పూర్ణ కుంభం: సుసంపన్నత కు, సౌభాగ్యానికి దివ్యమైన ప్రతీక.పూర్ణకుంభ స్వాగతం అంటేనే పరిపూర్ణ వైభవానికి ప్రతీక, హైందవ ఆచారం ప్రకారం ప్రతి దేవతారధన కలశ పూజ తోనే మొదలవుతుంది, కలశం అన్నా పూర్ణ కుంభమే, ఇది ప్రధానంగా బౌద్ధమత ఆచారంగా చెప్తారు, ఇందుకు నిట్టనిలువు నిదర్శనం తెలంగాణాలో ప్రసిద్ధమైన బౌద్ధ భూమి నాగార్జున కొండలో శతాబ్దాల కిందటే తొట్టతొలుత వెలుగుచూసిన ప్రతిమాత్మక పూర్ణ కుంభాన్ని పేర్కొంటారు.
అపురూపమైన బౌద్ధ పూర్ణ కుంభం తో పాటు అలనాటి శిల్ప కళాకండాలను నాగార్జున కొండలో మనం చూస్తాం, ప్రసన్నవదనం తో నిల్చున్న బుద్ధ విగ్రహం, భోధి వృక్షం కింద ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధ భగవానుని దృశ్య ప్రతిమల్ని దర్శించడం ఒక దివ్యానుభవం.
ఇంతకి ఈ పూర్ణ కుంభ ప్రశస్తి ఏమిటి ? గుండ్రని ఇత్తడి లేదా రాగి చెంబుని సాధారణంగా కలశంగా వాడుతారు, ఇందులో నిల్లు కాని బియ్యం లేదా గోధుమలు వంటి ధాన్యాలను పోసి, పైన ఒక కొబ్బరికాయను తమలపాకులపై కుర్చోబెడతారు, గంధం, పసుపు, కుంకుమ, కంకనాలతో కలశాన్ని అలంకరిస్తారు, కలశానికి జీవనదుల సాక్షిగా పూజలు చేస్తారు, ఇందులోని జాలం లేదా ధాన్యం శుద్ధ శక్తి కలవిగా భావిస్తారు.
రాష్ట్ర చిహ్నంగా ఉన్న పూర్ణకుంభం గుంటూరు జిల్లాలోని అమరావతి నుండి తీసుకున్నట్లుగా ఆంద్ర వాళ్ళు చెప్పుకుంటున్నారు, కాని అమరావతి కంటే పూర్వకాలానికి చెందిన పూర్ణ కుంభం మన తెలంగాణా లోనే కొలువై ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి