సహకార ఎన్నికలలో గెలిచినా సంబరం ఎంతో కాలం నిలవలేదు, నాలుగు రోజులకే వచ్చిన ఎం ఎల్ సి ఎన్నికలలో స్వామి గౌడ్ ని, పాతూరి సుధాకర్ రెడ్డి ని గెలిపించుకుంటాం అని ప్రకటించి, భారి మెజారిటీ తో టి అర్ ఎస్ ఆ స్థానాలను గెలుచుకోవడం సి ఎం కిరణ్ కు నచ్చడం లేదు, ఎలాగైనా టి అర్ ఎస్ హవా తెలంగాణాలో తగ్గిపోయిందని తన సంక్షేమ పతకాలవైపే ప్రజలున్నారని నిరూపించుకోవాలనుకుంటున్న సి ఎం కు సహకార ఎన్నికలు వరంగా వచ్చాయి, 2009 తర్వాత ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో ఈ ఎన్నికలకు ఎప్పుడు లేని ప్రాధాన్యం లభించింది, ఈ ఎన్నికలలో ఎప్పటినుండో పదవి కోసం ఎదురుచూస్తున్న మాజీ నాయకులంతా పోటిపడి డబ్బు విపరీతంగా పంచారు, ఒక్కో స్థానంలో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారే ఉండడం విశేషం, మొత్తానికి కాంగ్రెస్ గుర్తు లేకుండా ఉన్న ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది, సి ఎం తన సత్తా చాటాడని, గ్రామ స్థాయిలో పట్టు సాధించాడని అనుకుంటున్న సమయంలో ఎం ఎల్ సి ఎన్నికలలో టి అర్ ఎస్ విజయ భావుటా ఎగరవేయ్యడం సి ఎం కు మింగుడుపడలేదు.
అంతే కాకుండా ప్రధాన ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం పెట్టబోమని చెప్పిన తర్వాత ఊపిరి పీల్చుకున్న కిరణ్, టి అర్ ఎస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం, అన్ని పార్టీలను కలుపుకొని చర్చకు తేవడం కూడా ఆయనకు టి అర్ ఎస్ పై ఆగ్రహాన్ని తెప్పించాయి, అవిశ్వాస తీర్మాన చర్చ సమయంలో కిరణ్ హరీష్ రావు పై తీవ్రంగా విరుచుకుపడ్డారు, ఒకానొక సందర్భంలో తెలంగాణా కు ఒక్కపైసా కూడా ఇవ్వనని పొగరుగా మాట్లాడాడు, అంతె కాకుండా నేను ఇక్కడే పుట్టాను అంటూనే మా చిత్తూరు అంటూ తన సంకుంచిత మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారు, తెలంగాణా కు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అనడం పట్ల తెలంగాణా వాదులు తీవ్ర ఆగ్రహం చెందారు, మేమేమి మీ బాబుగాడి సొమ్ము అడుగుతున్నామ మా ప్రాంతం నుండే 70% ఆదాయం వస్తుంది, మాది మాకు ఇవ్వడానికి ని అభ్యంతరం ఏమిటి అని కొంతమంది సభ్యులు సి ఎం ని నిలదీసారు, సి ఎం పూర్తిగా తెలంగాణా వ్యతిరేఖి అని తెలంగాణావాదులు మండి పడుతున్న సమయంలో సి ఎం మరోసారి తన సీమంద్ర బుద్ది ని బయటపెట్టుకున్నాడు, గతం లో విద్యార్థులపై కేసులు పెట్టి నెలలపాటు జైలు లో పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఉద్యమ నాయకత్వాన్ని దెబ్బతీయాలని భావిస్తుంది.
మార్చ్ 21 న కర్నూల్-బెంగుళూర్ జాతీయ రహదారిని దిగ్బందించాలని జె ఎ సి పిలుపునిచ్చింది, అయితే దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, పైగా ఉద్యమాన్ని పోలీస్ బలగాలతో అణచివేయ్యలని భావించారు, సడక్ బంద్ కు వారం ముందు నుండే పాలమూరు నాయకులను బై0డోవర్ చెయ్యడం ప్రారంభించారు, చివరికి ఉద్యమ నాయకులను, ఎం ఎల్ ఎ లను కూడా అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు పోలీసులు, అయితే మధ్యానం అరెస్ట్ ఐన నాయకులను సాధారణం గా సాయంత్రం వదిలి పెట్టడం సాధారణమే, ఇప్పుడు కూడా అంతే అనుకున్నారు పోలీసులు కాని హైదరాబాద్ నుండి వచ్చిన ఫోన్ తో పోలీస్ లు నాయకులపై కేసులు పెట్టి కోర్ట్ కు తరలించారు, అయితే ఈ ఫోన్ సి ఎం నుండి వచ్చిందా..? లేదా అనేది తెలియరాలేదు, ప్రొ. కోదండ రామ్, టి జి ఓ నాయకుడు శ్రీనివాస్ గౌడ్, ఎం ఎల్ ఎ లు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు లకు కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది, అరెస్ట్ ల ద్వారా ఉద్యమాన్ని అణచివెయ్యలని, ఉద్యమ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో వారిని ఇబ్బందులకు గురిచేయ్యడం ద్వారా దెబ్బకొట్టాలని కిరణ్ చూస్తున్నాడు.
ఉద్యమ నాయకుల అరెస్ట్ తో తెలంగాణా రగిలి పోతుంది, చట్టం తన పని తాను చేసుకు పోతుంది అంటూ సబిత అసెంబ్లీ లో ఇచ్చిన వివరణ కు ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు, ఉద్యమ నాయకులపై పెట్టిన కెసులు ఎత్తివేసి వెంటనే విడుదల చెయ్యాలని వారు డిమాండ్ చేసారు, కోదండ రామ్, శ్రీనివాస్ గౌడ్ లు ప్రభుత్వ ఉద్యోగులు కావడం వళ్ళ వారు 48 గంటలు ఎ కారణం చేతను జైలు లో ఉండరాదు, అల ఉన్నట్లయితే వారిని సస్పెండ్ చేస్తారు, కావున ఇలా కూడా వారిని ఇబ్బందుల పాలు చెయ్యాలని ప్రభుత్వం బావిస్తుంది.
ఆంద్ర అనుకూల సర్కార్ జె ఎ సి నాయకులను ఇబ్బందుల పాలు చేసి తెలంగాణా ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి భవిష్యత్తులో జె ఎ సి తలపెట్టిన విజయవాడ రహదారి దిగ్బందాన్ని అడ్డుకోవాలని చూస్తుంది, కాని ప్రభుత్వం ఎంత నిర్భందాన్ని విధిస్తే అంత తీవ్రంగా ఉద్యమం ఎగసిపడుతుందనే విషయం ఈ ప్రజా కంటక సర్కారుకు తెలియకపోవచ్చు, ఇప్పుడు ఎంతగా ఉద్యమ నాయకత్వాన్ని వేధిస్తే తెలంగాణా ప్రజలతో ఈ సర్కారుకు దూరం కూడా అంతగా పెరుగుతూ పోతుంది, విజయవాడ రహదారి దిగ్బండం రోజున వచ్చే జన సునామి లో కిరణ్ సర్కార్ కొట్టుకుపోతుంది...
ఆంద్ర అనుకూల సర్కార్ జె ఎ సి నాయకులను ఇబ్బందుల పాలు చేసి తెలంగాణా ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి భవిష్యత్తులో జె ఎ సి తలపెట్టిన విజయవాడ రహదారి దిగ్బందాన్ని అడ్డుకోవాలని చూస్తుంది, కాని ప్రభుత్వం ఎంత నిర్భందాన్ని విధిస్తే అంత తీవ్రంగా ఉద్యమం ఎగసిపడుతుందనే విషయం ఈ ప్రజా కంటక సర్కారుకు తెలియకపోవచ్చు, ఇప్పుడు ఎంతగా ఉద్యమ నాయకత్వాన్ని వేధిస్తే తెలంగాణా ప్రజలతో ఈ సర్కారుకు దూరం కూడా అంతగా పెరుగుతూ పోతుంది, విజయవాడ రహదారి దిగ్బండం రోజున వచ్చే జన సునామి లో కిరణ్ సర్కార్ కొట్టుకుపోతుంది...
'కాంగ్రెస్ కి ఇగ పుట్టగతుల్లేవు' అన్న విషయం కిరణ్ కూ తెల్సివస్తంది. పైకి మాత్రం '2014 ఎన్నికల్లో మల్లి రాబోయేది మేమే' అని అంటడు. పొన్నాల పక్కనే ఉండి నవ్వినా , అందరూ లోపల్లోపల నవ్వుకున్నరు. జైల్లలో పెడితే ఉద్యమం ఆపొచ్చు అనుకోడం కిరణ్ తెలివితక్కువ తనానికి నిదర్శనం.
రిప్లయితొలగించండిమంచి ఇన్ఫర్మేశన్. బ్లాగు రాసిన తీరు బాగుంది. వెరీ నైస్.