హోం

6, నవంబర్ 2011, ఆదివారం

మన పత్రికలు


తెలంగాణా పత్రిక రంగం పాత్రికేయాన్ని ధర్మంగా స్వీకరించింది, ఇక్కడ పత్రికలు ప్రజల ఆక్రన్దనలనుండి పుట్టాయి, అంధకారంలో మగ్గుతున్న ప్రజలకు ఉషోదయాన్ని ఇవ్వడానికి వెలుగు రేఖల పత్రికలు పని చేసాయి. ప్రజల స్వేదానికి, మట్టి మనుషుల ఆవేదనకు, ఆకలికి, ప్రతీకలయ్యాయి, అధికార మదన్ధులను అడ్డంగా నారికే కరవాలలయ్యాయి,   నిజాం రాజు అకృత్యాలు, జమీన్ దారుల జాగీర్ధరుల పెత్తనాలను ఎత్తి చుపేవి, రజాకార్ల దుశ్చర్యకు ఎదురొడ్డి పోరాడేవి, ఒక్క గోల్కొండ పత్రిక పేరు వింటే చాలు నిజాం రాజు జమీన్ దారులు జాగిర్ దారుల  వెన్నులో వణుకు పుట్టేది, అక్షరం అక్షరం చదువుతుంటే రక్తం మరిగిపోయి, పౌరుషం పొడుచు కొచ్చే కథనాలే, పదం పదం ప్రజల పక్షమే, తెలంగాణా వాళ్ళకు పత్రికలే లేవు అనే వాళ్ళ  కోరకు ఈ కథనం..
             శేద్య చంద్రిక లేదా సేద్య చంద్రిక తెలంగాణా ప్రాంతం నుండి వెలువడిన మొదటి పత్రిక గా చెప్పా వచ్చు, 1912 లో హిత బొదిని అనే పత్రిక ప్రారంభమైనది, దీనిని కూడా మొదటి పత్రికగా కూడా చెప్తారు, 1917 లో గౌళి గూడా నుండి ఆంద్రమాత, ఆతర్వాత 1922 లో తెలంగాణా సాంస్కృతిక ప్రతీకలుగా చెప్పాబడే నీలగిరి, తెనుగు అనే పత్రికలు పుట్టాయి, నీలగిరి నల్గొండ నుండి, తెనుగు వరంగల్ నుండి ప్రారంభమైనాయి, నీలగిరి తెలంగాణాలో మొదటి వార పత్రిక, 1926 లో తెలంగాణా ఆత్మ గౌరవ పతక గా చెప్పబడే గోల్కొండ పత్రిక ప్రారంబమైంది, ఈ పత్రికను సురవరం ప్రతాప రెడ్డి నిర్వహించారు, తెలంగాణా లో నిజాం రాజు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పుట్టిన మరో పత్రికే రయ్యత్, రయ్యత్ అనేది ఒక ఉర్దూ పత్రిక షోయబుల్ల ఖాన్ అనే ప్రముక పాత్రికేయుడు నిజాం రాజు యొక్క నిరంకుశ పాలనపై అక్షర పోరు జరిపాడు, ఆయన స్వయంగా ఇమ్రోజ్ అనే పత్రికను 1947 ప్రాంతంలో తీసుకొచ్చారు.భాగ్య రెడ్డి వర్మ సంపాదకత్వంలో భాగ్య నగర్ అనే పాత్రక నడిచింది, 1946 లో శోభ అనే పత్రికను ప్రారంబించారు కాని ఇది ఒక సంవత్సరంలోనే ఆగి పోయింది, దీనిని మల్లి 1950 లో పూనా ప్రారంభించారు, దాశరథి మొదటి కావ్యాలు ప్రచురితమైంది ఈ పత్రికలోనే.




                         గోల్కొండ పత్రిక తొలుత అర్ధ వార పత్రిక గా ఉండేది, కాని ఆ తర్వాత దిన పత్రిక గా మారింది, కాని నిధుల లేమితో పత్రిక రెండుమూడు రోజులకొక సారి వచ్చిన జనం ఒకే పత్రికను రెండు మూడు రోజులు కొని చదివి పత్రికను ఆధుకున్నారు, మన పత్రికలలో గోల్కొండ ముఖ్యమైనది, తెలంగాణాలో కవులే లేరని, ఉన్న కవులను కూడా తమ కాతలో వేసుకున్న ఆంధ్రులకు గోల్కొండ పత్రిక సమాధానం చెప్పింది, తెలంగాణాలో ఉన్న కవులను, సాహిత్యాన్ని రుజువులతో సహా వెలికి తీసింది, 
                           తెలంగాణా అనే పత్రిక 1942 లో 1944 లో మీజాన్, 1951 లో సారస్వత జ్యోతి, 1946 లో కాకతీయ  పత్రికలు వెలువడ్డాయి కాని ఎక్కువకాలం నిలువలేఖ పోయాయి. కాకతీయ పత్రికను మాజీ ప్రధాని పీ వీ నరసింహ రావు చాల ఇష్టంగా చదివేవారు.
                     సుజాత పత్రిక 1927 లో మాస పత్రికగా ప్రారంభమైంది, కథలు, వ్యాసాలు, కవిత్వం ప్రచురించేవారు, తెలంగాణాలోని అనేక శాసనాలను  ప్రచురించేవారు, సుజాతలో తెలంగాణా రచయితల రచనలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు, గుడిపాటి వెంకట చలం రచనలకు బ్రిటిష్ ఇండియా లో నిషేధం ఉండేది, కాని సుజాత పత్రిక ధైర్యంగా ప్రచురించింది, ఆ తర్వాత సంపాదకులు శర్మ, పట్టబద్రులు కావడం తో ఆయన వెళ్ళిపోయారు, ఆ తర్వాత గోల్కొండ పత్రిక సంపాదకులే దీనిని నిర్వహించారు.నిజాం రాజు కాలం లో వచ్చ్సిన తెలంగాణా పత్రికలు ప్రజల వానిని వినిపించాయి, `రాజకారుల దుశ్చర్యల్ని ప్రశ్నించాయి, ప్రజలను మేల్కొల్పాయి, అనునిత్యం ప్రజల పక్షాన ఉంటూ ప్రజల ఆదరణను చూరగొని ప్రభువుల ఆగ్రహానికి కూడా గురి అయ్యాయి, కాని నేటి లాగా పత్రికలు అంటే రాజకీయ నాయకుల, పాలకుల  డైరీలుగా ఆరోజు లేవు, ప్రజల పక్షాన మాత్రమే ఉన్నాయి...
( మధ్య ఫోటో సురవరం ప్రతాప రెడ్డి గారిది, పైది షోయబుల్ల ఖాన్ ఫోటో)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి