హోం

4, ఫిబ్రవరి 2012, శనివారం

నిరంతర పోరాటం - తెలంగాణా ప్రజా జీవితం


నిజాం విమోచన పోరాటం నుండి తెలంగాణా లో ప్రతి రోజు పోరాటమే, ప్రతి క్షణం స్వేచ్చ నినాదమే, ఆటు పోట్లు లేని సముద్రం, గెలుపోటములు లేని యుద్ధం ఉండదు, స్వేచ్చ కోసం తెలంగాణా ప్రజలు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు, కేవలం వాటి పంధాలే మారుతున్నాయి, నాడు సాయుధ పోరాటం నుండి, మొదటి ప్రత్యేక రాష్ట్ర పోరు, తర్వాత ఉదృతంగా నక్సల్ బరీ ఉద్యమం మల్లి ఈ రోజు మాలి విడుత తెలంగాణా పోరాటం..
                                       నాడు హైదరాబాద్ లో  ఒక సమావేశంలో  వెంకట రామారావు అనే వ్యక్తి తెలుగులో మాట్లాడినందుకు తెలుంగి,బెడంగి అని ఆయనను అవమానించారు, దీనితో తెలుగు వారు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఆంద్ర జన సంఘం అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు, 1930 లో ఆంద్ర జన సంఘం ఆంద్ర మహా సభగా ఏర్పడింది ఇది అనేక సమావేశాలు నిర్వహించింది, ప్రజలను చైతన్య వంతులను చేసింది, దీనికి ముఖ్య నాయకులు రావి నారాయణ రెడ్డి, బద్ధం యెల్లారెడ్డి, ముగ్దూం మొహినుద్దిన్ లు, ఈ ఆంద్ర మహా సభనే ఆ తర్వాత కమూనిస్ట్ పార్టీగా ఆవిర్భవించింది, రష్యన్ కమూనిస్ట్ పోరాటం మాదురిగానే ఇక్కడ కూడా రైతాంగ శ్రామిక పోరాటం జరిగింది.

                      అయితే దేశ్ ముఖ్ లు చేసే అరాచకాలను భరించలేక పోయారు ప్రజలు, అదే సమయంలో కమూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడం తో అనేక మంది ప్రజలు సంఘం లో చేరారు, సంఘం లో ప్రజలను నాయకులు చైతన్య పరచి నిజాం ప్రభువుకు అతని దేశ్ముఖులకు ఏ విధంగానూ సహకరించ కూడదని చెప్పారు, అయితే పన్నులు కట్టని ప్రజలను దేశముఖ్ లు  చిత్రహింసలు పెట్టేవారు, అంతే కాక దేశ్ ముఖ్ లు తమ ఇష్టరాజ్యంగా ప్రజలపై పన్నులు వేసే వారు, పంట కు, భూమికి, వారి ఇండ్లల్లో శుభకార్యాలకు ప్రజలు పన్ను కట్టాల్సిందే.దీనితో ప్రజలు అప్పులపాలయ్యారు, భూములు జమీందార్ లు ఆక్రమించుకున్నారు, యజమానులు కాస్తా కౌలుదార్లు అయ్యారు,  ప్రభుత్వ అధికారులైన పోలీసు పటేల్, మాలి పటేల్, తాసిల్ దార్, ఇలా అందరు దేశ్ ముఖ్ లకు పూర్తిగా సహకరించి పల్లెల్లో అరాచకం సృష్టించారు, ఆడవారిని మానభంగాలు చెయ్యడం, మగవారిని చిత్ర హింసలు పెట్టి చంపెయ్యడం పరిపాటి అయ్యింది, ఇలాంటి సమయంలోనే అనేక మంది సంఘం వైపు ఆకర్షితులైనారు, సంఘానికి సహకరించే వారిని పోలీసు ల సహాయంతో చిత్రహింసలు పెట్టేవారు జమిందార్లు.

                                     అయితే మరోవైపు అప్పటికే తెలంగాణా జిల్లాల్లో కర్మాగారాలను నెలకొల్పాడు నిజాం నవాబ్, అయితే అందులో వెట్టి చాకిరి మాత్రమె ఉండేది, పనిలో చేరిన వారిని బానిసలుగా బావించేవారు, దీనితో అక్కడి కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారని, కార్మికుల హక్కుల కొరకు పోరాడాలని కమూనిస్ట్ పార్టీ భావించింది, నైజాంలో కమూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది, పట్టణాలలో ఉన్న కార్మికులను సంఘటిత పరచింది, తమ హక్కుల కోసం పోరాడే విధంగా వారిని తయారు చేసింది, రష్య విప్లవ సాహిత్యాన్ని వారికి పంచి, రష్యన్ ప్రజలు ఎ విధంగా స్వేచ్చను పొందింది, తమ హక్కులను కాపడుకుందో తెలియజెప్పింది. 
                                చాకలి ఐలమ్మ ఆమె కుటుంభ సభ్యులు సంఘంలో చేరి తరచుగా సంఘం సమావేశాలు జరుపుతూ ఉన్నారు, ఈ సమావేశాలకు ఆరుట్ల రామచంద్ర రెడ్డి, ఆరట్ల కమలమ్మ లాంటి గొప్ప నాయకులు వచ్చి ప్రజలను చైతన్య పరుస్తున్నారు, ఇది నచ్చని దేశ ముఖ్ దొంగ కేసులు బనాయించి ఐలమ్మ భర్త, కొడుకుల్ని అరెస్ట్ చేయిస్తాడు, ఐన అధైర్య పడని ఐలవ్వ కాపు కొచ్చిన  పంటను కోయడానికి సిద్ధం అవుతుంది, అవ్వల్ తాసిల్దార్ నుండి కౌలుకు తీసుకున్న ఆపోలం తమ దొరదని దొర మనుషులు వచ్చి ఐలమ్మ ను బెదిరిస్తారు, ఐన ఐలవ్వ భయ పడదు, వారిని ఎదురిస్తుంది, అయితే చిన్న దొర ఐలమ్మ కూతురును ఎత్తుకెళ్ళి పాడుచేయ్యలని ప్రయత్నిస్తాడు, అప్పుడే అటువైపుగా గొర్రె లను కాచుకుంటూ వెళ్తున్న దొడ్డి కొమురయ్య దొరపైకి దూకి వాడిని కొట్టి ఆమెను కాపాడుతాడు, మరుసటి దినం సంఘం వాళ్ళు వచ్చి ఎర్రజెండాలు పాతి ఐలవ్వ పొలానికి రక్షణ గా నిలబడుతారు, పొలం కోతలు అయ్యాక కమునిస్ట్లు భోజనానికి ఐలమ్మ ఇంట్లో కి వస్తారు, ఈ విషయం తెలుసుకున్న అమీను కమూనిస్ట్ లను అరెస్ట్ చేస్తాడు, ఐలమ్మ ఇంట్లో ఉన్న ధాన్యాన్ని మొత్తం దోచుకేల్తడు, కమూనిస్ట్ నాయకులను విడిచిపెట్టాలని వారి మద్దతుదారులు రాలి నిర్వహిస్తారు, దొడ్డి కొమురయ్య అన్నానికి ఇంటికి వస్తాడు, అదేసమయంలో అటుగా ఆ రాలి వెళ్తుంది అది చూసిన కొమురయ్య  అన్నాన్ని వొదిలేసి ఆ రాలిలోకి వెళ్తాడు, దొర వారి బంగ్లా వరకు వెళ్ళగానే లోపలినుండి తుపాకి తో కాలుస్తుంది దొరసాని, దొడ్డి కొమురయ్య నేలకోరుగుతాడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటంలో మొదటి అమరుడు దొడ్డి కొమురయ్య.
                                    షేక్ బందగి అన్న దేశ ముఖ్ వద్ద పనిచేస్తాడు దొరవారితో ఉన్న చనవుతో తన తమ్ముళ్ళ భూములు కూడా తన పేరు మీద పట్టా చేయించుకుంటాడు, అయితే ఈ విషయం తెలిసిన బందగి తన అన్నాను నిల దీస్తడు, పంచాయతి దొర వద్దకు వెళ్తుంది, అయితే దొర తన వద్ద పనిచేసే బందగి అన్నకు అనుకూలంగా తీర్పు చెప్తాడు, దీనితో ఆగ్రహించిన బందగి దేశ్ ముఖ్ దొరను ఎదురించి హై కోర్ట్ కు వెళ్తాడు, పన్నెండేళ్ళ పోరాటం తర్వాత బంధగికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పు ఇస్తుంది, అయితే ఈ విషయం ఊర్లో తెలిస్తే తన పరువు పోతుందని భావించిన దొర హైదరాబాద్ నుండి వస్తున్న బందగిని మార్గ మధ్యంలోనే హత్య చేయిస్తాడు.
                          షోయబుల్ల ఖాన్ నిజమైన జర్నలిస్ట్, ఆయన పోరాటంలో భాగంగా ఇమ్రోజ్ అనే పత్రికను స్థాపించారు, పత్రిక ద్వార నిజాం రాజుపై మాటల తూటాలను పేల్చాడు, ఇతని రాతలకు జనం చైతన్య వంతులు అవుతుండడంతో, కాశీం రజ్వి సేనలు ఆయనను చంపేసాయి.

                                 గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్ సోంబాయి దంపతులకు 1900 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకా లోని సంకేపల్లి గ్రామంలో జన్మించాడు. 
భీం కుటుంబం పదిహేడేళ్ళ వయసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కరిమెర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది. అక్కడ వాళ్ళు సాగుచేసుకుంటున్న భూమిని సిద్దిఖీ అన్న జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతన్ని హతమార్చి అస్సాం వెళ్ళిపోయాడు. అక్కడ ఐదేళ్ళపాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించి ఉద్యమించాడు.  ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు మరియు జోడేఘాట్ గుట్టలు కేంద్రంగా నిజాం నవాబు పై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించాడు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 సెప్టెంబర్ 1 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. 
                              రెండవ ప్రపంచ యుద్ధ కాలం తీవ్ర కరువుతో జనం అల్లాడుతున్నారు, యుద్ధంలో పాల్గొంటున్న బ్రిటిష్ సైన్యానికి ఆహారంతో పాటు, డబ్బును కూడా పంపించాలని డిల్లి నుండి నిజాం రాజుకు ఆదేశాలు అందాయి, నిజాం రాజు "లేవి గళ్ళు " వసూలు చెయ్యల్సిన్ధిగా దేశముఖ్లను ఆదేశించాడు, అయితే కమూనిస్ట్ లు  లేవి గళ్ళు కట్టవద్దని జనానికి పిలుపునిచ్చారు, జనం లేవి వాసులు చెయ్యడానికి వచ్చిన వారిపై తిరగ బడ్డారు, కర్మాగారాల్లో కార్మికులు కూడా నిరంకుశ పాలన అంతం కావాలని  పోరు బాట పట్టారు, తాను ఎంతో అభివృద్ది చేసిన ప్రజలు తన నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నరనే కోపంతో నిజాం రాజు తెలంగాణా ను ముస్లిం రాజ్యం చెయ్యాలని భావించాడు, హైదరాబాద్లో ప్రతి ముస్లిం రాజేనని ప్రకటించాడు, దీనితో అనేక రాష్ట్రాలనుండి ముస్లింలు హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు, అనేక మంది హిందూ యువకులు ఆ మతంలో చేరారు.ఇదే సమయంలో ఆర్య సమాజ అధ్యక్షుడు స్వామీ రామానంద తీర్థ హైదరాబాద్ సంస్థానం అంత పర్యటించి నిజాంకు, ముస్లిమ్స్ కు వ్యతిరేక ప్రచారం చేస్తాడు, అయితే ఈయన ప్రచార౦  తెలంగాణా ప్రాంతాన్ని ప్రభావితం చెయ్యకపోయినా, మరాట, కన్నడ ప్రాంతాల్లో తీవ్ర మత ఘర్షణలు చెలరేగుతాయి, కాశీం రజ్వి ని సైన్యాధ్యక్షునిగా నియమించి అరాచకానికి దిగాడు నిజాం, రజ్వి మనిషి కాదు వాడొక రాక్షసుడు, కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చేసి ధాన్యాన్ని, పశువులను, డబ్బును దోచుకున్నాడు, విడి ఆగడాలకు అంతే లేకుండా పోయింది, సంఘం పేరు చెప్పిన వారిని, సంఘానికి సహకారం అందించే వారిని చిత్రహింసలు పెట్టి వారిని చంపేసే వాడు, అధికారులు , దేశ ముఖ్ లు  మద్యం మత్తులో తూలుతూ, కనిపించిన ఆడదాన్ని అనుభవిస్తూ అడ్డం వచ్చిన వారిని చంపేస్తు పల్లెల్లో అరాచకం సృష్టించారు, గృహ దహనాలు, హత్యలు, లూటీలు, మానభంగాలు, క్రురంగా హింసించడం జరిగేవి, లేవికి వ్యతిరేఖం గా పోరాడిన లంబాడా నాయకుడు "తను నాయక్ "ను పట్టుకొని కట్టేసి అందరు చూస్తుండగా జనం మధ్యలో కాల్చేస్తారు రజాకార్లు, లేవి కి వ్యతిరేఖంగా మాట్లాడిన "గోపాల్ రెడ్డి" ని కాల్చి చంపుతారు, పల్లెల్లో ఉన్న ధాన్యం దోచుకేల్తారు, ఎప్పుడు ఎవరు వచ్చి  ఇంటి మీద పడతారో, అనే భయం తో ప్రాణాలను అరచేతులో పెట్టుకొని బతికారు. 

                        ఆంద్ర మహా సభలో అంతరాలు పెరుగుతూ వచ్చాయి, అతివాదులు మితవాదులు గా విడిపోయారు, మితవాదులంత కాంగ్రెస్ ను స్థాపించుకున్నారు, అతి వాదులు జనం లో ప్రాభల్యం కలిగి ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు, ఈ పరిస్థితులన్నీ చూసిన రావి నారాయణ రెడ్డి, బద్దం ఏళ్ళ రెడ్డి, ముగ్ధుం మొహినోద్దిన్ లు సాయుధ పోరాటానికి పిలుపునిస్తారు, గ్రామా రక్షక దళాలను ఏర్పాటు చేస్తారు, వారికి ఆయుధాల శిక్షణ ఇచ్చి, వారిని గ్రామానికి రక్షణగా ఉంచుతారు, ఆ సమయంలో గ్రామాల్లోకి వచ్చిన రాజాకర్లపై వీరోచిత పోరాటం చేసారు, ప్రజలంతా ఆడ , మగ అనే తేడా లేకుండా ఆయుధం పట్టారు, ఒక రోజు ఆరుట్ల రామచంద్ర రెడ్డి సభ జరుగుతుంటే పోలీసులు, దొర గుండాలు సభపై దాడికి దిగారు అదే సమయం లో అక్కడే ఉన్న సుద్దాల దేవయ్య "వెయ్, వెయ్" అనే పాటను పాడుతుంటే జనం రౌద్రులయ్యారు దొర మనుషుల్ని కొట్టి చంపారు.                    
                                   భైరాన్ పల్లి, గాలిపల్లి లలో జరిగిన ఘటనలు మరో జలియన్ వాళ భాగ్ ను తలపించాయి, గ్రామం లోని ప్రజలందరిని కాల్చి చంపారు, ఇండ్లకు నిప్పుపెట్టారు, ఆడవారిని చెరచారు, పంట ధాన్యాన్ని కాల్చేసారు, తాగునీటి బావులు, చెరువుల్లో మూత్ర విసర్జన చేసారు ఇలా వాళ్ళ అరాచకాలకు అంతే లేకుండా పోయింది, జనం తిరగ బడే సరికి ఒక్కొక్కరిగా దేశ్ ముఖ్ లు గ్రామాలను వదిలి హైదరాబాద్ కు పారిపోయారు. యాదగిరి రాసిన బండెనుక బండి కట్టి అనే పాట తెలంగాణా కు వందేమాతరం అయ్యింది.

                                       తెలంగాణా లో పరిస్థితులు చెయ్యి దాటుతున్దడంతో భారత హోం శాఖ మంత్రి సారధ్యంలో పోలీసు చర్య జరుగుతుంది, అదే "ఆపరేషన్ పోలో", నిజాం రాజు లొంగిపోతాడు, సెప్టెంబర్ 17 1948 న తెలంగాణా కు విముక్తి లభిస్తుంది, అయితే ఆ తర్వాత ఇక్కడ మిలటరీ పాలన విధిస్తుంది భారత ప్రభుత్వం, కమునిస్ట్లు దొరల భూముల్ని పేద ప్రజలకు పంచుతారు, అయితే ఆ భూమిని సాగు చేసుకుందామనే సరికి దొరలు మల్లి గ్రామాల్లో అడుగు పెడతారు, అన్ని రోజులు దేశ్ ముఖ్ లు గా ఉన్న దొరలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మిల్టరిని తీసుకొని గ్రామాలపై పడతారు. గ్రామాల మీద దొరల ఆధిపత్యం పోవాలంటే దొరలకు వ్యతిరేఖంగా పోరాడాలని, భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని, దొరలకు సాయం చేస్తున్న సైన్యానికి కూడా వ్యతిరేఖంగా పోరాడాలని బద్దం ఏళ్ళ రెడ్డి, రావి నారాయణ రెడ్డి, ముగ్ధుం మొహినోద్దిన్ లు తీర్మానం చేస్తారు. దోరలపై దాడులు చేస్తూ భూములను ఆక్రమిస్తారు కమూనిస్ట్ లు, అయితే ఈ క్రమంలో భారత సైన్యంతో తలపడతారు వీరు, భారత దేశంలో హైదరాబాద్ విలీనం కమూనిస్ట్ లకు ఇష్టం లేదని అందుకే సైన్యం పై దాడులు చేస్తున్నారు అని  భావించిన నెహ్రు కమూనిస్ట్ లపై నిషేధం విధిస్తాడు, దీనితో కమునిస్ట్ లు అడవుల్లోకి వెళ్లి పోరాటం కొనసాగిస్తారు, 1952 లో సాయుధ పోరాటం ముగించి మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నిలబడతారు, అయితే అధికారం సాధించేంత మెజారిటి రాక ప్రతిపక్షానికే పరిమితం అవుతారు.

                             అయితే గద్దేదిగిన నిజాం ఎటు వెళ్ళాడు..? ఎక్కడ తన శేష జీవితం గడిపాడు..? ప్రజలను చిత్ర హింసలకు గురిచేసిన నిజాంను నెహ్రు అక్కున చేర్చుకున్నాడు, 1948  నుండి 1956 ఆంద్ర ప్రదేశ్ ఏర్పడేవరకూ హైదరాబాద్ స్టేట్ కు నిజాం రాజ్ ప్రాముఖ్ గా ఉన్నారు, ఆ తర్వాత రాయలసీమ నుండి ఎం పీ గా కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు గెలిచారు, రెండవ సారి పదవిలో ఉండగానే మరణించాడు,నిజాం కు నెహ్రు ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏమిటి..? అసలు పోరాటం మొత్తం కమూనిస్ట్ లు చేస్తే అధికారం కాంగెస్ కు ఎలా వచ్చింది..? సెప్టెంబర్ 17 ను ఆ రోజుల్లో కూడా విమోచన దినంగా ఎందుకు జరుపుకోలేదు..? కమూనిస్ట్ లు   విమోచన దినాన్ని విద్రోహ దినం అని ఎందుకు అన్నారు..? నిజానికి నిజాం గద్దె దిగడంతో జనాల కష్టాలు తిరాయా..? 
                  నిజాం దిగిపోవడంతో జనాల కష్టాలు తీరిపోలేదు, వారికి కావాల్సింది భూమి, అది దక్కలేదు, దొరలు కాంగ్రెస్ లో చేరి గ్రామాల్లోని తమ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు, అందుకే 1952 వరకు కమునిస్ట్  లు పోరాటాన్ని కొనసాగించారు, అందుకే సెప్టెంబర్ 17 ను విద్రోహ దినం అని అన్నారు, నిజాం దిగిపోవడంలోనే కుట్ర ఉంది, తాను దిగిపోవడానికి ముందే నెహ్రూతో ఒప్పందం చేసుకున్నాడన్నది సుస్పష్టం, అందుకే ఆయనకు రాజ్ ప్రముఖ్ పదవి లభించింది, తర్వాత రెండు సార్లు ఎం పీ కూడాను, తాను పొందడమే కాకుండా అన్ని రోజులు తనకు సేవచేసిన దేశ్ ముఖ్ లకు కూడా న్యాయం చేసాడు, వారిని కాంగ్రెస్ లో చేర్చి తిరిగి గ్రామాల్లోకి వచ్చేలా చేసాడు, ఇక నెహ్రూకు కావాల్సింది కూడా డబ్బున్న వారే కదా...
                1952 లో నాన్ ముల్కి గోబాక్ ఉద్యమం జరిగింది, ఉద్యోగాల్లో స్థానికుల్ని పక్కనబెట్టి ఇతర ప్రాంతాల వారికి ప్రాధాన్యత ఇవ్వడం తో ఉద్యోగులు పోరుబాట పట్టారు, వీరికి విద్యార్థులు సహకరాయించి ఉద్యమంలోకి దిగారు, అప్పుడు జరిగిన కాల్పులో పది మంది విద్యార్థులు మరణించారు,  ఈ ఉద్యమంలో నాన్ ముల్కి గో బాక్ , లేదా ఇడ్లి సాంబార్ గో బాక్ , గోంగూర పచ్చడి గో బాక్ అనే నినాదాలు చేసారు,(1919 లో ముల్కి రూల్స్ అమల్లోకి వచ్చాయి, 15 సంవత్సరాలు ఇక్కడ నివసించిన వారే ఉద్యోగానికి అర్హులు) అయితే సీమంద్ర్లు మాత్రం ఈ ఉద్యమాన్ని ఆజాద్ హైదరాబాద్ ఉద్యమంగా చిత్రీకరించారు.
ఫజల్ అలీ కమిషన్ లేదా మొదటి ఎస్ ఆర్ సి: రాష్ట్రాల పునర్ వ్యవస్థికరణ కోసం ఆ రోజులలో కేంద్ర ప్రభుత్వం మొదటి ఎస్ ఆర్ సి ని వేసింది, ఈ కమిటి దేశ వ్యాప్తంగా పర్యటనలు చేసి నివేదికను కేంద్రానికి సమర్పించింది, ఇందులో భాగంగానే ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల గురించి తెలియజేసింది.
~తెలంగాణా ను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని, ఒక వేల కలపాలనుకుంటే 1961 ఎన్నికల వరకు ఆగాలని, ఎన్నికలలో గెలిచినా అభ్యర్తులలో 2 /3  సభ్యులు ఒప్పుకుంటే అప్పుడు విలీనం గురించి ఆలోచించాలి అని చెప్పారు.
~"విశాలాంద్రలో మునుముందు అభివృద్ది పతకాలను చేపట్టినపుడు తెలంగాణా హక్కులకు తగిన గుర్తింపు లభించకపోవచ్చును అనే భయం ఆ ప్రాంతంలో ఉన్నదీ. ఉదాహరణకు : నందికొండ (కృష్ణ), కుష్ట పురం (గోదావరి) వంటి ప్రాజెక్ట్లు తెలంగాణాలోనే కాకమొత్తం దేశంలోనే చేపట్టిన పథకాలలో ముక్యమైనది, ఈ రెండు పెద్ద నదులపై సేద్యపు పథకాలు చేపట్టాలనే ఆలోచన కోస్తా ప్రాంతంలో కూడా ఉంది, ఈ పరిస్థితిలో కృష్ణ గోదావరి జలాలలో ప్రస్తుతం తమకున్న స్వతంత్ర అధికారాన్ని కోల్పోవడానికి తెలంగాణా ప్రాంతం సిద్ధంగా లేదు. (ఎస్.ఆర్.సి రిపోర్ట్ పేరా 377 )
             హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు మొదటినుండి విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారు, అయితే విలీనానికి ఒత్తిడి పెరుగుతున్న సమయంలో ఆయన వారి పార్టీ అధిష్టానానికి ఉత్తరం రాసారు దాని సారాంశం ఏంటంటే:
తెలంగాణా లో విభిన్న వాదనలు ఉన్నా అధిక సంఖ్యలో ప్రజలు తెలంగాణా రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని రాసారు.
 ఆ తర్వాత డిల్లి నుండి ఆయనకు పిలుపు వచ్చింది, విలీనానికి ఒప్పుకునేదే లేదు అని బేగంపేట్ విమానాశ్రయంలో చెప్పి వెళ్ళిన బూర్గుల, డిల్లి నుండి రాగానే వీలైనంత త్వరలో రాష్ట్రాలని విలీనం చెయ్యాలి ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పుడు జరగదు అంటూ తన మార్చుకున్న భిప్రాయాన్ని చెప్పారు.
               ఇంతకి డిల్లి లో జరిగిందేమిటి..? బుర్గులకు ఎం చెప్పి ఒప్పించారు..? 1952 మొదటి సార్వత్రిక ఎన్నికలు,ఒక వైపు అన్ని రోజులు తమను హింసించిన దొరలు కాంగ్రెస్ పార్టీ తరపున పోటి చేస్తుంటే, మరో వైపు ప్రజలకోసం పోరాడిన కమూనిస్ట్ లు పోటి చేస్తున్నారనుకో.. , జనం ఎవరికీ ఒటేస్తారు, కమూనిస్ట్ లకే కదా.. తెలంగాణా మొత్తం కమూనిస్ట్ రాష్ట్రం ఐపోతే అక్కడ భవిష్యత్తులో కాంగ్రెస్ పుంజుకోవడం అనేది అసాధ్యం, దక్షిణ భారత దేశంలోని ఒక ప్రధాన రాష్ట్రాన్ని కోల్పోవడానికి నెహ్రు సిద్దంగా లేరు, మరో వైపు కమునిస్ట్ లు అధికారంలోకి వస్తే భూ సంస్కరణల చట్టం తీసుకొని వస్తే తమ భూములన్నీ పోతాయని దొరల భయం, ప్రజలకు భూమిని పంచితే  నిన్నటి వరకు దొర అంటూ తమ చుట్టూ తిరిగిన వాడుకుడా తమను లెక్క చెయ్యరని వీరి భావన,  ఒక వైపు పార్టీని, మరో వైపు తన పార్టీ నాయకుల్ని కాపాడుకోవడానికి నెహ్రు కమూనిస్ట్ పార్టీ పై నిషేధం విధించాడు , అలాంటి సమయంలో కొంతమంది కమూనిస్ట్ నాయకులు పిడిఎఫ్ అనే పార్టీ ని స్థాపించి ఎన్నికల్లో పాల్గొన్నారు, అయితే వీరు ఎక్కువ స్థానాల్లో పోటి చెయ్యలేక పోయారు, పోటి చేసిన స్థానాల్లో విజయం సాధించారు, అయితే ప్రజలు మాత్రం గత్యంతరం లేక కాంగ్రెస్ దొరలనే ఎన్నుకున్నారు, అయితే ఆ తర్వాత క్రమంగా పి డి ఎఫ్  బల పడింది, ఫజల్ అలీ కమిషన్ లో చెప్పినట్టు  1961  వరకు ఆగితే కాంగ్రెస్ గెలవదు, కాబట్టి కమూనిస్ట్ పార్టీని దెబ్బ తీయాలంటే హైదరాబాద్ రాష్ట్రానికే ఉనికి లేకుండా చెయ్యాలని అనుకున్నరు, అందుకే భాష ప్రాతిపదికన మరాటి మాట్లాడే జిల్లాలను మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే జిల్లాలను కర్ణాటకలో కలిపి, మిగిలిన ప్రాంతాన్ని ఆంధ్రతో కలిపారు, అయితే మరాటి, కన్నడ ప్రాంతాలు తొలగించడంతో తెలంగాణా అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాలు ఆంద్ర కంటే తగ్గిపోయాయి, కాబట్టి 1957 లో పీ డి ఎఫ్ బలం పుంజుకున్న అధికారంలోకి రాలేదు, ఈ ఎత్తుగడతో కాంగ్రెస్ ఆంధ్రను ,తెలంగాణాను కలిపింది. అనుకున్నట్టుగానే 1957 లో తెలంగాణాలో చాల స్థానాల్లో పీ డి ఎఫ్ జయకేతనం ఎగురవేసిన ఫలితం లేకుండా పోయింది.
 ఆంద్ర ప్రదేశ్ ఏర్పడటానికి ముందు రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలంగాణాలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది, సీమాంద్ర , తెలంగాణా పెద్దలు విశాలాంద్ర తీర్మానం చెయ్యడానికి హన్మకొండ కు వచ్చారు, ఖాజిపేట్ లో రైల్ దిగి కారులో హన్మ కొండ వెళ్తున్న వారిని అడుగడుగునా ప్రజలు అడ్డుకున్నారు, ఖాజిపేట్ నుండి హన్మకొండ వరకు  రోడ్లన్నీ జనమయంయ్యాయి. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటుచేశాయి. తెలంగాణా రక్షణల పేరుతో ఒక ఒప్పందం చేసుకున్నారు అదే..

మనుషుల ఒప్పందం:

* ఒప్పందంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు:

-తెలంగాణా మంత్రులతో తెలంగాణా అభివృద్ది కొరకు " రిజినల్ స్టాండింగ్ కమిటి " ఏర్పాటు చేయాలి. తెలంగాణా లోని భూముల అమ్మకానికి, తెలంగాణాలో మధ్య నిషేధానికి ఈ కమిటి అనుమతి తప్పనిసరి.

-డోమినల్ రూల్స్: అప్పటి వరకు హైదరాబాద్ స్టేట్లోని ఉద్యోగుల ఉద్యోగాలు ఎధతధం గా ఉంటాయి.విధ్యభివ్రుద్ది పై దృష్టి, ముల్కి రూల్స్ అమలును పర్యవేక్షించడం దీని పని.
-ఉర్దూ భాషకు రెండవ అధికార భాష హోదా.
-అప్పటి వరకు తెలంగాణా లో ఉన్న మిగులు బడ్జెట్ ను తెలంగాణా అభివృద్ధికి కర్చు చెయ్యాలి.
-ఆదాయాన్ని ఎ ప్రాంతానిది ఆ ప్రాంతానికే కర్చు చెయ్యాలి, తెలంగాణా లోని ఆదయ, వ్యయాల్ని లెక్క చూపాలి.
-మంత్రి వర్గంలో 60 :40 పంపిణి,ఆంద్ర నుండి ముక్య మంత్రి ఉంటె తెలంగాణా వాళ్ళు ఉపముక్య మంత్రి ఉండాలి.
* పెద్దమనుషుల ఒప్పందం పై ఇరు ప్రాంతాల నేతలు 19 జూలై 1956 లో సంతకం చేసారు,
ఆంద్ర నుండి 1 బెజవాడ గోపాల్ రెడ్డి, 2 నీలం సంజీవ రెడ్డి, 3 గౌతు లచ్చన్న లు 
తెలంగాణా నుండి 1 బూర్గుల రామకృష్ణ రావు, 2 మర్రి చెన్నారెడ్డి, 3 కే వి రంగా రావు లు సంతకాలు చేసారు.


మొత్తానికి 1956 నవంబర్ 1 న ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసారు, అయితే మొదటి నుండి వివక్ష, దోపిడీకి తెలంగాణా ప్రజలు గురవుతూనే ఉన్నారు, ఆంద్ర వాళ్ళు ఎదేచ్చాగా తెలంగాణా నిధుల్ని అందరకు తరలించుకేల్లరు, ఉద్యోగాలన్నీ వారె పొందడం, ఇవన్ని చుసిన జనం కేవలం 12 సంవత్సరాలకే విసిగి పోయారు, పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చెయ్యాలని మొదటి సారిగా ఉద్యమం మొదలయ్యింది.



 1969 హక్కుల పోరాటం-ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం: ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కావడంలో కీలకమైనది పెద్దమనుషుల ఒప్పందం. 1956 [ఫిబ్రవరి 20] న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణా అభివృద్ధికి, తెలంగాణా సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందాన్ననుసరించి 1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. అయితే  ఈ తంతును మొత్తం కొంతమంది హడావిడిగా చేసేసారు, తెలంగాణా ప్రాంతంలోని అధిక ప్రజలు విలీనానికి ఒప్పుకోలేదు,  తాము విద్యాపరంగా ఆంద్ర కంటే వెనక బడి ఉన్నందున ఉద్యోగాలన్నీ ఆంధ్రా వాళ్ళే తన్నుకు పోతారని ఇక్కడి ప్రజలు భావించారు, అదేవిధంగా తమ వనరులు సైతం విద్యాధికులైన ఆంధ్రుల చేతుల్లోకి వెళ్తాయని భయపడ్డారు, ఇదే విషయాన్నీ మొదటి ఎస్ ఆర్ సి కూడా చెప్పింది, అయితే కొంతమంది రాజకీయ నాయకులు ఆంద్ర నాయకుల ఒత్తిడికి లొంగి హైదరాబాద్ ను ఆంధ్రలో విలీనం చేసారు.ఆంధ్ర ప్రాంతానికి చెందిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.
                               ఈ ఒప్పందం అమలు విషయమై కొద్దికాలంలోనే తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి బయలుదేరింది. ఒప్పందాన్ననుసరించి ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణా వాసికి ఇవ్వలేదు, అప్పటికే అనేకమంది ఆంద్ర వాళ్ళు నకిలీ నివాస పాత్రలతో తెలంగాణా కు రావాల్సిన ఉద్యోగాల్లో చేరిపోయారు, అంతే కాకుండా విద్య విషయంలో తక్కువ శాతం విధ్యవంతులున్న తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి కాని ప్రభుత్వం సీట్లన్నీ ఆంద్ర వారికి కేటాయించడం, ఆంద్ర వారు తెలంగాణా కు వచ్చి దొరల భూముల్ని తక్కువ ధరలకు కొని వ్యవసాయం చెయ్యడం (దొరల భూములలో కామునిస్ట్లులు(అన్నలు) జండాలు పాతి వారి దోపిడిని అడ్డుకుంటున్న కాలం అది. వేల ఎకరాల్లో ఉన్న దొరల భూముల్ని పేదలకు పంపిణి చెయ్యాలని అన్నలు ప్రయత్నించారు, అలాంటి సమయంలో అనేక మంది దొరలూ, జమీన్ దార్ల పై వారు దాడులు చేసారు, దీనితో విధిలేక వారు హైదరాబాద్ కు పారిపోయారు, దొరవారి భూముల్ని కొనడానికి ఎవరు సాహసించేవారు కాదు, ఎందుకంటే అన్నలు తమపై దాడి చేస్తారనే భయం, కాని ఆంద్ర వారు చాల మంది అతి తక్కువ ధరలకు, {ఎంతో కాలం గా వెట్టి చేస్తున్న అక్కడి ప్రజలకు దక్కాల్సిన భూముల్ని} కొని వ్యవసాయం చేయసాగారు ) ఇక్కడి ప్రజలకు అది మింగుడు పడలేదు.

1967లో ముఖ్యమంత్రి అయిన తరువాత కాసు బ్రహ్మానంద రెడ్డి కుట్రలతో రాజకీయంగా స్థిరపడ్డారు. తెలంగాణ నేతలను తొక్కేసారు. కాసు బ్రహ్మానందరెడ్డి ఆంద్ర వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు ముల్కీ నిబంధనలకు పాతరేసారు. దీంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఖమ్మంలో రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరసనకు దిగాడు. దీంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది.                         
ఉద్యమం లో వీరోచితంగా పోరాడిన విద్యార్థుల్లో 369 మంది వీర మరణం పొందారు, ఆంద్ర పాలకుల తుపాకి తూటాలకు నేలకొరిగారు.కాని జనం కోరిక మాత్రం నెరవేరలేదు, తాని విశాలన్ద్రకే మద్దతు ఇస్తానని ఇందిరాగాంధీ పార్లమెంట్ల ప్రకటించారు, రాజ్యంగా పరమైన రక్షణలను కల్పించారు కాని ఇవి సత్ఫలితాలు ఇవ్వలేదు.

* సెప్టెంబర్ 21  1973 న సిక్స్ పాయింట్ ఫార్ముల వచ్చింది:
- రాష్ట్రాన్ని ఆరు జోన్స్ గా ఏర్పాటు చెయ్యడం.
- రాష్ట్ర పరిధిలో ప్లానింగ్ బోర్డు మరియు సబ్ కమిటి ల ఏర్పాటు.
- తెలంగాణా లో విద్యాభివృద్ధికి సెంట్రల్ యునివర్సిటీ ఏర్పాటు.
- ఉద్యోగుల భద్రతకు హై లెవెల్ అడ్మినిస్త్రేటింగ్ ట్రిబునల్ ఏర్పాటు.
- దీనిలో దేనికి విఘాతం కల్గిన రాష్ట్రపతి నేరుగా కల్పించుకోవచ్చు.
- పైవి అమలైతే ఇక ముల్కి రూల్స్ , రిజినల్ కమిటీలు రద్దు అవుతాయి.అయితే 15 సంవత్సరాల నివాస నిబంధన నాల్గు సంవత్సరాలకు  కుదించారు.
* 1969 ఉద్యమం తర్వాత ఏర్పాటు చేసిన భార్గవ కమిటి 1969 నాటికి 25 వేల మంది ఆంద్ర వాళ్ళు తెలంగాణా కు రావాల్సిన ఉద్యోగాలు కొల్లగొట్టారని తేల్చింది.
* అయితే ఈ మధ్యలోనే 1969 లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు సూత్రాల పథకం తీసుకు వచ్చింది.
* 1969 జి ఓ నంబర్ 36 విడుదలయ్యింది దీని ప్రకారం తెలంగాణాలోని ఆంద్ర ఉద్యోగుల్ని ఆంద్ర కు  పంపి తెలంగాణా ఉద్యోగులతో కాలిలను నింపాలి.
* 1985 లో వేసిన జై భరత్ రెడ్డి కమిటి ప్రకారం 1969 నుండి 1985 మధ్యలో 58 వేల మంది ఆంద్ర వాళ్ళు తెలంగాణా ఉద్యోగాల్లో అక్రమంగా చేరారని తేల్చింది. 
* 1985 లో 610 జి ఓ వచ్చింది, ఇది జి ఓ 36 కు పుత్రిక.అయితే ఇవేవి కార్య రూపం దాల్చలేదు, తెలంగాణా ఏర్పడలేదని ఆవేశంలో ఉన్న యువకులు నక్సల్బరి ఉద్యమం వైపు అడుగులు వేసారు.

అప్పటికే జన నాట్య మండలి ని ప్రారంభించి వివిధ కళారూపాల ద్వార జనానికి చేరువవుతున్న కమూనిస్ట్ ల వైపు యువత ఆకర్షితులయ్యారు, పిజి లు పి హెచ్ డి లు చదివిన మేధావులు కమూనిస్ట్ ఉద్యమంలో భాగమయ్యారు.

నక్సల్ బరీ ఉద్యమం:నెహ్రు నిషేధం విధించడంతో అడవుల్లోకి వెళ్ళిన కమునిస్ట్లులు 1952 లో సాయుధ పోరాటం ముగించి ఎన్నికల్లో పోటి చేసారు, కాని అనేక మంది కమూనిస్ట్ లు ఈ వ్యవస్థ ద్వారా సామాన్య ప్రజలకు న్యాయం జరగదని భావించి అజ్ఞాతంలో ఉండి ఉద్యమాన్ని కొనసాగించారు, దొరలను చంపుతూ గడీలని కుల్చుతున్నారు, దొర భూముల్లో ఎర్ర జండాలను పాతి, దొర పంటలను పేదలకు పంచేవారు. 1969 లో ఈ వ్యవస్థ తో విసుగుచెందిన అనేక మంది విద్య వంతులు ఉద్యమంలో భాగం కావడంతో ఉద్యమం ఉధృతం అయ్యింది, 1970 నుండి 2000 సంవత్సరాల వరకు తెలంగాణా గ్రామాల్లో నక్సల్ బరీ ఉద్యమం ఉదృతంగా సాగింది, కరీం నగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు నక్సలైట్ లకు అడ్డాలుగా మారాయి, పోలీసు లు ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి భయపడేవారు, ఈ సమయాల్లో దొరలూ ఊర్లు ఖాళి చేసి పట్టణాలకు పారిపోయారు, అయితే భూ సంస్కరణలు మాత్రం జరగ లేదు, 1980 -1990 మధ్య కాలంలో ఈ ఇతివృత్తం తో అనేక తెలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయం సాధించాయి. 
                   జన నాట్య మండలి ద్వారా గద్దర్, విమలక్క లాంటి వారు గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్య వంతులను చేసారు. రాజ్య హింసను కళ్ళకు కట్టే విధంగా నాటకాల ద్వార ప్రజలకు తెలియ జెప్పేవారు జననాట్యమండలి వారు.తెలంగాణా నుండి చేరిన అనేక మంది సభ్యులు జాతీయ స్థాయికి వెళ్లారు. 1981 ఏప్రిల్ 20 న నక్సలైట్ లకు సహాయం చేస్తున్నారనే నెపంతో ఇంద్రవెల్లి లో పోలీసులు నర మేదానికి దిగారు, ఈ కాల్పుల్లో అనేక మంది గిరిజనులు మరణించారు, వీరి స్మారకంగా ఇక్కడ అతిపెద్ద స్థూపాన్ని నిర్మించారు. జగిత్యాల జైత్ర యాత్రకు చిహ్నంగా అక్కడ దేశంలోనే అతిపెద్ద స్థుపాన్ని నిర్మించారు. చర్చల పేరుతో ప్రభుత్వం వారిని పిలిచి అనేకమంది ని ఎన్కౌంటర్ చేయించింది, జన జీవన స్రవంతిలో కలవమని ఉపాధి చూపిస్తామని చెప్పారు, సీతక్క అనే మాజీ నక్సలిట్ కు టి డి పీ ఎం ఎల్ ఎ టికెట్ కూడా ఇచ్చింది, పద్మక్కను అరాచకంగా చంపడం తో పాటు అనేక మందిని శాంతి చర్చలు, పునరావాసం పేరుతో అంతం చేసారు..

మలిదశ తెలంగాణా పోరాటం: 1996 లో ప్రో. జయశంకర్ అధ్యక్షతన వరంగల్లో ఒక సదస్సు జరిగింది, దానికి అనూహ్యంగా వేలాదిమంది ప్రజలు హాజరయ్యారు, ఈ పరిణామంతో జయశంకర్ సార్ లో కొత్త ఆశలు చిగురించాయి, పరాయి పాలనా నుండి ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారని గ్రహించిన ఆయన ప్రజాసంఘాలను, కవులు,కళాకారులూ, మేధావులను ఒక్క తాటిపైకి తెచ్చారు, అనేక సభలు,సమావేశాలు నిర్వహించారు, ప్రజలలో చైతన్యం తేవడం ప్రారంబించారు, 1999 NRI తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం ను ఏర్పాటు చేసారు. 2000 సంవత్సరంలో ఆయన అమెరికా వెళ్లి అక్కడున్న NRI లను సంగటితం చేసారు,వాళ్ళను ఉద్యమం వైపుగా కదిలించగలిగారు, ఇక అందరు ఒక అభిప్రాయానికి వచ్చారు, తెలంగాణా కోసం ఒక రాజకీయ వేదిక కావాలని, అదే సమయంలో TDP కి రాజీనామా చేసిన కెసిఆర్ ప్రో.జయశంకర్ ను కలిసి ఆయన అధ్వర్యంలో తెరాస ను ఏర్పాటు చేసారు, సార్ పార్టీ సిద్ధాంతకర్తగా ఉన్నారు, కరీం నగర్ లో టి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారి భహిరంగ సభకు 12 లక్షల మంది హాజరయ్యారు, దీంతో కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ తన మానిఫెస్టోలో తెలంగాణా అంశం చేర్చి టి ఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకుంది..2004  సార్వత్రిక ఎన్నికల్లో 5 పార్లమెంట్ స్థానాల్లో పోటి చేసిన టి ఆర్ ఎస్ 5 స్థానాలను గెలుచుకుది, 26 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది,  2009 ఎన్నికల్లో  ముందుకు వెళ్ళాడు, కాని ఈ ఎన్నికల్లో టి ఆర్ ఎస్ కేవలం రెండు పార్లమెంట్, పది అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుహుకుంది, ఈ పరిణామంతో కే సి ఆర్ కుంగిపోయారు, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానన్నారు.
                                  కొద్ది రోజుల్లోనే కొత్త వ్యూహంతో ముందుకు వచ్చారు కే సి ఆర్, రాష్ట్ర పతి ఉత్తర్వుల్లోని 14 F ను రద్దు చెయ్యాలని, లేకపోతే తను నిరాహార ధిక్షకు దిగుతానని ప్రధానికి, రాష్ట్రపతికి, ముక్యమంత్రికి తెలియజేసారు, సిద్దిపేట వేదికగా 29 నవంబర్ 2009 న ఉదయం కరీం నగర్ నుండి ధిక్ష స్థలానికి బయలు దేరారు, అయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహంతో కే సి ఆర్ ను అర్రెస్ట్ చేసి ఖమ్మం సబ్ జైలు కు తరలించింది, ఈ వార్త తెలిసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం రగిలి పోయింది, శ్రీ కాంత చారి అనే విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకొని అందరు చూస్తుండగానే ఆత్మ హత్యా చేసుకున్నాడు, ఈ సంఘటన తో యావత్ తెలంగాణా  భగ్గుమంది, పది జిల్లాల్లో నిరసనలు దిష్టి బొమ్మల దహనాలు జరిగాయి, ఓ యు జాక్ రెండు రోజుల బంద్ కు పిలుపునిచ్చింది, రెండవ రోజు లాటీలు విరిగాయి, అనేక మంది విద్యార్థులు గాయలపాలు అయ్యారు, రబ్బరు బుల్లెట్లు , భాష్ప వాయు గోలలు ప్రయోగించారు, అంత కంతకు కే సి ఆర్ ఆరోగ్యం ధిగ జారుతుంది అని డాక్టర్లు చెప్పే సరికి విద్యార్థులు ఆవేశంతో రగిలి పోయారు, 

పంజాగుట్టలోని షాపులపై దాడులకు దిగారు, dec 10 న అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు పిలుపు నిచ్చారు, కే సి ఆర్ ఆరోగ్య పరిస్థితి, అసెంబ్లీ ముట్టడి ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోం మంత్రి ద్వార డిసెంబర్ 09 2009 న ఒక ప్రకటన చేయించింది, " తెలంగాణా రాష్ట్రము ఏర్పాటు చేస్తాం" అని, ఈ ప్రకటన తో కే సి ఆర్ నిరాహార దిక్ష విరమించారు, తెలంగాణా అంతట సంబరాలు జరిగాయి, కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు, సీమంద్రలో కృత్రిమ ఉద్యమం ప్రారంబమైంది, దీనితో కేంద్రం వెనక్కి వెళ్ళింది.
                      ఈ పరిణామంతో కే సి ఆర్ జానా రెడ్డి నివాసానికి వెళ్లి ఉమ్మడిగా పోరాడేందుకు ఒక వేదికను ఏర్పాటు చేసారు, అదే తెలంగాణా రాజకీయ JAC , జే ఎ సి కన్వినర్ గా ప్రో.కోదండ రామ్ ను ఎన్నుకున్నారు, ఇందులో కాంగ్రెస్, టి ఆర్ ఎస్, టి డి పి, బి జే పి, న్యూ డేమోక్రసి పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంగాలు, కవులు కళాకారులు, మేధావులు, గద్దర్, మంద కృష్ణ మాదిగ, ఇలా చాల మంది ఉన్నారు, ఒకటి రెండు సమావేశాలు జరిగాయి, అయితే ప్రాధాన్యతల గొడవతో గద్దర్ లాంటి వాళ్ళు , వివిధ కారణాలతో మంద కృష్ణ , కొన్ని సంగాలు జే ఎ సి నుండి తొలగి పోయాయి, అన్ని పార్టీల వాళ్ళు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు, జనవరి 28 2010 లోగ రాజీనామాలు చెయ్యాలని, కాంగ్రెస్ మాట నిలుపుకోలేక జే ఎ సి నుండి బయటికి వెళ్ళింది, టి డి పి రాజీనామాల జిరాక్ష్ కాగితాలు కోదండ రామ్ కు ఇచ్చి తప్పించుకునే ప్రయత్నం చేసారు, జే ఎ సి, టి డి పి ని భహిష్కరించింది, ఇక జాక్ లో కేవలం టి ఆర్ఎస్, బి జే పీ, న్యూ డేమోక్రాసి లు మాత్రమే ఉండడంతో రాజకీయ జాక్ విఫలం చెందిందని సీమంద్ర ఛానళ్ళు ప్రచారం చేసాయి, దీంతో జాక్ లో కొన్ని మార్పులు చేసారు, రాజకీయ jac ని తెలంగాణా jac గా ఏర్పరచి, చైర్మెన్గా కోదండ రామ్, కో చైర్మెన్గా మల్లేపల్లి లక్ష్మయ్య ఎన్నికయ్యారు. జాక్ మాట విని 11 మంది టి ఆర్ ఎస్ , ఒక బి జే పి ఎం ఎల్ ఎ లు రాజీనామా చేసారు.. జాక్ జిల్లా మండల స్థాయిల నుండి గ్రామ స్థాయి వరకు జాక్ లను ఏర్పరచి పూర్తిగా పరిపుష్టం అయ్యింది.JAC  పిలుపు మేరకు రాజీనామా చేసిన తెలంగాణా వాదులకు పోటిగా కాంగ్రెస్, టి డి పి లు తమ అబ్యర్తులను నిలబెట్టాయి, జాక్ తన అబ్యర్తులను గెలిపించుకోవడానికి, విద్యార్థులు బస్సు యాత్ర చేసారు, అమరవీరుల కుటుంబాలు ప్రచారంలో పాలు పంచుకున్నై, టి ఆర్ ఎస్, బి జే పి లు ప్రచారం చేసాయి, జూలై 30 ,2010  ఎన్నికల ఫలితాలు వచ్చాయి, అన్ని స్థానాల్లో జాక్ అభ్యర్థులు భారి మెజారిటితో విజయం సాధించారు, కాంగ్రెస్ నాల్గు, టి డి పి పన్నెండు స్థానాల్లో డిపాసిట్ కోల్పోయాయి. జే ఎ సి పిలుపుతో సహాయ నిరాకరణ, సకల జనుల సమ్మె జరిగాయి కాని ప్రభుత్వం కదలలేదు, మన ఎం ఎల్ ఎ లు మంత్రులు అసలే కదలలేదు. ఎందుకు..?
                 నాడు నిజాం ముందు కుచ్చు టోపీలు పెట్టుకొని, నిజాం దిగిపోగానే గాంధీ టోపీ లతో కాంగెస్ పార్టీలో చేరిన ఆ దొరల వారసులే నేటి కాంగెస్ ఎం ఎల్ ఎ లు, మంత్రులు,పార్టీలు మార్చి టి డి పీ లో ఉన్నవారు, ప్రజల ఆకాంక్షలకు విలువ ఎందుకు ఇస్తారు, తెలంగాణా వస్తే భూసంస్కరణలు వస్తాయి వారి అధికారం పోతుంది, అనే భయం, ఎ నాడు సాయుధ పోరాటంలో పాల్గొనని కుటుంభాలు, ఇంకా చెప్పాలంటే వీరి పుర్వికులకు వ్యతిరేఖంగానే సాయుధ పోరు సాగింది, అలంటి వారి పల్లకి ఎత్తుతున్నాం. వారు ఎన్నటికి ప్రజల ఆకాంక్షలకు విలువ ఇవ్వరు, అందుకే ఆంద్ర వారితో కలిసి తెలంగాణా రాకుండా అడ్డుపడుతున్నారు.
           ఈ రోజు కూడా ఉద్యమం కొనసాగుతూనే ఉంది పోరు యాత్ర పేరుతో బి జే పీ చేస్తున్న యాత్రకు జనం అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ నెల 15 ఓ యు లో విద్యార్థి ఘర్జన సభను నిర్వహిస్తున్నారు..


*** ఆటుపోట్లు లేని సముద్రం, గెలుపోటములు లేని యుద్ధం ఉండదు***
ఈ నేల వందల ఏళ్ళుగా పీడనలో నలిగిపోతునే ఉంది, స్వేచ్చ కోసం పోరాటం జరుగుతూనే ఉంది, ప్రాణ త్యాగాలు చేస్తూనే ఉంది, తర తరాలుగా స్వేచ్ఛకోసం పోరాడుతున్న ప్రజలు పార్లమెంట్ లో బిల్లు పెట్టేదాకా, తెలంగాణా రాష్ట్రం వచ్చే దాక, గమ్యాన్ని ముద్దాడే దాక ఈ పోరాటాన్ని కొనసాగిస్తారు.. 
జై తెలంగాణ.!!                          

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి