పీ జనార్ధన్ రెడ్డి హైదరాబాద్ నగరం లో జనవరి 12 1948 లో జన్మించారు, ఆయన పీ జే ఆర్ గా అందరికి సుపరిచితుడే,ఆయన తండ్రి పాపి రెడ్డి , తల్లి శివమ్మ, కార్మిక నాయకునిగా ఆయన ప్రస్థానం ప్రారంభమయ్యింది, కార్మిక నాయకునిగా ఆయన చేసిన విశేష సేవలను గుర్తించిన అప్పటి ముక్య మంత్రి టి. అంజయ్య పీ జే ఆర్ ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు, ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి 1978 మొదటిసారి ఎం ఎల్ ఎగా ఎన్నికయ్యారు, పేదల పాలిటి పెన్నిదిగా అయన ప్రజల గుండెల్లో సమున్నత స్థానం సంపాదించుకున్నారు, తన నియోజకవర్గం మొత్తం CC రోడ్లు వేయించారు, ఆయన ఇలవేల్పు ఐన జూబ్లి హిల్స్ పెద్దమ్మ తల్లికి దేవాలయం నిర్మించారు, ముక్యంగా ఆయన ప్రజలకు నిత్యం అందు బాటులో ఉండేవారు, ప్రజలు ఎ సమయంలో పిలిచినా వారికోసం పరుగు పరుగున వెళ్ళేవారు, ఆయన బతికి ఉన్నన్ని రోజులు ప్రభుత్వం హైదరాబాద్ భాస్తిల వైపు కుల్చేయ్యలని కన్నెత్తి కూడా చూడలేదంటే ఆయన బస్తి వాసులను ఎంతగా కాపడుకున్నారో అర్థం అవుతుంది, అసెంబ్లీలో చంద్ర బాబు నాయుడు కాలం నుండి రాజశేకర్ రెడ్డి వరకు తెలంగాణాకై పోరాడిన మనిషి పీ జే ఆర్, ఆయన మొత్తం ఐదు సార్లు ఎం ఎల్ ఎ గ ఎన్నికయ్యారు, 1994 నుండి 1999 వరకు సి ఎల్ పీ నాయకుడిగా ఉన్నారు, ఆయన తెలంగాణపై సొంత ప్రభుత్వాన్నే నిలదీసే వారు అందుకే ఆయనను వివాదాస్పదుడు అని ఎంతో సీనియర్ ఐన రాజశేకర్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు, పదవులకంటే తను నమ్ముకున్న సిద్ధాంతనికే కట్టుబడిన పీ జే ఆర్ చివరివరకు తెలంగాణాకై పరితపించారు, ఆయన 2007 ,డిసెంబర్ 28 న కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తుండగా గుండె పోటుతో మరణించారు, ఆయన లేని లోటు ప్రస్తుత ఉద్యమంలో ప్రస్పుటంగా కనిపిస్తున్నది, పేద ప్రజలకొరకు ఆయన జీవితాంతం కృషి చేసారు, వాళ్ళ మనసుల్లో ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు, అందుకే ఆయనకు ఆ ప్రజలు గుడి కట్టి పూజిస్తున్నారు, ఆయన కుమారుడు విష్ణు వర్ధన్ రెడ్డి తండ్రి బాటలో నడుస్తూ తెలంగాణాకొరకు పోరాడుతున్నాడు..
పీ జే ఆర్ అసెంబ్లీ లో తెలంగాణా గురించి రాజశేకర్ రెడ్డిని నిలదీస్తున్న దృశ్యం:
We need hundreds of PJRs. Even one would be welcome.
రిప్లయితొలగించండి