హోం

10, జూన్ 2013, సోమవారం

బాబూ..అవిశ్వాసానికి టైమొచ్చింది..!



చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతాడా , లేదా..? అనే విషయమై ఇద్దరు స్నేహితుల మాటా-మంతి ... 

వేణు: మహేష్! చంద్ర బాబు అవిశ్వాసం పెదతాడంటావా ..?

మహేష్ : చంద్ర బాబు అవిశ్వాసం ఎప్పుడు పెడతాడో తెలుసా నీకు..?

వేణు: ఆ తెలుసు, ప్రభుత్వం ఎప్పుడు వీక్ గా ఉంటె అప్పుడు పెడతాడు,

మహేష్ : అక్కడే పప్పులో కాలేశావ్ నువ్వు, కాంగ్రెస్ ప్రభుత్వం కూలదని తెలిసినప్పుడే చంద్ర బాబు అవిశ్వాసం పెడతాడు,

 వేణు: అదెట్లా..? చంద్ర బాబు కాంగ్రెస్ కి వ్యతిరేఖం కదా..? ఆ పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీ కి పోటీగా కదా..?

మహేష్: నిజమే, ఆ పార్టీ పుట్టింది కాంగ్రెస్ కు వ్యతిరేఖం గానే, కాని ఇప్పుడు మాత్రం చంద్ర బాబు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతున్నాడు.

వేణు: అదెలాగ..?

మహేష్: గతం లో అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెట్టాడు,  ప్రభుత్వం మైనారిటీ లో ఉన్నప్పుడు కాకుండా పీ అర్ పీ విలీనం ఐపోయాక, ప్రభుత్వానికి ఎం డోకా లేదని తెలిసాక ప్రవేశపెట్టాడు.

వేణు: అప్పుడేదో ఒకసారి అలా జరిగి ఉండొచ్చు, దానికే చంద్ర బాబు కాంగ్రెస్ సర్కార్ ను కాపాడుతున్నాడు అని ఎలా అనుకుంటాం..?

మహేష్:  ఒక్కసారి కాదు ఇప్పటికి అనేక సార్లు రుజువయ్యింది, గత అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం మైనారిటీ లో ఉంది, మిగతా విపక్షాలన్నీ అవిశ్వాసం పెట్టమని టి డి పీ పై ఒత్తిడి తెచ్చాయి కాని చంద్రబాబు కు తెలుసు అప్పుడు అవిశ్వాసం పెడితే ప్రభుత్వం పడిపోతుందని అందుకే అవిశ్వాసం ప్రవేశ పెట్టకపోగా, టి అర్ ఎస్ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వెయ్యకూడదని పార్టీ విప్ కుడా జారి చేసాడు చంద్ర బాబు, అలా కిరణ్ సర్కార్ ను కాపాడాడు. 

వేణు: కాని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడాల్సిన అవసరం చంద్ర బాబు కు ఏముంది..? 2014 లో యు పీ ఎ లో చేరుతున్నడా ఏమిటి..?

మహేష్: యు పీ ఎ లో చేరడు కాని, తక్షణం ఎన్నికలు రావడం ఆయనకు ఇష్టం లేదు, తెలంగాణా పై అస్పష్ట విదానం తో తెలంగాణా లో ఆయన విశ్వాసం కోల్పోయాడు, ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రైతులను ఏ నాడు పట్టించుకోక పోవడం తో ఈయన మారాను అని చెప్పిన అక్కడి జనం కూడా నమ్మడం లేదు, అయితే ప్రభుత్వ అస్థిరత, ఆకాశం లో నిత్యావసరాల ధరలు, పవర్ కట్, రైల్, బస్ చార్జీల పెంపు, పంటలు ఎండిపోవడం, తాగే నీరు కూడా  దొరకని పరిస్థితులు, విద్యుత్ సర్ చార్జీలు ఇలా జనం సమస్యలతో అల్లాడుతుంటే పట్టించుకునే నాదుడే లేని సమయం లో చంద్ర బాబు పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళడంతో ఆయనకు కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది, ఇప్పుడే ఎన్నికలకు వెళ్ళకుండా మరికొంత సమయం తీసుకొని మరో బస్సు యాత్రో, సైకిల్ యాత్రో చేసి బలపడుదామని ఆయన భావిస్తున్నారు. 

వేణు: అవునా, మరి ఇక ఎన్నికల దాక అవిశ్వాసం పెట్టడన్న మాట.. 

మహేష్: లేదు, ఈ సమావేశాల్లో అవిశ్వాసం పెట్టడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇవి గత బడ్జెట్ సమావేశాల కొనసాగింపు, బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాసం పెట్టారు కాబట్టి ఒకే సెషన్ లో రెండు సార్లు అవిశ్వాసం పెట్టడానికి ఛాన్స్ లేదు , కావున ఒక వేల మల్లి వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తే అంధులు చంద్రబాబు అవిశ్వాసం ప్రవేశ పెడతాడు. 

వేణు: అంత ఖచ్చితం గా ఎలా చెప్పగలవు..? 

మహేష్: ఎలా అంటే నిన్న ( జూన్ 9) పార్టీ విప్ ను దిక్కరించారని 15 మంది ఎం ఎల్ ఎ లపై వేటు వేసారు సభాపతి, వీరు 2014 సాదారణ ఎన్నికల వరకు వీరు మాజిలే, ఎందుకంటే ఎన్నికలకు సంవత్సరం లోపు కాళీ ఐన నియోజక వర్గాల్లో ఉపఎన్నికలు నిర్వహించరు, 2009 మే నెలలో అసెంబ్లీ ఏర్పడింది, 2009 జూన్ 4 న మొదటి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కావున ఎలా చూసుకున్న ఎన్నికలకు సంవత్సర కాలం కన్నా తక్కువగానే ఉంది, ఫలితం గా అసెంబ్లీ లో సంఖ్యా బలం 294 నుండి 279 కి తగ్గింది, కావున మాజిక్ ఫిగర్ 137, కాంగ్రెస్ పార్టీ కి ప్రస్తుతం 145 మంది ఎం ఎల్ ఎ ల మద్దతు ఉంది కావున ప్రభుత్వం చాలా కాలం తర్వాత మైనారిటి నుండి మెజారిటి కి వచ్చింది, ఇప్పడు బాబు అవిశ్వాసం ప్రవేశపెడితే ప్రభుత్వం కూలిపోదు, గతం లో కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యాడు అనే నిందను తొలగించుకోవచ్చు, కాబట్టి ఈ అవకాశాన్ని చంద్ర బాబు వదులుకోడు. 

వేణు: ఓహో..! ఇంతుందా..? చంద్ర బాబు మామూలోడు కాదు జిత్తుల మారే.. !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి