తెలంగాణా ఉద్యమం ఉవ్వేతున్న సాగుతున్న సందర్భం, ఒకవైపు కె సి అర్ నిరాహార దీక్ష మరో వైపు ఉస్మానియా విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి పిలుపు, బందులు, ధర్నాలు తెలంగాణా జనమంతా రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్నారు, తెలుగు పత్రికలూ, టి వీ లు బాగా ప్రాజెక్ట్ చేస్తున్నాయి, వారి కళ్ళ ముందు వచ్చిన అతి పెద్ద ప్రజా ఉద్యమం ఇదే కదా మరి, ఎప్పుడో ఎక్కడో పుస్తకాల్లో చదువుకున్నదే తప్ప నిజంగా అతి పెద్ద ప్రజా ఉద్యమం అంటే ఎలా ఉంటుందో రుచి చూపింది తెలంగాణా ఉద్యమం.
కేంద్రం దిగి వచ్చి ఒక ప్రకటన చేసింది, ఈ ప్రకటన తర్వాత సీమంద్ర నాయకులంతా రాజీనామా లు చెయ్యడంతో మీడియా కూడా రెండుగా విడిపోయింది, సమైక్యంద్ర ఉద్యమం బలంగా జరుగుతుందని అన్ని ఛానళ్ళు చూపించాయి, కాని అప్పటికి ఉన్న తెలంగాణా మీడియా చాల తక్కువ, హెచ్ ఎం టి వి తెలంగాణా కు మద్దతిచ్చే ఛానల్ కాని వాళ్ళు పూర్తిగా తెలంగాణా వాదాన్ని వినిపించలేదు, సీమంద్రలో కూడా వారి ఛానల్ నడవాలి కావున సమైక్యంద్ర అనే కృత్రిమ ఉద్యమాన్ని కూడా ప్రాజెక్ట్ చేసారు, శైలేష్ రెడ్డి జీ 24 గంటలు ఛానల్ లో ఛానల్ హెడ్ గా ఉన్న రోజులు, ఆయన పాలమూరు బిడ్డ, తెలంగాణా వాదాన్ని నేత్తికేత్తుకున్నాడు, అక్కడ జరుగుతున్నదంతా దొంగ ఉద్యమం అని చెప్పిండు, పొట్టి శ్రీ రాములు విశాలాంద్ర కోసం ప్రాణత్యాగం చెయ్యాలే అని చెప్పిండు, గ్రామాల్లో ఉన్న ప్రజా వాణి ని జీ 24 గంటలు వినిపించింది, అయితే తెలంగాణా కొరకు అంటూ ప్రత్యేకంగా ఒక ఛానల్ లేదు, ఇక పత్రికల విషయానికి వస్తే అన్ని ఆంద్ర విష పుత్రికలే తప్ప తెలంగాణా పత్రికలు లేనే లేవు(ఒక్క వార్త పత్రిక మాత్రం తెలంగాణాకు అనుకూలంగా స్టాండ్ తీసుకుంది), కాని జరుగుతున్న విషయాలను వార్తలుగా చూపిస్తే సరిపోదు, ఇప్పుడు కావాల్సింది కేవలం వార్తను వార్త గా అందించే మీడియా కాదు, సీమంద్ర మీడియా శక్తులతో పోరాడి నిలవగలిగే ఒక తెలంగాణా బావుటా కావలి, తడారిపోయిన వ్యధా జీవుల గుండె గొంతుకల ఆక్రందనలను ప్రపంచానికి తెలియజీసే పొలికేక కావలి.
తెలంగాణా గత చరిత్రను, వర్తమాన ఉద్యమాన్ని, భవిష్యత్తును దిశానిర్దేషణం చేసే విషయంలో ఒక లోటు ఏర్పడింది, తెలంగాణా కోసమే ఒక పత్రిక రావాల్సిన చారిత్రక అవసరం ఆ సమయం లో ఏర్పడింది, సరిగ్గా ఆ సమయంలో ఆ లోటును పూడ్చడానికి "మన పత్రిక- మన ఆత్మ గౌరవం" అంటూ దూసుకు వచ్చిన తెలంగాణా కర పత్రిక " నమస్తే తెలంగాణా". 2011 జూన్ 06 తెలంగాణా అమరవీరుడు శ్రీ కాంత్ చారి తల్లి శంకరమ్మ చేతులమీదుగా విడుదలయ్యింది, ప్రో . జయశంకర్ సార్ దిశా నిర్దేశనం లో, సి ఎల్ రాజం చైర్మెన్ గా, అల్లం నారాయణ ఎడిటర్ గా ప్రారంభమైన పత్రిక ఏ పార్టీ కి కొమ్ముకాయకుండా స్వతంత్రంగా తెలంగాణా ఉద్యమ పక్షాన నిలబడి పనిచేస్తుంది, నేడు నమస్తే తెలంగాణా పత్రిక ద్వితీయ వార్షికోత్సవం, పత్రిక ప్రారంభమైన రెండు సంవత్సరాలలో రాష్ట్రవ్యాప్తంగా ప్రచురించబడే సీమంద్ర పత్రికలను తట్టుకొని నిలబడి రాష్ట్రంలోని 4 ప్రధాన పత్రికలలో ఒకటిగా నిలిచింది.
నమస్తే తెలంగాణా ఆదివారం అనుబంధంగా వస్తున్న బతుకమ్మ, మహిళలు బతుకమ్మ పండుగకు ఒక్కొక్క పువ్వును ఎంత అందంగా పెరుస్తారో, అలా బతుకమ్మ లో తెలంగాణా గత సమాజం, పాటలు, పొడుపుకథలు, వీరుల చరిత్రలు, గొప్ప కట్టడాలు, పుణ్య క్షేత్రాలు, మరుగున పడ్డ చరిత్ర ఆనవాళ్ళు, వర్తమాన ఉద్యమ విశేషాలు ఇలా దేనికది ఏర్చి కూర్చి అందంగా ఒక బతుకమ్మలాగా ముస్తాబు చేస్తారు, నిజంగా తెలంగాణా సంస్కృతి, ఆచారాలు, వీర చరిత్రలను ప్రపంచానికి తెలియజేసే సాంస్కృతిక వారధిగా బతుకమ్మ తన బాధ్యతను నెరవేరుస్తుంది, ఈ ఆదివారం అనుబంధంలో ప్రతి పేజి విలువైనదే, ప్రతి పుట తెలంగాణా కు సంభందించిన ఏదో ఒక విషయాన్నీ తెలియజేస్తుంది. నమస్తే తెలంగాణా ప్రచురించిన "టెంపుల్స్ ఆఫ్ తెలంగాణ" అనే పుస్తకం తెలంగాణా లోని ప్రాచీన ఆలయాలను, మరుగున పడ్డ పాత కట్టడాలను, ఆధ్యాత్మిక కేంద్రాలను వెలుగులోకి తెచ్చింది.
తెలంగాణా గత వైభవంతో పాటు నేటి ఉద్యమ పరిణామాలను ఏ రోజుకారోజు ప్రజలకు అందిస్తూ ఉద్యమ స్పూర్తిని నింపుతుంది నమస్తే తెలంగాణా పత్రిక, ఆంద్ర వలసవాదుల దోపిడిని ఎండగడుతూ, సీమంద్రుల కుట్రలను చేదిస్తూ, తెలంగాణా ప్రజలకు వాస్తవాలను అందిస్తూ, ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్నది నమస్తే తెలంగాణా పత్రిక, కేవలం తెలంగాణా విషయాలే కాకుండా ఒక పత్రిక కు కావాల్సిన అన్ని లక్షణాలతో తెలుగులో స్టాండర్డ్ వార్తా పత్రికలలో ఒకటిగా వెలుగొందుతున్న మన ఆత్మ గౌరవ పతాక నమస్తే తెలంగాణా మరిన్ని వార్షికోత్సవాలను జరుపుకోవాలని మనసార కోరుకుంటుంది ***నా తెలంగాణా!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి