తెలంగాణా ఉప ప్రాంతీయ పార్టీ లతో అసాధ్యం, ప్రత్యేక రాష్ట్రము కావాలంటే జాతీయ పార్టీలతోనే సాధ్యం, కాంగ్రెస్ ఎలాగు తెలంగాణా ఇవ్వదని తేలిపోయింది, ఇక మిగిలిన ఒకే ఒక ప్రత్యామ్నాయం భా జా పానే, 2014 ఎన్నికలకు ముందే పార్లమెంట్ లో బిల్లు పెట్టండి మద్దతు ఇస్తాం, లేదా మేం అధికారం లోకి రాగానే 100 రోజులలో తెలంగాణా ఇస్తాం, ఇవి ఇప్పటివరకు మనం విన్న బి జె పీ నాయకుల మాటలు.
నిజంగా బి జె పీ తెలంగాణా ఇస్తుందా..? అంటే నమ్మడం కష్టమే, ఎందుకంటే గతం లో జరిగిన పరిణామాలు ఈ విషయాన్నీ స్పష్టం చేస్తున్నాయి, 1996 లో కాకినాడ తీర్మానం లో తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రచారం చేసారు, అటు కేంద్రం లోను, ఇటు రాష్ట్రం లోను( టి డి పీ+బి జె పీ) ఎన్ డి ఎ అధికారం లోకి వచ్చింది, ఛత్తీస్ ఘడ్, ఝార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలను ఏర్పాటు చేసారు కాని తెలంగాణా ని మాత్రం ఏర్పటు చెయ్యలేదు, టి అర్ ఎస్ పార్టీ ఆవిర్భవించి తెలంగాణా నినాదాన్ని ఎత్తుకున్న తర్వాత బి జె పీ అగ్ర నాయకుడైన అద్వానీ రాజధాని ఉన్నవాళ్లు రాష్ట్రం అడగడం ఏమిటి..? అని వ్యాఖ్యానించారు, 2004 లో ఓడిపోయాక 2006 లో తెలంగాణా పై తీర్మానం చేసి మేము తెలంగాణా కు అనుకూలం అని చెప్పారు, 2009 లో జె ఎ సి ఏర్పడేంత వరకు వీరు ఎలాంటి ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొనలేదు, నిజానికి 2009 సాధారణ ఎన్నికలలో గెలిచిన ఇద్దరు అభ్యర్థులు తెలంగాణా వాదం పై గెలవలేదు.
తాజాగా జూన్ 3 వ తేదిన బి జె పీ నిర్వహించిన ఆత్మ గౌరవ సభలో దాని అసలు రంగు బయటపడింది, తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఆ పార్టీ లో చేరుతున్నానని నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి ప్రకటించి బి జె పీ లో చేరిన అదే సభలో ఆ పార్టీ జాతియాధ్యక్షుడు ఆ పార్టీ విధానాన్ని స్పష్టం చేసాడు, బి జె పీ అధికారం లోకి వస్తే వచ్చిన ఒక సంవత్సర కాలం లో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేస్తాం, ఒక వేల మిత్రపక్షాలతో కలిసి ఎన్ డి ఎ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణా పై ఆయా పార్టీలను ఒప్పించడానికి కొంత సమయం పడుతుంది అని వ్యాఖ్యానించారు, ప్రస్తుత పరిస్థితులలో కేంద్రంలో ఏక పార్టీ పాలన వచ్చే అవకాశాలు లేవు, తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుంది, అంటే రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యల ద్వార తెలిసిందేమిటంటే ఎన్ డి ఎ కూడా తెలంగాణా పై ఏకాభిప్రాయం కుదరాలి అంటుందని, ఏకాభిప్రాయం కుదరడం లేదంటూ యు పీ ఎ ఇప్పటికే 9 సంవత్సరాలుగా సాగాదీస్తుంది, మరి ఎన్ డి ఎ అధికారం లోకి వస్తే వాళ్ళు ఎన్నిరోజులు సాగదీస్తారో మరి..?
సభ ముగిసాక రాజ్ నాథ్ సింగ్ పార్టీ నాయకులూ కార్య కర్తలతో ఈ సారి ఎన్నికలలో తెలంగాణా లో 15 ఎం పీ, 40 ఎం ఎల్ ఎ సీట్లు గెలవాలని చెప్పారు, దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ప్రభుత్వంలో భాగం కావాలి, డిల్లి లో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన ఎం పీ లను సమకుర్చాలి అలా అయితేనే వీళ్ళు తెలంగాణా గురించి ఆలోచిస్తారు లేకపోతే లేదు, ఐన ఎవరు వచ్చిన వాళ్ళకు కావాల్సింది వాళ్ళ ప్రభుత్వాన్ని నిలబెట్టే ఎం పీ స్థానాలే తప్ప ప్రజల ఆకాంక్ష ఎవరికీ పట్టదు, రేపు ఒకటో రెండో ఎం పీ సీట్లు ఇచ్చి తెలంగాణా రాష్ట్రం ఇవ్వమంటే ఎన్ డి ఎ మాత్రం ఎందుకు ఇస్తుంది..? కావున తెలంగాణా స్వీయ రాజకీయ శక్తిగా ఎదగాలి, అప్పుడే డిల్లి ని పాలించాలనుకునే వాళ్ళకు మన అవసరం పడుతుంది, వాళ్ళు అప్పుడు మన దగ్గరకు వచ్చి తెలంగాణా ఇస్తారు. కావున తెలంగాణా పార్టీ లనే గెలిపిద్దాం.. తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుందాం...
- (మూల వార్త ఆంద్ర జ్యోతి పత్రిక నుండి తీసుకోబడింది)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి