హోం

12, జనవరి 2012, గురువారం

దీక్షకు జనం కరువు



జగన్ దీక్షకు రైతులే కరువయ్యారు. రైతుల సమస్యలను తెలుసుకునే పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మంగళవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ను వేదికగా చేసుకొని ఆర్భాటంగా మొదలుపెట్టిన రైతుదీక్ష పేలవంగా సాగుతోంది. దీక్ష రెండో రోజు ఉదయం 7 గంటలకే జగన్ దీక్షవేదికపై వచ్చి కూర్చున్నారు. 20 నుంచి 25వేల మందిని లైనులో నిలబెట్టి జగన్ చేత ఓదార్పు మాటలు చెప్పించేందుకు నిర్వాహకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పట్టుమని ఐదారువేల మంది మాత్రమే దినమంతా జగన్‌ను కలువగలిగారు. వీరిలోనూ సగం మంది సీమాంధ్ర నుండి తరలించిన వారే కావడం గమనార్హం. జగన్ ఇందూర్ గడ్డపై కాలుమోపినప్పటి నుంచి దీక్షస్థలికి చేరేలోగా తెలంగాణవాదులు అడుగడుగున అడ్డుకున్న దరిమిలా పరిస్థితిని అంచనా వేసినా ఆ పార్టీ ముఖ్య నేతలు పొరుగు ప్రాంతాల నుండి జనాన్ని తరలించారు. విజయవాడ, విశాఖపట్నం,విజయనగరం, గుంటూర్, కృష్ణా, కడప, కర్నూలు, అనంతపురం తదితర సీమాంధ్ర జిల్లాలతో పాటు నల్గొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాల నుండి పథకం ప్రకారం జనాన్ని బుధవారం ఆర్మూర్‌కు తరలించారు. పొరుగు జిల్లాల నుండి జనాన్ని తరలించి ఉండకుంటే రెండో రోజు దీక్షశిబిరం వెల కానీ జగన్ రైతు దీక్ష విషయంలో మాత్రం స్థానిక రైతాంగం ప్రతికూలంగా స్పందించారు. ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ ముఖ్య నేత బాజిడ్డి గోవర్ధన్‌కు ఉన్న పరిచయాలతో ముందస్తు ప్రణాళికతో వివిధ గ్రామాల నుండి తోలుకొచ్చిన జనంతోనే రెండు రోజుల జగన్ రైతు దీక్షను మొక్కుబడిగా నడిపించారు. 
ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం బలంగా ఉండటంతో పాటు జగన్ సమైక్యవాదన్న బలమైన ముద్ర ఉండటం వల్లే చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానికులు జగన్ దీక్ష వైపు కదలలేదు. 

ఇదేందప్పా...
పాపం మాజీ మంత్రి మారెప్ప ఆగమాగమై కాలుకాలిన పిల్లిలా అటుఇటు తిరుగుతు కనబడ్డారు. రెండవ రోజంతా దీక్ష వేదికపై తిరుగాడుతూ సభా ప్రాంగణంలో పలుచబడుతున్న జనాన్ని చూస్తు నిట్టూర్పు విడవడం కనిపించింది. సహచరులతో ఇదేందప్పా... జనం ఇట్ల పలుసబడుతుండ్రు అంటూ ఆయన పెదవి విరిచారు. 


సెగతోనే తెలంగాణ ఆటపాట
తెలంగాణ ఉద్యమసెగ తాకడంతో రెండవ రోజు దీక్ష నిర్వహణలో తెలంగాణ ఆటపాటకు చోటు లభించింది. మధ్యాహ్నం న్యూడెమోక్షికసి నేతలు జై తెలంగాణ నినాదాలతో జగన్ దీక్ష శిబిరాన్ని దద్దరిల్లగొట్టారు. దీంతో వైఎస్సార్ కీర్తనలను పక్కనబెట్టి కళాకారులు తెలంగాణ ఆటపాటలతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అచ్చంగా గద్దర్ పోలికలున్న ఓ సీనియర్ కళాకారుని వేదికపై నిలబెట్టి పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా అంటూ రికార్డును వేసి అచ్చంగా గద్దర్ హావభావాలను అనుకరించే ప్రయత్నం చేయించారు. 

ఫ్లాప్ షో... ఇంటలిజెన్స్ నివేదికలు
తెలంగాణలో మొదటిసారి జగన్ చేస్తున్న రైతు దీక్షలకు స్పందన కరువైందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంటలిజెన్స్ అధికారులు నివేదికలు పంపారు. ఆయా శాఖలకు చెందిన అధికారులు రెండు రోజులుగా ప్రాంగణం పరిసరాలలో పరిశీలించిన అధికారులు ఏఏ ప్రాంతాల నుండి ఎంత మంది హాజరయ్యారనే అంశాలను సేకరించారు. 

ముగింపు సభకైనా బయటి జనమే
రెండు రోజుల దీక్ష అనుభవం దృష్ట్యా గురువారం సాయంత్రం జరిగే రైతుదీక్ష ముగింపు సభకైనా భారీ సంఖ్యలో జనాన్ని తరలించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. నిజామాబాద్, డిచ్‌పల్లి, కామాడ్డి, ఎల్లాడ్డి, బోధన్, ఆర్మూర్, బాల్కొండ తదితర ప్రాంతాల నుండి జనాన్ని తరలించేందుకు వందలాది వాహనాలను మాట్లాడి పల్లెలకు పంపించే ఏర్పాట్లు చేశారు. జనసమీకరణపై ఆ పార్టీ యంత్రాంగం దృష్టిసారిస్తోంది. ఈ మేరకు వైఎస్సార్‌పార్టీ ముఖ్య నేతలు బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.అయితే ముగింపు సభకు కూడా జన సందడి లేకపోవడంతో దీక్ష ముగుంపు కార్యక్రమాన్ని తూ.. తూ .. మంత్రగా జరిపించి ఐపోయింది అనిపించుకున్నారు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి