హోం

19, అక్టోబర్ 2011, బుధవారం

తెలంగాణకు బీజేపీ మద్దతిస్తది : అద్వానీ



(19/10/2011)అద్వాని జన చేతన రథయాత్రలో భాగంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మహాసభ ఏర్పాటు చేసారు, ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ స్పష్టం చేశారు. తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. శీతకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెడితే మద్దతిస్తామని తెలిపారు. యూపీఏ సర్కారు వ్యవహారంతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. 2012 జనవరి 1న తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలని కోరుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం లేదన్నారు. సాధారణ మెజార్టీతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చు అని స్పష్టం చేశారు.
యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాలతో ప్రజలు విసిగిపోయారని అద్వానీ పేర్కొన్నారు. ఇక నుంచి యూపీఏ పతనం ఖాయమని అద్వానీ స్పష్టం చేశారు. జన చేతన రథయాత్రలో భాగంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన మహాసభలో అద్వానీ ప్రసంగించారు. తన జీవితంలో జన చేతన రథయాత్ర మరిచిపోలేనిది అని అన్నారు. గతంలో ఎప్పుడు ఇంత ఆదరణ లభించలేదని చెప్పారు. నల్లధనాన్ని వెలికితీయడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని తెలిపారు. యూపీఏ హయాంలో జరిగిన అవినీతిపై ఓ సినిమా తీయవచ్చు అని పేర్కొన్నారు. అవినీతిని రూపుమాపితే 15 సంవత్సరాల్లో నవ భారతాన్ని నిర్మించుకోవచ్చని చెప్పారు. దేశంలో సార్వభౌమాధికారం కాపాడేందుకే బీజేపీ అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. ఇప్పటికీ గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం సిగ్గు చేటన్నారు. తనది రాజకీయ యాత్ర అని కొందరు అవహేళన చేస్తున్నారు అని చెప్పారు. ఈ యాత్ర అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన యాత్ర అని ఆయన స్పష్టం చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి