హోం

24, నవంబర్ 2011, గురువారం

ట్యాంక్ బండ్ పై విగ్రహాలు..



హుస్సేన్ సాగర్‌ హైదరాబాదు నగరపు నడిబొడ్డున ఒక మానవ నిర్మిత సరస్సు. ఈ జలాశయాన్ని 1562లోఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనా కాలములో హజ్రత్ హుస్సేన్ షా వలీచే నిర్మింపబడింది. 24 చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న ఈ సరస్సు నగరము యొక్క మంచినీటి మరియు సాగునీటి అవసరాలను తీర్చటానికి మూసీ నదియొక్క ఒక చిన్న ఉపనదిపై నిర్మించబడింది. చెరువు మధ్యలో హైదరాబాదు నగర చిహ్నముగా ఒక ఏకశిలా బుద్ధ విగ్రహాన్ని 1992లో స్థాపించారు. దీనికి పక్కన నెక్ లెస్ రోడ్ ఉంది
1562లో హుస్సేన్ సాగర్ నిర్మాణాన్ని ఇబ్రహీం కులీ కుతుబ్ షా కట్టించినా, దాని నిర్మాణ పర్యవేక్షణ మాత్రం ఇబ్రహీం కులీ అల్లుడు, పౌర నిర్మాణాల సూపరిండెంటైన హుస్సేన్ షా వలీ చేపట్టాడు.చెరువు తవ్వకం పూర్తయినా నీరు నిండకపోవటంతో మూసీ నదికి అనుసంధానం చేశారు. 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 32 అడుగుల లోతుతో చెరువు ఉండేది. కుతుబ్ షా ఈ సరస్సుకు ఇబ్రహీం సాగర్ అని పేరుపెట్టాలని అనుకున్నాడు, కానీ హుస్సేన్ వలీ యొక్క ప్రాచ్యుర్యము వలన ప్రజలు ఆయన పేరు మీదుగా హుస్సేన్ సాగర్ చెరువు అని పిలవటం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న సుల్తాను చెరువులకున్న ప్రజాదరణను గమనించి వెంటనే తన పేరు మీద గోల్కొండకు 16 మైళ్ళ దూరములో ఇబ్రహీంపట్నం చెరువును నిర్మింపజేశాడు1568లో హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ గట్టుగా నిర్మించబడిన రోడ్డును టాంక్ బండ్ అంటారు. ఈ రోడ్డు హైదరాబాదు మరియు సికింద్రాబాదు జంట నగరాలను కలుపుతుంది . ఈ గట్టుమీద నుండి వెళ్ళే ట్యాంక్ బండ్ రహదారికి, జంటనగరాలలో ఒక విశిష్టమైన గుర్తింపు ఉంది. పొద్దున్న పూట వ్యాయామంలో భాగంగా ఉదయం నడక సాగించేవారికి, సాయంకాలం వాహ్యాళికి వెళ్ళేవారికి(ముఖ్యంగా ఆదివారం మరియు ఇతర శెలవు రోజుల సాయంత్ర సమయాలలో), స్నేహితులను కలుసుకొనేవారికి, ఇది ఒక ఇష్టమైన ప్రత్యేక స్థలం.
టాంక్‌బండ్ ప్రక్కనున్న హుస్సేన్ సాగర్‌లో 'జిబ్రాల్టర్ రాక్' అనబడే రాతిపైన ఒక పెద్ద బుద్ధ విగ్రహాన్ని అమర్చారు. ఒకే రాతిలో మలచబడిన ఈ విగ్రహం 17.5 అడుగుల ఎత్తు ఉండి 350 టన్నుల బరువుంటుంది. గణపతి స్థపతి నేతృత్వంలో 40 మంది శిల్పులు రెండు సంవత్సరాలు శ్రమించి మలచిన ఈ శిల్పం 60 కి.మీ. దూరంనుండి 192 చక్రాలు గల వాహనంపై ఇక్కడికి తీసుకురాబడింది. అయితే స్థాపన సమయంలో విషాదం చోటు చేసుకొంది. బార్జ్‌తో పాటు విగ్రహం మునిగి కొందరు శ్రామికులు ప్రాణాలు పోగొట్టుకొన్నారు. మళ్ళీ డిసెంబరు 1992లో దీనిని వెలికితీసి ప్రతిష్టించారు. హైదరాబాదు నగర చిహ్నంగా చార్మినార్‌తో పాటు ఈ విగ్రహాన్ని కూడా పలు సందర్భాలలో చూపుతారు.


 టాంక్ బండ్ పై విగ్రహాలు: తెలంగాణా సంస్కృతిని ప్రజలకు చేరకుండా, అన్ద్రవారి విజయ చిహ్నాలుగా ట్యాంక్ బండ్పై విగ్రహాలు పెట్టడానికి అప్పటి ముఖ్య మంత్రి ఎన్టి ఆర్, సంకల్పించారు. ఇందులో ఎవరెవరి విగ్రహాలు పెట్టాలి అని ఎంపిక చెయ్యడం కోసం డా. సి. నారాయణ రెడ్డి తో ఒక కమిటి వేసారు, ఆయన ఎంపిక మేరకు విగ్రహాలను తాయారు చేయించి ప్రతిష్టించారు.( ఆయన ఎంపిక ఏమి లేదు, ఎన్ టి ఆర్ ముందు ఎవరి విగ్రహాలైతే పెట్టలనుకున్నదో వారివే పెట్టారు, ఈ కమిటి ఎందుకంటే తెలంగాణా వాడి సంస్కృతి మీద దాడి చేయించేది సీమంద్ర సర్కార్ ఐన చేసేది తెలంగాణా వాడు.( కత్తి వాడిది పొడిచేది మనవాడు). ఇందులో తెలంగాణా తో, ఉమ్మడి రాష్ట్రంతో  ఎ మాత్రం సంబంధం లేని అల్లూరి, టంగుటూరి ప్రకాశం, పొట్టి శ్రీ రాములు, సర్ ఆర్ధాన్ కాటన్, బళ్ళారి రాఘవ, శ్రీ కృష్ణ దేవరాయలు లాంటి అనేక మంది విగ్రహాలు పెట్టారు, అయితే విచిత్రం ఏమిటంటే హైదరాబాద్ ను, అందున ట్యాంక్ బండ్ ను నిర్మించిన కూలి కుతుబ్ష విగ్రహం లేదు, కన్నడ రాజు శ్రీ కృష్ణ దేవరాయలు విగ్రహం ఉంది కాని గణపతి దేవ చేక్రవర్తి, ప్రతాప రుద్రుల విగ్రహాలు లేవు, అల్లూరి విగ్రహం పెట్టిన వారు కొమురం భీమ విగ్రహాన్ని పెట్టలేదు, తెలంగాణా సాయుధ పోరాట వీరులలో కనీసం ఒక్కరికి కూడా ఇక్కడ చోటు దక్కలేదు, హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణ రావు, తెలంగాణా లో కాంగ్రెస్ వ్యవస్థాపకుడు రామానంద్ తీర్ధ, ప్రముఖ జర్నలిస్ట్ షోయబుల్ల ఖాన్, తెలుగు సినిమాకు జాతీయ అవార్డు తెచ్చి పెట్టిన డైరెక్టర్ బి ఎస్ నారాయణ, లే కాకుండా తెలంగాణాను సుధీర్గ కాలం పరిపాలించి తెలంగాణకు రైల్, రోడ్ మార్గాలు, విద్యుత్ సదుపాయం, కర్మాగారాల ఏర్పాటు, నదుల పై ప్రాజెక్ట్ లను నిర్మించిన నిజాం రాజుల్లో ఒక్కరి విగ్రహం కూడా అక్కడ లేదు, అమరావతి బౌద్ధ స్తూపం లాంటి నిర్మాణాన్ని అక్కడ ఏర్పాటుచేసారు, కాని తెలంగాణా సంస్కృతక చిహ్నాలని ఏర్పాటు చెయ్యలేదు.

విగ్రహాల విధ్వంసం: అనేక సంవత్సరాల ఓపిక తర్వాత ఒక రోజు తెలంగాణా తిరగ బడింది, తనపై విజయట్టహాసం చేస్తున్న అన్ద్రవారి అరువుతెచ్చుకున్న విగ్రహాలను పునాదులతో సహా పెకిలించింది, అదే మిలియన్ మార్చ్, 2011 మార్చ్ 10 న మిలియన్ మార్చ్ కు తెలంగాణా జే ఎ సి పిలుపునిచ్చింది, పోలిసుల నిర్భంధాలను తేన్చుకుంటూ తెలంగాణా సమాజం ఆ రోజు ట్యాంక్ బండ్ పైకి వచ్చి చేరింది, పోలిసుల అతితో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి, జనం చూపు ఆంద్ర విగ్రహలపై పడింది తెలంగాణా నడిబొడ్డున ఉన్న ఆంద్ర బొమ్మలను పగలగొట్టారు, నీటిలో నిమర్జనం చేసారు, తరతరాల తమ అస్తిత్వ పోరాటానికి పదును పెట్టారు, ఈ సంగాతనతో తెలంగాణా ప్రజలంతా ఉత్సాహం పొందారు, మరో మహోద్రుత ఉద్యమ రూపం కోసం ఎదురు చూస్తున్నారు.....




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి