(24/10/2011) 42 రోజుల సకలజనుల సమ్మెకు ప్రభుత్వం దిగి వచ్చింది, మొత్తం తొమ్మిది డిమాండ్ లను ఉద్యోగులు ప్రభుత్వం ముందు ఉంచారు, వాటన్నింటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది, అవి : 1 . 610 జిఓ అమలుకు రిటైర్డ్ జడ్జితో కమిటి 2 . ఉద్యోగుల వాదనలను వినడానికి కమిటి, 3 . ఉద్యమ సమయంలో పెట్టిన కేసుల ఎత్తివేత 4 . 177 జి ఓ నిలిపి వెత, 5 . ఎస్మా పరిదినుంది అన్ని శాఖల మినహాయింపు, 6 . హాఫ్ పే సాలరీ, 7 . దీపావళి బోనస్, 8 అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవడం, అక్రమ బదిలీలను నిలిపి వేయడం, 9 . స్వామి గౌడ్ పై హత్యా యత్నం పై విచారణ, ఈ డిమాండ్లకు కు ప్రభుత్వం ఒప్పుకుంది, తెలంగాణా పై హామీకి ఉద్యోగ సంగాలు పట్టు బట్టాయి కాని అది కేంద్రం పరిధి లో ఉందని , ఉద్యోగుల మనోభావాల్ని ఎప్పటికప్పుడు డిల్లీకి చేరవేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు, అయితే సమ్మెకు విరామం మాత్రమే ఇస్తున్నామని, భవిష్యత్తులో JAC ఇచ్చే అన్ని కార్యక్రమాల్లో ఉద్యోగులు పాల్గొంటారని స్వామి గౌడ్ చెప్పారు. 42 రోజులుగా తమ వంతు ప్రయత్నం తాము చేసామని ఐన కలిసి రాని రాజకీయ నాయకుల సంగతి ప్రజలే చూసుకోవాలని అన్నారు, ఈ సమ్మె ద్వార తెలంగాణా ద్రోహులెవరో అందరు గుర్తించారని ఇకపై వారి పైనే పోరాటమని కోదండ రామ్ అన్నారు, నవంబర్ 1 నుండి ప్రజా ప్రతినిధుల దిక్షలు ప్రారంభం అవుతాయని ఆయన అన్నారు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి