హోం

10, నవంబర్ 2011, గురువారం

నేటి వార్త (10 /11 /2011 )

1 . తెలంగాణ ఉద్యమంలో నక్సల్స్ లేరని డీజీపీ దినేష్‌రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గన్‌మెన్‌లకు వదులుకుంటే తాము ఏం చేయలేమని తెలిపారు. 
2 . తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఈ నెల 16 నుంచి 21 వరకు పది జిల్లాల్లో టీఆర్‌ఎస్ నేతలు పాదయాత్రలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు వెల్లడించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూర్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రలతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. తమ రాజీనామాలు ఆమోదించనందుకు గానూ చట్టసభల్లో పాల్గొని సభలను స్తంభింపజేస్తామని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.
3 . తెలంగాణపై వెంటనే ప్రకటన చేయకపోతే ఉద్యమం తీవ్రతను కేంద్రం ఎదుర్కొవలసి వస్తుందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధులు రోజుకో ప్రకటనతో తెలంగాణ ప్రజలను, మీడియాను గందరగోళానికి గురిచేస్తోందని కేసీఆర్ మండిపడ్డారు. ఎస్సార్సీ, గిస్సార్సీలను కట్టిపెట్టి 1956కు ముందున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తుఫాను ఉధృతితో తెలంగాణ ఉద్యమం ఎగసిపడుతోందని, జరిగే పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. ఇంకా ఎన్ని విధాలుగా ఉద్యమాలు చేస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కేంద్రానికి తెలుస్తుందని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులపైన పీడీ యాక్ట్ లాంటి నల్ల చట్టాలను ప్రయోగిస్తూ ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతున్నదని మండిపడ్డారు. చెరుకు సుధాకర్‌పై పెట్టిన పీడీ యాక్ట్‌ను ఉపసంహరించుకొని, ప్రభుత్వం వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ శక్తితోనే తెలంగాణ సాధించాలని 2001లోనే తాను చెప్పానని గుర్తు చేశారు.
4 . ఈ నెల 22వ తేదీ లోపు తెలంగాణపై కేంద్రం స్పందించకపోతే సేవ్ డెమోక్రసీ పేరుతో సత్యాగ్రహ యాత్ర చేస్తానని కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్కొన్నారు. తమ యాత్ర శాంతియుతంగా కొసాగుతోందని తెలిపారు. గన్‌పార్క్ వద్ద ఆయన అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 22న ఢిల్లీలోని రాంలీలా మైదానం నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ చేపడుతామని తెలిపారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే వరకు పార్లమెంట్‌ను స్తంభింపజేయాలని ఆయన ఎంపీలను కోరారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే దాకా తమ నిరసనలు కొనసాగుతాయని చెప్పారు.
5 . రంగారెడ్డి జిల్లా కీసరలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కు మహిళలు చుక్కలు చూపించిన్రు. రూపాయికి కిలో బియ్యం పథకంపై సీఎంతో సహా రచ్చబండకు హాజరైన నేతలను కడిగిపారేసిన్రు. దిక్కుమండ్ల బియ్యాన్ని ఎట్ల తినాలంటూ.. గల్లపట్టినంత పనిచేసిన్రు. నిత్యావసరాల రేట్లు దించినంకనే మాట్లాడాలంటూ.. నిలదీసిన్రు. దీంతో బిత్తరపోయిన నేతలు మహిళలను సముదాయించేందుకు విఫలయత్నం చేసిన్రు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి