నల్గొండ లేదా నల్లగొండ, దక్షిణ భారత దేశములోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నందలి ఒక ముఖ్య నగరము మరియు అదే పేరుగల జిల్లాకు రాజధాని. పూర్వము నల్గొండకు నీలగిరి అని పేరు ఉండేది. నల్గొండ జిల్లాకు ఉత్తరాన మెదక్మరియు వరంగల్ జిల్లాలు, దక్షిణాన గుంటూరు మరియు పాక్షికముగా మహబూబ్ నగర్ జిల్లాలు, తూర్పున ఖమ్మం మరియుకృష్ణా జిల్లాలు, పశ్చిమాన రంగారెడ్డి మరియు మహబూబ్ నగర్ జిల్లాలు సరిహద్దులు.
రెవిన్యూ డివిజన్లు (4): నల్గొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి.
లోక్‌సభ స్థానాలు (2):భువనగిరి, నల్గొండ.
శాసనసభ స్థానాలు (12): సూర్యాపేట, ఆలేరు, దేవరకొండ, తుంగతుర్తి, కోదాడ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, నకిరేకల్, నల్గొండ, నాగార్జునసాగర్, భువనగిరి, మునుగోడు.
దర్శనీయప్రదేశాలు:- కొలనుపాక, భువనగిరి, పానగల్లు, వాడపల్లి, నాగార్జునసాగర్, యాదగిరిగుట్ట, పిల్లలమర్రి.
జిల్లా విశిష్టతలు:శాతవాహనుల కాలంలో నీలగిరిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతమే కాలక్రమంలో నందికొండగా, నల్లగొండగా మారింది. బహుళార్థసాధక ప్రాజెక్టుకు సరైన నిర్వచనం చెప్పగల నాగార్జున సాగర్ ఈ జిల్లాకు ప్రధాన ఆకర్షణ. మానవ నిర్మిత ఆనకట్టలలో ఆసియాలోనే ఇది అతిపెద్దది. క్రీ.శ. 2వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో నివసించిన బౌద్ధమతాచార్యుడైన ఆచార్య నాగార్జునుని పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టును 1955 లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు. జలాశయం మధ్యలోని నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకూ కృష్ణా నది పొడవునా 3568 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించిన రిజర్వు అడవి దేశంలో వన్యమృగ సంరక్షణ కేంద్రాలన్నింటికంటే పెద్దది. జిల్లాలోనియాదగిరి గుట్ట, తెలంగాణాలోని పర్వత ప్రాంత దేవాలయాల్లో ఎంతో పేరుపొందింది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి గుడి అన్ని ప్రాంతాలవారికి దర్శనీయ పుణ్యక్షేత్రం. దేవాలయ నిర్మాణ రీతి ప్రాచీన ఆధునిక సంప్రదాయాల కలగలుపుగా ఉంటుంది. ఏటా రథోత్సవం జరుగుతుంది. ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవం, పెళ్ళిళ్ళు విరివిగా జరిగే ప్రదేశం. జిల్లాలోని ఆలేరుకు సుమారు ఆరుకిలోమీటర్ల దూరంలోని కొలనుపాక జైన మతానుయాయులకు ఒక పవిత్ర యాత్రాస్థలం. ప్రస్తుతం ఇక్కడ శ్వేతాంబర శాఖకు చెందిన ఒక జైన దేవాలయం నిత్య పూజారాధనతో విలసిల్లుతోంది. కాకతీయుల నాటి ప్రసిద్ది చెందిన శివాలయాలు సూర్యాపీట మండలం లోని పిల్లలమర్రి గ్రామంలో కలవు. రాష్త్రంలోనే ముఖ్యమైన మార్కెటింగ్ యార్డ్ సూర్యాపీటలో కలదు. సున్నపురాయి నిల్వలు అత్యధికంగా ఉన్న జిల్లా కావడంతో సిమెంట్ ఉత్పాదనలో ఈ జిల్లా అసియాలోనే ప్రదమ స్థానంలో ఉంది. నల్లగొండ జిల్లా పోరాటాలకు ప్రసిద్ది, ఉద్యమాల ఖిల్లాగా ఈ జిల్లాకు పేరు. ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించిన వీర తెలంగాణ సాయిధ రైతాంగ పోరాటానికి జిల్లా ఆయివుపట్టు. వాడపల్లి తీర్తమ్ ఈ జిల్లా లొ అతి పెద్ద శైవ క్షేత్రము.శివ రాత్రి నాడు స్నానా లు అచరంచడానికి ప్రజలందరు వస్తారు. ఇదీ కృష్ణా ,మూసీ మరియు అంతర్వేది సంగమం నందు అందరు స్నానాలు చేయడానికి వస్తారు.
దర్శనీయ ప్రదేశాలు:-
బుద్ధుడి శిల్పం :-హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రధాన పర్యాటకకేంద్రం. ఈ చారిత్రాత్మ ప్రదేశానికి ఈ పేరు బౌద్ధసన్యాసి నార్జునుడి కారణంగా వచ్చింది. ఈ ప్రదేశంలో పండితుడైన ఆచార్య నాగార్జునుడు విద్యాకేంద్రాన్ని స్థాపించాడు. ప్రస్థుతం ఇక్కడ నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మించబడి ఉంది. నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రపంచంలో పొడవైన మానవ నిర్మిత ఆనకట్టగా ప్రసిద్ధిగాంచింది. నాగార్జునసాగర్ ఆనకట్ట కింద 10 లక్షల కంటే అధికమైన ఎకరాల సాగుబడి జరుగుతుంది.
ఈ ఆనకట్ట నిర్మించే సమయంలో త్రవ్వకాలలో బౌద్ధసంస్కృతికి చెందిన శిధిలాల పురాతన అవశేషాలు బయటపడ్డాయి. వెలికితీసిన పురాతన అవశేషాలను సుందరమైన నాగార్జున కొండ మీద బధ్రపరిచారు. ఈ కొండ మానవ నిర్మిత సరస్సుకు కేంద్రంలో ఉన్నది. పవిత్రమైన బౌద్ధస్థూప అవశేష మిగులు భాగాలను స్థూప, విహారాలు, ఒక విశ్వవిద్యాలయం మరియు పవిత్రమైన బలిపీఠం జాగ్రత్తగా రిజర్వాయర్‌కు తూర్పు భాగంలో ఉన్నాయి.
నాగార్జున కొండ :-మానవ నిర్మిత సరస్సు మద్య మనోహరమైన ద్వీపం ఉంది. నాగార్జున కొండ త్రవ్వాకాలలో 2వ 3వ శతాబ్ధానికి చెందిన బౌద్ధసంస్కృతిక స్థూపం బయటపడ్డాయి. ఈ కోడను చేరటానికి విజయపురి వద్ద ఉన్న జెట్టి అనేప్రదేశంలో బోటు సేవలు లభ్యం ఔతాయి.
129 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాదు విమానాశ్రయం నుండి ఇక్కడకు వాయుమార్గంలో ప్రదేశానికి చేరవచ్చు. రైలు మార్గంలో ఇక్కడకు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాచర్ల నుండి చేరవచ్చు.
చంద్రవంక జలపాతము :-
ఎత్తిపోతల జలపాతముకు దిగువగా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరమైన కొండచరియలలో చంద్రవంక జలపాతము ఉంది. ఈ జలపాతము పచ్చని కొండల నుండి 21.3 మీటర్ల నుండి కింద ఒక మడుగులోకి పడుతూ ఉంటుంది. ఈ జలపాతాన్ని తరచూ పర్యాటకులు దర్శిస్తుంటారు.
ఈ సుందర జలపాతము 60 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న చంద్రవంకానది నుండి ప్రవహించే జలాల వలన ఏర్పడింది. ఈ జలపాతం నాగార్జున కొండకు 21 కిలోమీటర్ల దూరంలో తూర్పున ఉంది. అక్కడ ధ్యానంచేసిన ఒక యతీశ్వరుడి వలన ఈ జలపాతానికి ఈ పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో కొన్ని కొండ గుహాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం వారు ఇక్కడి దైవాలను పూజిస్తూ ఉంటారు.
ఈ ప్రాంతం రహదారి మార్గంలో హైదరాబాదు నుండి 150 కిలో మీటర్ల దూరంలో ఉంది విజయపురి సమీపంలో ఉంది.
నందికొండ :-
నందికొండ అంటే క్రిష్ణా నదీ తీరంలో ఉన్న చిన్న పల్లెటూరు. ఇది మిరియాలగూడకు 64.37 కిలో మీటర్ల దూరంలో ఉంది. చాలా ప్రముఖమైన ఈ నిర్మాణం ఇక్ష్వాకు వంశానికి చెందిన వారి చేత నిర్మించబడిన కోట. దృఢమైన గోడలు, కందకము, ద్వారాలు మరియు బురుజులు కలిగిన ఈ కోటలో ఒక దీర్ఘచతురస్రాకార రంగస్థలం (స్టేడియం)ఉంది.
పోచంపల్లి :-
1950 లో ఆచార్యా వినోభాభావే ఇక్కడి నుండి తన ఉద్యమాన్ని ఆరంభించాడు. ఇది బోంగిర్ నుండి 14.48 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే బీబీనగర్ నుండి 9.66 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పిల్లలమర్రి :-
ఇక్కడ అద్భుతమైన చిత్రాలు, సున్నితంగా చెక్కబడిన స్థంభాలు కలిగిన పురాతన కాకతీయ ఆలయాలు ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ప్రదేశం ప్రసిద్ధ కవి అయిన పిల్లల మర్రి పిన వీరభద్రుని పుట్టిన ప్రదేశం.
కొలనుపాక :-
ఇది హైదరాబాదు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా చారిత్రక ప్రసిద్ధమైనది. ఇది 93.24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఒకప్పుడు సమృద్ధి కలిగి ఉన్న ప్రదేశం. పాత కోట యొక్క శిధిలాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. ఒకప్పుడు ఎ.డి. 11వ శతాబ్ధం ఇది కల్యాణి చాళుక్యులకు రెండవ కోటగా ఉన్నప్పుడు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది.
ఇంకా కొన్ని దర్శనీయ స్థలాలు:-
- రాచకొండ
- గాజుల కొండ
- ఏలేశ్వరం
- ఫణిగిరి
- భోంగిర్ ఫోర్ట్
- బంజారా ఆభరణాలు
- మటంపల్లి
- వడపల్లి
- కొలనుపాక
పుణ్య క్షేత్రాలు:-
యాదగిరి గుట్ట:- హైదరాబాదు నుండి వరంగల్లురహదారిలో 50 కి.మీ. దూరంలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం యాదగిరిగుట్ట.
స్థల పురాణం:-
మహర్షి ఋష్యశృంగుని కుమారుడైన యాదగిరి అనే సన్యాసి వలన ఈ కొండకు ఈ పేరు వచ్చింది. యాదగిర్షి ఇక్కడ ఉన్న ఒక గుహలో ఆంజనేయుడి అనుగ్రహంతో నరసింహుని గురించి తపమాచరించాడు. ఈ కొండ నల్గొండలోని బోంగిరి మరియు రైగిరి మద్యలో ఉన్నది. యాదగిర్షి ఘాఢతపస్సుకు మెచ్చి నరసింహుడు ఐదు రూపాలలో సాక్షత్కరించాడు. జ్వాలానరసింహ, యోగానంద నరసింహ, గంఢభేరుండ నరసింహ, ఉగ్ర నరసింహ మరియు లక్ష్మీ నరసింహ అనేవి ఆ ఐదు రూపాలు. ఇలా ప్రత్యక్షమైన నరసింహ రూపాలు ఈ కొండలలో స్వయంభువులుగా వెలసి భక్తుల పూజలు అందుకుకుంటున్నాడు. అందుకనే ఇది పంచ నరసింహ క్షేత్రం అయింది. పురాణ కధనం ప్రకారం యాదర్షికి మొదట జ్వాలా నరసింహుడిగా ప్రత్యక్షమైన జ్వాలా నరసింహరూపాన్ని దర్శించే శక్తి లేని యాదగిర్షి కోరిక మీద నరసింహుడు తరువాత యోగనరసింహుడిగా దర్శనమిచ్చాడు. యాదగిర్షి అంతటితో సంతోషపడక లక్ష్మీ సహితంగా దర్శనమివ్వమని కోరడంతో ఓడిలో లక్ష్మీసహితంగా లక్ష్మీనరసింహుడై దర్శనమిచ్చాడు. లక్ష్మీనరసింహుడు ఆళ్వారుల పూజలు అందుకుంటున్నాడు. ఊగ్రనరసింహుడి ఉగ్రతను తగ్గించడానికి గరుత్మంతుడు గండభేరుండ పక్షి రూపంలో స్వామికి ముందు నిలిచి స్వామి ఊగ్రతను తగ్గిస్తుంటాడు. ఈ శిలను దాటి వంగుతూ వెళ్ళి స్వామిని దర్శించాలి. ఈ క్షేత్రానికి పాలకుడు ఆంజనేయుడు. యాదగిర్షి స్వామిని ఈ ప్రదేశాన్ని తనపేరుతో పిలవాలని కోరాడు. అందుకే ఇది యాదగిరి గుట్ట అయింది. చాలాకాలం నుండి ఇక్కడ లక్ష్మీనరసింహుడు భక్తిల పూజలు అందుకుంటున్నాడు.
మండలాలు:-
భౌగోళికంగా నల్గొండ జిల్లాను 59 రెవిన్యూ మండలాలుగా విభజించినారు. ఈ క్రింద మండలము ముందు ఉన్న సంఖ్య అంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన మండల సంఖ్య.
1. బొమ్మలరామారం 2. తుర్కపల్లి 3. రాజాపేట 5. ఆలేరు 6. గుండాల 7. తిరుమలగిరి 8. తుంగతుర్తి 9. నూతనకల్లు 10. ఆత్మకూరు(S) 11. జాజిరెడ్డిగూడెం 12. శాలిగౌరారం 13. మోతుకూరు 14. ఆత్మకూరు(M) 15. వలిగొండ 16. భువనగిరి 17. బీబీనగర్ 18. పోచంపల్లి 19. చౌటుప్పల్ 20. రామన్నపేట 21. చిట్యాల 22. నార్కెట్‌పల్లి 23. కట్టంగూర్ 24. నకిరేకల్ 25. కేతేపల్లి 26. సూర్యాపేట 27. చివ్వెంల 28. మోతే 29. నడిగూడెం 30. మునగాల | 31. పెన్‌పహాడ్ 32. వేములపల్లి 33. తిప్పర్తి 34. నల్గొండ 35. మునుగోడు 36. నారాయణపూర్ 37. మర్రిగూడ 38. చండూరు 39. కనగల్ 40. నిడమానూరు 41. త్రిపురారం 42. మిర్యాలగూడ 43. గరిడేపల్లి 44. చిలుకూరు 45. కోదాడ 46. మేళ్లచెరువు 47. హుజూర్నగర్ 48. మట్టంపల్లి 49. నేరేడుచర్ల 50. దామరచర్ల 51. అనుముల 52. పెద్దవూర 54. గుర్రమ్‌పోడ్ 55. నాంపల్లి 56. చింతపల్లి 57. దేవరకొండ 58. గుండ్లపల్లి 59. చందంపేట |
పోచం పల్లి: పోచం పల్లి లో ఆచార్య వినోబబావే భూదాన ఉద్యమాన్ని ప్రారంభించారు.ఆయన ఇక్కడ కొంతకాలం ఉన్నారు, భూమి లేని 700 కుటుంబాలకు ఆయన భు పంపిణి చేసారు.అందుకే ఈ గ్రామాన్ని భూదాన్ పోచం పల్లి అంటారు.
* పోచంపల్లి కి ఉన్న మరో ప్రత్యేకత ఇక్కడి చీరెలు, పోచం పల్లి అనగానే అందరికి గుర్తుకు వచ్చే పోచం పల్లి చీరలు ఇక్కడే నేస్తారు.అందుకే పోచంపల్లి ని సిల్క్ సిటి అంటారు.
భువనగిరి:- భువనగిరి కోట 12 వ శతాబ్దంలో చాళిక్యులు నిర్ముంచారు, ఆ తర్వాత ఈ కోట కాకతీయుల ప్రముఖ రాజధానులలో ఒకటిగా విలసిల్లింది, భువనగిరి ని పాలించిన వారిలో గౌడ కులానికి చెందినా సర్దార్ సర్వాయి పాపన్న ముఖ్యుడు ఆయన భువన గిరిని రాజధానిగా చేసుకొని సుమారు 30 సంవత్సరాలు పరిపాలించాడు, ఆయన రాజ్యం హుస్నాబాద్ నుండి షా పూర్ వరకు సువిశాలంగా ఉండేది, ఈ సువిశాల సామ్రాజ్యానికి రాజధాని నగరంగా భువన గిరి విలసిల్లింది, ఆయన మరణానంతరం ఈ రాజ్యం గోల్కొండ నవాబుల పాలనలోకి వెళ్ళింది. సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్రకి కింది లింక్ చూడండి.
http://naatelangaana.blogspot.in/2011/10/blog-post_27.html
నదులు :-
- కృష్ణా నది
- మూసీ నది:- కృష్ణా నది ఉపనది, మూసీనది హైదరాబాదు నగరానికి 90 కిలోమీటర్లు పశ్చిమాన రంగారెడ్డి జిల్లా, వికారాబాదు వద్ద అనంతగిరి కొండల్లో పుట్టినల్గొండ జిల్లా, వాడపల్లి (వజీరాబాద్) వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది.
- ఆలేరు
- పెద్దవాగు
- దిండి
- పాలేరు
నీటి పారుదల:-
నాగార్జున సాగర్: ఆంద్ర ప్రదేశ్ ఏర్పడక ముందే నంది కొండ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం 161 టి ఎం సి ల సామర్థ్యం తో ఉండే విధంగా నిర్మాణం చేపట్టింది.ఉమ్మడి రాష్ట్రము ఏర్పడ్డాక ఇరు ప్రాంతాలకు నీరందించాలని దాని స్థలాన్ని, పేరును మార్చారు, నాగార్జున సాగర్ పేరుతో ప్రాజెక్ట్ను నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతి పెద్ద రాతి డాం, దీనిని అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రు ప్రారంభించారు, ప్రాజెక్ట్ లే ఆధునిక కాలపు దేవాలయాలు అని నెహ్రు చెప్పింది ఇక్కడే.దీనికి రెండు కాలువలు ఉంటాయి, ఒకటి జవహర్ కాలువ, రెండవది లాల్ బహాదుర్ కాలువలు, కుడి కాలువ ఆంద్ర ప్రాంతానికి నీరందిస్తే, ఎడమ కాలువ తెలంగాణా కు నీరందిస్తుంది.
* ప్రాజెక్ట్ ప్రారంభించినపుడు హైదరాబాద్ రాష్ట్రానికి 132 టి ఎం సి లు, ఆంద్ర రాష్ట్రానికి 132 టి ఎం సి ల నీరు అందించాలని అనుకున్నారు, కాని ఉమ్మడి రాష్ట్రము ఏర్పడగానే, తెలంగాణా కు వచ్చే ఎడమ కాలువ లెవెల్స్, ఎలైన్ మెంట్ లలో మార్పు చేసి 106 .2 టి ఎం సి లకు తగ్గించడమే కాక ఆంద్ర ప్రాంతానికి వెళ్ళే కుడి కాలువను పొడగించారు.
* ఈ పరిణామంతో తెలంగాణకు అందుతున్నది కేవలం 85 నుండి 90 టి ఎం సి ల నీరు మాత్రమే. ఆంధ్రలో కుడి కాలువ కింద 15 లక్షల ఎకరాలకు నీరందుతుంటే, తెలంగాణకు కేవలం 5 లక్షల ఎకరాలకు కూడా నీరు అందడంలేదు.
* అంటే కోస్తాకు మొత్తం 811 టి ఎం సి లలో 580 టి ఎం సి లు అంటే 71 % నికి పైచిలుకు వెళ్తుంటే, తెలంగాణా, రాయలసీమలకు 230 టి ఎం సి ల నీరు అందుతున్నది.
శ్రీశైలం:-శ్రీ శైలం మొదట విద్యుత్ ఉత్పత్తికి నిర్దేశించారు కాని ఆ తరువాత సాగు నీటి కొరకు వాడుకోవాలని నిర్ణయించుకున్నారు.
* 1981 లో జరిగిన ఒప్పందం ప్రకారం 48 టి ఎం సి ల నీరు రాయలసీమకు, 50 టి ఎం సి ల నీరు తెలంగాణకు ఇవ్వాలి.
* అయితే 1983 లో రాయలసీమ కు వెళ్ళే కుడి కాలువతో గాలేరు-నగరి, హంద్రినీవ, తెలుగు గంగలను జోడించి 48 టి ఎం సి ల కంటే ఎక్కువగా తీసుకోవడం ప్రారంభించారు.
* దీనికి మూడు తూములు పెట్టారు ఒకటి కుడి కాలువ కొరకు, రెండోది తెలుగు గంగ కొరకు, మూడోది ఎస్కప్ ఛానల్ అని. మొత్తం గా గ్రావిటి పద్ధతిలో ఈ మూడు తుముల ద్వారా 200 టి ఎం సి ల నీటిని పొందవచ్చు, అంతే కాకూడ కుడి గట్టు కాలువ కోసం 20 టి ఎం సి ల నికర జలాన్ని కేటాయించారు.
* ఇక తెలంగాణా లోని ఎడమగట్టు కాలవకు గ్రావిటి ద్వారన, లేక ఎత్తిపోతల ద్వార నీరివ్వాల అన్నది నిర్ణయించలేదు.
* కేటాయించిన నీటిని 26 టి ఎం సి లకు కుదించి, అవి కూడా మిగులు జలాలకు పరిమితం చేసారు.
* అయితే నాగార్జున సాగర్కు మిగిలిన జలం తరలించి అక్కడనుండి ఎలిమినేటి మాధవ రెడ్డి అనే కాలువ నిర్మించి దాని ద్వార ఎడమకాలువ కు నీరిస్తారట..!అయితే అది కూడా నాగార్జున సాగర్ లో 510 అడుగులకు పైగా నీరుంటేనే, అంటే శ్రీ శైలం నుండి తెలంగాణకు నీరు రాదన్న మాట..
పంటలు:-
కడుపు నిండా నీరు ఉన్న గొంతు మాత్రం దప్పికతో ఎండిపోయిన చందంగా ఉంది నల్గొండలో పరిస్థితి, ప్రధానంగా ఇక్కడ బోరుబావులపై ఆధారపడి పంటలు పండిస్తున్నారు.
* ఇక్కడ ప్రధానంగా వరి, సజ్జ, రాగులు,వేరుశనగ,ఆముదాలు,పొద్దుతిరుగుడు, ప్రత్తి మొదలైన పంటలు పండుతాయి.

పరిశ్రమలు:-జిల్లాలో సున్నపురాయి నిల్వలు అధికంగా ఉండడంవల్ల సిమెంట్ పరిశ్రమల్ని నెలకొల్పారు. నల్గొండలో అను పదార్థ మూలకం థోరియం నిల్వలు కూడా ఉన్నాయి, రాశి సిమెంట్స్ హుజూర్ నగర్ లో, దక్కన్ సిమెంట్ ను కేట్లపల్లి లోను ఏర్పాటు చేసారు, ఇంకా కాకతీయ, ప్రియ దర్శిని, రాక్ ల్యాండ్, విష్ణు, సాగర్ వంటి అనేక సిమెంట్ కర్మాగారాలు ఇక్కడ ఉన్నాయి.
రవాణా మార్గాలు:- రెండు జాతీయ రహదారులు జిల్లా గుండా వెళ్తున్నాయి, 9 వ నంబర్ జాతీయ రహదారి జిల్లాలోని సూర్యాపేట, నకిరేకల్, కోదాడ గుండా వెళ్తుంది, 202 వ నంబర్ జాతీయ రహదారి భువనగిరి గుండా వెళ్తుంది.
* బల్లార్ష నుండి సికింద్రాబాద్ ప్రధాన రైల్ మార్గం మధ్యలో జిల్లాలోని ఆలేరు,భువనగిరి రైల్వే స్టేషన్ లు ఉంటాయి, హైదరాబాద్ నుండి గుంటూరు వెళ్ళే రైల్ మార్గం నల్గొండ పట్టణం గుండా వెళ్తుంది.
* బల్లార్ష నుండి సికింద్రాబాద్ ప్రధాన రైల్ మార్గం మధ్యలో జిల్లాలోని ఆలేరు,భువనగిరి రైల్వే స్టేషన్ లు ఉంటాయి, హైదరాబాద్ నుండి గుంటూరు వెళ్ళే రైల్ మార్గం నల్గొండ పట్టణం గుండా వెళ్తుంది.
విద్య:-జిల్లాలో 2007 వ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధి విశ్వ విద్యాలయం ను ఏర్పాటు చేసింది, జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం 58 శాతం విద్యావంతులు ఉన్నారు.
* జిల్లాలో స్వామి రామానంద్ తీర్థ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ చాల ప్రముఖమైనది.
* జిల్లాలో స్వామి రామానంద్ తీర్థ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ చాల ప్రముఖమైనది.
ఫ్లోరైడ్:-జిల్లా ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య ఫ్లోరైడ్, వందల గ్రామాల ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడి జవసత్వాలు కోల్పోయారు, నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటం వల్ల తాగే నీరే విషం అవుతుంది, ఆ నీటితో పండిన కూరగాయలు, పండ్లు అన్ని విషమే అవుతున్నాయి, సమైక్య రాష్ట్రం చేసిన తెలంగాణకు చేసిన గాయం ఇది, బొక్కల్లో సత్తువ లేక వంగి పోవడం, విరిగి పోవడం, ఎత్తు పెరగక పోవడం, ఎంత వయసు వారైన శారీరికంగా అభివృద్ది చెందక పోవడం వంటి అనేఖ సమస్యలకు ఈ ఫ్లోరైడ్ భూతం కారణం,స్వాతంత్ర్యం వచ్చి 60 సంవత్సరాలు గడుతున్న పాలకులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదు, నల్గొండ లో దేశం లోనే అతి పెద్ద ప్రాజెక్ట్ లలో ఒక్కటైనా నాగార్జున సాగర్ ఉంది, కాని వారికి కనీసం తాగడానికి కూడా స్వచ్చమైన నీరు దొరకని పరిస్థితి, వీరి తల రాతలు మారాలంటే తెలంగాణా రాష్ట్రం మినహా మరో దారే లేదు.
జిల్లాలోని ప్రముఖులు:-
* రావి నారాయణ్ రెడ్డి: ఆంద్ర మహా సభ నాయకుడు, తెలంగాణా సాయుధ పోరాట నాయకుడు.
* కోదాటి నారాయణ రావు:
* పులిజాల వెంకట రంగ రావు :
* ఆరుట్ల రామ్ చంద్ర రెడ్డి:ఆంద్ర మహా సభ సభ్యుడు, సాయుధ పోరాట యోధుడు.
* ఆరుట్ల కమల దేవి:ఆంద్ర మహా సభ మహిళా నాయకురాలు.
* లక్ష్మి నరసింహ రెడ్డి:
* కొండల రావు: ఈయన ను దేవరకొండ గాంధీ అంటారు.
* సి వి చారి:భూదాన ఉద్యమ నేత.
* శబ్నవీసు వెంకట నరసింహా రావు: నీలగిరి పత్రిక ఎడిటర్.
* పెద వెంకట రామారావు:
* కంచర్ల రామ కృష్ణ రెడ్డి:
* ఎ హరికృష్ణ రావు:ఆంద్ర సారస్వత పరిషత్ స్థాపకులు.
* రామచంద్ర రెడ్డి: భూదాన్ ఉద్యమ నేత.
* డి వెంకటేశ్వర రావు:
* నిమ్మల రాములు:ఆర్య సమాజ్ తరపున ఉద్యమ నేత.
* నర్ర రాఘవ రెడ్డి:
* చకిలం రంగ రావు:గ్రందాలయ ఉద్యమ నేత.
* ఉమ్మేత్తల కేశవరావు:రచయిత, గ్రంధాలయ, భూదాన ఉద్యమ నేత.
మరికొంతమంది ప్రముఖులు:
* విమలక్క: అరుణోదయ సాంస్కృతిక కళా వేదిక అధ్యక్షురాలు, ప్రజా గాయకురాలు.
* ఎన్. శంకర్: సుప్రసిద్ధ తెలుగు దర్శకుడు.
సుద్దాల అశోక్ తేజ,ఉత్తేజ్, వేణుమాధవ్...

పోరాటాల ఖిల్లా:- తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభించిన జిల్లా, జమిందార్, జాగిర్దార్, దేశ్ ముఖ్లను తరిమి కొట్టిన జిల్లా, మట్టి మనుషులతో మహత్తర పోరాటం చేయించిన జిల్లా నల్లగొండ జిల్లా నాటి తెలంగాణా సాయుధ పోరాటం నుండి నేటి మలిదశ పోరు వరకు నల్గొండ తన పోరాట పటిమను తెలియజేస్తూనే ఉంది. ఉద్యమ సారథి ఐన రావి నాయరణ రెడ్డి, ఆరుట్ల రామ్ చంద్ర రెడ్డి, ఆరుట్ల కమల, లాంటి ప్రముఖులు ఈ జిల్లా వారే , తెలంగాణా మొత్తం సాయుధ పోరాటం లో నాలుగు వేల మంది మరణిస్తే అందులో రెండు వేల మంది నల్గొండ వారె కావడం ఇక్కడి ఉద్యమ తీవ్రతను తెలియజేస్తుంది, సుద్దాల హన్మంతు పాడిన వేయ్, వేయ్ పాటతో ఉత్తేజితులైన జనం దేశ్ ముఖ్ మనుషులను తరిమి కొట్టారు, యాదగిరి ఆశువుగా పాడిన బండెనుక బండి కట్టి పాట తెలంగాణకు వందేమాతరం అయ్యింది.
బేతవోలులో, కొలనుపాక, మనుగోడుల్లో రైతులు సాయుధ దళాలుగా ఏర్పడి పోరాటం కొనసాగించారు, ఆ ప్రాంతాల్లోని దేశ్ ముఖ్ లు వేసే పన్నులు, పెట్టె చిత్రహింసలు బరించలేక జనం తిరగబడ్డారు.ఇలా రైతాంగ తిరుగుబాటు ఆ తర్వాత అనేక గ్రామాలకు విస్తరించి దొరలను ఊర్ల నుండి తరిమి కొట్టారు.
ప్రస్తుత ఉద్యమంలో కూడా నల్లగొండ చురుకైన పాత్ర పోషిస్తుంది, జిల్లాలోని ప్రజలు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియ జేసారు, ఆంద్ర కు తెలంగాణా కు సరిహద్దు గ్రామాల్లో రోడ్ పై గోడలు కట్టి తమ నిరసనలు తెలిపారు, విజయవాడ వెళ్ళే పవేట్ వాహనాలను అడ్డగించారు,ఇలా జిల్లా తెలంగాణా ఉద్యమాలకు పట్టు కొమ్మగా ఉంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి