హోం

6, నవంబర్ 2011, ఆదివారం

తెలంగాణా అంబేద్కర్ మన భాగయ్య...


తెలంగాణా దళితోద్యమ పితామహుడు భాగ్య రెడ్డి వర్మ, 1888 మే 22 న హైదరాబాద్ సంస్థానంలో జన్మించారు, ఆయన అసలు పేరు మదారి భాగయ్య , తండ్రి మదారి వెంకటయ్య, ఆయన మాల కులానికి చెందినవారు.. 
                                   ఆయన దళితులు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితుల్ని చూసి, అనుభవించి ఉన్నారు కావున వారి పురోభి వృద్ది కై విశేషం గా కృషి చేసారు, దళితుల్లో అక్షరాస్యతను పెంచడం ద్వార వారిని సామాజికంగా, ఆర్థికం గా బలవంతుల్ని చేయ వచ్చని భావించిన ఆయన హైదరాబాద్ సంస్థానంలో 26 పాటశాల లను నెలకొల్పారు, దళితులే ఆది హిందువులని, దళితులకు ఆది హిందువులనే నామకరణం చేసారు భాగ్య రెడ్డి వర్మ, దళితుల గొంతు వేదికలపై నొక్కి వేస్తున్నారని, ప్రపంచానికి తమ గొంతును కూడా వినిపించాలనే ఉద్దేశ్యం తో ఆయన తన పేరును భాగ్య రెడ్డి గా మార్చుకున్నారు.
               దళితులపై జరుగుతున్న దాడులను ప్రశ్నించేవారే లేని కాలంలో దళితులకు న్యాయం చేయడానికి న్యాయస్థానాలను ఏర్పాటు చేసారు, అవే దళిత్ పంచాయత్ లు. ఇవి ఇప్పటి కోర్ట్ లలాగా పని చేసేవి.ఆయన 1906 వ సంవత్సరంలో జగన్ మిత్ర మండలి అనే ఒక సంస్థను ప్రారంబించారు, ఈ మండలి దళిత వాడల్లోని అమాయక ప్రజానీకాన్ని మేల్కొల్పుతుంది.
                    భాగ్య రెడ్డి వర్మ బుద్దున్ని పూజించే వారు, ఆయన బుద్దిజం ను స్వీకరించారు, హైదరాబాద్ పట్టణంలో ఆయన జీవించి ఉన్నన్ని రోజులు బుద్దపూర్నిమ ఉత్సవాలు ఘనంగా జరిగేవి.
ఆయన దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా సుధీర్గ పోరాటం చేసారు, దేవదాసి వ్యవస్థ అనేది ఉండ కూడదని, దాన్ని రద్దు చెయ్యాలని ఆయన నిజాం రాజు పై ఒత్తిడి తెచ్చారు, ఆ తర్వాత ఆ వ్యవస్థను రద్దు చేయించారు, ఆయన "భాగ్య నగర్ " అనే ఒక పత్రికను ప్రారంబించారు, దానికి అయన సంపాదకులుగా ఉన్నారు.
                        1913 లో జరిగిన ఆర్య సమాజ్ మహా సభల్లో పాల్గొన్న భాగ్య రెడ్డిని వేదికపై వర్మ అని సంబోధించారు, దాంతో ఆయన భాగ్య రెడ్డి వర్మ అయ్యారు, భాగ్య రెడ్డి వర్మ అధ్యక్షతన 1930 డిసెంబర్ 27 ,28 న లక్నో లో జరిగిన జాతీయ దళిత మహా సభలకు దేశవ్యాప్తం గా ఉన్న అనేక మంది దళిత ప్రముకులు హాజారయ్యారు , డా.బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా ఈ కార్యక్రమానికి హాజారయ్యారు.
                                ఆయన ధలితులకోస౦ రాజధాని నగరం లో ఒక వేదిక కావాలని ఆకాంక్షించారు, అందుకోసం అప్పటి పాలకులను ఒప్పించి హైదరాబాద్లో కోటి కి సమీపంలో గల చాదర్ ఘాట్ ప్రాంతంలో ఆది హిందు భవన్ ను నిర్మించారు.
                                         వలసాంద్ర పాలనకులు ఇలాంటి గొప్ప సామాజిక వేత్తను తెలంగాణా ప్రజలు గుర్తించకుండా చేసారు, కాని నిజం నిప్పులాంటిది, అది ఎన్నటికైనా బయటికి రావాల్సిందే, మన ప్రముకులను వెలుగులోకి తీసుకు రావడం మన భాద్యత, మన చరిత్రను సక్రమం గా మనం రాసుకోవడం మన విధి, కావున మరుగున పడిన మన చరిత్రను వెలుగులోకి తేవడమే ఇలాంటి గోప్పవల్లకు మనం ఇచ్చే నిజమైన నివాళి....
                          2009  లో తెలంగాణా ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సమయంలో విద్యార్థులు బాలయోగి స్తదిఉమ్కు భాగ్య రెడ్డి వర్మ స్టేడియం గా నామకరణం చేసారు.... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి