక దళం మహారాష్ట్ర, బస్తర్ అడవుల్లో ఆదివాసీల మధ్య పని చేయడానికి కదిలి వెళ్ళాయి. బెల్లంపల్లి బొగ్గుగని కార్మికుని బిడ్డ అయిన పెద్ది శంకర్ ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడు.

ఆదిలాబాద్ జిల్లాలో అప్పుడు రఘుగా ప్రసిద్ధమైన నల్లా ఆదిడ్డి నాయకత్వంలో గజ్జెల గంగారాం, సాహులు సహచరులుగా విప్లవోద్యమం విస్తరించిందీ. రఘు, సాహు, గంగారాంలు ఆదివాసీ భాష నేర్చుకొని ‘జననాట్య మండలి’ పాటలను ఆదివాసీ భాషలోకి అనువదించి, వారి మధ్య పనిచేస్తూ ‘గిరిజన రైతుకూలీ సంఘం’ స్థాపించారు. ఆ గిరిజన రైతుకూలీ సంఘానికి కార్యదర్శిగా ఉన్న హనుమంతరావు నాయకత్వంలో తలపెట్టిందీ 1981 ఏప్రిల్ 20 నాటి గిరిజన రైతుకూలీ సభ. ఆ సభ ప్రభుత్వం ముందు ఉంచిన డిమాండ్లు ఇవి: v తాము పోడు చేసుకున్న భూములపై పట్టా ఇవ్వాలి. v తాము మార్కెట్‌కు తెస్తున్న పత్తి, పొగాకు వంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. v ఇంద్ర రోడ్డు పొడవునా... సంతలో తాము అమ్ముకుంటున్న అటవీ వస్తువులను సేట్‌లు తప్పుడు తూనికలతో కొలిచి తక్కువ రేట్లతో కొని మోసపుచ్చుతున్నారు. ఈ మోసాన్ని అరికట్టి సరైన పద్ధతిని నియంవూతించాలి. 



-ఇటువంటి న్యాయపరమైన ఆర్థిక డిమాండ్‌లతో ఈ సభ తలపెట్టి అడవంతా తుడుం మోతతో ప్రచారం చేశారు. జిల్లా అంతటా విస్తృతంగా పోస్టర్లు వేశారు. అప్పుడు సి.పి.డి.ఆర్. (కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమొక్షికటిక్ రైట్స్) ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ సంఘంలో ప్రముఖుడైన కోబాడ్ గాంధీ, రాడికల్ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడైన లింగమూర్తి, ఎ.పి.సి.ఎల్.సి. రంగనాథం, ‘జననాట్య మండలి’ గద్దర్ ఆ సభకు ప్రధాన ఆహ్వానితులు. సభకు మొదట అనుమతించిన జిల్లా పోలీస్ యంత్రాంగం హైదరాబాద్ నుండి అందిన ఆదేశాలతో అనుమతి రద్దుచేసి ఏప్రిల్ 20న సభ జరిగే రోజు 144వ సెక్షన్ విధించింది. అప్పటికే కొండల మీద నుంచి, లోయల నుంచి, నలువైపుల నుంచి ఆదివాసీలు సభకు తరలి వస్తున్నారు. వాళ్ళకు 144వ సెక్షన్ అంటే ఏంటో తెలియదు.

ముందుగా ఎటువంటి ప్రకటనా లేదు. సభకు నలువైపులా తరలి వచ్చే ఆదివాసీలపై ఇంద్ర అంతా మోహరించిన పోలీసులు చెట్లపై నుంచి కాల్పులు జరిపారు. ఎంతమంది నేల కూలారో, ఎంతమంది గాయపడ్డారో ఇప్పటికీ లెక్కలు లేవు. రాష్ట్రస్థాయిలో, దేశ స్థాయిలో వెళ్ళిన ఎన్నో నిజ నిర్ధారణ కమిటీలు సేకరించిన సమాచారం ప్రకారం కనీసం 60 మందైనా చనిపోయి ఉంటారు. వందలాది మంది గాయపడ్డారు. మరణించిన, గాయపడిన తమ వారిని ఆదివాసీలు లోతట్టు ప్రాంతాలకు తీసుకు వెళ్ళినందున ఆసుపవూతుల్లో ఈ లెక్కలు తెలిసే అవకాశం లేదు. సంఘటన జరుగగానే హైదరాబాద్ నుంచి అప్పటి ఎ.పి.సి.ఎల్.సి. నాయకులు కన్నాభిరాన్, సి.ఆర్ రాజగోపాలన్, బిపదీప్ నాయకత్వంలో ఒక నిజ నిర్ధారణ సంఘం అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత వరంగల్‌లో రాడికల్ యువజన సంఘం మహాసభల ప్రారంభోపన్యాసానికి వచ్చిన ఢిల్లీ పి.యు.డి.ఆర్. (పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్షికటిక్ రైట్స్) ప్రముఖులు ప్రొ॥ మనోరంజన్ మహంతి నాయకత్వంలో ఒక అఖిల భారత స్థాయి నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళింది. ఇందులో ఎ.పి.సి.ఎల్.సి. నుంచి డా॥ ‘విరసం’ నుంచి కె.వి.ఆర్. కూడా ఉన్నారు. వీళ్ళు సమక్షిగమైన నివేదిక తీసుకొచ్చారు. అప్పటి ఎస్పీ ఇంతటి నిర్విచక్షణగా కాల్పులు ఎందుకు జరిపారని అడిగితే ‘బుప్లూట్లకు నియమాలు తెలియవు’ (Bullets know no rules) అన్నారు. ఈ ప్రత్యక్ష నిర్ధారణల ఆధారంగా ఆ తర్వాత కె.వి.ఆర్. ఫ్రాంటియకల్ రాశారు. 

కాగా, ఈ సంఘటన అనంతరం వి.వి.( ఈ వ్యాస రచయిత) కన్వీనర్‌గా ఇంద్ర అమరుల బాధితుల కుటుంబ సహాయ నిధి ఏర్పడింది. ఒక ఏడాది తర్వాత వి.వి. తో పాటు బాలగోపాల్, కె.సీతారామారావు జోడేఘాట్, పిప్పల్‌ధర్, పిట్ట బొంగరం, పాండుపురం మొదలైన ఆదివాసీ గ్రామాలకు వెళ్ళి మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి వచ్చారు. కానీ, వెళ్ళిన వారివద్ద ఉన్న వివరాలు స్వల్పమే. కేవలం 13 మంది మృతుల పేర్లు, ఊర్లు తప్ప ఏమీ లేవు. దాంతో పెద్దగా చేయడానికేమీ లేకుండా పోయింది. 

కానీ, నాటికి నేటికీ ఇంద్ర సంఘటనను ‘జలియన్ వాలా బాగ్’ సంఘటనతో పోల్చడం, అది ప్రపంచ దృష్టికి రావడం ఒక అంశమైతే, నైతిక శక్తి దిగజారకుండా ఓటమిని విజయంగా మలచుకొని కొనసాగే ఒక గొప్ప సంకల్పాన్ని ఇంద్ర సంఘటన విప్లవకారులకు, ఆదివాసీలకు ఇచ్చింది. 

1981-85 వరకు ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఇంద్ర ‘ఇంద్రవెల్లి అమరుల సంస్మరణ సభ’ జరిగింది. ఆంధ్రవూపదేశ్ రైతుకూలీ సంఘం అధ్యక్షుడు గంజి రామారావు ఏడాది పాటు ఇంద్ర ఒక టిన్ షెడ్ వేసుకొని ఉండి పోయి, ఆదివాసీల రక్తం చిందిన చోట భూమిని కొని అమరవీరుల స్థూప నిర్మాణం చేయించాడు. అది దేశంలోనే అమరుల స్థూపాలకు తలమానికంగా ఉండాలని చైనాకు వెళ్ళి అక్కడి ‘చైనా విప్లవం’లో అమరులైన వాళ్ళకోసం ‘తియానాన్మెన్ స్కేర్’లో నిర్మితమైన స్థూపాన్ని చూసి, దాని గురించి అధ్యయనం చేసి 3 అడుగుల ఎత్తున ఇంద్ర స్థూప నిర్మాణం చేయించాడు. 1983 ఏప్రిల్ 20న దాని ఆవిష్కరణ చేయించాడు. ఆ సభలోనే సాహు, అల్లం రాజయ్యల ‘కొమురం భీం’ నవలను బాలగోపాల్ ఆవిష్కరించారు. 

1985లో మనోరంజన్ మహంతి, మురళీ మనోహర్, ఏక్‌నాథ్ సాల్వే, గద్దర్‌లు ఈ సంస్మరణ సభలకు వెళ్ళినప్పుడు పోలీసులు తుపాకులు గురి పెట్టి అరెస్టు చేశారు. 1984లో ఇంద్ర సంస్మరణ సభకు జార్జి ఫెర్నాండెజ్ వచ్చినప్పుడు వందలాది మంది పోలీసులు మోహరించారు. తిరుగు ప్రయాణంలో నిర్మల్ ఘాట్‌రోడ్డు వద్ద ఆయనా, బాలగోపాల్, వి.వి., పంకజ్ దత్‌లు ప్రయాణం చేస్తున్న కారుపై పోలీసులు రాళ్ళు దొర్లించి హత్యా ప్రయత్నం చేశారు.

1985 తర్వాత ఈనాటికి ప్రతి సంవత్సరం ఇంద్ర ఆదివాసులు అమరులైన చోట ఈ ఏప్రిల్ 20న ఆదివాసీలు, ప్రజాసంఘాలు ఎంత నిర్బంధంలోనైనా సంస్మరణ సభలు నిర్వహించుకుంటూనే ఉన్నాయి. పోలీసులు ప్రతి సంవత్సరం 144వ సెక్షన్ విధిస్తూనే ఉన్నారు. గుడి హత్నూర్ నుంచి లక్సెట్టిపేట ఇరువైపుల రోడ్లను బంధిస్తూనే ఉన్నారు.

ఈ ఇంద్ర సభ అప్పటి పరిశోధక విద్యార్థిగా ఉన్న బి.జనార్దన్‌రావును ఆ తర్వాత దేశంలోనే ఒక ప్రముఖ ఆదివాసీ జీవిత పోరాట అధ్యయన శీలిగా మార్చింది. ఈ సభలకు వక్తగా వెళుతున్న కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి ఆర్.ఎస్.యు. ఉపాధ్యక్షుడు లింగమూర్తితో పాటు జనార్ధన్, సీతారామరావు, ఎన్.వేణుగోపాల్‌లు కూడా ఇంద్ర వెళ్ళారు. ఇంద్ర వీళ్ళు బస్సు దిగగానే పోలీసులు అరెస్టు చేసి బంధించి, ప్రశ్నించి ఈ నలుగురిలోను కొంచెం దృఢకాయునిగా ఉన్న జనార్ధన్‌ను జేబులో చేయి పెట్టుకొని సమాధానాలు ఇస్తున్నాడని తీవ్రంగా కొట్టారు. బక్క పలుచని లింగమూర్తి ఆర్.ఎస్.యు. ఉపాధ్యక్షుడంటే నమ్మలేదు. ఆ తర్వాత అతడు పీపుల్స్‌వార్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉన్నప్పుడు, నల్లమలలో కృష్ణా నదిలో (2002లో) పుట్టి మునిగి అమరుడయ్యాడు. ఆయనది కరీంనగర్ జిల్లా అంబాల.
1987లో అదిలాబాద్ జిల్లా ఆలంపల్లిలో సిఆర్‌పిఎఫ్ క్యాంపుపై పీపుల్స్‌వార్ దళం దాడి చేసింది. అందులో 11 మంది సీఆర్‌పిఎఫ్ జవాన్లు చనిపోయారు. రామకృష్ణ అనే దళ సభ్యుడు అమరుడయ్యాడు. 

ప్రతీకారంగా మఫ్టీలో వచ్చిన పోలీసులు ఇంద్ర స్థూపాన్ని డైనమైట్ పెట్టి పేల్చివేశారు. ఎన్.టి.రామారావు ఈ ‘అదిలాబాద్ జిల్లా ఎక్కడ ఉంది? పీపుల్స్ వార్‌లోని వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళతో ఎక్కడ చర్చించాలి?’ అని దూర్త అమాయకత్వాన్ని నటించి అదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పర్చడానికి కోటి రూపాయలు ప్రకటించాడు. ఆదివాసీల ఆగ్రహానికి, గాయానికి మలాం పూయడానికన్నట్లుగా మళ్ళీ స్థూపం నిర్మాణం చేయించారు. ఇప్పుడు మనం చూస్తున్న స్థూపం అదే. అయితే, అది ఇప్పుడు తెలుపు రంగులో ఉంటుంది. గత మహోన్నత శిఖరాయమాన అరుణారుణ స్థూపం కాదది. ‘కొండల్లు ఎరుపు గోగుపూలు ఎరుపు / అడవిలో అమరుల త్యాగాలు ఎరుపు’ అని రాసుకున్న ఆ స్థూపంపై చరణాలు మాత్రం ఆనాటికీ ఈనాటికీ ఆదివాసీల విప్లవకారుల ఆకాంక్షలను ఆ అడవిలో ప్రతిధ్వనింపజేస్తూనే ఉంటాయి.

ఇంద్ర మారణకాండ తర్వాత నుంచి ఇప్పటికీ వస్తున్న సాహిత్యంతో పోల్చదగినంత సాహిత్యం మరే సంఘటనపైనా వచ్చి ఉండదు. అందులో ప్రధానంగా పేర్కొనదగింది సాహు, అల్లం రాజయ్యల రచనలు. సాహు 1980ల వరకే అదిలాబాద్ ఆదివాసీల మధ్య పనిచేస్తూ గోండు భాష నేర్చుకొని ఆ భాషలో పాటలు రాశాడు. ఒగ్గు కథలు రాశాడు. ఆదివాసీల జీవిత పోరాటంపై ‘పటార్’వంటి ఎన్నో కథలు రాశాడు. ఇవన్నీ ‘సృజన’, ‘అరుణతార’ల్లో అచ్చయ్యాయి. అదిలాబాద్ ఆదివాసీల జీవితాన్ని, సంస్కృతినీ 0లలో ఆయన ఎంతో సమక్షిగంగా అధ్యయనం చేశారు. ఆ అధ్యయన క్రమంలో గజ్జెల గంగారాం అమరుడయ్యాడు. అధ్యయనం, కార్యాచరణ కారణంగా వాళ్లిద్దరినీ నల్లా ఆదిడ్డి ఎంతో ప్రోత్సహించాడు. ఒక విధంగా ఇంద్ర సంఘటన కొమురం భీంకు మళ్ళీ ప్రాణం పోసింది. 

కొమురం భీం జీవితం, పోరాటం గురించి ఆయన సమకాలీన పోరాట యోధుల నుంచి సేకరించి, ఎన్నో చరిత్ర గ్రంథాలు, దస్తావేజులు చదివి, పురాతత్వ పరిశోధనలు చదివిన ఆయన అల్లం రాజయ్యతో కలిసి ఒక క్లాసిక్ అనదగిన ‘కొమురం భీం’ నవల రాశాడు. ఆ విధంగా చూసినప్పుడు ఇది తెన్నేటి సూరి రాసిన ‘చంఘీజ్‌ఖాన్’ నవల కన్నా గొప్ప నవల. ఇవ్వాళ తెలంగాణలో మరెవరికీ లేనంతగా కొమురం భీంకు ఇంత గుర్తింపు, ఇంత ఆదరణ లభించడానికి ముఖ్య ప్రేరణల్లో విప్లవోద్యమం- ప్రత్యేక తెలంగాణ ఉద్యమం- ఆదివాసీ పోరాటాలతో పాటు ఈ ‘కొమురం భీం నవల’కు సముచిత స్థానం ఉంటుంది.
ఇంద్ర సంఘటనపై ‘అడవి ఉప్పొంగిన రాత్రి’ అనే దీర్ఘ కవిత ద్వారానే తెలుగు సాహిత్యంలో విమల ఒక ప్రముఖ కవిగా గుర్తింపు పొందింది. 90లో ఆ పేరుతోనే ఆమె మొదటి కవితా సంకలనం వెలువరించింది. ఒక కవి రమేష్‌కి ఇంద్ర ఇంటి పేరైంది. శివసాగర్ సహచరి పార్వతి తనను ఇంద్ర ఖననం చేయాలని కోరింది. ఇంద్ర సంఘటన తర్వాత విస్తృతంగా ఆ ప్రాంతంలో తిరిగిన గద్దర్ ‘రగల్ జెండా బ్యాలె’ రచించాడు. జననాట్యమండలి ఇప్పటికీ ఎన్ని వందల సార్లు దీనిని ప్రదర్శించిందో లెక్కే లేదు. ఇంద్ర సంఘటన జరుగగానే ‘సృజన’ సమక్షిగమైన అధ్యయనంతో ప్రత్యేక సంచిక వెలువరించింది. చికాగో నగరంలో పోలీసుల కాల్పుల్లో మరణించిన కార్మికుల రక్తంతో తడిసిన చొక్కా ఎర్రజెండా అయినట్లుగా ఇంద్ర సంఘటన నిజ నిరూపణకు వెళ్ళిన కె.వి.ఆర్. కనుగొన్న ఆదివాసీ అమరుని వస్త్రమే ‘రగల్ జెండా’గా సృజన ముఖచివూతమైంది. 

మళ్ళీ ఇంద్ర అమరుల సంస్మరణ సందర్భంగా కూడా సృజన ప్రత్యేక సంచిక తెచ్చింది. కొమురం భీం భార్య సోను భాయి జీవితాన్ని ఆధారంగా పులుగు శ్రీనివాస్ ఓ నవల రాశాడు. భూపాల్ ప్రధాన పాత్రలో కొమురం భీంగా అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో ‘కొమురం భీం’ సినిమా వచ్చింది. 92లో నిర్మితమైన ఈ సినిమా విప్లవోద్యమం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో, కొమురం భీం ప్రశస్తి విస్తృతంగా ప్రజల హృదయాల్లో గూడుగట్టుకున్న సందర్భంలో విడుదలయింది.

మొదట చెప్పినట్లుగా ఈ ముప్పై ఏండ్లలో ఆదిలాబాద్‌లోను, తెలంగాణలోనూ దేశవ్యాప్తంగానూ నదులు, అడవులు, లోయలు, కొండకోనలు, పల్లెలు, నగరాలలో రాజ్యం వనరుల దోపిడీ కోసం చాలా రక్తాన్ని ప్రవహింపజేసింది. ఒకప్పుడు రాజ్యాంగంలోని 5, 6 అధికరణలు గానీ, 1/70 చట్టాన్ని గానీ ఆదివాసేతరుల ప్రయోజనాల కోసం విచ్చలవిడిగా ఉల్లంఘించిన ప్రభుత్వాలు రెండు దశాబ్దాలుగా ఒక పద్ధతి ప్రకారమే బహుళజాతి కంపెనీల కోసం బడా కంపెనీల కోసం ఒక దళారిగా మారి చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. ఒకవైపు ‘పేసా’ వంటి చట్టాలు తెస్తున్నాయి. మరొక వైపు ‘ఆక్షికమించు, ఖాళీ చేయి, అభివృద్ధి పరుచు’ అనే విధ్వంస నమూనాను అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ప్రయోగిస్తున్నది. 

అదిలాబాద్ జిల్లానే తీసుకుంటే వేలాది మంది ఆదివాసీలను నిర్వాసితులను చేసే విధ్వంసక కార్యక్షికమాలు అక్కడ జరుగుతున్నాయి. అక్షరాల ఇప్పుడక్కడ ఆకురాలు కాలాన్ని చూస్తున్నాం. కుంతాల జలపాతాన్ని పవర్ ప్లాంట్‌గా మార్చడానికి, కవ్వాల్ అడవులను పులుల అభయారణ్యంగా మార్చడానికి ప్రభుత్వం పథకాలు వేసింది. జోడేఘాట్ దగ్గర నిర్మితమైన ‘జోడేఘాట్ ప్రాజెక్ట్’ ఏ ఒక్క ఆదివాసీ దాహార్తినీ తీర్చిందీ లేదు. ఒక్క ఆదివాసీ భూమిని తడిపిందీ లేదు. పైగా ఉట్నూర్ ప్రాంతమంతా గోండు, కోలాం మెదలగు ఆదివాసీలకు, లంబాడీలకు మధ్య విద్య, ఉద్యోగ, ఉపాధి విషయాల్లో ఘర్షణ సృష్టిస్తూ ప్రభుత్వం దాన్ని ఆదివాసీల మధ్య సమస్యగా చిత్రించే ప్రయత్నం చేస్తోంది. న్యాయమైన వర్గీకరణ అమలు చేయకుండా ఘర్షణలు రెచ్చగొడుతున్నది.

(from namaste telangana)

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

రాములవారు నడయాడిన స్థలాలు..



రాముడు తెలంగాణలో సంచరించాడనడానికి మూడు రకాల ఆధారాలు కన్పిస్తున్నాయి. ఒకటి వాల్మీకి రామాయణం (అరణ్యకాండ), రెండు పురావస్తు-చారివూతక విశేషాలు, మూడు జానపద స్థల పురాణ గాథలు.సీతారామ లక్ష్మణులు తమ పద్నాలుగేళ్ళ వనవాసంలో భాగంగా ఉత్తర, మధ్య భారతంలో అనేక స్థలాలు తిరుగుతూ వాల్మీకి ఆశ్రమాన్ని దర్శించారని, ఆ తర్వాత చిత్రకూట పర్వతాన్ని చేరుకొని పర్ణశాల నిర్మించుకున్నారని మనకు తెలుసు. అయితే, అగస్త్య మహర్షి రాములవారిని దక్షిణాన గోదావరి తీరాన ఉన్న పంచవటికి వెళ్లమని చెప్తూ ‘‘తాడిచెట్ల వనం దాటి ఉత్తరం గుండా మఱ్ఱి చెట్టు వద్దకు చేరుకొని, అక్కడి నుండి పర్వత తలంపై నడవాలి’’ అని వివరించినట్లు అరణ్యకాండ 13వ సర్గలోని 13,1,21,22 శ్లోకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ‘పంచవటి’ అంటే మఱ్ఱి, మారేడు, మేడి, రావి, అశోక వృక్షాల వనాలుండే ప్రదేశమని అర్థం. ఈ వనాలున్న ప్రదేశం గోదావరి నది వెంట కరీంనగర్ జిల్లాలోని రామగిరి ఖిల్లా నుండి ఖమ్మం జిల్లా తూర్పు సరిహద్దుల వరకూ ఉండేది. ఇంత విశాలమైన పంచవటిలో రాముడు మొదట పర్ణశాల నిర్మించుకున్నది చిత్రకూటంపైన. 

‘‘న మూలం లిఖ్యతే/నానపేక్షిత ముచ్యతే’’ (మూలంలో లేనిది చెప్పను, అనవసరమైంది అసలే చెప్పను) అని ఢంకా బజాయించి చెప్పుకున్న అగ్రక్షిశేణి వ్యాఖ్యానకారుడు మల్లినాథసూరి ‘చివూతకూటం అంటే రామగిరి’ అని చెప్పాడు. ఆయన మన మెదక్ జిల్లా వాసి అన్నది తెలిసిందే. నిజానికి ‘అరణ్యకాండ’లోని పైన పేర్కొన్న శ్లోకాలలో వివరించినట్లుగానే రామగిరికి ఉత్తరాన వేల తాడి చెట్లుండటం విశేషం. అట్లే, ఆగ్నేయంలో ‘తాడిచెట్ల’ అనే ఊరు కూడా ఉన్నది. ఆ శ్లోకంలో చెప్పినట్లే, రామగిరి పర్వత తలంపై 10 కిలోమీటర్లు నడవాలి కూడా. ఇంకొక గొప్ప విషయమేమిటంటే, రాముడు ఇక్కడికి వచ్చినప్పటి సంగతి! అంటే క్రీ.పూ. 5179వ సంవత్సరం నాటి మధ్య శిలాయుగ మానవుల స్థావరం, వారి పనిముట్లు, ఆయుధాలు ఇక్కడ లభించడం! వీటిని 197లో పెద్దపల్లి నివాసి ఠాకూర్ రాజారాం సింగ్ పూర్వ పురావస్తు శాఖ సంచాలకులు వి.వి.కృష్ణశాస్త్రి సమక్షంలో రామగిరి గుట్ట మొదట్లో సేకరించారు.
‘సీతాస్నాన పుణ్యోదకేషు రామగిరి’ అని క్రీ.శ. 5వ శతాబ్దంలో మహాకవి కాళిదాసు తన మేఘసందేశం’ కావ్యంలో రాశారు. వారు రాసినట్లుగానే ఈ రామగిరిపై సీత స్నానం చేసిన కొలనులూ ఉన్నయి. ఆమె పసుపు కుంకుమలు ఇక్కడి రాళ్ళ నుంచి సేకరించుకున్న ఆనవాళ్లు...అంటే గుంటలు కూడా ఉన్నయి. అట్లే, సీతారామ ప్రతిష్టిత శివలింగాలను కూడా మనం రామగిరి పైన ఇప్పటికీ చూడవచ్చు. అంతేకాదు, రాముడు భూమిలోకి శక్తివంతమైన బాణాలను సంధించి సృష్టించిన ఊటలను కూడా రామగిరిపై చూడవచ్చు. 

రాముడు ఇక్కడున్నప్పుడే దశరథుడు మరణిస్తాడు. దాంతో తండ్రికి ఇక్కడే పిండం పెట్టాడని స్థానికులు చెప్తరు. తదనంతరం భరతుడు ఇక్కడికి వచ్చి రాముడి పాదుకలను అయోధ్యకు తీసుకెళ్ళాడని అంటరు. ఈ చరివూతాత్మక విషయాలకు సంబంధించిన ఎన్నో విగ్రహాలు కూడా రామగిరి కొండ కోనపైనున్న గుహలో మనం చూడవచ్చు.అయితే, రాముడి ఉనికి ఈ ప్రాంతపు రాజు ఖరునికి కంట గింపయిందట అతని సైన్యం మునులు, ఋషులపై అఘాయిత్యాలకు పాల్పడిందట. దాంతో రాముడు మునుల కోసం ఈ జనస్థానాన్ని (రాజధాని ఖరియాల్, చత్తీస్‌ఘడ్) వదిలి దండకారణ్యంలోకి ప్రవేశించాడని తెలుస్తున్నది. ఈ అరణ్యం మంత్రకూటం అంటే మంథని - దాని తూర్పు నుండి ప్రారంభిమవుతుందని కూడా గమనించవచ్చు. రాములవారు దండకారణ్యంలో మొదట ఎదురైన విరాధుడు అనే రాక్షసుని చేతులు నరికి శరభంగ మహాముని ఆశ్రమంలో గడుపుతున్నప్పుడు ఆ ప్రాంత మునులందరూ ఆయన దగ్గరికి వచ్చారట. వారంతా మునుపూందరినో రాక్షసులు చంపుతున్నారని చెబుతూ, వారి బొక్కలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ఒక స్థలాన్ని కూడా రాములవారికి చూపారట. ఆ స్థలం ఇప్పటికీ ‘బొక్కల గుట్ట’ పేరుతో రామగిరికి వాయవ్యాన -మంచిర్యాలకు 5 కి.మీ. దూరంలో ఉండటం కూడా ఒక ప్రబలమైన ఆధారంగా కనిపిస్తున్నది.
Raamagiripaiమునులకు అభయమిచ్చిన సీతారామ లక్ష్మణులు ఆ ప్రాంతంలో ఉన్న సుతీక్షుడు తదితర మునుల ఆశ్రమాలను దర్శిస్తారు. ఇక అదే రోజు పొద్దుగూకే సమయంలో పంచాప్సర సరస్సును చూశారట. ఆ సరస్సును మాండకర్ణి అనే ఋషి సృష్టించుకొన్నడు. అందులో ఆయన ఒక రహస్య మందిరాన్ని నిర్మించుకొని వాటిల్లో ఐదుగురు అప్సర సలతో రతి సుఖాలను అనుభవించాడట. ఈ సంగతి ధర్మభృతుడనే ఋషి రాముడికి చెప్పినట్లు అరణ్యకాండ 9వ సర్గ -1 శ్లోకాలలో ఉన్నది. మాండకర్ణి తాలూకు ఈ వ్యవహారాన్ని బట్టి ఆ సరస్సును స్థానికులు ఇప్పుడు ‘లంజమడుగు’ అంటున్నరని కూడా మనం గమనించాలి. ఇది గోదావరిలో మంథనికి సమీపంలో ఉంది. మాండకర్ణి తాలూకు ఈ కథ ఎంతగా ప్రచారమయ్యిందంటే ఆ వృత్తాంతాన్ని తెలిపే శిల్పం విజయవాడ కనకదుర్గ ఆలయ సమూహంలోని శిథిల ఆలయంపైన కూడా ఉన్నది. ఇలాంటి శిల్పాలు ఈ ప్రాంత గుహాలయాల్లో కూడా ఉన్నయి. 
ఇక, ఇక్కడి నుంచి రాముడు ఖమ్మం జిల్లాలోని ప్రస్తుతం పర్ణశాల ఉన్న ప్రాంతానికి వెళుతున్నప్పుడు మధ్యలో జటాయువు అనే (టోటెమ్) పక్షిరాజు ఎదురై తాను దశరథునికి స్నేహితున్నని చెప్తూ, ప్రసంగ వశాన సృష్టిలో జీవజాల పుట్టుక ఎలా జరిగిందో వివరిస్తడు. (14వ సర్గ). ఈ వివరణ తాలూకు శిల్పాలను మనం రామగిరి ఖిల్లా రెండవ, మూడవ కోటల దర్వాజాలపై చూడవచ్చు. మరో విషయం, ఈ ప్రాంతంలో రామాయణ కాలం నాటి జటాయువు లేదా గద్దను (సంస్కృతంలో గృధ్రం) పూజించే వారి ప్రాబల్యం ఉండేది. ఇక్కడి నుండి తూర్పు వైపున్న అరణ్య ప్రాంతానికి అతి ప్రాచీన కాలంలో ‘గృవూధవాడి’ అనే పేరు ఉన్నట్లు కూడా శాసనాల ద్వారా తెలుస్తున్నది. గద్దను తమ జెండాపై చిత్రించుకున్న పొలవాస రాజులు ఈ ప్రాంతంలో క్రీ.శ.12వ శతాబ్దం వరకూ పరిపాలన చేశారన్నది చరిత్ర. ఇలాంటి జెండాలను ఇప్పటికీ మనం సమ్మక్క జాతరలో చూడవచ్చు.

సీతారామ లక్ష్మణులు నేటి ఖమ్మం జిల్లాలో గోదావరి తీరాన పర్ణశాల కట్టుకొని కొంతకాలం హాయిగా గడిపారు. భద్రాచలానికి ఉత్తరాన సుమారు 35 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పర్ణశాల పంచవటి ప్రాంతంలో భాగమే. ఇక్కడ ఒక వటవృక్షం కింద రామపాద ముద్రలున్నయి. ఈ పర్ణశాల ప్రాంతం ఒక అందమైన సంగమ ప్రదేశం. ఇక్కడ గోదావరిలో తాలిపేరు, సీలేరు, సీతవాగు కలుస్తయి. సీతవాగులో సీత స్నానం చేసి వాగులోని బండల మీద తన పట్టుచీరలు, నారచీరలను ఆరబెట్టుకున్నప్పుడు వాటి రంగు అంటిన చారలను మనం నేటికీ అక్కడ దర్శించవచ్చు. రాముడు స్నానం చేసిన స్థలాన్ని ఇప్పుడు ‘స్నానాల లక్ష్మీపురం’ అంటున్నారు. ఇది వైరా మండలంలో ఉంది. ఇక్కడ శివరావూతినాడు లక్షలాదిమంది భక్తిక్షిశద్ధలతో స్నానం చేస్తరు.

సీతారాములు పర్ణశాలలో ఉన్నప్పుడు అక్కడి పరిసర ప్రాంతాలలో కూడా తిరిగారని పరంపరగా వస్తున్న మౌఖిక ఆధారాలు తెలియజేస్తున్నయి. అలా వారు అదే గోదావరి వెంట నేటి భద్రాచలం వరకూ వచ్చి, ఆ గిరిపై కొంత సమయం విశ్రాంతి కూడా తీసుకున్నారని, అదే స్థలంలో భద్ర మహర్షి సీతారామ లక్ష్మణుల విగ్రహాలను కూడా ప్రతిష్టించి పూజలు ప్రారంభించారని భద్రాచల స్థలపురాణం తెలియజేస్తున్నది. ఇక్కడికి ఆగ్నేయంలో ఆన్న ఉష్ణకుండంలో చలికాలంలో సీత స్నానం చేసేదని కూడా చెప్తరు. ఈ సందర్భంగా ఇదే ప్రాంతంలో నవీన శిలా యుగానికి చెందిన మానవుల స్థావరపు పనిముట్లను డా॥ పి.వి.పరవూబహ్మశాస్త్రి గుర్తించిన విషయం మనం దృష్టిలో ఉంచుకోవాలె.

ఖమ్మం పట్టణానికి 22 కి.మీ. దూరంలో ఉన్న ‘నాగులవంచ’కు కూడా రాముడు వచ్చిండనుకోవచ్చు. ‘వంచ’ అంటే ‘వాగు’ అని అర్థం. ఆయన ఇక్కడి వంచలో స్నానం చేశాడట. ఇక్కడున్న అతి ప్రాచీన కోదండ రామాలయంలో భద్రాచలంలో ఉన్నట్లే సీతారాములు ఒకే వేదికపై దర్శనమిస్తరు. ఇక్కడే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెస్తున్నటువంటి శిల్పం కూడా చిత్రితమైంది. సమీపంలోని గజగిరి నరసింహస్వామి గుట్టపై ఉన్న దేవుడు ప్రసిద్ధి చెందిన మంగళగిరి పానకాల స్వామిలా ఎంత పానకం పోసినా తాగేస్తడు. అంతేకాదు, ఇదే నాగులవంచలో సీతారాములు సృష్టించుకున్నవిగా చెప్తున్న సీతానగర్, రామసముద్రం అనే రెండు చెరువులు కూడా ఉన్నయి.

సీతారామ లక్ష్మణులు పర్ణశాలలో ఉన్నప్పుడు రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ (అంటే చాటంత చెవులు కలదని అర్థం) ఇక్కడికి వచ్చి రాముడిని మోహిస్తుంది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు కోస్తడు. దానికి ఆగ్రహించిన ఈ ప్రాంత పాలకుడు, శూర్పణఖ అన్న అయిన ఖరుడు రాముడిపై పద్నాలుగువేల మంది సైన్యంతో యుద్ధం చేస్తడు. ఆ యుద్ధ సమయంలో సూర్యక్షిగహణం సంభవించిందని, ఆ రోజు రాత్రి అమావాస్య అని, అప్పుడు మధ్యలో ఉన్న అంగారక గ్రహానికి ఒక పక్క బుధ-శుక్ర గ్రహాలు, మరో పక్క శని గ్రహం - సూర్యుడు ఉన్నారని అరణ్యకాండ 23వ సర్గ 10-13,34 శ్లోకాలలో వాల్మీకి వివరించిండు. ఈ గ్రహస్థితిని అమెరికన్ టైమ్ మిషన్‌లో పొందుపర్చినప్పుడు అది ఆ రోజు తేది క్రీ.పూ. 5077 అక్టోబర్ 7 అని సూచించిందని ‘డేటింగ్ ది ఎరా ఆఫ్ లార్డ్ రామ’ అనే పుస్తకంలో పుష్కర్ భట్నాగర్ అనే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి పేర్కొన్నాడు. ఆ నాటి యుద్ధంలో రాముడు ఖర, దూషణ, త్రిశిరాదులతో సహా 14వేల మంది రాక్షస సైన్యాలను చంపుతున్నప్పుడు రాముని సూచన మేరకు లక్ష్మణుడు సీతను ఒక కొండ గుహలో దాస్తడు. ఆ కొండ పేరు లక్ష్మణకొండ. ఈ యుద్ధం జరిగిన స్థలం దుమ్ముగూడెం, లక్ష్మణకొండ ప్రాంతాలు. ఇవి పర్ణశాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంటయి. దుమ్ముగూడెంలో అత్యంత ప్రాచీనమైన రామలింగేశ్వరాలయం కూడా ఉన్నది. 

రాముడు ఖరున్ని చంపాక శూర్పణఖ రావణుడితో మొరపెట్టుకుంటది. దాంతో రావణుడు లంక నుండి ఇక్కడికి వచ్చి మారీచున్ని ఒప్పించి అతని సహకారంతో సీతను ఎత్తుకుపోయే పథకం పన్నుతడు. రావణుడు ఇక్కడికి కంచర గాడిదల రథం మీద వచ్చిండని, సరైన సమయం కోసం గోదావరి ఆవలి ఒడ్డున వేచి ఉన్నడని, ఆ వేచివున్న గుట్టపేరు ‘రావణగుట్ట’ అని, అతని రథ చక్రాల గాడి ఇదే అని స్థానికులు ఆ గుట్టపై ఉన్న ఆనవాళ్ళను చూపిస్తరు. రావణుడు సీతను ముట్టజాలక ఆమె నిల్చున్న భూమినంతా పెకిలించుకొని పోవడంతో ఆ ప్రాంతంలో ఏర్పడ్డ గుంటను ‘రావణుకొలను’ అని కూడా అంటున్నరు. ఇది పర్ణశాలలోని రామాలయం వెనక ఉన్నది. సమీపంలోనే ‘దశకంఠేశ్వరాయం’ అనే శివాలయం కూడా ఉంది. అందులో శివలింగాన్ని పరమ శివభక్తుడైన దశకంఠుడు అంటే రావణుడే తను లంక నుండి తెచ్చి ప్రతిష్టంచిండని చెబుతరు. 

రావణుడు తనను ఎత్తుకుపోతున్న విషయాన్ని గురించి సీతమ్మ తన రాముడికి చెప్పండని మాల్యవంతం పైనున్న ప్రస్రవణగిరికి, గోదావరికి చెప్పిందట. ఈ ప్రస్రవణమే తెలుగులో ‘పొరవణం’గా, క్రమంగా ‘పోలవరం’గా మారింది. సుమారు రెండు శతాబ్దాల కింద భద్రాచలంపై జరిగిన ధంసా (దొంగ గిరిజనుల) దాడి సమయంలో భద్రాచల రాముడ్ని రహస్యంగా ఈ పోలవరం మీదికే తీసుకొచ్చి, ప్రతిష్టంచి పూజించారు. కొన్నాళ్ళ తరువాత మళ్ళీ భద్రాచలానికి తీసుకొచ్చిండ్రు.

సీత అరుపులను విని జటాయువు రావణుడ్ని ఎదిరించిండు. కానీ, రావణుడు జటాయువు రెక్కలను నరికివేసిండు. ఆ రెక్కలు పడిన స్థలం పేరు ‘రెక్కపల్లి’. అది క్రమంగా ‘రేకపల్లి’ అయ్యింది. జటాయువు రాముడికి సీతాపహరణ విషయం చెప్పి మరణించిన స్థలమే ‘జటపాక.’ అది కాలక్షికమంలో ‘ఎటపాక’ అయ్యింది. ఇక్కడ ఇప్పుడు ‘జటాయువు మంటపం’ కూడా ఉన్నది. పక్కనే భద్రాచలానికి 5 కి.మీ.ల దూరంలో ‘జటాయువు పర్వతం’ కూడా ఉంది. రాములవారు చనిపోయిన ఆ జటాయువుకు సమీపంలో ఉన్న గోదావరిలో పిండాలు పెట్టిండట. అలా పిండాలు పెట్టిన ప్రదేశం పేరుతో తెలంగాణలో కొన్ని చోట్ల ‘పెండ్యాల’ అనే ఊర్లేర్పడినాయి.
RaamunigunDaalaloరావణుడు తనను ఆకాశమార్గంలో ఎత్తుకు పోతున్నపుడు సీత కింద కనిపిస్తున్న ఐదుగురు వానరులను చూసి తన నగలను ఒలిచి, తన పట్టు ఉత్తరీయంలో చుట్టి వారి దగ్గర పడేసిందట. ఆ ప్రదేశం పేరు ‘సీతంపేట’ అయ్యింది. ఇది భద్రాచలానికి తూర్పున 50 కి.మీ.ల దూరంలో కూనవరానికి దగ్గర్లో ఉంది. అటు తర్వాత రామలక్ష్మణులు సీతను వెతుక్కుంటూ కూనవరానికి వచ్చారు. అక్కడ వారికి స్థానిక సవర తెగ స్త్రీ శబరి కనిపించింది. ఆమె రేగుపళ్ళ రుచి చూసి తియ్యగా ఉన్నవాటిని రాముడికి తినిపించింది. ఆ ప్రదేశాన్ని ఇప్పుడు ‘శ్రీరామగిరి’ అంటున్నరు. 

ఈ కూనవరం దగ్గరే శబరి నది ఉత్తరం నుండి వచ్చి గోదావరిలో సంగమిస్తుంది. పాపికొండల టూర్ బోట్లు ఇక్కడి నుండే గోదావరిలో ప్రయాణిస్తయి. సమీపంలో వాలి సుగ్రీవుల కొండ కూడా ఉన్నది. ఆ కొండపై వాలి సుగ్రీవులు కొట్లాడినారని అంటరు. అయితే, వాళ్లు కొట్లాడినట్లు తెలిపే శిల్పాలు ఇక్కడికి దక్షిణంగా కొన్ని పదుల కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ గోదావరి జిల్లాలోని కామవరపు కోట గ్రామ పరిధిలోని కొండల్లో ఉన్నయి. ఆ కొండల్లో వాలి భార్య తారను పూజించే ఒక ప్రాచీన గుహాలయం ఉన్నది. వీటన్నిటి మూలంగా కూనవరం దగ్గర వాలి సుగ్రీవుల కొండలో రాముడు వాలిని చంపినట్లు, సుగ్రీవునితో స్నేహం చేసి అతని సహచరులను నలు దిశలకు పంపి సీతను వెదికించినట్లు అనుకోవడానికి ఆధారం లభిస్తుంది. కూనవరంలోని రామాలయంలో యోగరాముని విగ్రహం ఉంది. దీనికీ ఒక కారణం కనిపిస్తుంది. రాముడు పర్ణశాలలో ఉన్నప్పుడు ఇక్కడున్న మతంగముని ఆశ్రమంలో యోగ నేర్చుకున్నారట.

చారివూతక స్థలాలు
కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలోని అడవి సోమనపల్లిలో ‘ఎక్కటె విమున’ అనే అతడు క్రీ.శ. 10వ శతాబ్దంలో రామేశ్వర ప్రతిష్ట చేసినట్లు అక్కడ శాసనమున్నది. ఈ ఊరికి ఉత్తరాన గోదావరికి అవతల విమునపల్లి (వేమనపల్లి)లో కూడా అనేక శిథిల శిల్పాలున్నయి. అక్కడ కూడా ఈ ‘ఎక్కటె విమున’ అనే అతనే రామేశ్వర దేవాలయం కట్టించి ఉండవచ్చునని, అతని పేరుతో ఉన్న ఊరు పేరును బట్టి ఊహించవచ్చు. అడవి సోమనపల్లి రామేశ్వరాలయం కోసం క్రీ.శ. 110 ప్రాంతంలో పెనుకంటి ముచ్చిడ్డి అనే రామగిరి ప్రాంత రాజు భూదానం చేశాడని తెలిపే శాసనం కూడా లభిస్తున్నది.కరీంనగర్ జిల్లాలోనే ఉన్న పొట్లపల్లి రామాలయానికి సాగు నీరును తోడే ‘మోట రాట్నాన్ని’ కళ్యాణి చాళుక్యరాజు త్రిలోకమల్లదేవుని మహాసామంతుడు- రేగొండ రాజు చందయ్యరసర్ మకీ.శ. 1066 మార్చి 14వ తేదీ ఆదివారం (చంవూదక్షిగహణం) నాడు దానం చేసిండని ఆలయ శిలాశాసనంలో ఉంది. రాముడు తన తండ్రికి ‘ఉల్లింతపప్పు’తో శ్రాద్ధం పెట్టినట్లు చెప్పబడుతున్న ప్రాంతం ఇదే. అది ‘ఇల్లంతకుంట’కు సమీపంలోనే ఉండటం గమనార్హం.

కరీంనగర్ జిల్లాలోని యెల్గేడులోని రామనాథ దేవరకు ఓరుగల్లు కాకతీయరాజు రెండవ ప్రతాపరువూదుని ఒక భార్య లకుమాదేవి తన తండ్రి పేర స్థానిక పన్నులను క్రీ.శ. 1301 జూన్ 27 నాడు వృత్తిగా (దానంగా) ఇచ్చినట్లు అక్కడ శాసనమున్నది. ఇదే జిల్లాలోని విలాసాగర్‌లో ఉన్న రామేశ్వర దేవాలయానికి క్రీ.శ. 1302లో మల్యాల వంశ రాజులు దానం చేసినట్లు తెలిపే శాసనం కూడా ఆ ఆలయంలో ఒకటున్నది.
నిజామాబాద్ జిల్లాలోని బండరామేశ్వరపల్లి దేవాలయంలోని శ్రీరామనాథ దేవునికి క్రీ.శ. 1264లో రాణి రుద్రమదేవి సామంతుడు ‘గుండయ పిన్నవేలుకొండ’ అనే గ్రామాన్ని దానం చేసినట్లు ఆ ఆలయ స్తంభ శాసనం తెలియజేస్తోంది. ఇదే జిల్లా తాండూరులో త్రిలింగ రామేశ్వరాలయం అనే ఒక శిల్పకళాశోభిత చారివూతక ఆలయం ఉంది. అలాగే సిరికొండ మండలం లొంక రామాలయంలో కూడా కనీసం క్రీ.శ. 5వ శతాబ్దం నుండే మూలాలున్నాయని అక్కడి శాసనాలు, పురావస్తు విశేషాల ఆధారంగా తెలుస్తున్నది.
హైదరాబాద్ దగ్గరి కీసరగుట్ట పైనున్న 10 శివలింగాలను క్రీ.శ. 5వ శతాబ్దంలో విష్ణుకుండి రాజు రెండవ మాధవవర్మ తన ఒక్కొక్క యుద్ధ విజయానికి గుర్తుగా ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్టించాడనేది చారివూతక సత్యం. మార్చి 11నే ఆయన అక్కడ కట్టించిన యాగశాలలు బయటపడినట్లు ఫొటోలతో సహా పత్రికల్లో వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.

శ్రీశైలం మల్లికార్జునస్వామి దేవాలయం దక్షిణ ముఖ మండపానికి ఎదురుగా ఉన్న క్రీ.శ. 1313 నాటి స్తంభశాసనంలో ఈ దేవాలయానికి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర, కలియుగాల కాలాల్లో ఇవ్వబడుతూ వస్తున్న మాన్యాలను ఫిబ్రవరి 26న స్థిరీకరించినట్లు ఉంది. అందులో కుసలనాటిలోని మల్లికార్జునింపల్లి, సాసుఱ్ఱాల, పిప్పరిగె, కలుచెఱులు, దేవరపల్లి అనే ఐదు గ్రామాలు కూడా మాన్యాలుగా పేర్కొని ఉన్నయి. ఈ కుసలనాడు గ్రామాలు మెదక్ జిల్లాలోనివి. ఈ కుసలనాడు మొదట అంటే త్రేతాయుగంలో కుశస్థితి అని, అంటే రాముడి కొడుకు కుశుడు పాలించిన ప్రాంతమని వి.వి.కృష్ణశాస్త్రి అభివూపాయం.
అయితే, రాముడి గురువు విశ్వామివూతుని వంశంలో కూడా ఒక కుశుడు ఉన్నాడు. అతని కథను రాముడికి వినిపించడం జరిగింది. విశ్వామివూతుడు తన యాభై మంది కొడుకులను ఆంధ్రులలో కలిసి పొమ్మని శపించిండు. కాబట్టి, ఆనాడు ఆంధ్రులు నేటి తెలంగాణ ప్రాంతంలో విస్తరించి ఉండేవారు. వాళ్లలో ఒకడైన కుశుని పేర ఇది ‘కుశలనాడు’ కావడానికి ఆస్కారముంది. ఎట్లా చూసినా మెదక్ జిల్లాలోని చారివూతక ‘కుసలనాడు’ రామ సంబంధ ప్రాంతమే. ఉత్తర భారత సామ్రాట్ సమువూదగుప్తుడు క్రీ.శ. 360 ప్రాంతంలో దక్షిణ దేశాన్నంతటినీ జయించి తిరిగి ఉత్తర భారతానికి ఈ కుశలనాటి నుంచే వెళ్ళినట్లు అలహాబాద్ స్తంభశాసనంలో కూడా ఉంది.

సమువూదగుప్తుడు, అతని కొడుకు చంద్రగుప్తుడు తదితర గుప్తరాజులు శ్రీరామ భక్తులు. శ్రీరామున్ని తమ నాణేలపై ముద్రించారు. తాము జయించిన రాజులు రామ మతాన్ని పోషిస్తే వారి రాజ్యాలను వారికి తిరిగి ఇచ్చేవారని పి.వి. పరవూబహ్మశాస్త్రి నిరూపించారు కూడా. రెండవ చంద్రగుప్తుని కూతురు, వాకాటక రాజ్యపు రాణి ప్రభావతీ గుప్తతో బంధుత్వమున్న తెలంగాణ రాజు విష్ణుకుండి రెండవ మాధవవర్మ వారి ప్రభావంతోనో లేక తనకు తానుగానో రామభక్తుడై తెలుగు ప్రాంతమంతటా క్రీ.శ. 5వ శతాబ్దంలో రామలింగేశ్వరాలయాలను కట్టించాడు. మూడు, నాలుగు చోట్ల అ విషయాన్ని నిర్ధారించే విధంగా శాసనాలు కూడా దొరికాయి. కాబట్టి, ఎక్కడ ప్రాచీన చారివూతక రామలింగేశ్వరాలయం కనిపించినా దాని మూలాలు కనీసం 5వ శతాబ్దం నుండైనా ఉంటాయని చెప్పవచ్చు.