హోం

17, నవంబర్ 2011, గురువారం

తెలంగాణ సాధన పాదయాత్రలు



ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో భాగంగా బుధవారం టీఆర్‌ఎస్ చేపట్టిన ‘తెలంగాణ సాధన పాద యాత్ర ’లో పార్టీ శ్రేణులు, తెలంగాణవాదులు భారీ ఎత్తున పాల్గొన్నారు. యాత్రకు అడుగడుగునా మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. ఆరు రోజులు సాగే ఈ యాత్రలను వరంగల్‌లో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రారంభించారు. యూపీ సీఎం మాయావతికి ఉన్న సోయి సీఎం కిరణ్‌కుమార్‌కు రావాలన్నారు. కాంగ్రెస్‌కు పోయేకాలం వచ్చిందని కరీంనగర్ జిల్లా యాత్రలో ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. రంగాడ్డి జిల్లా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చే దాకా పోరాటం ఆగదన్నారు.
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తామని పాలమూరు పాద యాత్ర లో ఎమ్మెల్యే జూపల్లి, నిజామాబాద్ యాత్రలో ఎమ్మెల్యేలు పోచారం, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌డ్డి హెచ్చరించారు. తెలంగాణకు అడ్డుపడుతున్న కిరణ్ సర్కార్‌కు దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మెదక్ జిల్లా యాత్రలో ఎమ్మెల్యే హరీష్‌రావు సవాలు విసిరారు. యాత్రద్వారా కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ద్రోహులను తరిమి కొట్టాలని నల్లగొండ యాత్రలో ఎమ్మెల్యే సోమారపు, పొలిట్‌బ్యూరో సభ్యుడు జగదీశ్వర్‌డ్డి పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్ కో ఖతం కరో.. తెలంగాణ హాసిల్ కరో నినాదంతో టీఆర్‌ఎస్ చేపట్టిన తెలంగాణ సాధన పాద యాత్రకు  కరీంనగర్ జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బుధవారం కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ శివారులోని గండి హనుమాన్ దేవస్థానం నుంచి ఈ పాదయావూతను టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత, పాదయాత్ర ఇన్‌చార్జి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. కాంగ్రెస్కు పోయేకాలం దగ్గరపడ్డదని ధ్వజమెత్తారు. తొలుత దేవాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కోరుట్ల, ధర్మపురి ఎమ్మెల్యేలు కే.విద్యాసాగర్‌రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్8 మహిళావిభాగం అధ్యక్షురాలు తుల ఉమ తోపాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ముఖ్య నేతలు పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించారు.
గండిహనుమాన్ నుంచి బయలుదేరిన పాదయాత్ర రాజేశ్వరావుపేట, సత్తక్కపల్లి స్టేజీల మీదుగా బండలింగాపూర్, మేడిపల్లి, వెంకట్‌రావుపేటల నుంచి మెట్‌పల్లికి మధ్యాహ్నం చేరుకుంది. భోజన విరామం అనంతరం ఆరపేట, మారుతీనగర్, మేడిపల్లి మీదుగా కొరుట్లకు రాత్రి 7గంటలకు చేరుకుంది. మార్గమధ్యంలో విద్యార్థులు, మహిళలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మెట్‌పల్లిలో ఈటెల మాట్లాడుతూ ప్రజాస్వామ్యంగా ఎదుర్కోలేక కాంగ్రెస్8 ప్రభుత్వం పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని, చివరి అస్త్రంగా నిర్బంధకాండను ప్రయోగిస్తోందని, పోయేకాలం వచ్చినపుడు ప్రభుత్వాలు ఇలానే ప్రవర్తిస్తుంటాయని విమర్శించారు. పీడీ యాక్ట్ కింద అరెస్టు చేసిన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఈ యాత్ర కొనసాగిస్తున్నామని తెలిపారు. తెలంగాణ మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి