హోం

9, నవంబర్ 2011, బుధవారం

నేటి వార్త ( 09 /11 /2011 )

1 . చంద్రబాబు రైతుపోరు యాత్ర పై ఖమ్మం జిల్లావాసులు మండిపడుతున్నరు. బాబు హయాంలో బషీర్ బాగ్ కాల్పుల ఘటనలో అసువులు బాసిన జిల్లా వాసి సత్తెనపల్లి రామకృష్ణ కుటుంబానికి సమాధానం చెప్పి యాత్ర చేపట్టాలని డిమాండ్ చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయమే దండగన్న చంద్రబాబు ఇప్పుడు రైతు యాత్ర చేపట్టడాన్ని విడ్డూరంగా ఉందని టీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు. యాత్రకు నిరసనగా రామకృష్ణ స్ధూపం వద్ద బాబు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
2 . నిమ్స్ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్ష విరమించారు. ఢిల్లీలో పార్లమెంట్ ముందు తెలంగాణ కోసం ఉరి వేసుకుని మరణించిన యాదిరెడ్డి తల్లి చంద్రమ్మ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీక్ష గత తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీక్ష విరమణకు కాంగ్రేస్ నేతలు, జేఏసీ నేతలు హజరయ్యారు. కోదండరాం, మంత్రిసారయ్య ,గుత్తా , మందా జగన్నాథం, కేకేశవరావు, తదితరులు హాజరయ్యారు.
3 . రూపాయి కిలో బియ్యం ముక్కిపోయినయన్నందు కు బాలరాజు అనే వ్యక్తిపై చేయిచేసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
4 . తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వలసలు జోరందుకున్నాయి. మరో నలుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి త్వరలో చేరనున్నారు. 11వ తేదిన చేరుతున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిందే, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, అచ్చంపేట ఎమ్మెల్యే సి.రాములు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. చంద్రబాబు రెండుకళ్ల సిద్దాంతం, తటస్థ వైఖరీ అంటూ తెలంగాణ విషయంలో పూటకో మాట చెబుతుండటం వలనే ఎమ్మెల్యేలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌లోకి మరో నలుగురు ఎంపీలు వెళ్లెందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిసింది.తాను టీఆర్‌ఎస్‌లో చేరే ఆలోచన లేదని హన్మంత్ షిడే తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి