హోం

11, ఫిబ్రవరి 2012, శనివారం

బి జే పీ తెలంగాణా పోరు యాత్ర సంపూర్ణం..


బి జే పీ తలపెట్టిన పోరు యాత్ర మొన్న ఖమ్మం జిల్లా భద్రాచలం లో ముగిసింది, గత నెల 19  న బి జే పీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మండలం నుండి ప్రారంభించిన యాత్ర 22 రోజుల్లో, 9 జిల్లాల గుండా ప్రయాణించి మొన్న బద్రాచలం లో ముగిసింది. నిన్న బి జే పీ నాయకులు మేడారం చేరుకొని సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని బంగారాన్ని సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు, ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ "కాంగ్రెస్ పార్టీ తెలంగాణా బిల్లు పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని, వచ్చే జాతర తెలంగాణా రాష్ట్రము  లోనే జరగాలని, పోరాడేందుకు కాలసిన శక్తి ని ప్రజలకు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు" ఆయన చెప్పారు.
                      యాత్ర మహబూబ్ నగర్ లో ప్రారంభం ఐన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బి జే పీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కారి హాజారయ్యారు, తెలంగాణా జే ఎ సి యాత్రకు పూర్తి మద్దతు తెల్పింది, యాత్ర మహబూబ్ నగర్, నల్గొండ, రంగా రెడ్డి, నిజామాబాదు,  ఆదిలాబాద్, కరీంనగర్,వరంగల్, మీదుగా ఖమ్మం చేరుకొని భద్రాచలం లో ముగిసింది, అన్ని జిల్లాలలోను యాత్రకు ప్రజలనుండి విశేష స్పందన కనిపించింది, ఈ యాత్ర తో బి జే పీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం కల్గించారు కిషన్ రెడ్డి, యాత్రలో ఆయన రోజు రోజుకు మాటల తీవ్రత పెంచారు, బి జే పీ తోనే తెలంగాణా సాధ్యం అనే విషయాన్నీ ఆయన ప్రజలకు తెలియజేసారు, తెలంగాణా కు కాంగ్రేసే ప్రధాన అడ్డంకి అని, కాంగెస్, టి డి పీ పార్టీ లను బొంద పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు,  ఆయన వివిధ ప్రాంతాల్లోని ప్రజల స్థితి గతులను పరిశీలించారు, గోదావరిఖనిలో బొగ్గు బావిలోకి దిగారు, కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు, నల్గొండలో ఫ్లోరైడ్ బాధితులను కలిసి వారి భాధలు తెలుసుకున్నారు, ఇలా ఆయన యాత్ర ప్రజల జీవన స్థితి గతులను కూడా తెలుసుకుంటూ ముందుకు సాగింది, యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్లో భారి బహిరంగ సభను ఏర్పాటు చేసారు.

బి జే పీ సభ:- బి జే పీ అధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం నుండి నిజాం కాలేజి మైదానంలో భారి భహిరంగ సభ ప్రారంభమయ్యింది, దీనికి ముఖ్య అతిదిగా ఛత్తీస్ ఘర్ ముఖ్య మంత్రి రమన్ సింగ్ హాజారయ్యారు,ఇంకా బి జే పీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు, జే ఎ సి చైర్మెన్ కొదందారంలు  హాజరయ్యారు, సభకు వేలాదిగా జనం తరలి వచ్చారు.


                        తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా నాటాకాలాడుతున్న కాంగ్రెస్‌ను గద్దె దించాలని చత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ అన్నారు. నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన బీజేపీ తెలంగాణ పోరుయాత్ర ముగింపు సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్ర ఏర్పాటుకు వేయనన్ని కమిటీలు తెలంగాణకు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణ కమిటీని వేయడం సిగ్గు చేటన్నారు. చిన్న రాష్ట్రాలు ఎట్లా అభివృద్ధి చెందుతాయో చత్తీస్‌గఢ్‌ను చూసి సోనియా తెలుసుకోవాలన్నారు. 42 రోజులు సమ్మె చేసిన ఉద్యోగుల స్ఫూర్తికి ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ తప్పక మద్దతిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి