హోం

12, ఫిబ్రవరి 2012, ఆదివారం

ఈ చీకటి తర్వాత తెలంగాణకు ఉషోదయమే-మాజీ డిజీపీ రాములు అంతరంగం!!


ఉద్యమం ఊపు మీద ఉంది. తెలంగాణ ప్రజలు నిరాశ, నిస్పృహలకు లోనుకావద్దు. రాత్రి అత్యంత చీకటి ఉండేది ఉషోదయానికి ముందే. ప్రస్తుత చీకటి తర్వాత తెలంగాణ సూర్యోదయమే’’అంటున్నారు మాజీ డిజీపీ పేర్వారం రాములు.
                   భిన్న సంస్కృతులు, భిన్న ఆచార వ్యహారాలు, ముఖ్యంగా భిన్న నైతిక విలువలు కలిగిన రెండు ప్రాంతాలను భాష ప్రాతిపదికన ఒక్కటిగా ఉండాలని చెప్పలేం. భాష ఒక్కటే కలిపి ఉంచేది కాదు. మా ఇంట్లో పనోళ్లలో ఒకరిది మహబూబ్‌నగర్, మరొకరిది విజయనగరం జిల్లా. శనివారంనాడు విజయనగరం ఆమె పది నిమిషాలు మహబూబ్‌నగర్ ఆమెతో మాట్లాడి వెళ్లింది. ఏం మాట్లాడుకున్నారని అడిగితే ‘ఒక్క ముక్క అర్థం కాలే సారూ’ అని చెప్పింది. ఒకరి అభివూపాయాలు ఒకరు చెప్పుకోలేనప్పుడు ఒకే భాష అంటే ఎలా? అన్నింటిలోనూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవంగా ఉన్నప్పుడు అవి ఏకం కావు.
        తెలంగాణ నినాదం ఇప్పటిది కాదు. 1919లో షోలాపూర్ నవాబు తనకు కప్పం కట్టనప్పుడు అప్పటి నిజాం ప్రభువు బ్రిటీష్ సహాయాన్నిఅర్ధించాడు. అందుకోసం బెర్రార్‌ను (నాగ్‌పూర్, షోలాపూర్, బల్లార్షా ప్రాంతం) రాసిచ్చాడు. బ్రిటీష్ వాళ్ల నుంచి సహాయం అందకపోవడంతో బెర్రార్‌ను తిరిగి ఇచ్చేయమంటే.. ‘నీ ప్రజలకు నీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకొచ్చి ఉద్యోగాలిస్తున్నావు. ముందు నీ ఇల్లు చక్కదిద్దుకో’ అని లార్డ్ రీడింగ్ వైశ్రాయ్ హెచ్చరించాడు. అప్పటి నుంచే తెలంగాణ దోపిడీకి గురవుతోంది. 1945 పోలీస్ చర్యతర్వాత ఇక్కడి వాళ్లకు ఇంగ్లీషు రాదనే కారణంతో మద్రాస్‌నుంచి ఆంధ్రావాళ్లనుతెచ్చి ఉద్యోగాలిచ్చారు.ఎస్‌ఐగా చేరిన వ్యక్తి కొద్ది వ్యవధిలో ఎస్పీ అయ్యాడు. అప్పటి నుంచే నిజాం సంపదను, తెలంగాణ వనరులను దోచుకున్నారు. ఇప్పుడు అన్ని వాదాల కంటే పల్లెల్లో తెలంగాణవాదమే గట్టిగా ఉంది.
                                రైతులను ఓదార్చడానికి అంటే చిన్న విషయం. దానికి వందల వాహనాలు అనవసరం. బాబుపై జిల్లా ప్రజలకు అభిమానం ఉంటే, పెంబర్తి, జనగామ నాయకులు, వరంగల్ జిల్లా నేతల వాహనాలుంటే సరే. కానీ హైదరాబాద్ నుంచే భారీగా వాహనాలు తెచ్చి, ఒక గుంపు విశృఖలంగా ప్రవర్తిస్తుంటే పట్టించుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. జగన్మోహన్‌డ్డిని రానివ్వలేదన్న పట్టుదలతోనే బాబు వెళ్లినట్లు కనిపిస్తున్నది కానీ రైతులకోసంకాదు. రైతుల కోసం వచ్చామంటే నమ్మడానికి తెలంగాణ రైతులు ఫూల్స్ కాదు.ఈ ఘటనతో టీడీపీకి నష్టమే తప్పలాభం లేదు. విచ్చలవిడిగా అర్థ, అంగబలాలు నిరూపించుకోవాలని చూసేవారిని నియంవూతించకపోతే భవిష్యత్తులో అరాచకత్వమే. ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోయినా అది దావానలంలా వ్యాపించి నిద్రాణమైన తెలంగాణ జనం ఉద్యమిస్తే ఏంజరిగేది? ప్రభుత్వం ఇకనైనా కఠినంగా ఉండాలి. 
                      ‘జై తెలంగాణ’ అనకపోతే ఊళ్లలోకి వెళ్లే పరిస్థితి లేదు. పెద్ద కాన్వాయ్‌తో బాబు వెళితే వెళ్లుండొచ్చు. కానీ దయాకర్‌రావు, కడియం ఇన్ని వాహనాలతో వెళ్లగలరా?చంద్రబాబుని టీ ఫోరం సభ్యులే బలవంతంగా తీసుకొచ్చారని నా అభిప్రాయం. బుల్లెట్ దిగినాఫర్వాలేదని గాంధీ ముందుకు వెళ్లారు. 1000 మంది పోలీసులను పెట్టుకుని వెళ్లుంటే ఆయన చనిపోయేవారు కాదు. ఈ సంఘటనతో బాబు మొండివాడు, గట్టివాడన్న అభివూపాయం ప్రజలకు వస్తుందని వాళ్లు భావించి ఉండొచ్చు. కానీ పోలీసులకు సన్నిహితంగా ఉంటూ ప్రజలకు దూరం అవుతున్న విషయాన్ని గుర్తించాలి. టీడీపీ మొదటి నుంచి ప్రజలతో మమేకమైంది.ఎన్టీఆర్ కోసం జనం ఎగబడేవాళ్లు. ఇప్పుడు జనం రాకపోగా హైదరాబాద్ నుంచే తీసుకెళ్లే పరిస్థితికి దిగజారింది. 
            .తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగు తల్లి, తెలుగు సంస్కృతి నినాదాలతో ఆవిర్భవించిన టీడీపీ ప్రత్యేక తెలంగాణను ఎన్నటికీ ఒప్పుకోదు. బాబే కాదు ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నా టీడీపీ సిద్ధాంతం అదే. తెలంగాణలో టీడీపీకి ప్రజాబలం లేకపోవడంతో అక్కడ ఏర్పడిన శూన్యాన్ని పూడ్చడం కోసమే హైదరాబాద్ నుంచి మందీమార్బలంతో చంద్రబాబు వరంగల్ జిల్లాకు బయలుదేరి వచ్చారని మాజీ డీజీపీ పేర్వారం రాములు అన్నారు. ఎన్టీఆర్‌తన వాగ్ధాటి, ప్రతిభ, ఆహార్యం, నిజాయితీతో ప్రజల మనుసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్‌లాగా ప్రజల మనసు దోచుకోవాలని, కానీ వాళ్ల శరీరాలను కాదని వ్యాఖ్యానించారు. 
                      ఎవరైనా పరీక్ష రాసే ముందు ట్యూషన్‌కి వెళతారు లేదా కోచింగ్ తీసుకుంటారు. కానీ కేంద్రం మాత్రం పరీక్ష ఫెయిల్ అయిన తర్వాత కోచింగ్ తీసుకున్నట్లు డిసెంబరు 9న ప్రకటన చేసిన తర్వాత శ్రీకృష్ణ కమిటీని వేసింది. కేంద్ర హోం మంత్రి అంటే సాధారణమైన పదవి కాదు. సర్దార్ వల్లభాయ్‌ప పని చేసిన అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి చెబితే తెలంగాణ ఇస్తరనే అనుకున్నాం. కానీ కొంత మంది నాయకులు ఆంధ్రలో చేయించిన గొడవలతో కేంద్రం మాటమర్చి ప్రకటన చేయడం అవగాహన రాహిత్యానికి, అసమర్ధతకు నిదర్శనం. కేంద్రం వైఖరితో నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలు నిరాశ, నిస్పృహలకు లోనుకాగా, 700 మంది ఆత్మబలిదానాలు చేశారు. డిసెంబర్ 9 ప్రకటనకు ముందు అంతోఇంతో కలిసున్నాం. ఇప్పుడు కేంద్రం చలవ వల్ల విభజన విచ్చంది. దీన్ని చక్కదిద్దడం అసాధ్యం. మరింత నష్టం జరుగకముందే ప్రత్యేక తెలంగాణ ప్రకటించడం శ్రేయస్కరం..
                                  ( టి న్యూస్ నుండి..)
                                     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి