"విశాలాంద్రలో మునుముందు అభివృద్ది పతకాలను చేపట్టినపుడు తెలంగాణా హక్కులకు తగిన గుర్తింపు లభించకపోవచ్చును అనే భయం ఆ ప్రాంతంలో ఉన్నదీ. ఉదాహరణకు : నందికొండ (కృష్ణ), కుష్ట పురం (గోదావరి) వంటి ప్రాజెక్ట్లు తెలంగాణాలోనే కాకమొత్తం దేశంలోనే చేపట్టిన పథకాలలో ముక్యమైనది, ఈ రెండు పెద్ద నదులపై సేద్యపు పథకాలు చేపట్టాలనే ఆలోచన కోస్తా ప్రాంతంలో కూడా ఉంది, ఈ పరిస్థితిలో కృష్ణ గోదావరి జలాలలో ప్రస్తుతం తమకున్న స్వతంత్ర అధికారాన్ని కోల్పోవడానికి తెలంగాణా ప్రాంతం సిద్ధంగా లేదు. (ఎస్.ఆర్.సి రిపోర్ట్ పేరా 377 )
అనుకున్నట్టుగానే జరిగింది, నది జలాల కేటాయింపులో వాటి వినియోగంలో ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం అతి దారుణం.
* ఆంద్ర ప్రదేశ్ అవతరణకు పూర్వమే అప్పుడున్న హైదరాబాద్ ప్రభుత్వం కొన్ని ప్రాజెక్ట్లను కృష్ణ నదిపై చేపట్టింది, వాటి కొరకు 560 టి ఎం సి ల నీటిని కేటాయించింది.
* అప్పటి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్లలో నల్లగొండ, ఖమ్మం జిల్లాల కొరకు 161 టి ఎం సి ల సామర్ధ్యంతో నంది కొండ, మహబూబ్ నగర్ కొరకు 100 టి ఎం సి ల భీమ, 54 .40 టి ఎం సి ల సామర్థ్యం కల అలమట్టి లు ప్రధాన మైనవి.
* 1956 లో రాష్ట్రాల పునర్ వ్యవస్తికరణ జరిగింది, కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఐన ఈ ప్రాజెక్ట్లు పూర్తి చెయ్యాలని భారత పార్లమెంట్ నిర్ణయించింది.
* కృష్ణ నది జలాలను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సమంగా పంచడానికి కేంద్రం బచావత్ ట్రిబునల్ను ఏర్పాటు చేసింది.
* 1973 లో ట్రిబునల్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఆంద్ర ప్రదేశ్ కు 811 టి ఎం సి ల నికర జాలం, దానిని మించి మిగులు జలాలు వాడుకునే హక్కు లభించింది.
* ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణ పరివాహక ప్రాంతం తెలంగాణా లో 68 .5 %, ఆంద్ర లో 13 .11 % , రాయలసీమలో 18 .39 % ఉంది.
* కృష్ణ పరివాహక ప్రాంతంలో సాగుకు అనుకూలంగా ఉన్న భూమిలో 70 % తెలంగాణాలోనే ఉంది కాబట్టి ట్రిబునల్ ఇచ్చిన 811 టి ఎం సి ల నీటిలో తెలంగాణా కే ఎక్కువ భాగం నీరు లభించాలి.
* కాని 70 % పరివాహక ప్రాంతం ఉన్న తెలంగాణకు 277 .86 టి ఎం సి లు అంటే కేవలం 34 .26 % నీటిని కేటాయించారు, అదే ఆంద్ర లో కేవలం 13 .11 % మాత్రమే పరివాహక ప్రాంతం మాత్రమే ఉన్నది కాని వారికీ 388 .44 టి ఎం సి లు అంటే 47 .90 % నీరు అందుతున్నది, ఇక రాయల సీమ లో 18 .30 % పరివాహక ప్రాంతం ఉన్నదీ వారికి 17 .90 % నీరందు తున్నది, అయితే తెలంగాణా కు ఆ 277 టి ఎం సి ల నీరుకూడా అందడం లేదు, అతి కష్టం మీద తెలంగాణాకు అందుతున్న నీరు ఎంత అంటే 120 టి ఎం సి లు అంటే కేవలం 15 % నీరు మాత్రమే కృష్ణ నది నుండి తెలంగాణకు లభిస్తున్నది.
ప్రకాశం బ్యారేజి: ఇది కేవలం కోస్తా ప్రాంతానికి మాత్రమే పనికి వచ్చే ప్రాజెక్ట్.
* దీనికి కేటాయించింది 181 .20 టి ఎం సి లు. ఈ నీటితో 12 లక్షల ఎకరాల్లో మాగాణి పండించవచ్చు.
* కాని దీని కింద 13 లక్షల ఎకరాలు ఖరీఫ్ , 7 లక్షల ఎకరాలు రబీ లో వరి పండిస్తున్నట్లు రెవెన్యు లెక్కలు చెప్తున్నాయి.
* అంటే 330 టి ఎం సి ల కంటే ఎక్కువ నీరు అవసరం, అయితే 181 .20 టి ఎం సి ల నీటిని మత్రమ నాగార్జున సాగర్ నుండి వదలాలి, అయితే మిగిలి నీరు ఎక్కడనుండి వస్తుంది..?
* ఆ నీరు కూడా నాగార్జున సాగర్ నుండే వాదులు తున్నారు, అది సాగుకోసం అని కాక విద్యుదుత్పత్తికి అని చెప్తున్నారు, అయితే నాగార్జున సాగర్ లో విద్యుదుత్పత్తికి వదిలిన నీటిని రివర్స్ టర్బన్ ల ద్వారా డాం లోకి తిరిగి పంపాలి, అయితే దీనికి టెయిల్ పాండ్ ను సాగర్ దిగువ భాగంలో నిర్మించాలి , కాని ఇంతవరకు అలాంటి ప్రయత్నం జరగలేదు.
దాని వలన సాగార్నుండి కాలువలకు అందవలసిన నీరు డెల్ట ప్రాంతానికి తరలి వెళ్తుంది.
నాగార్జున సాగర్: ఆంద్ర ప్రదేశ్ ఏర్పడక ముందే నంది కొండ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం 161 టి ఎం సి ల సామర్థ్యం తో ఉండే విధంగా నిర్మాణం చేపట్టింది.
* ఉమ్మడి రాష్ట్రము ఏర్పడ్డాక ఇరు ప్రాంతాలకు నీరందించాలని దాని స్థలాన్ని, పేరును మార్చారు, నాగార్జున సాగర్ పేరుతో ప్రాజెక్ట్ను నిర్మించారు.
* ప్రాజెక్ట్ ప్రారంభించినపుడు హైదరాబాద్ రాష్ట్రానికి 132 టి ఎం సి లు, ఆంద్ర రాష్ట్రానికి 132 టి ఎం సి ల నీరు అందించాలని అనుకున్నారు, కాని ఉమ్మడి రాష్ట్రము ఏర్పడగానే, తెలంగాణా కు వచ్చే ఎడమ కాలువ లెవెల్స్, ఎలైన్ మెంట్ లలో మార్పు చేసి 106 .2 టి ఎం సి లకు తగ్గించడమే కాక ఆంద్ర ప్రాంతానికి వెళ్ళే కుడి కాలువను పొడగించారు.
* ఈ పరిణామంతో తెలంగాణకు అందుతున్నది కేవలం 85 నుండి 90 టి ఎం సి ల నీరు మాత్రమే. ఆంధ్రలో కుడి కాలువ కింద 15 లక్షల ఎకరాలకు నీరందుతుంటే, తెలంగాణకు కేవలం 5 లక్షల ఎకరాలకు కూడా నీరు అందడంలేదు.
* అంటే కోస్తాకు మొత్తం 811 టి ఎం సి లలో 580 టి ఎం సి లు అంటే 71 % నికి పైచిలుకు వెళ్తుంటే, తెలంగాణా, రాయలసీమలకు 230 టి ఎం సి ల నీరు అందుతున్నది.
శ్రీ శైలం: శ్రీ శైలం మొదట విద్యుత్ ఉత్పత్తికి నిర్దేశించారు కాని ఆ తరువాత సాగు నీటి కొరకు వాడుకోవాలని నిర్ణయించుకున్నారు.
* 1981 లో జరిగిన ఒప్పందం ప్రకారం 48 టి ఎం సి ల నీరు రాయలసీమకు, 50 టి ఎం సి ల నీరు తెలంగాణకు ఇవ్వాలి.
* అయితే 1983 లో రాయలసీమ కు వెళ్ళే కుడి కాలువతో గాలేరు-నగరి, హంద్రినీవ, తెలుగు గంగలను జోడించి 48 టి ఎం సి ల కంటే ఎక్కువగా తీసుకోవడం ప్రారంభించారు.
* దీనికి మూడు తూములు పెట్టారు ఒకటి కుడి కాలువ కొరకు, రెండోది తెలుగు గంగ కొరకు, మూడోది ఎస్కప్ ఛానల్ అని. మొత్తం గా గ్రావిటి పద్ధతిలో ఈ మూడు తుముల ద్వారా 200 టి ఎం సి ల నీటిని పొందవచ్చు, అంతే కాకూడ కుడి గట్టు కాలువ కోసం 20 టి ఎం సి ల నికర జలాన్ని కేటాయించారు.
* ఇక తెలంగాణా లోని ఎడమగట్టు కాలవకు గ్రావిటి ద్వారన, లేక ఎత్తిపోతల ద్వార నీరివ్వాల అన్నది నిర్ణయించలేదు.
* కేటాయించిన నీటిని 26 టి ఎం సి లకు కుదించి, అవి కూడా మిగులు జలాలకు పరిమితం చేసారు.
* అయితే నాగార్జున సాగర్కు మిగిలిన జలం తరలించి అక్కడనుండి ఎలిమినేటి మాధవ రెడ్డి అనే కాలువ నిర్మించి దాని ద్వార ఎడమకాలువ కు నీరిస్తారట..!అయితే అది కూడా నాగార్జున సాగర్ లో 510 అడుగులకు పైగా నీరుంటేనే, అంటే శ్రీ శైలం నుండి తెలంగాణకు నీరు రాదన్న మాట..
జూరాల: జూరాల అన్నింటికంటే చిన్న ప్రాజెక్ట్.
* మహాబూబ్ నగర్ కు నీరందివ్వడం దీని లక్ష్యం.
* ప్రాజెక్ట్ పని మొదలయ్యి 25 సంవత్సరాలు దాటిన ఇంకా కాలువల పనులు ముగియలేదు.
* దీనికి మొదట 17 .84 టి ఎం సి ల నీటిని కేటాయించిన 11 టి ఎం సి లకే దీని సామర్థ్యాన్ని పరిమితం చేసారు.ఇందలో కూడా ఇప్పటివరకు వాడకంలోకి వచ్చింది కేవలం మూడు లేక నలుగు టి ఎం సి లు మాత్రమే.
రాజోలిబండ మళ్లింపు పథకం: ఇది నిజాం రాజు ప్రారంభించిన పథకం, మహబూబ్ నగర్ కోసం ఉద్దేశించిన పథకం.
* ట్రిబునల్ తీర్పు ప్రకారం దీనికి 15 .9 టి ఎం సి ల నికర జలం కేటాయించారు.
* అయితే కర్నూల్ లోని కొందరు భూస్వాములు గేట్లను నిరంతరం తెరిచిఉంచి, బాంబులతో గేట్లను బద్దలు కొట్టి నీటిని అక్రమంగా తరలించుకొని వెళ్తున్నారు, ఇప్పటికి ఇలాంటి సంగటనలు అనేక సార్లు జరిగిన పట్టించుకునే నాధుడే లేదు.
* ఈ ప్రాజెక్ట్ కింద 87 వేల 5 వందల ఎకరాల భూమి సాగు కావాల్సి ఉండగా, దాదాపు మొత్తం బీడుగానే ఉంటుంది.
* ఇది చాలదన్నట్టు రాజోలి బండ నుండి నీరు రావాల్సిన భూములకు జురలనుంది ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది ప్రభుత్వం, అయితే ఇలా చేస్తే జూరాల రైతుల నోట్లో మట్టి కొట్టడమే అవుతుంది.
పులి చింతల: ఇప్పటికి జరిగిన అన్యాయాలు చాలవన్నట్టు డెల్టాప్రాంత ప్రజలకు మరింత లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది, దీని ద్వారా నల్లగొండ జిల్లా తీవ్రంగా నష్ట పోతుంది.
* నల్లగొండ లోని విలువైన ఖనిజలతో పటు, అనేక గ్రామాలూ ముంపుకు గురవుతాయి.
* గోదావరి నీటిని కృష్ణ బేసిన్కు తరలించడమే ఈ ప్రాజెక్ట్ ముక్య ఉదేశ్యం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి