హోం

14, నవంబర్ 2011, సోమవారం

జల దోపిడి, గోదావరి బేసిన్:

ఆంద్ర ప్రదేశ్ లో గోదావరి నదికి ఉన్న పరివాహక ప్రాంతంలో 79 % తెలంగాణాలో ఉంటె, కేవలం 31 % మాత్రమే ఆంద్ర ప్రాంతంలో ఉంది.
* ఈ బేసిన్ లో సాగుకు యోగ్యమైన భూమిలో 70 % తెలంగాణా లోనే ఉంది.
* హైదరాబాద్ గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్ట్లకు రూపకల్పన చేసింది. వాటికోసం అప్పటి ప్రభుత్వం 845 టి ఎం సి ల నీటిని కేటాయించింది.
* అందులో కొన్ని పూర్తి కాగ కొన్ని నిర్మాణదశలో, మరి కొన్ని ప్రణాళిక దశలో ఉన్నాయ్, వీటిలో 330 టి ఎం సి ల సామర్థ్యం కల గోదావరి భాహులార్థ సాధక ప్రాజెక్ట్, ఇచ్చంపల్లి, 350 టి ఎం సి లు, 58 టి ఎం సి లతో నిజాంసాగర్, 38 టి ఎం సి ల దేవనూర్ ప్రాజెక్ట్లు ప్రధానమైనవి.
* రాష్ట్రాల పునర్విభజన తర్వాత అంతకు ముందు ప్రోజేక్ట్లన్ని పూర్తి చెయ్యాలని పార్లమెంట్ నిర్ణయించింది.
* నీటి పంపిణి కోసం బచావత్ ట్రిబునల్ ను కేంద్రం ఏర్పాటు చేసింది, ట్రిబునల్ 1480 టి ఎం సి ల నీటిని ఆంద్ర ప్రదేశ్ వాటాగా ఇచ్చింది.
* అయితే గోదావరి కింద ఆంద్ర లో ఉన్న ఒక్క ధవళేశ్వరం కిందే ఖరిఫ్ లో 12 లక్షల ఎకరాలు, రబీ లో 7 నుండి 8 లక్షల ఎకరాలు సాగవుతుంది, అదే తెలంగాణాలో ఐదు జిల్లాల గుండా గోదావరి ప్రవహిస్తున్న ఇక్కడ అతి కష్టం మీద నాల్గు నుండి ఐదు లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతుంది, అది సంవత్సరానికి ఒక్క పంట మాత్రమె.
* గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని ప్రతిపాధికగా తీసుకుంటే రాష్ట్రానికి కేటాయించిన 1480 టి ఎం సి ల నీటిలో 79 % తెలంగాణా కు రావాలి, పరివాహక ప్రాంతంలో సాగుకు యోగ్యమైన భూమిని ఆధారంగా తీసుకున్న 70 % రావాలి. 
* ప్రధానంగా తెలంగాణా కు ఉపయోగపడే గోదావరి నీటి విషయంలో ప్రభుత్వం ట్రిబునల్ ముందు చాల భాద్యత రాహిత్యంగా ప్రవర్తించి, ఎగువరస్త్రాలకు, గోదావరి, మంజీరా నీటిని వారు అడిగినంత కాదనకుండా ఇచ్చారు.
* ఇక ప్రాజెక్ట్ లను  గురించి చర్చిద్దాం.
శ్రీ రామ్ సాగర్: తెలంగాణా ప్రాంతంలోని నిజామా బాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లోని 20 లక్షల ఎకరాలకు నీరు అందించే ఉద్దేశ్యంతో అప్పటి నిజాం సర్కార్ ప్రాజెక్ట్ నిర్మించాలని తలచారు.
* పోచంపాడ్ ప్రాజెక్ట్ గా నామకరణం చేసారు.
* అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ప్రాజెక్ట్ సంగతే మరచిపోయారు.
* 1969 ఉద్యమం తర్వాత హడావిడిగా ఈ ప్రాజెక్ట్ను మొదలు పెట్టారు కాని ఇంతవరకు అది పూర్తికాలేదు.
* ౩౩౦ టి ఎం సి సామర్ధ్యం అనుకున్న ప్రాజెక్ట్ సామర్ధ్యం 145 టి ఎం సి లకు కుదించారు.పోనీ ఆ మేరకైన పని పూర్తయ్యింద అంటే అది లేదు.
* ఈ ప్రాజెక్ట్ ద్వారా కేవలం నాలుగైదు లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతుంది, అది అతి కష్టం మీద ఒక్క పంటకు మాత్రమే.
* ఇసుక మేటలు వేయడంతో ఈ ప్రాజెక్ట్ సామర్ధ్యం 20 టి ఎం సి ల మేర తగ్గింది.
* అప్పట్లోనే ఈ విషయాన్నీ ఊహించిన నిజాం సర్కార్ ప్రాజెక్ట్ పై భాగంలో ఒక సీల్డ్ ట్రాప్ ను నిర్మించాలని సంకల్పించింది, కాని ఆ ప్రాజెక్టే గుర్తులేని నేటి ప్రభుత్వాలు సీల్డ్ ట్రాప్ ను ఎలా గుర్తుపెట్టుకుంటాయి........


శ్రీ రామ్ సాగర్ వరద కలువ: శ్రీ రామ్ సాగర్ లో ఇసుక మేటలు వెయ్యడంతో దాని సామర్థ్యం తగ్గి వరదలు వచ్చినపుడు నీరు వృధాగా దిగువకు వెళ్తుంది.
* దిగువన ఉన్న ధవలేశ్వరానికి నీరు చేరుతుండడంతో పాలకులు ఆ విషయాన్నీ సంతోషకరం గా భావించారు, అయితే ఈ విషయంపై తెలంగాణా ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్నారు, చివరికి ఈ వరద నీటిని శ్రీ రామ్ సాగర్ నుండి కాలువ ద్వార తరలించేందుకు , శ్రీ రామ్ సాగర్ వరద కాలువ నిర్మించడానికి ప్రభుత్వం అంగీకరించింది.
* దీని ద్వార వరంగల్, నల్గొండ జిల్లాల్లోని ఎగువ ప్రాంతాల్లో సుమారు 2 లక్షల 30 వేల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉంది.
* ఈ ప్రాజెక్ట్కు కేంద్రం ఎప్పుడో అనుమతులు ఇచ్చింది, పి.వి ప్రధానిగా ఉన్నప్పుడు దీనికి శంకుస్థాపన జరిగింది.
* కాని ఈనాటికి చెప్పుకోదగిన పని మాత్రం జరగలేదు.
నిజాం సాగర్: 58 టి ఎం సి ల సామర్ధ్యం కల ఈ ప్రాజెక్ట్ను అప్పటి నిజాం సర్కార్ 1931 లో నిర్మించింది.
* 100 సంవత్సరాలైనా ఈ ప్రాజెక్ట్ ఉండాలనే ఉద్యేశంతో అప్పటి ప్రభుత్వం రెండు ప్రతిపాదనలు చేసింది.
1 . ఇసుక మేటలు రాకుండా ఆపుటకు పై భాగంలో 38 టి ఎం సి ల సామర్థ్యం కల దేవనూర్ ప్రాజెక్ట్ నిర్మించాలి.
2 . మంజీరా నది పరివాహక ప్రాంతంలో అడవులను పెంచాలి.
* కాని ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఈ రెండు జరగలేదు.
* దశాబ్దాలుగా ప్రధాన కాలువ నిరవహనకు, పూడిక తీయడానికి ప్రభుత్వాలు నిధులు కేటాయించక పోవడంతో పూడికలు చేరి, డిస్టిబుటరి లో పిచ్చి మొక్కలు పెరిగి కాలువ గట్టు తెగిపోయి ప్రాజెక్ట్ నిరర్ధకమైంది.
* 2 లక్షల 75 వేల ఎకరాలకు నీరంధించవలసిన ప్రాజెక్ట్ లక్ష ఎకరాలకు కూడా నీరు అందించడం లేదు.
* కోస్తాలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ధవళేశ్వరం ప్రాజెక్ట్, ప్రకాశం బరాజ్ ల వయో పరిమితి ఆంద్ర ప్రదేశ్ ఏర్పడే నాటికీ తీరిపోయింది ఐన 1956 తర్వాత వేల కోట్లు కర్చు చేసి ఆ ప్రోజేట్ లను పునరుద్ధరించిన పాలకులు నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ను పట్టించుకోవడం లేదు.
సింగూర్: నిజాం సాగర్లో తగ్గిన నీటి నిలువ సామర్ధ్యాన్ని పాక్షికంగా ఐన పునరుద్ధరించి, మెదక్ జిల్లాకు సాగు నీరు, జంట నగరాలకు తాగు నీరు అందించాలని ఈ ప్రాజెక్ట్ ను 1980 లో మంజీరా నది పై నిజాం సాగర్ పై భాగంలో నిర్మించారు.
* అయితే ఇది కేవలం జంట నగరాలకు నీరు అందిస్తుంది కాని మెదక్ రైతులకు ఒక్క నీటి చుక్క కూడా ఇవ్వడంలేదు.
* పైగా నిజాం సాగర్కు వచ్చే నీరుకూడా ఇక్కడే ఆగిపోతుంది.
* ఇవి తెలంగాణాలో గోదావరి నది పై ఇప్పటి వరకు నిర్మించిన ప్రాజెక్ట్లు, ఇక భవిష్యత్తులో నిర్మించిన ప్రాజెక్ట్ల వివరాలు...
ఇచ్చంపల్లి : 350 టి ఎం సి ల సామర్ధ్యం కల ఇచ్చం పల్లి ప్రతిపాదన నిజం కలం నాటిది.
* ఇది జలవిధ్యుత్ ప్రాజెక్ట్, నాలుగు రాష్ట్రాలకు మధ్యలో ఉన్న ప్రాజెక్ట్, దీని ద్వార నాలుగు రాష్ట్రాలు ప్రభావితం అవుతాయి.
* కాని ఇచ్చం పల్లి నిర్మాణమే నేడు ప్రశ్నార్ధకం అయ్యింది.
దేవాదుల: 2001 జునేలో 50 టి ఎం సి లతో ఐదు లక్షల ఎకరాలకు నీరందించే ఉద్యేశ్యంతో ప్రారంభించిన ప్రాజెక్ట్ దేవాదుల.
* అయితే ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించడానికి అప్పటి ముఖ్య మంత్రి హెలికప్టార్ లో వెళ్లారు, ఎందుకనే అప్పటికి ఆ ప్రాంతంలో అసలు రోడ్ మార్గం లేదు.
2003 లో ప్రాజెక్ట్ పనులు పూర్తి కావలి, కాని ఇప్పటివరకు అరకొర పనులు జరిగాయి.
* అయితే దేవాదుల అప్పుడు ప్రారంభించిన చోట నిర్మాణం సాధ్యం కాదు అని తేల్చేసి గంగారం అనే ప్రాంతంలో కడుతున్నారు.
* అయితే దీనిని రెండు స్టేజ్ లలో పూర్తి చేస్తారు.
* మొదటి స్టేజ్ లో రెండు ఫేజ్ లు ఉంటాయి.
* మొదటి స్టేజ్ లో మొదటి ఫేజ్ పూర్తయితే 5 టి ఎం సి ల నీరు వాడుకోవచ్చు.
* దీనిని 2005 నాటికి పూర్తి చెయ్యాలి కాని ఇప్పటికి పూర్తి కాలేదు.
* అయితే గమ్మత్తు ఏంటంటే ఈ స్టేజ్ లు, ఫేజ్ లు పూర్తైన కేవలం 32 టి ఎం సి లే వాడుకోవచ్చు.
* ఇది ఎత్తి పోతల పథకం అంటే దీనిలోని నీరు పక్కన ఉన్న చెరువులు కాలువలలో ఎత్తి పోస్తారు, అయితే అదికూడా వరదలు వచ్చిన సమయాల్లో, అయితే వరదలు వచ్చినపుడు చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా ఉంటుంది, మరు ఈ నీరును ఎం చేస్తారో..?
* ఇది ఎత్తి పోతల పథకం కావడంతో విద్యుత్ కర్చు మొత్తం రైతులే చెల్లించ వలసి ఉంటుంది.
ఎల్లంపల్లి: కరీం నగర్ జిల్లలో గోదావరి నది పై 40 టి ఎం సి ల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్ట్ ఎల్లంపల్లి. ఇది దక్కి ముక్కిలు తిని ఎం టి పి సి పుణ్యమని ఒక దశ పనులు పూర్తి చేసుకున్న ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందం గా ఉంది, దీని నుండి 10 టి ఎం సి ల నీరు ఎం టి పి సి కి ఇస్తారట.. 
దుమ్ముగూడెం: సింగిరెడ్డి పల్లె: ఇవి రెండు దేవాదుల కింద తలపెట్టిన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్లు.
* ఆస్ట్రియ నుండి రుణ సుకర్యాన్ని పొంది ఈ ప్రాజెక్ట్లను నిర్మించడానికి ఒప్పందాలు చేసుకున్నారట.
* అయితే ఈ ప్రోజెట్ల నుండి వచ్చే విద్యుత్ను దేవాదులకు ఉపయోగిస్తారట..


నదుల అనుసంధానం: గోదావరి, కృష్ణ నదులను అనుసంధానం చేసి పులిచింతల పథకం చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
* దీని వలన తెలంగాణకు అసలు ఎ విధమైన ఉపయోగం లేదు, పైగా నల్గొండ జిల్లా లోని అనేక గ్రామాలూ ముంపుకు గురవుతాయి.
* తెలంగాణా కు మాత్రమే సొంతమైన గోదావరి నీటిని ఆంద్ర, రాయలసీమలకు తరలించి తెలంగాణాను ఎడారిని చెయ్యాలి అనేది ప్రభుత్వాల ఉద్దేశ్యం.


కాలువల ద్వార నీటి సరఫరా:
* భారి ప్రాజెక్ట్ లనుండి కాలువల ద్వార నీరందించే విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది.
* రాష్ట్రము లో కాల్వల కింద సాగయ్యే మొత్తం భూమి( 2001 -2002 ) లో 1562413 హెక్టార్లు( 3560800 ఎకరాల్లో ), దీనిలో తెలంగాణా ప్రాంతానికి కేవలం 248091 హెక్టార్లు( 613045 ఎకరాల్లో) భూమి మాత్రమే కాలువల కింద సాగు అవుతున్నది. ఐది కేవలం 15 .88 % మాత్రమే.
* ఒక్క గుంటూరు జిల్లా లోనే 304863 హెక్టార్లు ( 753331 ఎకరాల్లో) కు కాలువ నీరు అందుతున్నది.అంటే ప్రాంతీయ వివక్ష ఎ స్థాయిలో జరుగుతుందో చూడవచ్చు..
* అయితే ఈ లెక్కలు 2001 -2002 నాటివి కాని నేటికి ఇంచు మించు ఇదే పరిస్థితులు ఉన్నాయి.
* 1991 వరకు తెలంగాణా ప్రాంతంలో కాల్వలకిండా సాగు ఐన భూమి 870754 ఎకరాలు కాగ అది 2002 నాటికి 613042 ఎకరాలకు తగ్గింది, అంటే వీళ్ళు జల యజ్ఞం పేరుతో, అధిక నిధులు తెలంగాణా ప్రాజెక్ట్లకు ఇస్తున్నాం అని చెప్తున్నా సాగు భూమి మాత్రం పెరగడం లేదంటే అర్థం ఏమిటి..? 
* నాగార్జున సాగర్ ఎడమ కాలువ, నిజాం సాగర్, రాజోలి బండ, కింద సాగయ్యే విస్తీర్ణం గడచినా పది సంవత్సరాల్లో మూడు లక్షల ఎకరాలకు పడి పోయింది..
ప్రాణ హిత- చేవెల్ల: తెలంగాణ ప్రాజెక్టులపై సర్కారు వివక్ష కొనసాగుతోందనడానికి ప్రాణహిత-చేవెల్ల ప్రాజెక్టు తాజా ఉదాహరణ. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడినప్పుడో, ఎన్నికల ముందో తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడే పాలకులు ఆ తర్వాత వీటి గురించి పట్టించుకోక పోవడం విషాదం. తెలంగాణ ప్రజల కలల పంటైన ప్రాణహిత-చేవెల్ల ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల సంఘం 2010 ఏప్రిల్‌లో సూత్రవూపాయ అనుమతినిచ్చింది. 18 నెలలు గడిచినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తిస్థాయి అనుమతులను సంపాదించలేక పోయింది. ప్రధాన మంత్రి ప్రత్యేక కార్యక్రమం కింద ప్రాణహిత ప్రాజెక్టుకు పూర్తి స్థాయి పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వమే పెట్టే విధంగా ప్రయత్నిస్తామని, ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా సంపాదించడానికి కృషి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ దిశగా ఎటువంటి ప్రయత్నాలను చేయక పోవడంతో తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరువు పీడిత తెలంగాణ ప్రాంతానికి తక్షణ అవసరమైన ప్రాణహిత-చేవెల్లను పట్టించుకోని సర్కారు... తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్ట్ కట్టి.. తెలంగాణ అటవీ ప్రాంతాలను జల సమాధి చేసి, గిరిజన జీవన విధ్వంసాన్ని సృష్టించి, సీమంద్రులకు నీళ్లు పారించే పోలవరానికి జాతీయ హోదా కల్పించేందుకు కిందికి మీదికి అవుతోందని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. 
జాప్యంతో పెరుగుతున్న అంచనా వ్యయం:
ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం సవరించిన ప్రాజెక్టు నిర్మాణ రిపోర్టును గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం పంపింది. కేంద్ర జలవనరుల సంఘానికి చెందిన 16 విభాగాలతో పాటు పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన ఎనిమిది రకాల అనుమతులు, కేంద్ర ప్రణాళిక సంఘానికి చెందిన సవరించిన పెట్టుబడుల అనుమతులు పొందవలసి ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 17,875 కోట్లు ఖర్చవుతాయని మొదట అంచనా వేసి ప్పటికీ మొదటిసారి సవరించిన అంచనాల ప్రకారం 38,500 కోట్లకు పెరగగా 2007లో సవరించిన అంచనాల ప్రకారం 40,300 కోట్లకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతి కూడా ఇచ్చింది. నిర్మాణంలో జరుగుతున్న జాప్యంవల్ల అంచనావ్యయం ఏటా పెరుగుతోంది.
కేంద్ర అనుమతిలో జాప్యం:
ప్రాణహిత-చేవెల్ల ప్రాజెక్టుకు 2012 సంవత్సరం నాటికి అన్ని అనుమతులు సాధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అనుమతుల మంజూరు కోసం చేస్తున్న ప్రయత్నాలు నామమావూతంగానే సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండానే పోలవరం ప్రాజెక్టుపై వేల కోట్లు ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ప్రానహిత ప్రాజెక్టు విషయంలో మాత్రం సాచివేత ధోరణి అవలంబించడం పట్ల తెలంగాణవాదులు ఆక్షేపణ తెలుపుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల మహారాష్ట్రకు చెందిన 1852 ఎకరాల సాగు భూమి, 3395 ఎకరాల నదీ ప్రాంత భూమి ముంపునకు గురవుతుంది. అయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సాంకేతిక అభ్యంతరాలు పెట్టకపోవచ్చని భావిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్ పరిధిలో 893 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. ఈ ప్రాజెక్టు కాలువలు, టన్నెల్‌లు, తదితర నిర్మాణాలకు 7 జిల్లాల పరిధిలో 4644 ఎకరాల అటవీ భూమి సేకరించవలసి ఉంది. అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని కూడా కేటాయించవలసి ఉంది. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ముందుగా కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళకు కూడా జాతీయ హోదా కావాలని కోరుతోంది. ఒకే రాష్ట్రానికి చెందిన రెండు ప్రాజెక్టులకు ఏక కాలంలో జాతీయ హోదా ఇవ్వడం సాధ్యమా కాదా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. 


               ఇప్పటికే అన్ని అనుమతులను పొందిన పోలవరం ప్రాజెక్టుతో ప్రాణహితను పోటీ పెట్టడం సమంజసం కాదని తెలంగాణ ప్రాంత ఇంజనీరింగ్ నిపుణులు అంటున్నారు. దీనికి తోడు ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కాలంటే పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా చూసుకోవాలి. అయితే ఇప్పటివరకు మహారాష్ట్రతో చర్చల ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రాణహిత ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎదురైన అభ్యంతరాల వల్ల ప్రాణహిత విషయంలో అడ్డుపుల్ల వేయడానికి మహారాష్ట్ర ప్రయత్నించొచ్చన్న వాదన ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మహారాష్ట్రతో చర్చలు జరిపితే ఈ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 
జాతీయ హోదాతోనే సత్వరం పూర్తి:
ప్రాణహితకు జాతీయ ప్రాజెక్టు హోదా లభిస్తే కేంద్రం 90% వాటాను, రాష్ట్రం 10% వాటాను భరించవలసి ఉంది. ప్రాణహిత ప్రాజెక్టు వ్యయం పోలవరం కన్నా రెట్టింపు ఉండడంతో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా తీసుకుంటే త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే 4 వేల కోట్లు ఖర్చు పెట్టగా ప్రాణహితపై కేవలం వెయ్యి కోట్లు రాష్ట్రపభుత్వం ఖర్చు పెట్టింది. 28 ప్యాకేజీలుగా విభజించిన ప్రాణహిత ప్రాజెక్టును రెండుదశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణ స్థలం నుంచి మధ్యమానేరు వరకు నిర్ణయించిన తొమ్మిది ప్యాకేజీ పనులను, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు నీరందించే ఐదు ప్యాకేజీలను రూ.24,000 కోట్ల వ్యయంతో నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఇటీవల నిర్ణయించింది. మిగిలిన 14 ప్యాకేజీల పనులను మరో ఏడేళ్ళకాలంలో పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత బడ్జెట్‌లో ఇప్పటి వరకు కేవలం 54 కోట్ల రూపాయలు కేటాయించడంతో కాంట్రాక్టర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
                కేంద్ర జలసంఘం సూత్రపాయమైన అనుమతులనిచ్చిన మూడు సంవత్సరాల్లోగా మిగిలిన అనుమతులను పొందకపోతే మొదటఇచ్చిన అనుమతులను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ప్రాణహిత పనులను కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేపడితే ప్రభుత్వం చెప్పే లెక్క ప్రకారం ఇది పూర్తి కావడానికి 11ఏళ్ల కాలం పడుతుంది. ఈ వ్యవహారం చూస్తుంటే సర్కారుకు ఈ ప్రాజెక్టుపై చిత్త శుద్ధిలేదని స్పష్టమౌతోందని నిపుణులు విమర్శిస్తున్నారు.ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడినెట్టి వద్ద ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తారు. ప్రాజెక్టు ప్రారంభ స్థలం వద్ద 236.5 టీఎంసీల నీరు లభ్యమవుతుందని కేంద్ర జలవనరుల సంఘం అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం కాలువల పొడవు 1055 కిలోమీటర్లుగా అంచనా వేశారు. 22 లిఫ్ట్‌ల ద్వారా నీటిని తరలించడానికి 3466 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది. ఎల్లంపల్లి ద్వారా మరో 20 టీఎంసీల నీటిని కూడా ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం మొత్తం పనులను 28 ప్యాకేజీలుగా విభజించి కాంట్రాక్టు పనులను అప్పగించారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి